యోగ సంప్రదాయం అంటే ఏమిటి?

యోగ సంప్రదాయం అంటే ఏమిటి?
 
యోగశాస్త్రం అనాదిగా మన దేశంలో ఉన్న సంప్రదాయం. ఉపనిషత్తుల్లో చాలా చోట్ల యోగం యొక్క ప్రస్తావన ఉంది. మనస్సును పవిత్రం చేసుకోవడానికి ఉపయోగించే మార్గంగా దీన్ని ఉపాసనలతో జోడించి చెప్పారు. భగవద్గీత ఆరవ అధ్యాయం అంతా యోగాభ్యాసానికి సంబంధించినదే. నాస్తిక సంప్రదాయాలైన బౌద్ధ, జైన మతాల్లో కూడా చాలా నిశితంగా వీటిని అభ్యాసం చేశారు. బహుశా బౌద్ధుల కాలంలోనే యోగశాస్త్రం మనదేశం ఎల్లలు దాటి టిబెట్‌, చైనా తద్వారా మిగతా ఆసియా దేశాలకు కూడా విస్తరించింది. అన్ని భారతీయ సంప్రదాయాలూ యోగాన్ని అంగీకరించినా ముఖ్యంగా దీనికి సంబంధించిన అంశాల్ని సూత్రాల రూపంలో పతంజలి అనే ఋషి వ్రాశాడు. వీటినే పతంజలి యోగసూత్రాలు అంటారు. ప్రపంచంలోని మేధావులందరూ ప్రశంసించిన గ్రంథమిది.
యోగం అనే పదానికి కలయిక అని అర్థం. ఇది వరకు లేనిదాన్ని పొందడం, లేదా ఇది వరకూ తెలియనిదాన్ని తెలుసుకోవడం. భగవద్గీతలో ప్రతి అధ్యాయం పేరులో యోగ అనే పదం ఉంటుంది. అది ఆ అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని సూచిస్తుంది. ప్రస్తుత వ్యాసం అలాకాక యోగశాసా్త్రనికి సంబంధించినది. దీన్ని అభ్యాసం చేసే వ్యక్తి ఇది వరకు తెలియనిదాన్ని తెల్సుకోవడం ఇందులోని విషయం. జీవుడు తాను కేవలం శరీరం, ఇంద్రియాలు  కాదనీ, చైతన్యం తన నిజరూపమనీ తెలుసుకోవడం.
శరీరానికి, మనస్సుకు ఉన్న సంబంధాన్ని నిశితంగా పరిశీలించిన శాస్త్రం యోగశాస్త్రం. సాధారణంగా యోగమంటే ఏవో ఆసనాలు వేయడం, శరీరాన్ని అనేక రీతుల్లో వంచడం, గాలిని బిగబట్టడం మొదలైనవేనని భావిస్తూ ఉంటాం. ఈ విధమైన ఆసనాలు, గాలిని బిగబట్టడం లాంటివి యోగశాస్త్రంలో ప్రాథమిక అభ్యాసాలు మాత్రమేనని యోగసూత్రాల్ని చూస్తే గమనించగలం. మరి ఇందులో అసలైన విషయమేమిటి అని పరిశీలిద్దాం.
చైతన్యం అనే రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి చర్చ అన్ని భారతీయ దర్శనాల్లో చూడగలం. జడం నుండి చైతన్యం వచ్చిందని కొందరు, చైతన్యమే జడంగా మారిందని కొందరు, చైతన్యం జడంగా కనిపిస్తుందని మరికొందరు ప్రతిపాదించారు. ఈ సమస్యకు సమాధానానికై ఈనాటికీ భౌతిక శాస్త్రవేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు కలిసి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఆధునిక మనస్తత్వశాస్త్రజ్ఞులు మన యోగశాస్త్రం చేసే ప్రతిపాదనల్ని స్వీకరించి ఈ యోగ విధానాల్ని అభ్యాసం చేసే సాధువులు, బౌద్ధభిక్షువులు మొదలైన వారితో కూడా కలిసి పనిచేస్తున్నారు.
ఇలాంటి ప్రయోగాలకు మనిషి(అన్ని జీవుల) శరీరమే ప్రయోగశాలలాంటిది. దీనిలో ఒక ఆలోచనాశక్తి ఉంది, శరీరం, ఇంద్రియాలు, అవయవాలు ఉన్నాయి. ఆలోచనాశక్తి చైతన్యానికి సంబంధించిన అంశం. శరీరం, ఇంద్రియాలు జడానికి చెందిన అంశాలు. ఈ రెండూ కలగాపులగంగా విడదీయరానివిగా శరీరంలో ఉన్నాయి. ఏది దేనిపైన ఆధారపడి ఉంది, ఏది ప్రధానమైనది అని తెలియాలంటే శరీరము, మనస్సు అనే లేబొరెటరీతోనే పరిశీలన చేయాలి.
శాస్త్రవేత్తలు దేన్నీ నిర్ధారించి చెప్పనప్పటికీ వేదాంతం. సాంఖ్యము, యోగశాస్త్రమూ చైతన్యమే ప్రధానమైనదని చెపుతాయి. ప్రాణుల శరీరం, ఇంద్రియాలు, మనస్సు అనేవి సృష్టిలో ఉన్న పృథివి, జలం, అగ్ని మొదలైన ఐదు భూతాల పరిణామంగా ఏర్పడినవే (్ఛఠిౌజూఠ్ఛి) అని ఇది వరకు వ్యాసాలలో గమనించాం. శరీరం, అవయవాలు స్థూలమైనవి, అంటే బండవి, చైతన్యం లేనివి అని చెప్పవచ్చు. మనస్సు వీటికన్నా మెరుగైనది. దీనికి విషయాల్ని గ్రహించే శక్తి ఉంది. అందుకే దీన్ని సూక్ష్మమైనది అన్నారు. మనిషికి ‘నేను’ అనే భావన ముఖ్యంగా స్థూలమైన శరీరంపై ఉంటుంది. దీనికి ఆకలి, దప్పికతో పాటు, ఇంద్రియాల సంతోషానికై అనేక కోరికలు ఉంటాయి. మనస్సు వీటి వెంబడి పరిగెడుతూ ఉంటుంది. ఈ కోరికలు తీరనప్పుడు మనస్సు తీవ్రంగా కలత చెందుతుంది. దాని ప్రభావం శరీరంపై ఉంటుంది. కానీ మనిషి స్వరూపం శరీరం, ఇంద్రియాలు కాదు, చైతన్యం అని ఉపనిషత్తులు చెప్పినట్లే పతంజలి కూడా చెబుతాడు. అందువల్ల సాధన మార్గంలో ఉన్న వ్యక్తి ‘నేను’ అనే భావనను స్థూల శరీరం నుండి తీసివేసి తన స్వరూపం చైతన్యమే అని గమనించాలనేది యోగం యొక్క ముఖ్య లక్ష్యం. ఇలా గమనించడానికి మనస్సుకు చాలా అభ్యాసం కావాలి. ఇలాంటి అభ్యాసాన్నే యోగశాస్త్రం చెప్తుంది.
మనస్సు శరీరంపై ప్రభావం చూపుతుందని మనకు తెలుసు. ఏదైనా ఎక్కువ సంతోషాన్ని, దుఃఖాన్ని కలిగించే వార్తలు విన్నప్పుడు మనిషి ఉద్వేగానికి లోనౌతాడు. కానీ శరీరాన్ని నియంత్రించడం ద్వారా మనస్సును ప్రభావితం చేయగలం అనేది యోగశాస్త్రంలో మౌళికమైన సూత్రం.పతంజలి తన యోగసూత్రాల్లోని మొదటి మూడు సూత్రాల్లోనే విషయాన్నంతా సంగ్రహంగా చెప్పాడు. యోగమంటే మనస్సులోని అన్ని ఆలోచనల్నీ నిరోధించడం అని, అలా చేసినపుడు సాధకుడు తన అసలు స్వరూపమైన చైతన్యంలో ఉంటాడని, అలా చేయలేనప్పుడు బయటి ప్రపంచంతో మమేకమై కష్టసుఖాలు అనుభవిస్తుంటాని మొదటి మూడు సూత్రాలు. మిగతా గ్రంథమంతా ఈ మూడింటిపైన వచ్చిన వ్యాఖ్య. మనస్సును అదుపులో తేవడానికి ఎనిమిది మెట్లు చెప్పారు. దీన్నే అష్టాంగయోగం అన్నారు. మొదటగా శరీరానికి సంబంధించిన అభ్యాసాలు. ఒక విషయంపై కోరిక కలిగినపుడు బలవంతంగా శరీరాన్ని నిగ్రహించుకోవడం మొదటి మెట్టు. మంచి, చెడులు విచారించి, మనస్సును కోరికలవైపు వెళ్ళకుండా చేయడం రెండవ మెట్టు. మూడవమెట్టు మనందరికీ తెలిసిన ఆసనాలు. ఇవి శరీరానికి కష్టం కలిగించేటట్టుగా లేకుండా ఆలోచించడానికి అనువైన పద్ధతిలో ఉండాలి. ఆ తర్వాత గాలిపై నియంత్రణ మొదలైన మెట్లు చెప్పబడ్డాయి. వీటిని పుస్తకాల ద్వారానే కాక ఒక మంచి సాధకుడైన గురువు పర్యవేక్షణలో అభ్యాసం చేయడం ముఖ్యం.
యోగశాస్త్రంలో దేవుడి ప్రస్తావన కేవలం ఒకే సూత్రంలో ఉంది. మనిషికున్న క్లేశాలు, కర్మఫలం మొదలైన వాటికీ, దేశకాలాలకూ అతీతంగా ఉన్న సర్వజ్ఞుడైన వ్యక్తి అని మాత్రమే చెప్పబడింది. కావున ఇది ఏ మతవిశ్వాసానికీ, ఏ దేవుడికీ చెందింది కాదు. ప్రపంచంలో ప్రతి మనిషికీ శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఒకటే. అందువల్లే ఈ శాస్త్రంలోని విశ్లేషణపై మనకన్నా ఎక్కువగా ఇతరులు శ్రద్ధ చూపుతున్నారు. పాశ్చాత్య మనస్తత్వశాసా్త్రనికి మూల పురుషుడు అని పిలవబడే గిజీజూజూజ్చీఝ ఒ్చఝ్ఛట (హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం) వివేకానందుని శిష్యుడు. వివేకానందుడు ఇతని ఆతిథ్యంలో ఉండేవాడు. ఇతడు చెప్పిన టఛిజీౌఠటుటట అనే భావన యోగసూత్రంలోనిదే. గిజీజూజూజ్చీఝ ఒ్చఝ్ఛట హిందూ, బౌద్ధ సంప్రదాయాల్ని క్షుణ్ణంగా చదివాడు. అలాగే ఇ్చటజూ ఒఠుజ కుండలిని యోగంపై అనేక సెమినార్లు నిర్వహించాడు. బ్రిటీష్‌ పరిపాలన సమయంలో కలకత్తాలో జడ్జిగా ఉండిన ఖిజీట ఒౌజిు గిౌౌఛీటౌజజ్ఛ అనే అతను శరీరంలోని వివిధ చక్రాలు, కుండలిని మొదలైనవాటి గూర్చి ఖీజ్ఛి ఖ్ఛిటఞ్ఛు మొదలైన పుస్తకాలు వ్రాశాడు. యోగంలో చెప్పే ధ్యానాన్ని అనే పేరిట మనస్తత్వవేత్తలు బోధిస్తున్నారు. ప్రస్తుతం యోగవిధానాల్ని హిందూ సంప్రదాయంలో కన్నా బౌద్ధులు ఎక్కువ అభ్యాసం చేస్తూండడం, ఆదరణ పొందడం ఒక విశేషం.
యోగం అనే పదానికి కలయిక అని అర్థం. ఇది వరకు లేనిదాన్ని పొందడం, లేదా ఇది వరకూ తెలియనిదాన్ని తెలుసుకోవడం. భగవద్గీతలో ప్రతి అధ్యాయం పేరులో యోగ అనే పదం ఉంటుంది. అది ఆ అధ్యాయంలో చెప్పబడిన విషయాన్ని సూచిస్తుంది. ప్రస్తుత వ్యాసం అలాకాక యోగశాసా్త్రనికి సంబంధించినది. దీన్ని అభ్యాసం చేసే వ్యక్తి ఇది వరకు తెలియనిదాన్ని తెల్సుకోవడం ఇందులోని విషయం.
డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
 
సుగుణ మూర్తి స్వరూపమే విగ్రహారాధన!
స్పందన
చివరగా మానవునిలో లౌకిక ప్రయోజనములకు ఆధారభూతమైన మాంత్రిక, యాంత్రిక, తాంత్రిక ప్రధానమైన అధర్వణం ఆవిర్భవించింది. ఆ తరువాతి క్రమంలో ’’సత్యం-శివం- సుందరం’’ అనే ఉపనిషత్తుకి స్ఫూర్తిగా మానవుని మనో విక్షేపాన్ని తొలగించి, ఆత్మ ప్రత్యగాత్మ, ఆధ్యాత్మలను, పరమాత్మలో సాయుజ్య మొనరించే విగ్రహారాధన ప్రారంభమైంది.
మార్చి 27 వ తేదీ శుక్రవారం భారతీయంలో విగ్రహారాధన ప్రధానాంశంగా రిటైర్డ్‌ డి.జి.పి డాక్టర్‌ అరవిందరావు గారి వ్యాసం ఆలోచనాత్మకంగా బాగుంది. దానికి మరి కొంచెం వివరణే ఈ వ్యాసం.
మన భారతీయతత్వ చింతన జ్ఞాన ప్రధానమైనది కేవలం విశ్వాస ప్రధానమైనది కాదు. తత్వం అంటే మూలతత్వం. – ‘ఈ అనంత విశ్వశకి ్తరహస్య తత్వం. ఆ తాత్విక జ్ఞానాన్నే వేదం అన్నారు.‘‘ వేత్తీఆవేదః వేదమతీతివేదః ’’
అని వేద నిర్వచనం. తెలిసేది- తెలుసుకునేది- తెలుసుకున్న జ్ఞానమే వేదం. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవలసినదే చాలా ఉంటుంది. అందుకే ‘‘అనంతావైవేదాః’’ . అయితే ఈ వేద విజ్ఞానాన్ని నాల్గు వేదాలుగా వింగడించాడు వ్యాస మహర్షి. ‘‘వేదాన్‌ వివ్యాస ఇతివేదన్యాసంః’’ అని సంగీత వాక్యము. వేదములు మూడు అని ‘‘త్రయోవేదాః’’ అని కూడా అంటారు. సరే అది ప్రస్తావాంశమే కానీ ప్రధానాంశం కాదు. ప్రస్తుతం విగ్రహారాధనకు వేద నాగరికతా పరిణామం ఎలాగో ఆలోచిద్దాం.
మొదటిగా..
మొట్టమొదటి ఋగ్వేద కాలంలో మానవ నాగరికతలో మనస్సే ప్రధానంగా భావించారు. ఋక్కు అంటే మంత్రం. మను తేత్రాయతీతి మంత్రః అని, మన్య తేత్రాయతేతిమంత్రః అని, మీననాల్‌త్రామతే ఇతిమంత్రః అని నిర్వచనాలున్నాయి. ‘‘మన ఏవ మనుష్యాణాంకారణంబంధవేలూక్షమోః’’ అని మనసునే ప్రధానాంశంగా జపయోగాన్ని, తపోయోగాన్ని సంకల్ప ప్రధానంగా తపోభవ’ అని ఉపదేశించాడు అగస్త్య మహర్షి. అందుకే రుగ్వేద కర్మకాండల్లో క్రియ కంటే ఎక్కువ సంకల్ప ప్రధానంగా ఉంటాయి .‘‘యజ్ఞారాంజపయజ్ఞోస్మి’’ గీతా వాక్యం. కానీ కాలక్రమంలో మనస్సే కాకుండా క్రియకు కూడా ప్రాధాన్యమివ్వాలనే దృష్టిలో యజుర్వేద యుగం ప్రారంభమైంది. ‘‘ కామేనవాచామనసేంద్రియైుః బుద్ధ్యాత్మనా’’- చేసిన కర్మలే సంపూర్ణ సాఫల్యాన్నిందిస్తాయని యజ్ఞయాగాది కర్మలను ప్రబోధించింది. ‘‘యజ్యతీతియజ్ఞం’’ ,దేవేభ్యోయజ్ఞందేవయజ్ఞం’’, ‘‘భూతేభ్యోయజ్ఞః’’, ‘‘ భూతయజ్ఞః’’ అని దేవతలకు, పితరులకు, తనచుట్టూ ఉన్న చరాచర భూత ప్రపంచానికి మేలు చేకూర్చే కర్మలను యజుర్వేదంలో నిర్దేశించారు- యజుర్వేదమైన నమకచమకాదులలో అంతా కూడా ప్రకృతి లోని సర్వవస్తువులను ప్రస్తుతించారు. ముఖ్యంగా మానవజీవనానికి ఆధారభూతమైన నదులను(నద్యామచ), ప్రవాహములను(ప్రవాహ్యమచ), సముద్రపు నురుగును(ఊర్మ్యామచ), శిలలను ( శిలామచ) , రహదారులను(ప్రపధ్యామచ) అన్నింటినీ దేవతా స్వరూపంగా భావించి ప్రస్తుతించింది. ’’ఆపోవాఇదగుంసర్వం… భూర్భువస్సవరోం’’ అనే మంత్రంలో నీటి ప్రాధాన్యాన్ని వివరించింది. అదే ఋగ్వేదంలో జ్ఞానప్రధానంగా భావించి ‘‘అగ్నిమేలే పురోహితం.. హోతారంరతృధాతమమ్‌ ’’ అని అగ్నిని ప్రధానదైవత్వంగా జ్ఞానాన్ని లక్ష్యంగా మనస్సంకల్పాన్ని లక్షణంగా భావించింది ఋగ్వేదం. యజుర్వేదంలో అన్నిప్రాధాన్యాన్ని గుర్తించినా శన్నుదేవరభష్టయతో నీటి ప్రాధాన్యాన్ని ప్రకృతి శక్తుల ప్రాధాన్యాన్ని మానవుని ఐహిక ఆముష్మిక కర్మల్లో అవసరమని గుర్తించింది. అందుకు మానవుడు మనస్సంకల్పంతో పాటు క్రియాత్మకంగా ఉండాలని యజ్ఞయాగాది కర్మలను నిర్దేశించింది. మానవుడు- ప్రకృతి- సంకల్పశక్తి- ఇచ్ఛాశక్తి- క్రియాశక్తుల సమహార సుస్వరూపమే యజుర్వేదం. తరువాత క్రమంలో ’ఆనందో బ్రహ్మ’ అనే లక్ష్యంతో నాద ప్రధానము, సుస్వర ప్రధానమూ అయిన సామవేదం నిష్పన్నమైంది- ఉపవేదంగా గాంధర్వవేదం ఆవిష్కృతమైంది. చివరగా మానవునిలో లౌకిక ప్రయోజనములకు ఆధారభూతమైన మాంత్రిక, యాంత్రిక, తాంత్రిక ప్రధానమైన ఽఅధర్వణం ఆవిర్భవించింది. ఆ తరువాతి క్రమంలో ’’సత్యం-శివం- సుందరం’’ అనే ఉపనిషత్తుకి స్ఫూర్తిగా మానవుని మనో విక్షేపాన్ని తొలగించి, ఆత్మ ప్రత్యగాత్మ, ఆధ్యాత్మలను, పరమాత్మలో సాయుజ్య మొనరించే విగ్రహారాధన ప్రారంభమైంది.
సుగుణనిర్గుణలు..
సుగుణనిర్గుణోపాసనల పరంగా చర్చించినపుడు సగుణోపాసకమైన విగ్రహం ఒక బొమ్మకాదు- మనస్సంకల్ప సిద్ధి పూర్వకమైన మంత్ర పరిపుష్టి(మంత్రాధీనంతుదైవతం) అక్షరము- ధ్వని- స్వరబంధోనియమ బద్ధమైన మంత్రసిద్ధి రేఖాప్రమాణ శాస్త్ర నియమబద్ధమైన యంత్రము. శిల్ప శాస్త్ర ప్రధానమూ ఆగమమంత్ర ప్రమాణమైన విగ్రహమూ, వీటన్నింటిని సమాహార స్ఫూర్తి స్వరూపమే. దేవతామూర్తి అంటే కాని ఏదో ఒక రీతిన చెక్కిన బొమ్మ కాదు. ఇక ఆరాధన, అర్చన విషయానికి వస్తే- కామేన( శరీరం చేత), మనసా (మనస్సు చేత), బుద్ధ్యా (బుద్ధి చేత), ఆత్మనా (ఆత్మ చేత) చేసిన క్రియా కర్మమే సంస్కార భూతంగా సూక్ష్మబుద్ధిలో ప్రవేశించి మానవుని ఉన్నత స్థాయికి, ఉపాసనాస్థితికి చేరుస్తుంది. అదీ ఆరాధన అంటే. వెరసి విగ్రహారాధన భగవత్స్వరూపం- ఈ గంభీర సుశాస్ర్తీయ ఆలోచనా సరళిని విమర్శకులు గ్రహించవలెనని మనవి చేస్తున్నాను.
ఇక నిర్గుణము అనే మాటకు వస్తే వేదాంత పరిభాషలో నిర్గుణ ం అంటే గుణరహితం అని అర్థం కాదు. సంస్కృత వ్యాకరణరీత్యా నిర్‌ అనే ఉపసర్గ రహితం- అని కాకుండా విశేష సంజ్ఞాగుణ వాచకంగా వర్తిస్తుంది. ఉదా: నిరుక్తం- నిర్దేశం – నిర్వచనం- నిర్దిష్టం- నిర్ణయం- వంటి పదములు. అందువల్ల నిర్గుణం అంటే విశేష సౌంజ్ఞాగుణ వాచక శూన్యం అని చెప్పుకోవాలి. అంటే వ్యవహార భాషలో గుణం అనే మాట సంకుచితమైంది. సర్వశక్త్యాత్మక, సర్వవిశ్వాత్మక, సర్వ జ్ఞానాత్మక గుణం కూడా గుణ తత్వమే కానీ అది విశేష సౌంజ్ఞాగుణ వాచకం నిర్గుణం అని అర్థం చేసుకోవాలి. అందుచేత నిర్గుణ తత్వాన్ని మనం చేరుకోలేము కనుక దానినే మంత్ర యంత్ర, తంత్ర సహితంగా సంక్షీప్తికరీంచి సగుణాత్మక దృశ్య మానమూర్తిగా నిర్ధేశించారు. శ్రీ చక్రాది యంత్రాలు – దేవతామూర్తుల విగ్రహాలు దేహా దేవాలయ ప్రోక్తో అని చెప్పబడిన విధంగా దేవాలయాలు – పూజా స్థానాలుగా నిర్ణయించారు. ఈ గంభీరతత్వమే విగ్రహారాధన – ఈ తాత్విక రహాస్యాన్ని తెలుసుకోవలసినదిగా విమర్శకులకు మనవి.
ఉమాపతి బి శర్మా
9246171342
 
స్ఫూర్తే ముఖ్యం!
 
మనం యంత్రాలం కాదు. మనుషులం. అందువల్ల భావోద్వేగాల ప్రభావం మనపై ఉంటుంది. సిబ్బంది పట్ల కరుణతో వ్యవహరించాలి. అయితే ఇది క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా ఉండకూడదు. అతి సర్వత్రా వర్జియేత్‌ అనే విషయం మీకందరికీ తెలుసు కదా! ఇప్పుడు సిబ్బందిని ఎలా కలుపుకొని ముందుకు వెళ్లాలో చూద్దాం. వాళ్ల సమస్యలను వినటం, మన సమస్యలను వారికి వివరించటం ద్వారా ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఈ అనుబంధమే వారిని సంస్థలో కొనసాగేలా చేస్తుంది. ఈ అనుబంధం లేకపోవటం వల్లే – 20, 30 ఏళ్లు పనిచేసినా తర్వాత కూడా చాలా మందిలో నిబద్ధత ఏర్పడదు.
జీవితంలో ప్రోత్సాహకాలు, స్ఫూర్తి- ఈ రెండింటిలో ఏది ముఖ్యం? స్పూర్తే అంటారు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు రవిశంకర్‌. ఇటీవల జపాన్‌లో పర్యటించినప్పుడు – ఆయనను అక్కడి వాణిజ్యవేత్తలు అనేక ప్రశ్నలు అడిగారు. వాటికి రవిశంకర్‌ చెప్పిన సమాధానాలు..
జీవితంలో సవాళ్లను ఎలా ఎదుర్కోగలం?
ఆహారం, విశ్రాంతి, ధ్యానం, వ్యాయామం- ఈ నాలుగు మన శరీరానికి అత్యవసరం. ఇవి క్రమం తప్పకుండా శరీరానికి అందిస్తే మనకు శక్తి లభిస్తుంది. ఆ శక్తి మనను ముందుకు నడిపిస్తుంది. కానీ చాలా సార్లు మనం మన శరీరానికి ఈ నాలుగు తగిన పాళ్లలో అందివ్వం. దీని వల్ల మన శరీరం అలసిపోతుంది. అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది. సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధపడదు. సవాళ్లను ఎదుర్కోవాలంటే పైన చెప్పిన నాలుగు అత్యవసరం.
నా కంపెనీ కోసం సరైన వ్యక్తులను ఎంపిక చేసుకోవటం చాలా కష్టంగా ఉంది.. దీనికి పరిష్కారమేమిటి?
దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి- ఏదైనా రిక్రూట్‌మెంట్‌ కంపెనీకి ఆ బాధ్యత అప్పచెప్పటం. కానీ ఈ బాధ్యతను ఇతరులకు అప్పచెప్పటం సరికాదు. మనకు కావాల్సిన వ్యక్తులను మనమే ఎంపిక చేసుకోవాలి. దీనికి పరిష్కారం ఒకటే. సమాజాన్ని జాగ్రత్తగా గమనించటం. వారిలో మనకు కావాల్సిన వ్యక్తులను ఎంపిక చేసుకోవటం.
నాకు రెండు కంపెనీలు ఉన్నాయి. వాటిలో వేల మంది పనిచేస్తున్నారు. మా ఆవిడ- ఇంత సంపాదించాం కదా.. జపాన్‌ వదిలి వెళ్లిపోదాం అంటోంది. అది నాకు ఇష్టం లేదు. ఒక వైపు కంపెనీలను, ఒక వైపు ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్‌ చేయాలి?
ఒక చక్రంతో సైకిల్‌ తొక్కగలమా? జీవితం కూడా అంతే. కుటుంబం, పని- ఇవి రెండూ మన జీవితమనే సైకిల్‌ చక్రాలు. ఏ ఒక్కటి పంక్చర్‌ అయినా ముందుకు వెళ్లలేం. పని మీద మనం ఎంత శ్రద్ధ పెడతామో.. అంతే శ్రద్ధ కుటుంబం మీద కూడా పెట్టాలి. అప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
నూడిల్స్‌ తింటే చైనీయులం అయిపోం. డానిష్‌ బిస్కట్లు తింటే డానిష్‌ అయిపోం. అలాంటిది- పరాయి సంస్కృతికి చెందిన భావాలను ఎందుకు ఆదరించలేకపోతున్నాం? వాటిని ఎందుకు సహించలేకపోతున్నాం?
దీనికి ఎకైక పరిష్కారం ఇతరుల భావాలను గౌరవించటం. వారు చెప్పే విషయాలను వినటం. ఈ రెండు ఉంటే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. ఇతరుల అభిప్రాయాలతో మనం ఏకీభవించకపోవచ్చు. కానీ వాటిని వింటే తప్పులేదు కదా!
నాకు ఒక కంపెనీ ఉంది. నా సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలంటే ఏం చేయాలి?
ముందు ఒక విషయాన్ని స్పష్టం చేస్తాను. మనం యంత్రాలం కాదు. మనుషులం. అందువల్ల భావోద్వేగాల ప్రభావం మనపై ఉంటుంది. సిబ్బంది పట్ల కరుణతో వ్యవహరించాలి. అయితే ఇది క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా ఉండకూడదు. అతి సర్వత్రా వర్జియేత్‌ అనే విషయం మీకందరికీ తెలుసు కదా! ఇప్పుడు సిబ్బందిని ఎలా కలుపుకొని ముందుకు వెళ్లాలో చూద్దాం. వాళ్ల సమస్యలను వినటం, మన సమస్యలను వారికి వివరించటం ద్వారా ఒక అనుబంధం ఏర్పడుతుంది. ఈ అనుబంధమే వారిని సంస్థలో కొనసాగేలా చేస్తుంది. ఈ అనుబంధం లేకపోవటం వల్లే – 20, 30 ఏళ్లు పనిచేసినా తర్వాత కూడా చాలా మందిలో నిబద్ధత ఏర్పడదు. ఇక టాప్‌ మేనేజిమెంట్‌ విషయానికి వద్దాం. సిబ్బంది చేత బాగా పనిచేయించుకోవటానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి- ప్రోత్సాహకాలు ఇవ్వటం. రెండోది- వారికి స్పూర్తి ఇవ్వటం. ప్రోత్సాహకాలు తాత్కాలికమైనవి. వాటి విలువ కూడా తాత్కాలికంగానే ఉంటుంది. స్ఫూర్తిని ఒక సారి ఇస్తే చాలు. జీవితాంతం పనిచేస్తుంది. దీనికి ఉదాహరణ గాంధీజీ. ఏనాడు ఆయన ప్రోత్సాహకాల గురించి మాట్లాడలేదు. స్ఫూర్తిని నింపటానికే ప్రయత్నించాడు.

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.