కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘25(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)
ఆహ్వాన వైవిధ్యం
‘’అన్ని మీటింగులు ఒకలా లేవు .వృద్ధులు వేరొక విధం గా కలిసేవారు. ప్రెస్ కాన్ఫ రెన్స్ లో అన్ని ప్రశ్నలూ స్నేహ పూరితంగా వేసే వారుకాదు .రైటిస్ట్ వాదులు వారి పంధాలో ప్రచురిస్తే ,మా బ్రాహ్నాలు సంప్రదాయంగా ప్రవర్తించారు .మా బంధువులు నా ప్రక్కన కూర్చునే వారు కాదు .ఒకే టేబుల్ మీద నాతొ భోజనం చేయలేదు .ఊరికే తల ఊపుతూ ఉండేవారు .కొత్త వాళ్ళు పాత తరం వాళ్ళూ స్నేహితుల్లా కలిసి ఉండలేరా ?అని అనిపించింది .ఇది వయసు వ్యత్యాసం ఒక్కటిమాత్రమే కాదు .ముసలి సన్యాసులలో అందరూ దైవ సేవలో అంకిత భావం తో పని చేసేవారుకాదు .కొలంబో క్రిస్టియన్ ల లాగా వారిలో ఏదో ఉంది .వీరిలో నటన లేదు పూర్తిగా దైవ సేవలో నిమగ్నమయి ఉండేవారు .వీళ్ళతో మాట్లాడటానికి నాకు ఏ విషయమూ ఉండేదికాదు .’’ఈ నాటి పవిత్రకార్యం పోరాటమే ‘’అని వారికి ఎలా చెప్పగలను ?ఉరక లెత్తే సముద్రాన్ని అందులో మునిగి ఈదటాన్ని వదిలేసి ,పగలును రాత్రి నుండి రక్షించుకొని , చావు నుండి నుండి జీవితాన్ని రక్షించుకొని ,యుద్ధం నుంచి శాంతిని కాపాడుకోవటం మహత్కార్యం .ఎవరి జీవితాన్ని వారికిస్టమైనట్లు జీవించ వచ్చు. అభ్యంతరం లేదు .ఇలాంటి వారిని నేను నిందించను .అంతమాత్రాన వారిని సమర్ది౦చనూ లేను .ఈ సారి వచ్చే యుద్ధం నిన్నూ నన్నూ ప్రపంచాన్ని కబళిస్తుంది .జాతీయత నినాదం అచ్సిరాదు.వీరిలో ఇండియాను నేను గుర్తించలేను .’’
స్వంత ఇంట్లో రామయ్య –బాలిక ఆత్మ హత్య
‘’మా ఇంటి దగ్గర ఉన్న పాత బావి ని నేను గుర్తుపట్టాను . నా చిన్ననాటి స్నేహితునిచూడటానికి వాళ్ళ ఇంటి వైపు నడుస్తుంటే నా చెయ్యి పట్టుకొని ఆపేసింది మా బంధువులమ్మాయి .’’దయ చేసి వెళ్ళకు .అదొక విషాదం ‘’అంది ఆమెకు సోదరి వరుస అయిన ఆవిడ విషాద గాధ వినిపించింది .ఆమెకు ఇష్టం లేకుండా ఒకడికిచ్చిఆమె పెళ్లి చేయాలనుకొన్నారు .పైగా ఆతను ఆమె దగ్గర బంధువుకూడా .ఇష్టం లేని వాడిని కట్టుకోలేక ,మరో దారి లేక ఆ పిల్ల నూతిలో దూకి ప్రాణం తీసుకొంది .అప్పటి నుండి ఆ బావి నీరు ఎవరూ వాడటం లేదు .ఆ బావి పక్కనుంచి వెళ్ళే వారు విషాదం తో తల ఆడిస్తూ నడిచి వెళ్ళేవారు .నన్ను ఆపినా నేను వెళ్లి ఆ బావి ని చూశాను .ఆ నీటిలో నా ముఖం ,ఆకాశం ప్రతి ఫలించాయి .ఒక్క క్షణం నాకు ‘’అరె !నేను బతికే ఉన్నానే ?’’అనిపించింది .బతికి ఉన్నందుకు ఆనంద పడటం చూసి అభినందించాను. నాకు తెలియని ఆ బాలిక మరణానికి చింతించాను .పాత నూయి ఆమెను ఆహ్వానించింది గావుల్ను .
యాకమూరు పారిశ్రామిక వాడ
ఒక సారి కొదరు యువకులు కలిసి మాట్లాడకుండా నావైపు చూస్తున్నారు . వాళ్ల కళ్ళల్లో పెద్ద వారి కళ్ళల్లో కనిపించని వింత భావం ఏదో నాకు కనిపించింది .వాళ్లకు నేను కొత్త వాడినైనా ఆంధ్రుడిని అనిపించిందని అర్ధమైంది నాకు .ఇక్కడే ఒక చిన్న తమాషా జరిగింది .అందులో మెరిసే తెల్లని పలువరస తో ఉన్న ఒక కుర్రాడు నాదగ్గరకొచ్చి ‘’నాపేరు లాల్ గోవింద్ రామయ్య ‘’అన్నాడు .ఆశ్చర్యం తో అతని మొహం లోకి తొంగి చూశాను .ఏమైనా నాకు తెలియని ప్రపంచం లోకి నేను అడుగు పెట్టాను .నా ఉయ్యూరు పల్లె నుండి పట్నంగా మారింది .నేను పుట్టిన యాకమూరూ మారిపోయింది .పారిశ్రామిక వాడ గా కనిపిస్తోంది. అయితే అది స్థానిక వ్యాపారానికి సంబంధించినదే .అక్కడొక చిన్న ఫాక్టరీ దగ్గరకు వెళ్ళగానే నా అన్నగారమ్మాయి ‘’ఇదేమిటో తెలుసా ?అద్దకం ఫాక్టరీ .వాళ్ళు బాటిక్ (రంగుల డిజైన్లు )తయారు చేస్తున్నారు ‘’అంది .చిన్నప్పుడు నా తండ్రి అద్దకపు పరిశ్రమ గురించి చెప్పగా విన్నాను .ఇప్పుడిక్కడ డిజైన్లు రూపు దిద్దు తున్నారు .’’అద్దకమా –చాలా బాగుంది ‘’అన్నాను .అది తయారు చేసే వాళ్ళను చూడాలని ఉంది అన్నాను .ఇద్దరం ఫాక్టరీ లోకి వెళ్లాం .
ఇదొక చేనేత పరిశ్రమ .ఇప్పుడు కొత్త పద్ధతులలో శక్తి వంతమైంది పని చేసే చోటుకు వెళ్లి పరిశీలించాను యువకులు యువతులు వాట్ మన్ పేపర్ మీద ఆభరణాల డిజైన్లు వేస్తున్నారు .నేర్పే మాస్టారు వారి పని తీరును నిశితంగా పరిశీలిస్తున్నాడు .ఈ కళ ఎవరి దగ్గర నేర్చుకోన్నావు అని అతన్ని అడిగాను .అతనుఇక్కడే ఎప్పుడో చేరి పని చేసిన తన తాత గారి నుండి ఈ విద్య నేర్చుకోన్నానని చెప్పాడు .ఎప్పుడో ఒకప్పుడు తనను కూడా ఇక్కడికి వచ్చి పని చేయమని ఆ ముసలాయన చెప్పాడని అన్నాడు .ఇక్కడ నేర్చే యువకులు శక్తి యుక్తుల్ని బాగా ఉపయోగించి అంకిత భావం తో పని చేస్తున్నారు అని తెలుసుకొన్నాను .’’ఈ పనికి డిమాండ్ బాగా ఉందా ?’’అని అడిగాను .అప్పుడు మేష్టారు ‘’రామయ్య గారూ !ఈ పిల్లలంటే నాకు అమితమైన అభిమానం .నేను నా తండ్రికంటే ఏంతో గొప్ప పని మంతుడిని అయ్యాను .అలానే వీళ్ళూ ఈ గురువును మించిన శిష్యులవ్వాలని నా కోరిక .’’అన్నాడు తర్వాత అక్కడే ఉన్న వర్క్ షాప్ కు వెళ్లాను. అక్కడ మిరుమిట్లు గొలిపే ఇంద్ర ధనుసు రంగులున్నాయి.. తల ఆడిస్తూ ముందుకు సాగిపోయాను .మధ్యమధ్యలో ‘’ఎంత గొప్ప డిజైన్ ?రంగులు యెంత అద్భుతంగా ఉన్నాయి ?అనే వాడిని .నా మాటలు నాకే నవ్వు తెప్పించేవి .నా మాట తీరు రష్యన్ యాస తో ఉండేది .నాకు ఇస్టమైనదాన్ని ఎంచుకోమని మాస్టారు కోరారు .చాలా వింత అయినదాన్ని ఎంచుకొన్నాను .మాస్టారు ఆశ్చర్యపడి ‘’ఇది మీకు గుర్తుందా ?ఈ మాదిరి (మోడల్ )నా చిన్నతనం నుంచి ఉంది ‘’అన్నాడు నవ్వుతూ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-15 –ఉయ్యూరు