’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-12

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-12

రష్యా రామయ్య

1930 డిసెంబర్ 17 న  కొలాచల సీతారామయ్య గారు సోవియట్ యూనియన్ (యు .ఎస్ .ఎస్. ఆర్ )రాజధాని మాస్కో నగరం చేరారు .వెంటనే ఎకడమీషియన్ ఇవాన్ గుబ్కిన్ ను అత్యవసరంగా కలుసుకోమని కబురు అందుకున్నారు . ‘’సోవియట్ దేశపు సైంటిఫిక్ రిసెర్చ్ ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ ఆయిల్’’కు  గుబ్కిన్ డైరెక్టర్ అన్న సంగతి రామయ్య గారికి ముందే తెలుసు .

ప్రపంచ ప్రసిద్ధ సైంటి స్ట్ దృష్టిలో పడిన రామయ్యగారు

సోవియెట్ జీయాలజీ ,పెట్రోలియం ఉత్పత్తి మీద గుబ్కిన్ అధారిటీ అనీ తెలుసు .యువ రామయ్య కు అలాంటి పెద్ద అధికారి  ప్రపంచ ప్రసిద్ధ సైంటిస్ట్ అయిన గుబ్కిన్   దృష్టిలో పడటం ,ఆయన నుండి తనకు కబురు రావటం మహదానందంగా ఉంది .రాష్యావస్తే రొట్టె విరిగి నేతిలో పడింది అనిపించింది . ఆలస్యం చేయకుండా రామయ్య  వెళ్లి ఆయన్ను ఆఫీసులో కలిశారు .

రామయ్యగారితో గుబ్కిన్ దాపరికం లేకండా రష్యాలో ఆయిల్ పరిశ్రమ అభివృద్ధి కోసం చేబడుతున్న ప్రణాళిiకలను గురించి వివరించాడు .అతి తక్కువ కాలం లోనే వోల్గా నుండి యూరల్ దాకా ఆయిల్ క్షేత్రాన్ని వ్యాపి౦ప జేయాలన్నదే తమ లక్ష్యం అన్నాడు .ఈ విషయాలన్నీ రామయ్యగారు  మాస్కోకు ట్రెయిన్ లో వస్తూండగా విన్న విషయాలే .దీనితో ఉత్సుకత మరీ పెరిగింది .ఆయనలోని సైంటిస్ట్ ,వర్కర్ రష్యా దేశాభి వృద్ధికి పూర్తిగా సహకరించాలని ప్రబోది౦చి నట్లు అనిపించింది .

భారత దేశం పై గుబ్కిన్ ఆరాధనా ,ఆశా భావం

వారిద్దరి సంభాషణలలో ఇండియా విషయం ప్రస్తావనకు వచ్చింది .గుబ్కిన్ రామయ్యగారితో ‘’మీ వింధ్య పర్వతాలు మా యూరల్ పర్వతాలు చాలా పోలికలు కలిగిఉన్నాయి .ఈ విషయం పై నేను చాలా సార్లు ఆలోచించాను .కొన్నేళ్లలో మీ దేశం లో కూడా ఆయిల్ కోసం అన్వేషణ జరుగుతుంది .’’అని ఆశాభావం వ్యక్తం చేశాడు .రామయ్యగారు పెట్రో కెమికల్స్ లో ,లూబ్రికంట్ లపైనా  చేసిన అత్యున్నత  పరిశోధనలకు గుబ్కిన్ ముగ్ధుడయ్యాడు .

అరుదైన ఉన్నత పదవికి ఆహ్వానం –అంగీకారం

వెంటనే  తన ఇన్ ష్టి ట్యూట్ లోని’’లూబ్రికంట్స్  రిసెర్చ్ డివిజన్ ‘’లో అత్యున్నత అధికారిగా చేరమని ఆహ్వానించాడు .రెండు వారాల గడువు కోరి అమెరికాలో తాను  పని చేసిన ‘’సొనేబార్న్ సంస్థ  ‘’ కు ఈ విషయం తెలియ జేశారు .ఇప్పటిదాకా రామయ్య గారికి రష్యాలో స్థిర పాడాలన్న ఉద్దేశ్య౦కాని ,బ్రిటిష్ వారు పాలిస్తున్న ఇండియాకు తిరిగి వెళ్లాలని కాని  లేదు .కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరు కృష్ణా రావు గారు చెప్పినట్లు ‘’భగవంతుడికి  ఎవరితో ఎక్కడ ఎలా పని చేయించాలో తెలుసు ‘’అన్న మాట రామయ్య గారి పట్ల రుజువైంది .ఎక్కడ ఇండియా ? ఎక్కడ సోవియట్ యూనియన్ ?విరుద్ధ భావాలున్న దేశాలివి .వాటి మధ్య తాను విజ్ఞాన శాస్త్ర రాయబారి గా రూపాంతరం చెందటం భగవల్లీల గా భాసించింది .

మార్పు ,అభివృద్ధి కోసం రామయ్య గారి సూచనలు

రష్యా లో ఆయిల్ పరిశ్రమ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకొన్నారు .ఆయిల్ రిఫైనరీ కేంద్రాలకు వెళ్లి పరిశీలించారుము౦దు గా .అక్కడున్న సాంకేతిక విషయాలను అడిగి తెలుసుకొన్నారు .వాటిలో చేయాల్సిన మార్పులను ,విధానాలను అక్కడికక్కడే సూచించారు .అతి తక్కువ కాలం లోనే రామయ్య గారి ముద్ర సోవియెట్ ఆయిల్ సంస్థ మీద పడింది .పూర్వం కంటే అభివృద్ధి గణనీయంగా పెరిగింది .

మరో అరుదైన ఉన్నతోన్నత పదవీ గౌరవం

ఈ అసామాన్య మేధావి సూక్ష్మ బుద్ధికి నీరాజనాలు పలికిన యాజమాన్యం ఆయన్ను ‘’డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫ్యుయెల్స్ అండ్ ఆయిల్స్ –కు –అంటే ‘’నామి ‘’ (N.A .M.I –అంటే Nauchno –Avtomotorno iinstitute or the institute for Automobile Motor research )అధిపతిని చేసింది .ఇది అరుదైన గౌరవం .

రామయ్య గారి పరిశోధనా ఫలితాలు

‘’నామి ‘’కు అధిపతిగా ఉంటూ రామయ్యగారు సోవియట్ రష్యాలోయుద్ధ టాంకు లు   వివిధరకాల శీతోష్ణ స్థితులలో సమర్ధ వంతంగా పని చేయటానికి ఉపయోగ పడే’’ ప్రత్యేక కిరోసీన్ ఇంధనాన్ని’’  ను స్వీయ ప్రతిభతో తయారు చేసి అందరి మన్ననలను అందుకొన్నారు .ఇది సోవియట్ దేశం రెండవ ప్రపంచ యుద్ధం లో జర్మనీ తో చేసిన  టాంక్ యుద్ధాలలో గొప్ప విజయాలను చేకూర్చి పెట్టి రామయ్యగారి కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది .ఇదొక మేజర్ సైంటిఫిక్ విజయం .ఈ విజయం రామయ్యగారికే దక్కింది .

డి .కే .నామి సృష్టి

రామయ్యగారు ఒక కొత్త పరికరాన్ని సృష్టించారు .దాని పేరే’’ D.K N.A.M.I .’’ఈ యంత్రం కోసం చాలా సంవత్సరాలు తీవ్రంగా కస్టపడి పని చేశారు .ఇందులో ఎదురయ్యే అనేక సమస్యలను గుర్తించి ,పరిష్కరించారు .కందెన నూనెలు  అంటే లూబ్రికంట్స్ అతి తక్కువ ,అతి ఎక్కువ  ఉష్ణోగ్రత లలో ఇంజన్ భాగాలను తినేసే ధర్మం ఉంది (కరోసివ్ ఎఫెక్ట్ ).అంతేగాక ఏదైనా గాస్ దీనిమీదకు వదల బడితే దాని లోహాలకు  శత్రువై విపరీతమైన హాని కూడా కలిగిస్తుంది .మోటార్ ఇంజన్ ను సమర్ధ వంతంగా పని చేయించటానికి బదులు ఈ లూబ్రికంట్స్  యంత్రాల పాలిటి పరమ శత్రువులై పోతాయి .అదీ విడ్డూరం .1954 లో ఈ కొత్త యంత్రాన్ని సృష్టించి ప్రయోగం చేశారు .ఇది రేడియో యాక్టివ్ ఐసోటోపులను విని యోగించుకొని ,లూబ్రికంట్ లోకలిపే పదార్ధాలను  బేరీజు వేసి యంత్రం లోని సిలిండరు, పిస్టన్ భాగాలపై పడే ప్రభావాన్ని అంచనా వేసింది .ఇది మరొక  ఘన విజయమే అయింది .సల్ఫ్యూరిక్ ఇంధనాలను వాడటం వలన యంత్ర భాగాలకు జరిగే ప్రమాదాలను నివారించటాని ఇది బాగా తోడ్పడింది .పని చేసేటప్పుడు విడుదల అయ్యే సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ ,సల్ఫ్యూరిక్ ట్రయాక్సైద్  వాయువులు   విడుదల అయినపుడు ‘’ఆయిల్ జెల్ ‘’ఏర్పడకుండా కాపాడింది  .దీనివల్ల ఇంజిన్ సామర్ధ్యం పెరిగి ,విషవాయువుల వాళ్ళ యంత్ర భాగాలు తినేసే గుణం నివారించ బడింది .

ఒక డీజెల్ మోటారు జీవిత కాలం లో ఒక వెయ్యి టన్నుల ఇంధనాన్ని ఉపయోగించుకొంటుంది .ఇది వెయ్యి కిలోల సల్ఫర్ నుండి మూడు టన్నుల సల్ఫ్యూరిక్ ఆమ్లం ఏర్పడటానికి సమానం .దీనివలన మోటార్ ఇంజిన్ లోని లోహ భాగాలు పూర్తిగా దెబ్బతింటాయి అంటే తిని వేయబడతాయి .ఇంజిన్ జీవితం గోవిందో హారి .ఈ ప్రమాదం నుండి కాపాడటానికే రామయ్య గారి తపన అంతా .చక్కని పరిష్కారం’’ డి .కే. నామి’’ ద్వారా  సాధించారు  .ఈ ప్రయోగాల వలన లూబ్రికంట్స్ లో సరైన’’ అడిటివ్స్ ‘’కలిపి లూబ్రికంట్ పై ఒక రక్షక పొర ఏర్పడి యంత్ర లోహాన్ని కాపాడేట్లు చేయగలిగారు .ప్రగతి పధం లో ఇదొక ముందడుగు ,మైలు రాయి  .

డి. కే .2

దీని తర్వాత మరింత అధునాతన యంత్రం డి.కే 2 ను తయారు చేశారు .ఇది భారీ ఉత్పత్తి లో భాగమైంది .ఈ యంత్రాలు సోవియెట్ యూనియన్ లోనేకాక మిగిలిన చైనా ,జెకోస్లోవేకియా ,మొదలైన సోషలిస్ట్ దేశాలలోను ఉపయోగానికి వచ్చాయి .దీనివలన ఆయిల్ ఇంజిన్లు గడువుకన్నా ముందే  అతి త్వరగా వినాశనం చెందకుండా ఎక్కువ కాలం సమర్ధ వంతం గా పని చేయించే వీలుకలిగి ,యంత్రం  జీవితకాలం  వృద్ధి అయింది .తరువాత అత్యంత శక్తి సామర్ధ్యాలు కల ఇంజన్ల నిర్మాణం జరిగింది .నిమిషానికి అయిదు వేల రివల్యూషన్లు తిరగ గలిగే యంత్రాలోచ్చాయి .ఇంత  శక్తి తో అవి పని చేస్తున్నా ,అధిక పీడనానికి గురవుతున్నా ,ఘర్షణకు లోనవుతున్నా చెక్కు చెదర కుండా పని చేస్తున్నాయి .అది అపూర్వ విజయం .రామయ్యగారు తన లాబ్ లో కొత్త లూబ్రికంట్ అడ్డిటివ్స్ పై పరిశోధన తీవ్రంగా చేసి  పాత వాటి స్థానం లో వీటి నికలిపి అద్భుత విజయాలు సాధించారు .పదేళ్ళ దీర్ఘ కృషి ఫలితం గా రామయ్యగారు 1964లో N A M.I –T-!అనే యంత్రాన్ని నిర్మించగాలిగారు .ఆయన ‘’లేబరేటరి ప్లాంట్ ‘’అధునాతన (అడ్వాన్సేడ్ )లూబ్రికంట్ అడ్డిటివ్స్ ను ఎంపిక చేసి కొత్త , భవిష్యత్ తరాలకు ఉపయోగ పడే  ఇంజిన్ లలో ఉపయోగించే కేంద్రం అయింది .రామయ్య గారు రష్యా వచ్చిన అతి కొద్దికాలం లోనే దాని ప్రగతి రధానికి ఒక చక్రమై నిలిచారు .సార్ధక జీవి అనిపించుకొన్నారు .తనపై పెట్టిన బాధ్యతలను అతి సమర్ధ వంతం గా నిర్వహించి కీర్తి శిఖరాలను అందుకొన్నారు .

దీనితో రష్యా లో  రామయ్య ఫోటో జత చేశాను చూడండి –

rashya ramayya 001సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-4-15 –ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

3 Responses to ’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-12

  1. venkat అంటున్నారు:

    మీరు ఫొటోస్ జత చేస్తున్నాను అని చెప్తున్నారు ,అవి ఎలా చూడాలి .
    పోస్ట్ లో కనపడటం లేదు .

  2. gdurgaprasad అంటున్నారు:

    pl. check this post now visible

venkatకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.