నా దారి తీరు -94 త్రుటిలో తప్పిన —

నా దారి తీరు -94

త్రుటిలో తప్పిన —

నేను ఒకసారి ఉయ్యూరు నుంచి బయల్దేరి మంగళాపురం వస్తున్నాను .లక్ష్మీపురం ఉదయం తోమ్మిది౦తటి కే చేరుకొన్నాను .అక్కడి నుండి మంగళాపురం రావటానికి ఏమీ దొరకలేదు .కంగారుగా ఉంది. టైం కు స్కూల్ కు కు చేరకపోతే మాటపడాల్సివస్తుందని టెన్షన్ టెన్షన్ .గుండె మహా వేగం గా కొట్టుకొంటోంది .ఎమీపాలుపోవటం లేదు .ఇంతలో ఒక చిన్నకారు నా దగ్గరకు వచ్చి ఆగింది .డోర్  తీసి అందులోని పెద్దమనిషి ‘’నమస్తే హెడ్మాస్టారు .మీకు అభ్యంతరం లేకపోతే మాకారులో వెళ్దాం రండి ‘’అన్నారు అంతకు ముందెప్పుడూ నేను ఆయన్ను చూడలేదు .రక్షించావురా దేవుడా అనుకోని కారు ఎక్కాను .స్కూల్ దగ్గరే నన్ను దింపి వెళ్ళిపోయారు .అప్పుడే మొదటిగంట కొడుతున్నారు అంటే పావుతక్కువ పది అన్నమాట హమ్మయ్య అనుకొన్నాను .అసెంబ్లీ జరుగుపుతున్నాను .ఇంతలో  జీప్ శబ్దం వినబడింది .ఎవరా అని చూస్తె ‘’జిల్లా పరిషత్ లో మా మొగుడు ‘’అంటే పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ .మా జుట్టు అంతా ఆయన చేతిలోనే ఉంటుంది .ఆయన పేరు ‘’పరమ హంస ‘’కాని అప్పటికే ఆయనకు ‘’పరమ హింస ‘’అని పేరొచ్చింది .అందర్నీ ఇరికించి బాధపెడతాడని పుకారు .సరే గేట్ దాకా వెళ్లి ఆయన్ను ఆహ్వానించి నా కుర్చీలో కూచోబెట్టాను .పై అధికారివస్తే హెడ్ మాస్టర్ కుర్చీలో కూచోవటం ఒక ఆచారంగా వస్తోంది .హాజరు పట్టీ తెప్పించి సంతకాలు వెరిఫై చేశాడు .సైన్స్ మాస్టర్ పాల్ ఇంకా రాలేదు. సాకు దొరికింది ఆయనకు .రోజూ పాల్ లేట్ గా వస్తాడా అని అడిగాడు .లేదు అని టైం కే వస్తాడని కొంచెం ‘’కలర్’’ ఇచ్చాను .ఆయన సెలవు ముందే చెప్పి పెడతాడా అని రెండోప్రశ్న.అవునని నా సమాధానం .పాఠాలు బాగా చెబుతాడా అని మరొ బాణం .నేచురల్ సైన్స్ చెబుతాడని నా సమాధానం .ఫిజికల్ సైన్సు ఇంగ్లీషు నేనే చెబుతున్నానన్నాను .సంతోషించినట్లు మొహం కనిపించింది .టీచింగ్ నోట్స్ రాస్తాడా అంటే రాస్తాడని నేను’’ పూత ‘’.మీకు సహకరిస్తాడా అని అడిగితె ఇంచార్జ్ గా ఆయన సహకారం బాగా ఉంటుందని నా సమాధానం .మిగతా విషయాలన్నీ గుమాస్తా చూశాడు .పాల్ తప్ప అందరూ సమయానికి రావటం లెసన్ ప్లాన్లు అన్నీ వారం వారం నేను చెక్ చేసి సంతకం పెట్టటం అన్నీ హంసగారు గమనించారు .లాగ్ బుక్ విజిటర్స్ బుక్ కూడా చూపించాను రికార్డ్స్ అన్నీ పెర్ఫెక్ట్ గా ఉన్నాయని సంతృప్తి పొందాడు .పాల్ కు ఆబ్సేంట్ మార్క్ చేసి సాయంత్రం తనను ఆఫీసులో కలుసుకోమని చెప్పమని జీపెక్కి తుర్రు మన్నాడు ఆఫీసర్ హంస .నన్ను లక్ష్మీపురం లో ఆయనెవరో దేవుడిలాగా వచ్చి కారు ఎక్కించుకు రాకపోతే నా పని గోవిందో హారి .గొప్ప ప్రమాదం తప్పించాడు భగవంతుడు .

పాల్ వచ్చాడు .సారీ చెప్పాడు .ఆఫీసర్ చెప్పమన్నది చెప్పాను వణికాడు. మనిషి మినీ ఎస్వీ రంగా రావు లాగా ఉంటాడు. కాని భయపడ్డాడు .’’సార్ !నాకు ఇది కొత్త .ఆయనతో మాట్లాడటం భయం గా ఉంది .నాతొ పాటు మీరుకూడా వచ్చి నన్ను కాపాడాలి ‘’అన్నాడు .సరే నని ఆయన స్కూటర్ మీదనే సాయంత్రం స్కూల్ అయినాక ఇద్దరం జిల్లాపరిషత్ ఆఫీస్ కు వెళ్లాం .పరమహంసను కలిశాం .ముందు ఫైర్ అయ్యాడు .నెమ్మదిగా మాట్లాడి కూల్ చేశా .కొంత దిగాడు .అప్పుడు అసలు విషయం చెప్పాడు .’’మీ స్కూల్ లో పాల్ గురించి లెక్కల మేష్టారు గురించీ రోజూ ఆకాశ రామన్న ఉత్తరాలు వస్తున్నాయిచాలా రోజులుగా .అందుకని ఎంక్వైరీ కి వచ్చాను అన్నాడు .వాళ్ళు రాసినదేమీ నాకు అక్కడ కనిపించలేదు .స్కూల్ బాగా రన్ అవుతోందనే సంతృప్తి కలిగింది ‘’ అని నాతొ చెప్పి పాల్ ను ‘’నీ ప్రవర్తన మార్చుకో .మళ్ళీ కంప్లైంట్ వస్తే యాక్షన్ తీవ్రం గా ఉంటుంది ‘’అని హెచ్చరించాడు .అప్పటి నుంచి పాల్ పిల్లి అయ్యాడు భేషజం చూపించలేదు. నేను ఆయన్ను రక్షించాననే క్రుతజ్ఞతలో ఉండి పని చేశాడు ..వత్సవాయిలోస్కూల్ వదిలి ఇంటికి వచ్చేలోపు  అకస్మాత్తుగా డి ఇ వొ రావటం, ఇప్పుడు మంగళాపురం లో  హంసగారి విజిట్ లో నేను సమయానికి స్కూల్ లో ఉండటం దైవం కాపాడిన ఘటనలే నని నమ్ముతాను లేకపోతె సర్వీస్ రిజిస్టర్ లో యెర్ర ఎంట్రీ పడేది .

ఆ తర్వాత ఒకటి రెండు సార్లు మా సూల్ మీద హంసగారి నిఘా కనపడింది .ఒకసారి ఏదో సందర్భం గా సెలవు ప్రకటించాను .అది ఆయన  దృష్టి కి వెళ్లి నోటీస్ పంపటం జరిగింది. నేను ముందే పర్మిషన్ కోసం ఆయనకు రాశాను కాబట్టి సరిపోయింది .ప్రయర్ పర్మిషన్ లేకుండా సెలవు డిక్లేర్ చేయకూడదని ఒక సలహా పారేశాడు .సరేనన్నా.పాల్ గారికేసు రెండు నెలల దాకా నలుగుతూనే ఉంది .చివరికి ఏదో కొంత చేతులు తడిపి పాల్ బయట పడ్డ జ్ఞాపకం .

మా వివాహ రజతోత్సవం

మా వివాహమై 25 ఏళ్ళు అయింది .నేను మొదటిసారిగా మోపిదేవి హైస్కూల్ లో నా ఉద్యోగ జీవితాన్ని 1963లో ప్రారంభించాను .1964 ఫిబ్రవరి 21.అందుకని మా శ్రీమతిని ముందు రోజుకే మంగళా పురం రమ్మన్నాను .వచ్చింది పిల్లలూ వచ్చారు .21 ఉదయం మేమిద్దరం మోపిదేవి వెళ్లి శ్రీ సుబ్రహ్మణ్యీశ్వర స్వామి దర్శనం చేసుకోచ్చాం .సాయంత్రం ఇంటి దగ్గర చేసిన స్వీటు హాటూ గారెలు పులిహోర ,పాయసం  ఆవడలు తో స్కూల్ స్టాఫ్ కు బ్రహ్మాండమైన విందు ఇచ్చాను .అప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు.అందరూ ఆశ్చర్య పోయి అభినందించారు .ఇది ఒక కొత్త వరవడిని సృష్టించింది .అ తర్వాత డ్రాయింగ్ మేష్టారు పాండురంగా చార్యులగారు కూడా ఏదో సందర్భం గా గ్రాండ్ పార్టీ చేశారు . తర్వాత మరికొందరు టీచర్లు చేసి ఉత్సాహ వాతావరణాన్ని కలిగించారు .

అప్పటికే నన్ను టెన్త్ పిల్లలు అక్కడే ఉండి ట్యూషన్ చెప్పమని వొత్తిడి చేశారు .ఎలాగూ గది తీసుకొన్నాను కనుక ఉన్న సమయం లో చెబుతానని చెప్పి ప్రారంభించా .చండ్ర ఉమా ,చండ్ర శిరీష ,మాలెంపాటి వెంకటేశ్వరరావు ,లు చేరారు అందులో ఉమా చాలా చురుకైన తెలివైన పిళ్ళ .వెంకటేశ్వరరావు మా అమ్మాయికి దగ్గర బంధువు మంచికుర్రాడు .ఒక తొమ్మిదో తరగతి అమ్మాయి కూడా చేరింది .డబ్బులేమి తీసుకొన్నానో జ్ఞాపకం లేదుకాని ఏదో కాలక్షేపం గా సాగుతోంది .సాయంత్రం అరున్నరనుంది రాత్రి తోమ్మిదివరకు ఉదయం ఆరున్నర నుండి తొమ్మిది వరకు నేను ఉండే రోజుల్లో చెప్పేవాడిని .లెక్కలు,ఫిజికల్ ససిన్స్ ఇంగ్లీష్ పై ఎక్కువ శ్రద్ధ  చూపేవాడిని .ఒకసారి ఏదో పనిమీద బందరు వెళ్లి మాజీ హెడ్ మాస్టారు జోశ్యుల గారింటికి వెళ్లి పలకరించాను .దంపతులిద్దరూ నన్ను గౌరవం గా ఆదరించారు .అక్కడినుంచి మా పిచ్చాలక్కయ్య వాళ్ళింటికి అంటే వారణాసి వారింటికి వెళ్లి చూసి వచ్చాను .స్పాట్ వాల్యుయేషన్ కు కాని పదవ తరగతి పరీక్షలకు డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ గా కాని వేస్తె పిచ్చాలక్కయ్య వాళ్ళింట్లోనే ఉండేవాడిని. స్వంత తమ్ముడిలాగా ఆదరించేది అక్కయ్య బావగారు కూడా అదే సౌజన్యం చూపేవారు .పిచ్చాలక్కయ్య అంటే మా రేపల్లె బాబాయి రాయప్రోలు శివరామ దీక్షితులుగారి పెద్దమ్మాయి .మా రెండోఅక్కయ్య దుర్గ కు సహాధ్యాయి .ఉయ్యూరులో  మా ఇళ్ళలో కార్య కరామతులకు  ఎప్పుడూ వస్తూండేవారు .పిచ్చాలు, బాల,సీత అక్క చెల్లెళ్ళు ,బాల , సీత గుంటూరు లో ఉంటారు .అన్నయ్యా అన్నయ్యా అంటూ  మహా ఆప్యాయం గా ఉండేవారు .

స్కూల్ వార్షికోత్సవం

మంగళాపురం స్కూలు వార్షికోత్సవం అంతకు ముందెవరూ చేసినట్లు లేదు .నేను కొత్త సాంప్రదాయం ప్రవేశ పెట్టాలనుకొన్నాను స్టాఫ్ మీటింగ్ లో చెప్పి ఒప్పించాను .అసెంబ్లీలో చెప్పి పిల్లలకు తెలియ జేశాను .ఆటలలో పోటీలు వ్యాసరచన ,వక్తృత్వం   డ్రాయింగ్ ,లలో పోటీలు నిర్వహించాలని పై తరగతులలో ను కింది తరగతులలోనూ అన్నిటా ముందున్న ఉత్తమ విద్యార్ధులకు ,స్కూల్ పరీక్షలలో కన్సలిడేటేడ్ మార్కులను బట్టి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రతిక్లాస్ లోను బహుమతులు ఇవ్వాలని నిర్ణయించాం .మరి దీనికి డబ్బు కావాలి .స్కూల్ ఫండ్స్ ఏమీ లేవు .అప్పుడు చండ్రఉమా స్కూల్ పీపుల్ లీడర్ గా ఒక సలహా చెప్పింది .ఊర్లోకివిద్యార్ధులే  వెళ్లి విషయం చెప్పి చందాలు వసూలు చేసి ఇస్తామని అంది .అందరూ ఒప్పుకొన్నారు .స్టాఫ్ అంతా జీతాలను బట్టి చందాలు వేశారు .వసూలు చేశాం .ఉమా ఐడియా బాగా పని చేసింది .స్వచ్చందంగా తలిదండ్రులు ముందుకు వచ్చి వాళ్లకు డబ్బులు అందజేశారు .ప్రెస్ వాళ్ళు ఆహ్వాన పత్రికలూ ,సర్టిఫికెట్లు ఉచితంగా ప్రింట్ చేసి ఇస్తామన్నారు .ఇవన్నీ చక్కగా కుదిరాయి .ఊళ్ళో చండ్ర ప్రసాద్ గారు అనే పెద్ద భూస్వామి కుర్రాడు ఉన్నారు .ఆయన్ను ఆహ్వానించాం .లక్ష్మీపురం షుగర్ ఫాక్టరీ మేనేజర్ గారినీ పిలిచాం పిల్లలకు గేమ్స్ స్పోర్ట్స్ పోటీలు జరిపించం గొప్ప పండగ వాతావరణం ఏర్పడింది .అందరూ ఉత్సాహం గా పాల్గొన్నారు .ఎన్నడూ లేని ఐక్యత వచ్చింది .వార్షికోత్సవం పరమ వైభవం గా జరిగింది .విద్యార్ధులందరికీ స్వీటు హాటు పాకెట్స్ ఇచ్చాం స్టాఫ్ కు ఊరి పెద్దలకు  టీ పార్టీ ఇచ్చాం .పిల్లలందరికీ దాదాపు ఏదో ఒక బహుమతియో సర్టిఫికేట్తో వచ్చేట్లు చేయటం తో వారి ఉత్సాహానికి అంతే లేకపోయింది .ఈ  యానివర్సరి చరిత్రలో చిరస్థాయి గా నిలిచింది .

డ్రాయింగ్ మాస్టారు పదవీ విరమణ

డ్రాయింగ్ మాస్టారు పా౦డు రంగాచార్యులు గారు ఉత్తములు .గొప్ప సహాయ కారి .సేక్రేటరిగా సమర్ధం గా పని చేశారు అందరి తోనూ సంప్రదించి చక్కని నిర్ణయాలు చేసేవారు .ఒకే కుటుంబ భావన కలిగించారు .ఆయన పదవీ విరమణ అందరికి బాధ కలిగించింది ఘన సన్మానంవీడ్కోలూ  చేశాం  నేను ఆయన మీద ఒక కవిత రాసి చదివానుకూడా .తెలుగు మేష్టారు కూడా పద్యాలు రాశారు ఆయనా అంతే గొప్పగా ఇంటి దగ్గరే  అన్నీ వండించుకొని వచ్చి గొప్ప పార్టీ ఇచ్చారు .ఒకటి రెండుసార్లు సాయంత్రం స్కూల్ అవగానే తనతో పెదకల్లెపల్లికి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్లి భార్య చేత గారెలు వండించి టిఫిన్ పెట్టించేవారు అక్కడినుండి దేవాలయానికి తీసుకొని వెళ్లి దర్శనం చేయంచి బెజవాడ బస్ ఎక్కించేవారు .చాలా గౌరవం ,మర్యాదా ఉన్న పెద్దమనిషి .రిటైర్ అయిన రెండేళ్ళ లోపే చనిపోయారని తెలిసి విచారించాను .

తెలుగు మేష్టారు ముదిగొండ మల్లికార్జున రావు ఆరాధ్యులు .ఒక సారి సాహితీ మండలి  సమావేశం మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో జరిగితే వచ్చి మంచి సాహిత్యోపన్యాసమిచ్చారు .ఆయన పాండిత్యానికి అందరం అబ్బురపద్దాం .ఆయాసం తోనే అతగోప్పగా మాట్లాడారు .ఇన్ షర్ట్ వేసేవాడేప్పుడూ .వేసవికాలం లో గుంటూరు వెళ్లి అక్కడే అకస్మాత్తుగా చనిపోయినట్లు తెలిసింది .

రంగా యాజిటేషన్

వంగవీటి మోహన రంగా నిరాహార దీక్ష బెజవాడలో చేస్తుంటే ఏంటి రామారావు ముఖ్యమంత్రిగా ఉండి పోలీసులతో దీక్ష భగ్నం చేయించాడని ,రంగా మరణం తో అట్టుడికిపోయిన కాపులు కోపావేశం తో కమ్మవారి ఆస్తులన్నీ ధ్వంసం చేయటం దానికి ప్రతిగా కాపుల ఆస్తుల్ని వీరు ధ్వంసం చేయటం రాష్ట్రం లో ముఖ్యం గా కృష్ణా జిల్లాలో గొప్ప విపత్కర పరిస్తితిని తెచ్చింది .స్కూళ్ళు కాలేజీలు మూత పడ్డాయి. సెలవులు పొడిగించారు .కమ్యూనికేషన్ కూడా లేదు .ఒక సారి రివోపెనింగ్ కు బస్సులు లేక నేను నా లూనా మీద ఉయ్యూరు నుండి మంగళాపురం వెళ్లాను .పేపర్ చూసిన వారందరూ వచ్చారు .కాని ఎన్ డి ఎస్ అర్జునరావు మాత్రం హైదరాబాద్ లో చిక్కుకు పోయి రాలేదు .మర్నాడు బడికి వచ్చాడు .ఇప్పుడు ఏం చేయాలి ?అన్నది పెద్ద సమస్య రివోపెనింగ్ రోజున రాకపోతే సెలవులన్నీ జీతనస్టమై జీతం రాదు ,ఆయన వచ్చి బిక్క మొహం తో కూర్చున్నాడు. సంతకం పెట్ట నివ్వలేదు. డియి వొ  నుంచి పర్మిషన్ తెచ్చుకొంటేనే హాజరు లో సంతకం చేయాలి .అందరం తలలు పట్టుకు కూర్చున్నాం .డియి వొ ఆఫీసు కూదాకాలి బూదిదయింది .రికార్డులు ఏవీలేవు ఆధారానికి .దీన్లోంచి ఎలా బయటపడాలి .స్టాఫ్ మీటింగ్ వేసి అందర్నీ సంప్రదించాను .ఒకరిద్దరు ఆయనకు వ్యతిరేకం గా మాట్లాడారు .ఆ ఇద్దరినీ విడిగా పిలిచి నేను వారితో మాట్లాడాను ‘’ఇప్పటిదాకా స్కూల్ లో మంచి ఐక్యత కాపాడుకోన్నాం .మనం అందరం ఒకటిగా ఉంటె ఎవరూ మనల్ని ఏమీ చెయ్యలేరు .ఆయన ఏడుస్తున్నాడు .ఆయనది గవర్నమెంట్ ఉద్యోగం .లీవ్ అదీ సాంక్షన్ కావాలంటే ఎంతోకాలం పడుతుంది.రికార్డులే తగలబడ్డాయి .జీతం రాకపోతే ఎవరికైనా ఇబ్బందేకదా మీరుకూడా సరే నంటే నిన్ననే ఆయన మనతో బాటు స్కూల్ కు వచ్చినట్లు సంతకం పెట్టిస్తాను ‘’అని నచ్చ చెప్పాను వాళ్ళిద్దరూ కూడా మెత్తబడి చివరికి ఆయనతో సంతకం చేయించటానికి అంగీకరించారు .అందరి సమక్షం లో అర్జున రావు తో ఆ కిందటి రోజు సంతకం చేయించాను .అందరూ కిమిన్నాస్తి .నన్ను అందరూ అభినందించారు .అర్జున రావు నాకాళ్ళమీద పడేంతగా కృతజ్ఞత మాటల్లో చేతల్లో చూపించాడు .హమ్మయ్య మళ్ళీ ఒక గండం గడిచి పిండం బయట పడిందని సంతృప్తి చెందాం .హెడ్ మాస్టారికి కొంత చాకచక్యం, కలుపుకు పోయే తత్త్వం ఉండాలని తెలిసింది .నావిజయ రహస్యం అదేనని పిస్తుంది .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -2-4-15- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.