’ ‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-16
ప్లాస్టిక్ స్పేస్
ప్రత్యేకం గా చేస్తున్న పరిశోధనలు ఏవీ వృధా కాలేదు మంచి ఫలితాలనే ఇచ్చి ఉత్సాహపరచాయి .యుద్ధ టాంకు లకు పనికొచ్చే కొత్త రకాలైన ఇంధనాలు (ఫ్యుయెల్స్) ,వాటిలో కలిపే ‘’ఎడిటివ్స్’’ పైన చేస్తున్న కృషి రామయ్య గారి జీవితం లో ముఖ్య భాగమే అయింది .దీనితో ‘’ప్లాస్టిక్ స్పేస్ ‘’అనే కొత్త సూత్రాలకు దారి తీస్తుందని ఊహించలేదు .ఇది అనుకోకుండా జరిగిన సంఘటన .అప్పటికే మధ్యాహ్న భోజనం సమయమైంది .ఇంటికి ఫోన్ చేసి ఆ రోజు ఆలస్యంగా వస్తానని చెప్పారు .అక్కడే ఏదో దొరికింది తినేస్తాం అని తెలియజేశారు భార్య కాత్యాకు .మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఆ విషయమే మర్చిపోయారు .పని పూర్తీ చేసుకొని ఇంటికి చేరుకొనే సరికి అందరూ నిద్రపోతున్నారు .
హోం గార్డ్ రామయ్య –అదుగు దూరం లో యుద్ధభూమి కి దూరమైన రామయ్య
యుద్ధం మొదలైన రోజు నుండి దిన చర్యలో మార్పు వచ్చింది .రామయ్య గారు వాయంకోమాల్ వెళ్ళిన దగ్గర్నుంచి తనను యుద్ధ భూమికి పంపమని కోరుతూనే ఉన్నారు .ఆయన్ను హోమ్ గార్డ్ గా మిగిలిన వాలంటీర్ లతో బాటు తీసుకొన్నారు .అందరిలాగే వరుసలో నిలబడ్డారు .ఇది వరకటి లాగా అహింస ,ఇతరులను చంపరాదు ,యుద్ధం లో చస్తే అమరులౌతారు మొదలైన నీతి వాక్యాలేవీ అప్పుడు మనసులోకి రానే లేదు . అనాగరక కొత్త హూణులే ,వారి దుశ్చర్యలే మనసులో నిలిచాయి .హోమ్ గార్డ్ గా తన దేశాన్ని తన స్వేచ్చను సంరక్షించుకోవాలి అన్నదే ధ్యేయమైంది రెండో ఆలోచనే రాలేదు మనసులోకి .యుద్ధ సైనికుడినే అనుకొన్నారు .’’క్విక్ మార్చ్ ‘’అన్న కమాండ్ విని పించింది .యుద్ధ రంగం లోకి అడుగు పెట్ట బోతున్నారు .ఇంతలో ‘’ఇందులో రామయ్య ఎవరు ? ఆయన ఈ లైన్ ఫార్మేషన్ నుండి బయటికి రావాలి ‘’అన్న మాటలు వినిపించాయి .మిగిలిన వాలంటీర్లు ఆశ్చర్యం తో చూస్తుండగా రామయ్యగారు ఆ కమాండ్ విని ఆఫీస్ వైపు నడిచి వెళ్ళారు .అక్కడ ఆర్మీ రిప్రేసే౦టటివ్ తో బాటు, రామయ్య గారి ఇస్టిట్యూట్ డైరెక్టర్ కూర్చుని ఉన్నాడు .ఆయన ‘’కామ్రేడ్ మిత్రమా ! నీ దేశ భక్తీ పై ఎవరికీ అపనమ్మకం లేదు .కాని నీ బుర్ర శిక్షణ లేని సైనికుడు .కనుక అది శత్రువుల బులెట్ కు గురి కారాదు .మాకు నీ మేధస్సు పదునైన ఆయుధం గా ఉపయోగ పడాలి కాని యుద్ధ భూమిలో కాదు ‘’అన్నాడు .
రామయ్యగారు ఆజ్ఞను పాలించి ఇదివరకున్న ఇస్టిట్యూట్ ఖాళీ చేసిన చోటికి చేరుకొన్నారు .రామయ్యగారు తన కుటుంబాన్ని ఓల్గా తీరం లోని భార్య కాత్యా దగ్గర బంధువుల ఇంటికి పంపేశారు .మాస్కో కు రామయ్య గారు గుడ్ బై చెప్పారు .కానీ ఏడాది తిరిగొచ్చేసరికి మళ్ళీ ఇంటికి చేరుకొని పాత చోటులోనే మళ్ళీ ఏర్పడిన డిపార్ట్ మెంట్ లో చేరి పని చేయటం మొదలు పెట్టారు యుద్ధం తీవ్రం గా జరిగింది .రామయ్య గారు ఒంటరిగా ఉండిపోయారు తన భార్య ,పిల్లలు ఎక్కడున్నారో ఏమై పోయారో తెలియదు .కొన్ని నెలల తర్వాత వాళ్ళు క్షేమంగా ఉన్న వార్త మాత్రం తెలిసింది ..ఈ ఒంటరితనం తాను చేస్తున్న తీవ్ర పరిశోధనకు బాగా ఉపయోగ పడి సమయమే తెలియ కుండా పోయి గొప్ప వరమే అయింది .ఒంటరితనం మనుషుల్ని నిలువుగా అడ్డంగా కూడా వేరు చేస్తుంది .తరాల శృంఖలాను చేదిస్తుంది .భార్యా బిడ్డలు ఏమై పోయారో నన్న దిగులు తో బాటు తానూ జీవితం నడి దారిలో- క్రాస్ రోడ్స్ లో ఉన్నానన్న బాధా కలవరం కలిగించింది .తాను ఒక గుడ్ల గూబలా ఉండిపోయాను అని చెప్పుకొన్నారు రామయ్య .
ఈ ఒంటరితనం దూరం కావటం ఒక విధం గా జరిగి కొంత ఊరట కలిగించింది .’’హౌస్ మేనేజి మెంట్ ‘’వారు రామయ్య గారి పొరుగు వారైన ఒక ఇంజనీరు ,అయన భార్య ను తోడుగా ఉండే ఏర్పాటు చేశారు .యుద్ధప్రారంభం లో ఆ ఇంజనీర్ ఇంటి వద్ద బాంబు పేలిందట .అక్కడే బితుకు బితుకు మంటూ తల దాచుకొన్నారు ఇప్పటిదాకా . వారికి మళ్ళీ ఫ్లాట్ ఇచ్చేదాకా రామయ్య గారింట్లో నే ఉండే ఏర్పాటు చేశారు .కాసేపైనా మాట్లాడుకోవటానికి మనుషులు దొరికారని రామయ్య సంతోషించారు .వంట గది ఉపయోగం లోకి వచ్చినదుకు ఆనందమూ పొందారు . ఆ రోజుల్లో తినటానికి పెద్దగా ఏమీ ఉండేదికాదు ఉడికిన బంగాళా దుంప లే ఆహారం .తనదేమో ఏనుగు లాంటి భారీశరీరం .దానికి చిరు ఆహారాలేమీ ఆనటం లేదు .దీనికి తోడూ ఇన్ ష్టి ట్యూట్ లో పని ఎక్కువై టెన్షన్ పెరిగింది .ఈ కొద్ది ఆహారం ఏమూలకూ చాలక ఎప్పుడూ ఆకలిగా ఉండేది .అలసట నీరసం ,తల తిరుగుడు బాగా బాధించేవి .
మూడు బాంబులను తప్పించుకొని బతికిన రామయ్య
అందరిలాగే రామయ్య గారు జర్మన్ బాంబు దాడులు జరిగే రోజున సెర్చ్ లైట్లతో యుద్ధవిమానాలు ఎత్తుగా భీకర శబ్దం చేస్తూ ఎగురు తున్నాయి . విధి నిర్వహణలో బిల్డింగ్ పైభాగాన నిలబడి ఉన్నారు .గుడ్లగూబ చేసే ధ్వని లాంటిది వినబడింది .ఒక బాంబు పై నుండి పడి ప్రక్క బిల్డింగ్ దగ్గర ప్రేలింది .ఆ బాంబు ప్రేలుడు ప్రకంపనాలకు ఈ బిల్డింగ్ పై ఉన్న రామయ్యగారు కిందపడిపోయారు .దోర్లిపోయారు .తన కాళ్ళ కింద రూఫ్ గర్డర్లు పగిలి పోతూ కనిపించాయి .కాసేపటికి భయం తీరింది అని పించింది .బాంబు పేలిన పక్క ఇంటి పైభాగాన నుండి విపరీతమైన పొగ మేఘం లాగా కమ్మేసింది .కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి .కిందున్నవారు భయం తో అరుపులు కేకలు వేస్తున్నారు .ఇలా త్రుటికాలం లో మొదటి సారి బాంబు దాడి నుంచి రామయ్య తప్పించుకొని ప్రాణ భయం లేకుండా బతికారు .
రెండవ సారి సూటిగా బాంబు వచ్చి రామయ్య గారి చేతిలోనే పడింది .అదృష్టవశాత్తు అది అతి చిన్న ఇల్లు తగలబెట్టే దిమాత్రమే .ఈ సారికూడా రూఫ్ మీద డ్యూటీలోనే ఉన్నారు .ముందు జాగ్రత్తగా ఇసుక పెట్టె రెడీగా ఉంచుకొన్నారు .ఇవి’’ ఇన్సేన్డియరి’’ బా౦బు లాంటివి పడితే రక్షణకు ఉపయోగ పడతాయి .బాంబు పేలి రైలింగ్ కు తాకి సరాసరి వచ్చి రామయ్య గారి పాదాల దగ్గర పడింది .అప్రమత్తమై పట్టకారుతో దాన్ని పట్టుకొని ,అగ్ని జ్వాలలు కురిపిస్తున్న దాన్ని లాగి , సాండు బాక్స్ వైపుకు వదిలేశారు .అప్పుడు తాను ఒక కంసాలి పని చేసే వాడిలాగా అనిపించాను అనుకొన్నారు .మండే వస్తువులు ప్రాణాంతకమైనవి కాకూడదని రామయ్య గారు భావించారు .ఆయన భయపడనే లేదు .కాని ఇంకేదో ఉంది .ఆ స్పార్క్ లను తానూ సృస్టించ లేరు అనుకొన్నారు కాని ఆ వెలుగులు ఆయనలో కొత్త ఆలోచనల స్పార్క్ లను కలిగించింది .అవి తానూ చేస్తున్న పరిశోధనలకు సంబంధం ఉందనుకొన్నారు కాని తను చేస్తున్నది లూబ్రికంట్ ల పని .ఆ తర్వాత ఇంతకు ముందు వచ్చిన ఆలోచనను మర్చే పోయారు .
మూడో సారి పెద్ద భయంకర బాంబు నుండి తప్పించుకో గలిగారు .డ్యూటీకి వెడుతుండగా సైరన్లు వినిపించాయి .కాపాడుకోవటానికి దగ్గరేక్కడా షెల్టర్ కనిపించలేదు అనటం కంటే వాటిని పట్టించుకోలేదనటం సరైన మాట .యుద్ధానికి ముందు ప్రమాదాన్ని అంచనా వేయ లేక పోయాయమని రామయ్య అన్నారు .వీధిలో నడుస్తున్న రామయ్య గారికి కొన్ని అడుగుల దూరం లో భూమి మీద బాంబు పడింది .కదలకుండా అక్కడే ఉండిపోయారు .బాంబు ప్రేలుడు దాదాపు పూర్తీ అయి పోయింది .ఏదో అదృశ్య శక్తి తనను కాపాడింది అనుకొన్నారు .అవే తన చివరి క్షణాలనిపించింది .అదృష్ట వశాత్తు ఆ బాంబు పేలనే లేదు .పేలే అవకాశమూ కనపడ లేదు .కాని ఎప్పుడేది జరుగుతుందో ఎవరికి తెలుసు ?కానీ రామయ్యగారు భయ పడి పారిపోనే లేదు .బాంబు తన యెడల వీర విధేయత ప్రదర్శించిందేమో ?అక్కడ వారి దృష్టిలో తాను ఒక నల్లవాడు మాత్రమే .కాని అక్కడున్న జనం రామయ్యగారిని ప్రక్కకి లాగి అప్రమత్తం చేశారు .చుట్టూ దడికట్టి కాపాడారు .ఇలా మూడు సార్లు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకో గలిగారు .ప్రాణం పోకపోవటమే కాదు ,గాయాలు కూడా తగులకుండా బయట పడ్డారు .బాన్దేజి వేసిన డాక్టర్ ‘’రామయ్యా ! యు ఆర్ లకీ ‘’అనటం తమాషాగా ఉంది ఆయనకు .యుద్ధం లోని నైచ్యాన్ని ఏవ గి౦చు కొన్నారు .జనావాసాలపై ఈ బాంబు దాడులు ‘’mean absurdity ‘’ అని పించింది .ప్రపంచం లో సగం దూరం ప్రయాణం చేసి కొత్త దేశం లోదేశానికి కొత్త రూపు రేఖలు సంతరిస్తున్న సందర్భం లో ఈ బాంబు దాడులనుండి ‘’ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ ‘’ కాలం లో తప్పించుకోవటం అద్భుతం అని పిస్తుంది .ఆయన సాధించాల్సింది ఇంకా ఏంతో ఉందికదా .అందుకే ఆయన్ను భగవంతుడు రక్షించాడు అనుకోవాలి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-5-15 –ఉయ్యూరు