విలియం షేక్స్ పియర్ ఆంగ్ల సానెట్ కు డాక్టర్ రాచకొండ నరసింహ శర్మగారి అనువాద కవిత
అదృష్ట హీనునై అవమాన భరితునై-భ్రస్టునై ,ఒంటినై వగచినపుడు
వినని దైవంబునకు వినిపింప వ్యర్ధమై –ఉత్సాహ సంపన్ను నొకని తీరును కోరి
అతని సంపద అతని హిత ధనమ్ము- అతని నేర్పు ఇతని అవకాశ మును కోరి
మోదకారణ మేది ముదము నీక –
పొద్దు పొడుచు చున్నంతనే పుడమి రోసి –దివి కవాటమున కెగసి ధృతిని మీరి
కీర్తనల నాల పించు కోకిల విధమ్ము –నన్ను నే నేవగించు కొన్న సమయాన
తలపు నీవైన మరల సంతసము కల్గి –మృదు మధుర మైన నీ ప్రేమ స్మృతిని మెదిలి
ఎట్టి సిరిసంపదలు లభించుగాక –నృపతి పదవులనైన త్రుణీకరింతు .
The English version of this sonnet too may be included to enjoy the translation.
Regards,
Jabalimuni