’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘29(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)
ఏమైనా నేను అదృశ్య మైపోతున్నా.మళ్ళీ నేను సరిగా గాలి పీల్చలేక పోతున్నా .కళ్ళముందు ప్రతిదీ నల్లగా ఉంది . మళ్ళీ కనిపిస్తున్నాయి .ఎంతో తీక్ష్ణమైన వెలుగు .నాలో కొంత పడిపోయి శక్తిని కాంతిమయం చేస్తోంది అంతరిక్షం లో సోల్కొవ్ స్కి ‘’మనం జీవిత సమాప్తకాలం లో కాంతిగా మరిపోతాం .సముద్రమంతటి విజ్ఞానాన్ని తరించి తీరం చేరలేము మనం .కాని ఎప్పుడో ఒకప్పుడు ఒక వ్యక్తి చాల భాగం నేర్చి , అర్ధం చేసుకొని ,విలువలకు మేధస్సు తో తగినట్లు జీవిస్తాడు ‘’అన్నమాట గుర్తుకొచ్చింది ..నేను రాద్దామని అనుకుంటున్న ముఖ్యమైన ఆర్టికల్ రాయ లేక పోయాను .కాని ఇక్కడ నేను కాంతిని ప్రసారం చేస్తున్నాను .ఇందులో ఏదైనా విశేషార్ధం ఉందేమో ఎవరికి తెలుసు ?
పంటలపై సంగీత ప్రభావం –భాషా మూలాలు
నా విమానం నేలమీదికి దిగుతోంది .ఇప్పటిదాకా ఆకాశ గమనం చేశాను .ఇప్పుడు నేలమీద కాలు మోపాలి .మాక్సిం గోర్కి అంటాడు ‘’దేవతలు మన ప్రాచీన కార్యా(వ్యా)లకు హీరోలు .రాముడెవరు ?భలే ప్రశ్న ఇండియాలో అరటి తోటలను చూశాను . పూలు పూసే సమయం లో అక్కడ ఫ్లూట్ వాయిస్తే అరటి చెట్లు హాయిగా విని ఇబ్బడి ముబ్బడిగా అధికమైన గెలలు వేసి ఎక్కువ ఫలసాయాన్ని ఇస్తున్నాయి .ఈ చెట్ల ఫోటోలు నాతొ పాటు తెచ్చుకుంటున్నా .ఇక్కడ దీనికి ఆనుకొని ఉన్న తోట ‘’కంట్రోల్ ‘’ పేరిట సంగీతాన్ని వినిపిస్తారు .వీటినుంచే ‘’సంగీత వినికిడి అరటి ‘’ పండిస్తున్నారు . గెలల బరువుకు అరటి చెట్లు నేలకు ఆనుకొంటు న్నాయి. భలే సరదాగా ,వింతగా ఉంది నాకు చూడటానికి .ఎవరో ముందు దీన్ని గమనించి ఉంటారు .అదొక కొత్త డిస్కవరీ అయిపొయింది .కొంత కాలం ఫలితాలు సంతృప్తి కరంగా రాకపోయినా కాల క్రమేణా గొప్ప దిగుబడి సాధించారు .పంటలపై సంగీత ప్రభావం జాస్తీగా ఉందని రుజువైంది .ఇవే అతిముఖ్యమైన ఆలోచనలు. ‘’the induction period of sediment formation in motor oil ‘’వ్యాసం రాయటానికి ఉపకరించాయి .తెలుగులో ‘’ఒకటి, రెందు మూడు – సంస్కృతం లో’’ అద్నా ,ద్వా ,త్రై .స్లావిక్ భాషలో’’ ఓద్నా ,ద్వే,ట్రై’’ఇంగ్లీష్ లో’’వన్ టు,త్రీ ‘’తేడా ఏమైనా ఉందా ? అన్ని భాషల మూల స్వరూపాలు ఒకటే .
మనుషులంతా ఒకటే
ఉత్తరాన కరేలియా లో ‘’కందలస్క ‘’అనే నగరం ఉంది . ఈ ఫిన్నిష్ సెటిల్మెంట్ పేరుకు సంస్కృతం లో అర్ధం ‘’శత సహస్ర దుంపలు(కంద గడ్డలు ) .ఇండియాలో తెరకోయా టౌన్ ను చూశా దీనికి .ఫిన్నిష్ భాషలో ‘ ధాన్యాగారం ‘’ ‘’అని అర్ధం . ఇండియా ఆగ్నేయ భాగం నుండి ఎప్పుడో మనుషులు ఇక్కడికి ఈ ఫిన్నిష్ ప్రాంతం చేరుకొని ఉంటారు .వాళ్ళే ఇప్పుడు ఫిన్నిస్ అని పిలువ బడుతున్నారు .ఆ వచ్చిన వాళ్ళు ఇండియన్స్ ఏమో ?ఎక్కడి నుంచి వచ్చాం మనం ?మనం ఎవరం ?ఎక్కడికి వెడుతున్నాం ?’’గాగ్విన్’’ లా కాకుండా నేనే బాధ్యత వహిస్తా.నేనే సమాధానం చెబుతా .’’మనమందరం ఒకే మూల కుదురు నుండి పుట్టాం .మనది ఒకే మానవ జాతి.మనం అందరం మనుషులం .ఇందులోనే గౌరవానికి మన పరీక్ష ఉంది .మనం చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం చేస్తున్నాం ‘’అసతోమా సద్గమయా తమసోమా జ్యోతిర్గమయా ‘’.మనది వసుధైక కుటుంబకం .’’
‘’ టర్కిష్ ప్రజలు ‘’మెన్ ,సేన్ ‘’అంటే ,ఫిన్నీష్ వాళ్ళు ‘’మినా ,సినా ‘’అంటారు అంటే అర్ధం నేను ,నువ్వు కలిస్తే మనం . నాయనలారా ఇదే అసలైన విజ్ఞానం .దీన్ని తెలుసుకోకుండా భేషజాలు పోతున్నాం. కలిసి బతకాల్సిన వాళ్ళం కాట్లాడి, పోట్లాడి విడిపోతున్నాం .ఒక సారి మహా తత్వ వేత్త సోక్రటీస్ ను ఒకాయన అడిగాడట ‘’మీరు ఎక్కడి నుండి వచ్చారు “’? అని .దానికి ఆ మహానుభావుడు ’’ఏదేన్స్ నుంచి ‘’అని సమాధానం చెప్పకుండా ‘’ఈ విశ్వం నుండి ‘’అన్నాడు .అదీ ఆ దార్శనికుని విశాల దృక్పధం ,లోకోత్తర భావం, భావన ఈ విశాల విశ్వమే తన జన్మ స్థలం అన్నాడు .ఆయన తన అధిక సంపన్నమైన విజ్ఞానాన్ని ప్రేమను ,తనకూ మనకూ సర్వ మానవాళికీ పంచిపెట్టిన మహోన్నతమానవుడు , ఆదర్శ తత్వ వేత్త .అంతటి విశాల దృక్పధం మనలో రావాలి .ఇరుకు భావాల చీకటి గదుల నుండి బయటికి రావాలి .అంతటా వెలుగును దర్శించాలి .అప్పుడే మానవ జన్మ సార్ధకం ‘’
ఇండో రష్యన్ భాయి భాయి
‘’నేను ఇటీవల ఇండియా వెళ్ళినప్పుడుఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో నన్నొక ప్రశ్న అడిగారు .’’ఇండియా శాంతికాముక దేశం కదా ,సోవియట్ యూనియన్ శక్తి వంతమైన మిలిటరీ రాజ్యం .ఇండియాపై రష్యా దురాక్రమణ చేయదని గ్యారెంటీ ఏమిటి ?అది అనుకోకుండా వేసిన ప్రశ్నకాదుకాని ,అసంబద్ధమైన ప్రశ్న అనిపించి౦దినాకు .అనుకోకుండా నాకు నవ్వొచ్చి నవ్వేశాను .నేను నవ్వటం చూసి ప్రేక్షకులూ నాతొ బాటు నవ్వారు .కానీ ప్రశ్న ప్రశ్నయే కదా .దీనికి నేను సరైన సమాధానం చెప్పాలి .నేను చెప్పటం ప్రారంభించా’’దాదాపు అర్ధ శతాబ్దం గా ఇండియా సోవియట్ యూనియన్ కలిసి నడుస్తున్నాయి .ఇరు దేశాల మధ్య ఎలాంటి వివాదం లేదు .కొన్ని విషయాలలో భేద భావాలు ఉండవచ్చు అయినా కలిసే నడుస్తున్నాయి .రష్యాలో విభిన్నమైన రాజకీయ వ్యవస్థ ఉన్నంత మాత్రాన ఆ దేశం భారత్ పై దాడి చేస్తుంది అనటానికి ఏ మాత్రం అవకాశం లేదు .ఇంతకాలం గా సోవియట్ రష్యా ఏ దేశం మీదా దాడి చేసిన దాఖలాలు లేవు .దీనికి విరుద్ధం గా రష్యానే అనేక దాడులకు గురైంది .సంబంధాల విషయానికి వస్తే రష్యా ఇండియాకు మెటలర్జికల్ కాంప్లెక్స్ ల నిర్మాణానికి ,జాతీయ పారిశ్రామిక వ్యవస్థల నిర్మాణాలకు సహాయం చేస్తోంది .’’ఇలాంటి దాడులు ‘’చేస్తున్నందుకు స్వాగతించారు .’’అని చెప్పగానే అందరూ భారీగా కరతాళ ధ్వనులతో ఆమోదం తెలియ జేశారు .నేనెవర్ని ?నేను ఇండియన్ ను ,సోవియట్ యూనియన్ వాడిని కూడా .అన్ని విషయాలలో ఇలాగే ఉన్నాం .కనుక రెండు దేశాల మధ్య వైరుధ్యమే లేదు .కలిసి నడుస్తూ ప్రగతి పధం లో దూసుకు పోతున్నాం .’’ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-5-15 ఉయ్యూరు