కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-8
రామయ్య పెళ్లికొడుకాయేనే-సీతారామయ్య పెళ్ళికొడుకాయేనే
యవ్వనం పుట్టించే ప్రకంపనాలను తట్టుకోవటం ఎవరి వశమూ కాదు .రామయ్య గారూ దీనికి అతీతులు ఏమాత్రం కాదు .యూని వర్సిటి లో చేతిలో పెన్నీ లేకుండా చదువుకొంటున్న రోజుల్లో ,ఆయనకు నీడను అండనూ ఇచ్చింది సారా అనే అమ్మాయి .ఇద్దరు ఒకరికొకరు అ౦కితమైపోయారు .ఒకర్ని విడిచి ఒకరు ఉండలేక పోయేవారు .అయితే ఇద్దరికీ మౌలిక భావాలలో భేదాలున్నాయి .ఆమెకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు. రామయ్యగారికి తన వారసుల్ని చూసుకోవాలనే గొప్ప ఆలోచన ఉంది .ఆమెను ఒప్పించటానికి శతధా ప్రయత్నించారు .కాని ఆమెను ఒప్పించ లేకపోయారు .ఆమె కూడా ఈయన్ని తనమార్గం లోకి లాక్కు రావాలని విశ్వ ప్రయత్నం చేసింది .కాని రామయ్య అంగీకరించ లేదు . ఇంతటి తీవ్ర విభేదం ఇద్దరి మధ్యా ఉన్నా వారి ప్రేమకు అంతరాయం కలగ లేదు.తరచుగా కలుసుకొంటున్నారు .పార్టీలకు హాజరవుతున్నారు .ఒకరికొకరు సాయ పడుతున్నారు .సారా ఒక ఆయస్కాంతమే అయింది ఆయన పాలిటి .ఇదివరకు కడుపు ఆకలి ఉండేది .ఇప్పుడు ప్రేమ ఆకలితో అలమటిస్తున్నారు .ఆపుకోలేక పోతున్నారు .మనసు స్థిరంగా ఉండటం లేదు .ఒక్క చోట నిలవ లేక పోతున్నారు .ఆమె తప్ప ఇంకెవర్నీ ఆయన ఇష్టపడలేదు .అంత గాఢమైన ప్రేమ కద నడిచింది ఇద్దరి మధ్యా .ఏదో అజ్ఞాత శక్తి తమ ఇద్దరి మధ్యా ప్రేమకు కారణం అయి ఉంటుందని పించింది .’’ఆమె కన్నులలో అన౦తాంబరరపు నీలి నీడలు చూశారు రామయ్య .
సారా అంద గత్తేయే .ఆమె చేసిన సాయానికి ఏమిచ్చినా సరిపోదని భావించారు .సాధారణ అమెరికా అమ్మాయే ఆమె .కాని తనకు మాత్రం ఊర్వశీ ప్రేయసీ అనిపించింది .ప్రేమకున్న జబ్బు ఇదేనేమో?ఆమెలోని స్త్రీత్వం ఆయనకు పరమాకర్షణ అయింది .ఒక్కోసారి ఆమె తనకు అందనంత ఎత్తులో ఉన్నట్లు అనిపించేది .కనిపించి మురిపించి మరిపించేది .ఆమె తోడిదే స్వర్గం అనిపించేది .తనకంటే ఆమె చాలా పెద్దదే .’ఆమెలో భారతీయత లేదు .కాని ఆమె ఆయనతో ‘’నాలో ఇండియా అంతా ఉంది .నువ్వు నాలోనే ఉన్నావు ‘’అనేది .తాను నల్ల రామయ్య .ఆమె తెల్ల సీత .ఆయన్ను తన నల్ల కృష్ణుడు అనేది .తనకు పిల్లలు కావాలి ఆమెకు ఆ యావే లేదు .ఇదీ మౌలిక భేదం .పిల్లలు పుడితే ఎలా పెంచగలం ఈ బీదరికం లో అని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం లేదు. నెమ్మది నెమ్మదిగా డబ్బు వచ్చిచేరుతోంది .కాని ఆమె మనసు మార లేదు .ఈ విషయాన్ని యాభై ఏళ్ళ తర్వాత గుర్తుకు తెచ్చుకొని రామయ్య గిల్టీ గా ఫీలయ్యారు .ఆ ఇద్దరి మధ్యా క్రమంగా భేదాలుపెరిగాయి .కాని ఆమె తనది అనే గర్వం ఉండేది .
సారాను రామయ్య వివాహం చేసుకొన్నారు . స్తైఫ౦డ్ వచ్చి డబ్బు ఇబ్బంది తీరుతోంది .సారాకు కూడా రామయ్యగారిలా సంగీతం అంటే ఇష్టం .బీతొవెన్ సంగీతం రామయ్య గారికి మహా ఇస్టమైపోయింది కచేరీలకు వెళ్ళేవారు .మద్రాస్ చదువులో పొందిన మార్కులు రామయ్యగారికి ఇక్కడ ప్లస్ అయింది .ఒక ఏడాది ముందే చదువు పూర్తయింది. పొన్నాంబలం ఇంకో ఏడాది చదవాల్సి వచ్చింది .భార్యా భర్తల విషయం లో కోపెంహాన్ చెప్పినమాటలు తరచుగా రామయ్యగారికి జ్ఞాపకం వచ్చేవి .’’the relationship of husband and wife is a system in which each of the two elements work only through the medium of the other ‘’.తానూ సారా విడిపోయినా ,మానసికం గా కలిసే ఉంటామని పించింది .సారా ఇండియన్ వంటలు నేర్చుకొని చేసేది .
ఉద్యోగానికి ఆహ్వానం –పేటెంట్లు స్వంతం
డిప్లొమా చేతికి రావటం తో బాటు లూబ్రికేంట్స్ తయారు చేసే ఒక ప్రఖ్యాత సంస్థ నుంచి మంచి జీతం ,అధికమైన అవకాశాలతో ఉద్యోగానికి ఆఫర్ వచ్చింది .అప్పటికే రెండు పేటెంట్లు రామయ్యగారికి దక్కాయి .మొదటిది తిక్సోట్రఫి కొలిచే పద్ధతిలో ఒకటి ,రెండోది మోటార్ ఆయిల్ జీవితాన్ని పెంచే విధానం లో రెండోది పేటెంట్ హక్కులు పొందారు .ఇవి ఆయనకు సంతోషం కలిగించాయి .కాని సారా ప్రవర్తన మాత్రం అర్ధం కావటం లేదు .ఆమెలో మార్పు గమనిస్తున్నారు .ఒక సారి ఇండియాకు వెళ్లి రావాలని రామయ్యగారికి అనిపించి భార్య సారాను కూడా తనతో రమ్మన్నారు. ఆమె దానికేమీ సమాధానం చెప్పలేదు .ఆమె తలిదండ్రులు ఆమెను ప్రలోభ పెడుతున్నట్లని పించింది .సామాను తీసుకొని బయటికి వస్తుంటే ఆమె అడ్డుకోన్నది .వదిలి వెళ్ళే సాహసం చేయ లేకపోయారు .ఇండియాకు వెళ్లి పొలం లో మళ్ళీ కందా ,పెందలాలు పండించాలా ?అని ప్రశ్నించుకొన్నారు .’’the dollar is the murderer of the human soul ‘’అని ఒక రష్యా మిత్రుడు అన్నదానిపై వితర్కి౦చుకోనేవారు .కమ్యూనిస్ట్ సాహిత్యం పై అభిమానం పెరిగి మార్క్స్ ను చదివారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-4-15 ఉయ్యూరు