|
సీన్ సితారే
సినిమా అంటే 24 కళలు కదా.. మీరు ఎప్పుడూ హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు- వీళ్ల కథలే చెబుతారెందుకు? మిగతా కళాకారులు గురించి ఎప్పుడూ ఎందుకు ప్రస్తావించరు?’’ అని గురువుగారిని సూటిగా ప్రశ్నించాడు శిష్యుడు. అప్పటి దాకా ధ్యానం చేసుకుంటున్న గురువుగారు నెమ్మదిగా కళ్లు తెరిచారు. శిష్యుడు వైపు చూసి చిరునవ్వు నవ్వి- ‘‘ఈ ప్రశ్న నువ్వు ఎప్పుడు అడుగుతావా? అని ఎదురుచూస్తున్నాను.. అని ఆగాడు. ఇప్పుడు నీకో కథ చెబుతాను. ఆ కథలో ఒక చిక్కు ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకు నువ్వు సరైన సమాధానం చెప్పలేకపోతే- వచ్చే వారం వరకూ నాతో మాట్లాడకూడదు..’’ అని సవాలు విసిరాడు. శిష్యుడు ఆ సవాలును స్వీకరించినట్లు తలూపి- చెప్పండి.. గురుదేవా అన్నాడు.
కథాక్రమం..
మన ఇండసీ్ట్రలో ఒక గాయకుడు ఉండేవాడు. ఆయన పాడితే- తేనె కారినట్లు ఉంటుందని అందరూ అనుకొనేవారు. ఎంత కఠినమైన పాటనైనా సునాయాసంగా పాడేసేవాడు. దాంతో సంగీత దర్శకులకు పని చాలా సులువయ్యేది. అందువల్ల చాలా మంది సంగీత దర్శకులు ఆయనే కావాలనుకొనేవారు. ఏడాదికి 100కి పైగా సినిమాలు నిర్మిస్తే- ప్రతి దాంట్లో ఆయనవి కనీసం రెండు,మూడు పాటలైనా ఉండేవి. ఔత్సాహిక గాయకులందరూ ఆయన రికమెండ్ చేస్తే చాలని ఎదురుచూస్తూ ఉండేవారు. దానికి తగినట్లుగా ఆయన ఆంధ్రదేశమంతా తిరిగి- ఔత్సాహిక గాయకుల చేత పాడిస్తూ ఉండేవాడు. అందరూ ఆయన శిష్యులే. అయినా ఎవ్వరికీ అవకాశాలు వచ్చేవి కావు. ఇలా కథ సాగుతున్న సమయంలో- ఒక కుర్రాడు హఠాత్తుగా రంగం మీదకు దూసుకువచ్చాడు. జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలన్నింటిలోను అతని ప్రొగ్రాములే. ప్రతి మ్యూజిక్ డైరక్టర్ ఏదో ఒక సందర్భంలో అతనిని పొగిడిన వారే. చిన్న వయస్సులో అంత సులువున్న గాయకుడు మరొకరు లేరని ప్రస్తుతించినవారే. ఆ కుర్రవాడు మన గాయకుడి దృష్టిలో పడ్డాడు. ఒక సారి అతనిని పిలిచి- ుూనీది జిల్లా స్థాయి కాదు. మద్రాసు స్థాయి.. నా దగ్గరకు వచ్చేయి..’’ అని ఆహ్వానించాడు. ఆ కుర్రవాడు పొంగిపోయాడు. మూటాముళ్లు సర్ధుకొని మద్రాసు వెళ్లిపోయాడు. గాయకుడు- ఆ కుర్రవాడిని అమితంగా ఆదరించాడు. ఎక్కడికి వెళ్లినా- వెంటబెట్టుకొనే వెళ్లేవాడు. ఒక రోజు గాయకుడికి బాగా జ్వరం వచ్చింది. పాట రికార్డింగ్ చేయటం తప్పనిసరి. ఆ సమయంలో మ్యూజిక్ డైరక్టర్ ఫోన్ చేసి- ుూమీ దగ్గరున్న కుర్రాడి చేత పాడిద్దాం. బాగా పాడుతున్నాడు కదా..’’ అన్నాడు. అప్పుడా గాయకుడు- ుూవాడిది మన స్థాయి కాదు. బాలీవుడ్ స్థాయి. వాడికి అక్కడే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నా..’’ అన్నాడు. అన్నట్లే కొద్ది కాలం తర్వాత తన పలుకుబడి ఉపయోగించి- ఒక సినిమాలో ఛాన్స్ కూడా ఇప్పించాడు. బొంబాయిలో తన స్నేహితుడి గెస్ట్ హౌస్‌లో ఉంచాడు. ఆ కుర్రాడు చాలా కాలం ఛాన్స్‌ల కోసం ప్రయత్నించి విఫలమయి తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాడు. అప్పటికి ఇక్కడి ట్రెండ్ కూడా మారిపోయింది. దాంతో అతనికి ఇక్కడ కూడా ఛాన్స్‌లు దొరకలేదు..
ఉపసంహారం
బాలీవుడ్లో ఛాన్స్‌లు దొరకటం చాలా కష్టమనే విషయం తెలిసి ఆ గాయకుడు కుర్రావాడిని బొంబాయి ఎందుకు పంపాడు?’’ అని ప్రశ్నించాడు గురువుగారు. దీనికి సమాధానం చెప్పటం చాలా సులువు గురువుగారు.. అన్నాడు శిష్యుడు. ‘‘ఆ కుర్రాడి టాలెంట్‌ను గాయకుడు గుర్తించాడు. అతను టాలీవుడ్లో ఉంటే తనకు ప్రమాదమనే విషయం అతనికి తెలుసు. అందువల్ల అతనిని బాలీవుడ్‌కు పంపాడు. బాలీవుడ్ ఒక మహాసముద్రమని- అక్కడ నిలదొక్కుకోవటం కష్టమని అనుభజ్జుడైన గాయకుడికి తెలుసు. అందుకే ఆ పన్నాగం పన్నాడు..’’ అని సమాధానాన్ని చెప్పాడు శిష్యుడు. ఆ సమాధానానికి గురువు చిరునవ్వు నవ్వి- ‘‘నువ్వే గెలిచావు..’’ అని మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోయాడు.
చౌరా నీతి
ఇండసీ్ట్రలో టాలెంట్ ఉంటే సరిపోదు. దృతరాష్ట్ర ప్రేమ కూడా ఉంటుందని గ్రహించాలి.
ఏడాదికి 100కి పైగా సినిమాలు నిర్మిస్తే- ప్రతి దాంట్లో ఆయనవి కనీసం రెండు,మూడు పాటలైనా ఉండేది. ఔత్సాహిక గాయకులందరూ ఆయన రికమెండ్ చేస్తే చాలని ఎదురుచూస్తూ ఉండేవారు. దానికి తగినట్లుగా ఆయన ఆంధ్రదేశమంతా తిరిగి- ఔత్సాహిక గాయకుల చేత పాడిస్తూ ఉండేవాడు. అందరూ ఆయన శిష్యులే. అయినా ఎవ్వరికీ అవకాశాలు వచ్చేవి కావు.
|