’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-11

’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-11

జో సందేశం

రామయ్యగారికి ,భార్య సారాకు అత్యంత ఆత్మీయుడు జో తో ఒక సారి దీర్ఘ సంభాషణ జరిగింది .ఆఫీస్ లో జరిగిన విషయాలన్నీ తెలుసుకొన్న జో, రామయ్య గారికి గొప్ప హితోపదేశం చేశాడు .కంపెనీ మేనేజి మెంట్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని ,రామయ్యగారి మేధస్సుతో పావుల గేం ఆడుతోందని ,రామయ్యకు ఏ  క్షణం లో నైనా నోటీస్ ఇచ్చి బయటికి పంపే ప్రయత్నం లో ఉన్నారని గ్రహించమని చెప్పాడు .రామయ్య కంపెనీతో కొంత కాంప్రమైజ్ అయినట్లు జో చెప్పగా కాదన్నారాయన.రామయ్య గారి మేధస్సును వాడుకొని’’ బ్రెయిన్ డ్రెయిన్ ‘’చేసే ఆలోచనలో కంపెనీ ఉందని ,కంపెనీకి కావాల్సింది మంచికాదని, ఏవి వెంటనే  లాభాలు గడించి పెడుతాయో అవే కావాలని చెప్పాడు. రామయ్యగారి స్వేచ్చను క్రమ క్రమగా హరి౦చ టానికే వారు ఆలోచిస్తున్నారని తెలియ జెప్పాడు .లబరేటరీలో కూడా రామయ్యగారికి పూర్తీ స్వేచ్చ ఉండదని నిఘా ఉంటుందని ,ఆయన సృజనకు అడ్డ౦కు లేర్పరుస్తారని అన్నాడు .ప్రతిదానికీ ఎద్దులా తలూపద్దని   హెచ్చరించాడు .అన్నీ అర్ధం చేసుకోవాలని కోరాడు .బాస్ లు అంటే వ్యాపార  దృష్టిమత్రమే ఉన్నవారని గ్రహించాలన్నాడు .అంటే ఆయనద్వారా వాళ్లకి లాభాలు వచ్చి మీద పడాలి రామయ్య గారు కూడా వారికి వ్యాపార వస్తువే ననీ చెప్పాడు .రామయ్య గారికి ఇష్టమైనప్పుడు ,అనుకూలంగా ఉన్నప్పుడు కంపెనీ నుంచి వెళ్ళిపోయే స్వేచ్చ ఉండదని ఖచ్చితంగా చెప్పాడు .కాంట్రాక్ట్ ను భగ్నం చేశారని నేరం మోపే అవకాశం కూడా ఉందన్నాడు .ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచి౦చాలన్నాడు .ఇవి సీరియస్ సమస్యలే అనిపించింది రామయ్య గారికి కూడా .

భూతల స్వర్గం  రష్యా

వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ఉందన్నాడు జో .అదే రష్యాకు తరలి వెళ్ళటం .వెంటనే సామాన్లు సర్దుకొని ,రష్యాకు వెళ్లి ఉజ్వల భవిష్యత్తును అందుకోమన్నాడు .రామయ్య గారు కలలు కనే బంగారు భవిష్యత్తు రాష్యాలోనే సాధ్యమవుతు౦దన్నాడు .రష్యాలో రామయ్య వంటి సమర్ధుల అవసరం చాలా ఉందని చెప్పాడు .తనకు కూడా రష్యా వెళ్లి ఉండిపోవాలని ఉందికాని కేన్సర్ బాగా ముదిరి తన జీవితకాలం అతి తక్కువేనని తెలిసి  వెళ్ళటం లేదన్నాడు జో. .అమెరికా ,రష్యా ల పరిస్తితులను బేరీజు వేసుకోమని సలహా ఇచ్చాడు .ఇప్పుడున్న పరిస్తితులలో అమెరికా లో ఉన్న సుఖ జీవనం రష్యాలో ప్రస్తుతం సాధ్యం కాదని ,చాలా కష్టపడాలని చెబుతూ లెనిన్ అన్న మాటలు ‘’Either we will catch up with America and leave it behind or we will be crushed ‘’ గుర్తు చేశాడు .రష్యా అభి వృద్ధికి చేతనైన సాయం చెయ్యమన్నాడు .రామయ్య లాంటి స్పెషలిస్ట్ లు రష్యాకు చాలా అవసరం అన్నాడు .రష్యాకు సాయం చేస్తే రష్యా ఇండియాకు సహాయం చేసి ఋణం తీర్చుకొంటుంది అన్నాడు .’’రష్యా  భారత్ భాయీ భాయీ’’ గా భవిష్యత్తులో నిలిచి పోతాయన్నాడు .రష్యాలో విపరీత విపత్కర పరిస్తితులెదురైనా లెనిన్ మాటలు జ్ఞాపకం చేసు కొంటూ కష్టాలను అధిగమిస్తూ రష్యా అగ్రగామి దేశం గా ఎదగటానికి తోడ్పడమని కోరాడు .ఇక ఏ మాత్రం ఆలస్యం చేయవద్దని త్వర పెట్టాడు .

విఫలమైన వివాహం –సారా ‘’సారో’’దంతం

భార్య సారా కూడా ఈ సంభాషణలలో పాలు పంచుకోన్నది .ఆమెతో కూడా జో మాట్లాడి రామయ్య గారి వెంట రష్యా వెళ్లి పొమ్మని హితోపదేశం చేశాడు .ఇండియా  వెళ్లి పోదామనుకొన్న రామయ్య గారికి ఇదొక కొత్త సమస్య అయింది. అమెరికాలో ఉండలేక పోతున్నారు .సారా అంటే రామయ్యకు అమితమైన ప్రేమ ఉందని అతన్ని నమ్మమని ఆమెకు చెప్పాడు జో. ఆమె వెంటనే ఏమీ చెప్పలేక పోయింది .అది దారుణం అన్నాడు జో మొహమాటం లేకుండా .రామయ్యగారికీ మనసులో బాధగానే ఉంది .ఇప్పుడిప్పుడే  వారిద్దరి వైవాహిక జీవితం లో కొద్దిగా ఆశా రేఖ గోచరించింది .ఇంతలో మళ్ళీ ఈ దూరం .రామయ్యగారికి అన్నిరకాల సహకారం ఇచ్చానని ,ఇక కూడా ఇస్తానని ఇక్కడే ఉండిపొమ్మని సారా గోల చేసింది .

ఇద్దరి బాధలు అర్ధం చేసుకొన్న జో ఆమెతో ‘’అమ్మాయీ !ఇది జీవితం .మనం అనుకొన్నట్లు జరగదు. మనకు తెలియ కుండానే నిర్ణయాలు జరిగి పోతూ ఉంటాయి .నేను నీకు స్నేహితుడిని .నా మాట మీద విశ్వాసం ఉంచు .నేను చెప్పేది నీకు బాధాకరంగా, భయంకరం గా ఉండచ్చు .కాని ఇది వాస్తవం .అర్ధం చేసుకో .రామయ్యను తప్పు చేయమని నేను కోరలేను .ఆతను కొత్త జీవిత యుద్ధానికి తయారవుతున్నాడు .మీ ఆయనకు ఇష్టం ఉన్నా లేకున్నా అమెరికాలో సైనికులకోసం మోటార్లు తయారు చేశాడు .కాని ఆ మోటార్లు భూమిని త్రవ్వటానికి, దున్నటానికి ,పంటలు పండిం చటానికీ ఉయోగ పడతాయి టాంక్ లు నడపటానికీ అవే మొటార్లు కావాలి .యుద్ధం లో వీటిని వాడితే భూమి అంతా రక్త సిక్తమవుతుంది ‘’అని చెప్పాడు .కాని సారా తలిదండ్రులను వదిలి రష్యాకు రామయ్య గారితో వెళ్ళటానికి ఇష్టపడలేదు .ఇదివరకు ఆయనతో ఎక్కడికైనా వెళ్లి పోటానికి సిద్ధపడ్డ ఆమె ఇప్పుడు వెనకడుగు వేసింది .పూర్వం ఒక సారి తనతో ఇండియా రమ్మంటే అప్పుడూ వస్తానని అనలేదు .అంటే అవకాశం వచ్చినప్పుడు ఆమె సరైన నిర్ణయం తీసుకో లేక పోయింది ఇదే ఆమె బలహీనత అయి ఇద్దరి మధ్యా దూరం పెరగటానికి కారణం అయింది .జో చేవిలో ఇల్లు కట్టుకొని   నచ్చ చెప్పినా ఆమెను మార్చలేక పోయాడు .ఒప్పించలేక పోయాడు .సారా మనసు లో తనకు తెలియని ఏదో ఒక పొర ఉందని అర్ధమయింది .ఆమెకూ ఈ పొర ఉన్నట్లు తెలీదేమో అనుకొన్నారు .ఆమె ఒక కోతిపిల్ల తల్లిని అంటుకునే బతుకు తుంది అనిపించింది .ఆమెకు రక్షణా, సుఖం కావాలి .రష్యా మూలం గా తాము విడిపోవాల్సి వస్తుందని ఊహించలేదు .ఇక ఆమెది అమెరికా .తనది రష్యా అవుతుంది .మార్క్సిజం ఇద్దర్నీ శిక్షిందేమో నని సందేహమూ వచ్చింది .ఇక ఇది శాశ్వత వియోగమే అయింది .మనుషులు దూరమైనా మనసులు దూరం కావు అని నమ్మారు .సారా కద ‘’’’సారో’’(విషాద ) దంతం అయిపొయింది .ఆమె  పరిస్తి తులకు తగిన నిర్ణయాలు తీసుకోక పోవటం వలన వచ్చిన విషాదం ఇది .అది రామయ్యగారికీ బాధ కలిగించినా తప్పని పరిస్తితి అయింది .ఇలా సారా తో మొదటి వివాహం విఫలమైంది .ఇదే ‘’సారోదంతం ‘’.

ప్రలోభం –కాదని తిరస్కరించిన రామయ్య

కంపెనీతో ఒప్పందం గడువు పూర్తీ అవగానే వాన్ డేర్ హేంక్ రామయ్యగారిని పిలిచి ప్రొమోషన్ ఆశ చూపించి ,డిపార్ట్ మెంట్ పై పూర్తీ అధికారాలు ఇస్తామని ,,జీతం కూడా బాగా పెంచుతామని ప్రలోభ పెట్టాడు .దీనికి రామయ్య గారు థాంక్స్  చెప్పి తాను  చికాగో ఫర్మ్ కు వెళ్లి పని చేయనని ,అమెరికా వదిలి వెడుతున్నానని  చెప్పేశారు .ఎక్కడికి వేడుతున్నారో చెప్పలేదు .గ్రహించిన హేంక్ ‘’ఇండియాలో నీలాంటి స్పెషలిస్ట్ ల అవసరం లేదే .అక్కడున్నది బ్రిటిష్ ప్రభుత్వం ‘’.హోమ్ రూల్ ‘’ఇంకా ఇండియాకు రాలేదే’’అన్నాడు .ఒక నవ్వునవ్వి రామయ్యగారు ‘’రష్యా వెడుతున్నాను.అన్నారు  .నిస్చేస్టు డయ్యాడు హేంక్ .మళ్ళీ’’ గేం ‘’మొదలెట్టాడు హేంక్ .జీవితాన్ని ధ్వంసం చేసుకోవద్దని ఒక సలహా పారేశాడు .ఇక అక్కడ ఉండకుండా బయటికి వచ్చేశారు రామయ్య . ‘’Life is in fact short  but that is exactly why we want to live it honesty ‘’అన్న సూక్తి జ్ఞాపకమొచ్చింది .హేంక్ యెంత ఉద్రేకపరచినా పరమ శాంతంగా మేనేజ్ చేశారు రామయ్య .న్యూయార్క్ ఆయనకు ఒక’’ సీల్డ్ డోర్ ‘’లా, రష్యా ఒక భూతల స్వర్గం గా కనిపించింది . ప్రపంచ దేశాలనుండి సైంటిస్ట్ ల ,సాంకేతిక నిపుణుల ను ఆహ్వానించి రష్యాలో ఉండి  సోవియట్ రష్యా సర్వ తోముఖాభి వృద్ధికి తోడ్పడమని అభ్యర్ధించిన విషయం రామయ్య గారికి రెడ్ కార్పెట్ వెల్కం లాగా అనిపించింది .

1930  చివర్లో యూరప్ పర్యటన చేశారు .తన గమ్యం రష్యా అని తెలిసి పోయింది .ఆ దేశం గురించి వారపత్రికలలో చదివి అక్కడికి యాత్రగా వెళ్లి వచ్చిన వారి వలన విని తెలుసుకోగలిగారు .కాని అక్కడి ప్రజాస్వామ్య స్థితిగతులు ఉద్యోగావ కాశాలు ,అభివృద్ధికి మార్గాలు ,ఆ సమాఖ్యలోని దేశాల పరిస్తితులు స్వయంగా అధ్యయనం చేసి  ఫస్ట్ హాండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని  రష్యా వెళ్ళారు .first wife sara 001

దీనితో రామయ్య గారి మొదటి భార్య సారా ఫోటో జత చేశాను చూడండి

ఇక రష్యా రామయ్య గారి గురించి తెలుసుకొందాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-15 –ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.