‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-17
లూబ్రికంట్స్ లో విప్లవం
ఎకడమీషియన్ రవీంద్ర ‘’ఒక మనిషి ఒకటే మాట చెప్పాలి .అంటే రెండు పదాల సూత్రం మాత్రమె ఉండాలి ‘’అని చెప్పిన మాట సహజమే నని పించింది రామయ్య గారికి .కొత్తది కనిపెట్టటం (డిస్కవరీ )అనేది ఎప్పుడూ ఒక తరహా సూత్రమే .ప్రపంచ ప్రసిద్ధ శాత్ర వేత్త లందరూ ఒకటి రెండు మాటల్లోనే వారి పరిశోధనా ఫలితాలను తెలిపారు .న్యూటన్ ‘’గురుత్వాకర్షణ శక్తి ‘’,డార్విన్ ‘జాతుల పుట్టుక ‘’,పవ్లోవ్ ‘’కండి షండ్ రిఫ్లెక్స్ ‘’ఐన్ స్టీన్ ‘’సాపేక్ష సిద్ధాంతం ‘’, దీనికి ఉదాహరణలు అన్నారు రామయ్య .జీవితం మాత్రం అందరికి ఒకటే .రామయ్యగారు చాలా విలువైన పనే చేస్తున్నారన్నాడు రవీంద్ర .ప్రతి మనిషిలో అనేక మంది వ్యక్తులుంటారు .వారందరూ ఎవరి కర్తవ్యాన్ని వారు నేరవేరుస్తుంటారు అన్నారు రామయ్య .తన శక్తి యుక్తులనన్నిటినీ సంస్థాగత నిర్వహణకు ,సాంకేతిక సామర్ధ్యానికి వినియోగిస్తున్నానని భావించారు .మిగతా కాలమంతా ప్రత్యేక ప్రయోగాల నిర్వహణ ,వాటిని ప్రాముఖ్యంమైన వాటిలో ఉపయోగ పడేట్లు చేయటం . ఇదే సమయం లో తనలోని మరో వ్యక్తి తాను చేసిన పనిని సామాన్యీకరించేవాడు అన్నారు .ఈ రెండవ వ్యక్తియే మోటారులోని ఉపరితల ఘర్షణ కు ,కార్డాన్ షాఫ్ట్ ,బాల్ బేరింగ్ లకు మధ్య ఏం జరుగుతోందో అనే దానిపై ఆసక్తి చూపేవాడేట .ఈ మనిషే ఆయన జీవితం లో అన్ని ప్రయోగాలకు కింది అధికారిగా ఉండి (సబార్డినేట్ ) తనకు తెలీయకుండానే ఏర్పడే ప్రశ్నలన్నిటికి సమాధానాలు కనుక్కోనేవాడట .రెండవ సారి రామయ్య గారి పై బడిన ఇంసిడియరి బాంబ్ ఘటన తర్వాత లూబ్రికంట్స్ లో వేర్వేరు స్థాయిలలో జరిగే చలనాలలో జరిగే మార్పులను అర్ధం చేసుకోవటానికి వీలు కలిగించింది అంటారు .ఆ బాంబు రామయ్యగారి లోపలి వ్యక్తిలో’’ బల్బ్ వెలిగించాడ’’న్నమాట .
ఆ రోజు సాయంత్రం మెట్రో రైల్ లో రామయ్య ప్రయాణం చేస్తున్నారు .ఎస్కలేటర్ వద్ద రద్దీ గా ఉంటె కాసేపు ఆగి జనం తగ్గిపోగానే ఎస్కలేటర్ ఎక్కారు .అక్కడ ఆగి ఉన్న ప్పుడు జనం తలకాయల్ని లేక్కేశారు .ఎస్కలేటర్ దగ్గరకు చేరినప్పుడు హాయిగా స్వేచ్చగా ఉన్నజనం ,అది ఎక్కినప్పుడు అటూ ఇటూ క్రమపద్ధతి లేకుండా ఊగుతూ కదలటం గమనించారు .ఇది అచ్చంగా’’ బ్రౌనియన్ మువ్ మెంట్’’ లో మాలిక్యూల్స్ కదలిక లాగా ఉందని పించింది ఫ్లాష్ గా .ఇది వరకు ఎన్నో సార్లు ఎస్కలేటర్ ఎక్కి వెళ్ళారు. కాని ఈ సారి మాత్రమే ఈ ఆలోచన రావటం విరుద్ధం గా పారడాక్స్ లాగా ఉందని పించింది .ఆశ్చర్యమేసింది .జనం అంతా ఒకే చోట స్తిరంగా ఉండటం ,కాని పూర్తీ సామర్ధ్యం తో కదలటమే ఇందులో తమాషా .ఒక్కసారిగా మనసులో ఏదో తళుక్కున భావం పొడమరించింది .తాను చేస్తున్న ప్రయోగాలకూ దీనికీ ఏదో సంబంధం ఉండనుకొన్నారు . కొత్త ఆలోచనేదో ఒక్కసారిగా తట్టింది దీని సారాంశమే లూబ్రికంట్స్ లో ఏమి జరుగుతోందో తెలుసుకోవటానికి తోడ్పడింది అంటారు రామయ్య .ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు రామయ్య గారి ఆలోచన లూబ్రికంట్స్ లో విప్లవాన్నే తెచ్చింది .కారణాలు నిబంధనలకు దారి చూపుతాయి .మాలిక్యూల్స్ అవి ఉండే పరిస్తితులు ,వాటిలో వచ్చే చర్యలు పై ఆధార పడతాయి .ప్రతి చర్య ఫలితంగా అవే ,నిబంధనను మారుస్తాయి .ఈ ఆలోచన మెరపు వేగం గా రామయ్యగారికి తట్టింది. సమస్య పరిష్కారానికి దోహదం చేసింది .కళ్ళముందు అదంతా సినిమా రీల్ లాగా కనిపించింది .విపరీతమైన భావోద్రేకానికి గురై ఇంటికి చేరుకొన్నారు .ఒక సమాధి స్తితిలో ఉండిపోయి కోటుకూడా విప్పదీయకుండా ,తోచిన వివరాలను క్లుప్తంగా మననం చేసుకొని మనసులో స్తిరమైన భావన నేర్పరచుకొన్నారు .వాటి పర్యవసానాలను రాసి పెట్టారు .’’the lubricant is a special plastic medium ‘’అనేది ఈ ఆలోచనల మొత్తం సారాంశం .అది ఒక స్వతంత్ర వ్యక్తిత్వం గల సమ్మేళనం ‘’(it is a compound of integrity and plasticity ‘’) గా నిర్దారించుకొన్నారు రామయ్య .అందులోని మాలిక్యూల్స్ ల పరస్పర చర్యలు వాటి ధర్మాల పై ఆధార పడి ఉంటాయి కాని ప్రతి క్రియ అంటే రియాక్షన్ ఆ గుణాలనే మార్చేస్తుంది .అదీ ఇక్కడున్న తమాషా .కనుక దీనిని బాగా అర్ధం చేసుకోనేట్లు చెప్పటానికి కొత్త పద సృస్తి,కొత్త గుణాత్మక వివరణ ,అందుకోవటానికి కొత్త విధానం ఏర్పడాలి .పాత గణిత సూత్రాలేవీపని చేయవిక్కడ .అలాంటి మీడియం కాలం కూడా ప్రత్యేకంగా ఉంటుంది .ఆ స్పెషల్ టైం నే ‘’లేటేంట్ పీరియడ్ ‘’అన్నారు .ఈ కాలం లో జరిగే మార్పులు అర్ధమయ్యేట్లు వివరించాలి .దీనితో రామయ్య గారికి పూర్వం తాము ఎక్కడ పప్పులో సారీ తప్పులో కాలేశారో తెలిసింది .తర్వాత రామయ్య గారు మిగిలిన రిసెర్చ్ విద్యార్ధులు కలిసి కూర్చుని మీడియం పై మౌలిక భావన అంటే కాన్సెప్ట్ ను సాధించారు .దీన్ని గురించి రామయ్య గారు చెబుతూ ‘’In our calculations and formulations this was an abstract volume within whose limits ,like fish in an aquarium ,the moved periodically ,sometimes colliding and coming into contact .Actually every thing was the other way .The medium was the property of these molecules .It just like the molecules in their interaction .’’అని స్పష్టంగా అందరికి అర్ధమయ్యేట్లు వివరించారు . ఈ ఆలోచనలన్నీ బాంబు ప్రేలుడు సంఘటనల ద్వారా వచ్చినవే నంటారు .ఇంతటితో అయిపోలేదని తాను వెంటనే ఆలస్యం చేయకుండా సంవాద రూపాన్ని అంటే’’ interlocutor’’ ను కనుక్కోవాలని అన్నారు .అంటే ఇతరులకు చెప్పి అభిప్రాయం తెలుసుకోవాలని ఆయన భావం .’’యురేకా యురేకా ‘’అని ఆర్కిమిడీస్ లాగా బట్టలు లేకుండా రోడ్లవెంబడి పరి గేత్తలేదుకాని, రామయ్య గారు మహా ఉత్సాహం గా అదే భావోద్రేకం తో పరిశోధనా ఫలితం సాధించినందుకు ఇంటికి పరిగెత్తుకొచ్చి తలుపు తట్టారు .తన ఇంట్లో ఉంటున్న ఇంజినీర్ గారు లేరు ఇంజినీర్ భార్య పని చేసి అలసట తో నిద్ర పోతోంది .మంచీ మర్యాదా పాటించకుండా రామయ్య ఆమెను నిద్ర లేపి క్లుప్తంగా తానూ సాధించింది తెలిపారు .ఆమె కంగారులో తల ఊపుతోంది అర్ధంకాక .తానూ సరిగ్గా ఆలోచిస్తున్నాడా లేదా అని చెప్పటానికి తగిన వ్యక్తీ లేడు.తనను తానే సంబాళించుకొని తాను సరైన ఆలోచనలను సరైన మార్గం లోనే చేస్తున్నాను అని సంతృప్తి పడ్డారు .ఇంజినీర్ భార్య రామయ్యగారు కోటుకూడా విప్పలేదని గుర్తు చేసింది .సిగ్గుపడ్డారు .అప్పుడు స్పృహలోకి వచ్చి తాను ఎంచేశారో తెలుసుకొన్నారు .ఆమె వెంటనే వంటగదికి వెళ్లి టీ పెట్టి తెచ్చింది .బ్రెడ్ జామ్ ఇచ్చి తినమంది ‘’అన్నయ్యా !ఇలాంటిఒక శుభ సందర్భం వస్తుందనే వాటిని జాగ్రత్తగా దాచి ఉంచాను .ఇప్పుడు అవకాశం వచ్చింది .వాటిని తీసి తిందాం .మీ పరిశోధనా ఫలితా విజయాన్ని ఉత్సవం గా ఇప్పుడే చేసుకొందాం .మీరు కనిపెట్టిన విషయం సాధారణమైనదికాడు .మీ మేధస్సు అమోఘం .కూర్చోండి .రిలాక్స్ అవ్వండి .ఆనందంగా ఈ శుభ ఘడియలను పంచుకొందాం ‘’అన్నదామె
ఇద్దరూ జామ్ నంజుకొంటూ రొట్టె తిని టీ తాగి గొప్ప అనుభూతికి లోనయ్యారు .ఈ సంఘటన తానెప్పుడూ జీవితం లో మరచిపోలేదని రామయ్య గారు చెప్పేవారు .ఆ జామ్ రోజూకంటే రుచిగా ఉందట .దానికి కారణం దయగల యా ఇంజనీర్ గారి ఇల్లాలు పవిత్ర హృదయం తో ,ఆత్మీయంగా ఇచ్చి౦ది కనుక అంత గొప్ప రుచిగా ఉందట రామయ్య గారికి .రామయ్య గారు అంటే నిలువెల్లా కృతజ్ఞత నిండిన మహోన్నత వ్యక్తీ అని పిస్తుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-15 –ఉయ్యూరు