‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-18

నూతన ఆవిష్కరణ-ప్లాస్టిక్ మీడియం సిద్ధాంతం

అప్పటిదాకా రామయ్యగారికి ప్లాస్టిక్ మీడియం మాత్రమే తెలుసు .ఇప్పుడు మోటార్ లూబ్రికంట్ ల రాజ్యం ‘’రెజీం ‘’కు  సంబంధించిన లెక్కల షీట్లు అధ్యయనం చేశారు .అప్పుడు మనసులో అనిపించింది ‘’రామా !ధన్యుడివి .అభినందనలు .అసలైన తగిన మాటను ఉపయోగించావు .ఇప్పటి దాకా ఆకాశ విహారం చేశావు ఇక చాలించి నేలమీదకు దిగి అసలైన ఆలోచనలను చేయి .నీ శక్తి సామర్ధ్యాలను రుజువు చేసుకో .నువ్వు చెప్పిన ,కనుగోన్నదాన్ని నువ్వే నిరూపించాలి .దానికి తగిన వాదం తయారు చేసుకో .ఇలాంటి చిన్న బీజం నుండే మహోన్నత వృక్షం పెరుగుతుందని నమ్ము ‘’అని అంతరాత్మ ప్రబోధించిన అనుభూతి కలిగింది .’’దీని కీర్తి అంతా నాలోని వాడికే దక్కాలి ‘’అనుకొన్నారు ..అతను తాను  చేసిన దాన్ని మెచ్చుకోవటమేకాకుండా దానికి సంబంధించిన సిద్ధాంతం రాయమని గోల చేస్తున్నాడు .ఇతరులు మెచ్చేట్లుగా రాయాలి ,ఒప్పించేట్లుగా ఉండాలి .రవీంద్ర లాంటి వారి మాటలు జనం వింటారు .అయినా తన’’ డిసర్టేషన్’’అందరికి నమ్మకం కలిగించాలికదాఅని గుంజాటన పడ్డారు .కొత్తది ఎప్పుడూ కొత్తదే .యుద్ధం పూర్తీ అయిన తర్వాత రామయ్య గారు  ఈ నూతన సిద్ధాంతాన్ని సమర్ధింప జేసుకొని పేరుపొందారు .

కొత్తది కనిపెట్టటం ఆనందాన్ని ఇవ్వటమేకాక సైంటిస్ట్ కు  దురద్రుస్టాన్ని  తెచ్చి పెడుతుంది అన్నారు రామయ్య ..ఎందుకంటె ఒక కొత్త ఆవిష్కారం జరిగినప్పుడు ఒక శిఖరం మీద ఉండిపోవటమే కాని ఇక అంతకంటే అతను ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండదు .అంటే ఒక సమతల ప్రదేశాన్ని చేరుకోన్నట్లే .మళ్ళీ అలాంటిది ,లేక అంతకంటే గొప్ప   విషయం కనిపెట్టే అవకాశం రాక పోవచ్చు .ఇలా రామయ్య గారు అనుకొంటుంటే రాజేంద్ర ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారని నవ్వేసి ‘’ప్రజలు మిమ్మల్ని చూసి అసూయ పడేట్లుగా అద్భుత విషయం కనిపెట్టారు .గొప్పనూతన  ఆవిష్కరణ  చేశారు మీరు .ఇంతకంటే మీకేం కావాలి సార్ !రెండోమాట కావాలని ఆలోచిస్తున్నారా ?అది దానంతటికి అదే వస్తుంది . ఆ మాట  రావాలంటే మీరు మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది .’’అన్నాడు అతను చెప్పింది నిజమనిపించింది రామయ్య గారికి .ఇక ఆ విషయంపై ఆలోచించలేదు ‘’.ఈ జన్మకు ఇది చాలు ‘.ధన్యుడిని .జన్మ సార్ధక మైంది ‘’అనుకొన్నారు మనస్పూర్తిగా .జీవితకాలమంతా కృషి చేసి సాధించిన అపూర్వ విషయం ఇది అనిపించింది .ఈ నవీన ఆవిష్కరణ తర్వాత తనను  నిత్యం గతం లోకి లాక్కు వెళ్ళే అందమైన పడవ అనిపించింది  ఆ స్మృతి .అంత తియ్యగా ఉండేది .ముందుకు నడవకుండా వెనక్కే పడవ ప్రయాణం చేయటం బాధగా ఉండేది .

కేమోటాలజి పిత

ప్లాస్టిక్ మీడియం సిద్ధాంతం కనుక్కొన్న తర్వాత ఇక తన జీవితం లో ఏ ముఖ్యమైన ,ఆసక్తికర సంఘటన జరగ దేమోననుకొన్నారు  కాని రాజేంద్ర చెప్పిన’’ బీజమే వృక్షమవుతుంది ‘’ అన్నమాట మనసులో మెదులుతూనే ఉంది అది  వృధాకాలేదు .దీనితో సైన్స్ లో కొత్త అధ్యాయం ఆరంభమైంది .కొంతకాలం గడిచిన తర్వాత దానికి ‘’ కేమొటాలజి’’ అనే ఒక ప్రత్యేక మైన పేరు వచ్చింది .’’అదే మోటార్ ఆయిల్స్ కు సంబంధించిన రసాయన శాస్త్రం అయింది ‘’. మండే లూబ్రికంట్ పదార్ధ  స్వభావాలను విచక్షణతో ప్రయోగించే సాంకేతిక శాస్త్రం గా రూపు దిద్దుకోన్నది .దీన్ని సమర్ధించిన వారు వ్యతిరేకించిన వారూ ఏర్పడ్డారు .కాని అందరూ ఈ భావాన్ని అంటే ఐడియాను మాత్రం అంగీకరించారు .అదే ముందడుగు అయింది .బీజం క్రమగా అంకురించి మొలకెత్తి మహా వృక్షం గా ఎదిగిపోయింది. దాని విస్తరణను ఎవరూ ఆపలేక పోయారు .ఈ మహా వృక్షానికి కొమ్మలు రెమ్మలూ ఏర్పడ్డాయి .అన్నీ కలిసి అద్భుత ఫలితాల ఫలాలను అంద జేశాయి .లూబ్రికంట్ చరిత్రలో విప్లవమే వచ్చింది .అది మంచికి మార్గ దర్శనం చేసింది .కొత్త ఆలోచన ఆచరణ లోకి వచ్చి ఘన విజయాలను అందించింది . అందుకే రామయ్యగారిని ‘’కేమోటాలజి పిత ‘’-father of chemmotology’’అయ్యారు . ఈ విధానానికి మెచ్చి ‘’జాతీయ బహుమానం ‘’(స్టేట్ ప్రైజ్ )ను ప్రకటించారు .ఇక దీన్ని ఉత్పత్తి చేసి , పరీక్షించి నిగ్గు తేల్చుకోవాలి . ఇవి  వేరే ఇన్ష్టిట్యూట్ లలో జరగాలి ‘’ధీరీ’’ రామయ్య గారిది ప్రాక్టికల్ విజయం వారు సాధించి చూపాలి .

పరీక్షా విధానం

రామయ్యగారు ,చీఫ్ ‘’నూర్న్’’ కలిసి ఓల్గా తీరం లోని నిర్మాణ సంస్థ దగ్గరకు వెళ్ళారు .ఇద్దరికీ విరుద్ధమైన భావాలున్నా ఇక్కడ ఈ విషయం లో కలిసి పని చేయటం తమాషా అనిపించింది .పరీక్షించే యూనిట్ లోకి వీరిద్దరిని పంపుతూ దాని డైరెక్టర్ వాళ్ళిద్దరిని ఒక సారి చూసి ఒక చిరునవ్వు నవ్వి ‘’మీ ఇద్దరివి రెండు దృఢమైన పిడికిళ్ళు .అంతమాత్రాన మీ రిద్దరూ పోట్లాడుకొంటారని నాకు అనిపించటం లేదు .మీ ఇద్దరి ద్రుష్టి చాలా ఆకర్షణీయంగా ఉంది .మీకు విజయోస్తు ‘’అన్నాడు ఆశాభావమైన దీవెనతో . చేసిన పరిక్షలు విజయ వంతమైనాయి. తనకు అక్కడ కావాల్సింది  టెక్నాలజీ లో బాగా జ్ఞానం ఉన్న వారు కాదు .వాళ్ళ కమీషన్ లోనే రామయ్య గారి సిద్ధాంతాన్ని నమ్మని వారున్నారు .ఈ స్పెషలిస్ట్ లు ఆ మధ్యనే గ్రాడ్యుయేట్ లయిన వారు .రామయ్య గారికి వ్యతిరేకమైన ,ప్రాభవం ,పట్టూ ఉన్న వారి సంస్థలలో చదివి ఇక్కడ చేరిన  వారే వీళ్ళు .ఏమైనా ట్రయల్స్ సక్సెస్ అని చెప్పేశారు .రామయ్యగారు ,నర్మ్ ఇద్దరూ అక్కడినుంచి బయల్దేరి ఆనందం గా విజయ విలాసంగా మాస్కో చేరారు  .

రామయ్యగారు ఆ తిరుగు ప్రయాణాన్ని మనసులో భద్రం గా దాచుకొన్నారు. అది చిరస్మరణీయం గా ఉండిపోయింది .వెంటనే వచ్చిన ఆదివారం నాడు నర్మ్ తో బాటు మాస్కో-వోల్గా కాలువలో షిప్ లో ప్రయాణం చేశారు.చాలా ఆహ్లాదమైన యాత్రత అది .కాలువకు ఇరు వైపులా చెట్లు  శిశిర  శోభను సంతరించుకొని కను విందు చేశాయి పసుపు ఎరుపు ,ఊదా రంగుల ఆకులు రాలి పడుతున్నాయి . నిశ్శబ్దం గా ఉంది ప్రక్రుతి .ప్రకృతి ఇద్దర్ని పరవశుల్ని చేసింది .అనుభవించిన సంతోషం,,ప్రశాంతత శాశ్వతంగా మనసులో నిలిచిపోయాయి .ఆ ప్రశాంత సమయం లో నర్మ్ తన జీవిత చరిత్రను రామయ్యగారికి వివరంగా చెప్పాడు.ఆయనదీ తనలాంటి బతుకే అనిపించింది .ఆయన బీద ఈస్టోనియన్ రైతు కుటుంబం నుంచి వచ్చాడు.పని బరువు అతి చిన్నతనం లోనే తెలిసినవాడు .తనలాగానే ప్రపంచం సగం చుట్టి వచ్చిన వాడు .బాగా చదివుకొని ఏదో ఆకాశం లో ఆశగా విహరించాలని కాకుండా ప్రయోజన కరమైన కార్యం లో పని చేస్తున్నందుకు సంతృప్తిగా ఉన్నాడు .

చేతికి దక్కని ప్రైజ్ –ఆవరించిన నిరాశ

ఇంత ఆనందం అనుభవించిన  వీరిద్దరికీ  ఇన్ ష్టి ట్యూట్ లో చేదు అనుభవం ఎదురైంది .డైరెక్టర్ వాళ్ళిద్దరూ ఎందుకు ట్రయల్ ప్రోటోకాల్ పూర్తికాకుండా వచ్చారని ప్రశ్నించాడు .ప్రోటోకాల్ ను తర్వాత పంపిస్తామని,కమిషన్ లో అందరి సంతకాలు కాలేదని అయిన తర్వాత రిపోర్ట్ పంపిస్తామని అక్కడ వారు చెప్పారని వివరించారు  .డైరెక్టర్ తల అడ్డంగా ఊపాడు .’’సమయం మించిపోతోంది కుర్రాళ్ళారా  !’’ఆన్నాడాయన . నిజంగానే ఆయన అన్నట్లు సమయం గడిచిపోతోంది వేగంగా .డాక్యుమెంట్లు రావటానికి మరి కొద్ది రోజులే మిగిలాయి .ఈ లోపల అవి రాకపోతే ప్రైజ్ కమిటీకి వాటిని అందజేసే టైం దాటిపోతుందని భయం గా ఉంది అందరికి .కాని అదే జరిగింది . ఆనందంగా ఉన్న వారందరికీ నిరాశే మిగిలింది .పొందిన ఆనందం, సంతోషం ఒక్క సారిగా ఆవిరైపోయాయి .

రోజులు గడిచిపోతూనే ఉన్నాయి కాని ప్రోటోకాల్ రాలేదు .నర్మ్  టెస్ట్ లు జరిగిన ప్రదేశానికి వెళ్లి ఉత్తి చేతులతో తిరిగి వచ్చాడు .కమిటీలో ఇద్దరు సభ్యులు రామయ్యగారి సిద్ధాంతాన్ని అంగీకరించ లేదని  మళ్ళీ ప్రయోగాలు జరపాలని సూచించి నట్లు తెలిసింది .మిగిలిన సభ్యులందరూ రామయ్య గారి సిద్ధాంతాన్ని పూర్తిగా సమర్ధించారు .మళ్ళీ ఒక డేటా అందజేస్తే చాలని తెలిపారు .అప్పుడు వాళ్ళు సరైన దారిలో పరిశోధన చేశారని తెలుస్తు౦దట .నర్మ్ కు ఇదంతా ఒక ఫార్సుగా అనిపించి విపరీతమైన కోపం వచ్చింది .అభిప్రాయ భేదం రావటం ఏమిటని విరుచుకు పడ్డాడు .ఆయన అన్నది కరెక్టే .ఎందుకంటె ఇప్పటికే  వచ్చిన ఫలితాలు చాలు అభిప్రాయాలు ఏర్పరచుకోవటానికి.కాని ఆయన తీవ్ర పదజాలం సమస్యను మరింత జటిలం చేసింది .మళ్ళీ ప్రయోగాలు చేయాలని వారు నిర్ద్వంద్వంగా ప్రకటించేశారు .అంతలో ప్రైజ్ కమిటీ ముందు డాక్యు మెంట్లు అందజేసే సమయం అప్పటికే దాటి పోయింది ..డైరెక్టర్  భయపడింది సరైనదే అని రుజువైంది తర్వాత  .ఈ విఫల యత్నం సఫలంయ్యేలోగా నర్మ్ తీవ్రంగా అస్వస్థతకు గురైనాడు.

విజయం పొందిన రామయ్య గారి సిద్ధాంతం

.రామయ్యగారికి సంతోషం ప్రశాంతత దక్కలేదని అభిప్రాయ పడ్డారు .అది చాలా కష్టం అనిపించింది .వీరిద్దరికీ ఆ ప్రైజ్ దక్కలేదు .అది దారుణం అనిపించినా, విధి కృతం అనుకొన్నారు .సైన్స్ కు సంబంధించినంత వరకు దానికేమీ నష్టం లేదు . రిసెర్చ్ లు క్రమంగా జరుగుతూనే ఉన్నాయి .రామయ్య గారి కొత్త సిద్ధాంతం నవీనం గానే పేరు పొంది ఆ పేరు కొనసాగిందికూడా ప్రయోగాలు జరిగి జరిగి చివరికి రామయ్య గారిదే రైట్ అయింది .అని దాన్ని వ్యతిరేకించిన వారు ఓడిపోయారు .రామయ్య ఘన విజయం పొందారు .

ఒక రోజు నర్మ్ తిరిగి వచ్చాడు .ఆయన ముఖం లో కళా కాంతులు కనిపించలేదు. నిరాశలో ఉన్నట్లు అనిపించింది రామయ్య గారి అమ్మాయి సోఫాలో కూర్చుని ఏదో పుస్తకం  చదువు కొంటున్నది .ఆమె క్రిలోవ్ రాసిన నీతికధ బట్ట్టీ పడుతోంది .ఈ కధలో ఒక చిన్న కుక్క ఇంకో బుల్లి కుక్క ఏనుగును చూసి మొరుగుతుంటే  ‘’నువ్వేదో మొరుగుతున్నావు ఆ ఏనుగుదాన్ని పట్టించుకోకుండా  దాని దారిన అది పోతోంది చూడు  ‘’అని చెపుతుంది. అది విన్న రామయ్య గారు ‘’అమ్మా !క్రిలోవ్ చెప్పింది చాలా నిజం ‘’అన్నారు .దీనితో మనసులో ఉన్న కొంత టెన్షన్ తగ్గి వాతావరణం తేలిక పడింది .మర్నాడు అనుకోని వ్యక్తీ ఒకతను వచ్చి తన స్వంత ఇంటికి వచ్చానన్న ఆనందం తో చేరి కొంత సుఖాన్ని పొందాడు .అతనే అలెక్సీ మైఖేలోవిచ్ డియకోవ్  .మూడ్ పాడైనప్పుడల్లా అతను అనుకోకుండా వచ్చి సంతోషం పంచి  వెడుతూ ఉండేవాడు .ఇదొక రిలీఫ్ గా ఉండేది రామయ్యగారికి .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-15-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.