|
‘తేనేమనసులు’ చిత్రంతో మార్చి 31, 1965న తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. తన నట వైదూష్యంతో అభిమానుల హృదయాల్లో ‘పాడిపంటలు’ పండించారు నటశేఖర కృష్ణ. వెండితెరపై పండు వెన్నెల కురిపిస్తూ 50 ఏళ్ల నిండైన సినీ జీవితానికి చేరువయ్యారు. సినీ కళామతల్లి ముద్దు బిడ్డగా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని సొంతం చేసుకున్నారు. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, అగ్నిపర్వతం… ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ సగటు అభిమానికి సూపర్ స్టార్ అందించిన ఆణిముత్యాలకు అంతులేదు. తన నటజీవితంలో ఆయన అందుకోని రికార్డులు లేవు, పొందని సత్కారాలు లేవు.
1943 మే 31న జన్మించిన కృష్ణ నటనకే పరిమితం కాలేదు. దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా సిల్వర్ స్ర్కీన్‌కి అమూల్యమైన సేవలు అందించారు. తన వారసుడిగా ప్రిన్స్ మహేష్‌ను టాలీవుడ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చి స్టార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న సూపర్ స్టార్‌కి సినీ జీవిత స్వర్ణోత్సవ శుభాకాంక్షలు.
|
ఇది స్వర్ణోత్సవం ఎలా అవుతుంది. ఐదు దశాబ్దాలూ నటిస్తూ ఉంటే అనుకోవచ్చు. కృష్ణ నటించటం మానేసి దాదాపు రెండు దశాబ్దాలు అయిపోయింది.