‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-4
16-నవ్యాంధ్ర –దివ్యాంధ్ర –శ్రీమతి సింహాద్రి వాణి-విజయవాడ
సమైక్యాంధ్ర వడ్డించిన విస్తరి –షడ్రుచుల భోజనం లా
సర్వ సంపదలున్న జనం లా
నవ్యాంధ్ర మాత్రం వట్టి విస్తరి –పదార్ధాలు లేని పళ్లెంలా
గుర్రం లేని కళ్లెం లా
ఆంధ్ర మాత కన్న బిడ్డలు
వేరు కుంపటి పెట్టినప్పుడు
ఒకరికి ఉన్నవి అన్నీ –ఇంకొకరికి లేనివి ఎన్నో
నవ్యాంధ్ర దివ్యాన్ధ్రగా మార్చటానికి
విదు లెన్నో ఉన్నా నిధులు మాత్రం సున్నా .
ఇప్పుడు నవ్యాంధ్ర ఓ మర్రి విత్తనం
పరిసరాలు ,భూసారం ,గాలి ,నీరు ,వాతావరణం
సమస్తం అనుకూలిస్తే భవిష్యత్తులో
ఒక పెద్ద ఊడల వృక్షమై
ఆంధ్రులకు చల్లని నీడ నిస్తుంది
అప్పుడు ఈ నవ్యాంధ్ర దివ్యాంధ్ర గా మారి
స్వర్ణాంధ్ర గా వెలుగొందు తుంది .
17 –దృష్టి—వృష్టి -శ్రీమతి కొమాండూరి కృష్ణ –విజయవాడ
సిరుల నిచ్చేది శ్రీనివాసుడు ,ఝరుల నిచ్చేది విశాఖాశుడు
సరుల ప్రచ్చేడి ఉమాసుతుడు –మరుల బ్రోచెడి రమా సహితుడు
మనల కిచ్చేడు భోగముల్ –నవ్యాంధ్ర కిచ్చేడు మోదముల్ –‘
ఆపమోసగిన అమర సురపతి –ఆయువోసగిన ‘’అరస ‘’సిరిపతి
ఆవునోసగిన అసుర అరి నుతి –అభయ మొదవిన అర్క గణపతి
మనల కొదవును అన్ని శుభములు –నవ్యాంధ్ర కోసగును మోదమూ
సమత ఊపుల కనక వల్లి –మమత చూపుల నమక మల్లి
నమక పూరిత సరస వెళ్లి –చరిత రూపిత తెలుగు తల్లి
మనల కోసగును సౌఖ్యముల్ –నవ్యాంధ్ర కోసగును మోదముల్ .
చెలువ వరపెడు శోభనాద్రుడు –చలువ సలిపేడు చందనాంగుడు
నెలవు నెరపెడు ఆంద్ర నాధులు –దయను కురిపేడు ‘’చంద్ర’’ఆదులు
మనసు తడిపేడు వెల్లువల్ –నవ్యాంధ్ర కొసగెడు మోదముల్
.
18-శుభ మన్మధ –ఎస్ .అన్నపూర్ణ –విజయవాడ
జీవనదుల పుణ్య భూమి –సశ్యశ్యామల నా ఆంద్ర భూమి
రాజకీయ కుళ్ళు మురుగు నీరు పార
మోడు వారింది రాష్ట్ర వృక్షం .
శుక పికాల కలరవాలు
కొత్త ఆశ చివురులు వేసిన మామిడి కొమ్మ ఓలె
మన్మధ ఉగాదికి నిత్య నూతన చైతన్యం తో
నవ్య ఆలోచనల విరులు విరిసి
కీర్తి సుగంధాలు ఎల్లెడలా వ్యాపించాలి
నవ్యాంద్ర ప్రదేశ్ సవ్యాంధ్ర ప్రదేశ్ కావాలి
సుఖ శాంతులనివ్వాలి మన్మధ ఉగాది .
19- అమ్మవేరు –శ్రీమతి కోపూరి పుష్పాదేవి –విజయవాడ
అపురూప లావణ్యాల అద్భుత వనం –యెనలేని సోయగాల బృందావనం
ఎన్నో వృక్ష రాజాల సమూహం –మరెన్నో పూపోదల సమాహారం
లోకం లో అందాల విరులన్నీ చేరాయి ఒక్క చోటికి
సుమ సౌరభాలతో అవనికే వచ్చింది అందం
చేకూరాయి పేరు ప్రఖ్యాతులు –వచ్చాయి యెనలేని కీర్తి ప్రతిష్టలు
ఇంతలో పట్టాయి ఆ వనానికి స్వార్ధపు చీడ పీడలు
పీక్కు తిన్నాయి పురుగూ పుట్రా
అధికార దాహం తో అలమటిం చాయి లేత కొమ్మలు
ప్రకటించాయి తల్లిమానుపై తిరుగు బాటు
అలుకలు ,ఆందోళనలు –ఉద్యమాలు ,ఊరేగింపులతో
ప్రజ్వరిల్లింది విప్లవం –కాని ముష్కర రాకాసి పద ఘట్టనం తో
బలై పోయాయి చిగురు మొగ్గలు
వేరుకుంపటి రాచకీయం నెగ్గింది
బిడ్డ ఎక్కడున్నా బాగుండాలన్నదే తల్లి తపన
తన తో బాటు బిడ్డలూ పురోగమించాలని
తనకు మించిన కొమ్మలుగా ఎదగాలని
ఆ కాంక్షిస్తుంది అమ్మ వేరు .
20-హూద్ హూద్ తుఫాను –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీపట్నం
తే.గీ. – అంబు దమ్ములు కమ్మే ఆకాశ మందు –వీచెను పెనుగాలులు విర్రవీగి మరియు
తరువు లలొరిగెను ,కంపించే తనువు లకట –గాలివాన కు స్తంభించె కాలమపుడు .
తే .గీ-పెనుతుఫానుహూద్ తెచ్చిపెట్టే ముప్పు –కడలిని పడి లేచు కెరటాల్ గాంచి నంత
జనులు భయ విహ్వలు లగుటన్ కనులు తిరిగే –అవ్విశాఖ వాసుల గుండె లదరె నపుడు .
తీ .గీ-ఉదధి నువ్వెత్తున తరంగములు పుడమిని –అల్లకల్లోల పరచుచు హడల గొట్టే
నింగి నేలను చేయుచు నేకముగను –సతత ధారా వృష్టి కురిసే సరిగ నపుడు .
తీ.గీ-బాట మధ్యలో పడియున్న పాదపములు –అంతరాయమయ్యెను రవాణాల కెల్ల
కష్ట నష్ట మ్ములను ,అసౌకర్యములను –అధిగమించి రనతి కాలమందే యపుడు .
తీ గీ-ముప్పుతిప్పలు పడి రంత మూడు దినము –లచట విద్యుత్తు కొరత
ఇక్కటులను పడగ కొందరిళ్ళు కూలి –దాతలును జూపిరుపకార ధర్మమపుడు
.
21-నవ్యాంధ్ర –శ్రీమతి వారణాసి సూర్య కుమారి –మచిలీ పట్నం
సీ –నవ్యాంధ్ర వెలసినది నవ నవోన్మేషమై –పుష్పించి ఫలియింప పూనుకొనగ
ప్రతి పౌరుడును కూడ ప్రతిన బూని మరియు –పాటుపడవలెను ప్రగతికొరకు
భాషాభిమానులై భావితరాలకు –తెలుగులో మధురిమన్ తెలుపనగును
ఐకమత్యంబుగ ఆంధ్రులు సాధించ –ఆనంద మొందును ఆంద్ర మాత
తీ.గీ.-పాలనమ్ము నను ,సమయ పాలనమున –నాయకులు చిత్త శుద్ధి తో చేయు కృషికి
సిరులు యశమంది మనసీమ శీఘ్రముగను –ప్రజల సుఖ శాంతులను గూడి బ్రతక గలరు .
అప్పుడు
సీ –విద్య ,వాణిజ్యముల్ వివిధ రంగమ్ముల –విశ్వ విఖ్యాతిని విధిగ బడయు
వ్యవసాయ మందున వ్రుత్తి విద్యలయందు –శాస్త్ర పరిజ్ఞాన సకల మరియు
రాజ నీతిజ్ఞతన్ రాటు దేలి మరియు –రక్షణ కవచమై రధము నడుపు
కష్టే ఫలే యను కార్మిక వర్గమ్ము-పొందగలుగు నింక పూర్ణ ఫలము
తీ.గీ –నిత్య జీవితమున నిజాయితిగ నుండి –కార్య సాధన పావన క్రతువు వోలె
దీక్షతో నెరవేర్చ సిద్ధించు విధిగ –సకల సంశోభితాంధ్ర దేశమునకు .
సశేషం
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -26-3-15- ఉయ్యూరు