’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘30(’ పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య ‘30(’  పుల్లేరు నుండి ఓల్గా దాకా ’)

ఇప్పటిదాకా మనం రామయ్య గారి స్వదేశాగామనాం ,అనుభవాలు అనుభూతులు ఆయన స్వయం గా చెప్పిన మాటలద్వారా విని తెలుసుకొన్నాం .ఆయనలో భవిష్యత్తును దర్శించే దార్శనికుడు కనిపించాడు రెండు దేశాల అభివృద్ధి తపన ,యువతపై ఉన్న అచంచల విశ్వాసం ,ఇండియా ప్రపంచ దేశాలకు దీటుగా ఎదిగి నిలవాలన్న ఆకాంక్ష కనిపించింది .తన జీవితం సార్ధకమే నన్న విశ్వాసం గోచరమైంది .జీవన సంధ్యలో ఉన్నా ఇంకా ఏదో చేయాలనే తపన చూశాం .హార్ట్ పేషెంట్ అనీ తెలుసుకొన్నాం .విశ్వమానవ గీతం గా అయన జీవితాన్ని ఆవిష్కరించిన వైనం కనిపిస్తుంది ..            ‘’  ప్రతిదీ సాపేక్షికమే అని ప్రజలు అంటారు .ఒక రోజు నేను జనసమ్మర్ద మాస్కో వీధుల్లో నడుస్తున్నాను .అకస్మాత్తుగా ఒక మర్యదాపూర్వక మైన ‘’క్షమించండి రామయ్య గారు !’’అనే పిలుపు వినిపించింది .నా ముందు హాషి మోటో నిలబడి ఉన్నాడు .కాలం అతనిలో ఎన్నో మార్పులు తెచ్చి ముసలివాడుగా కనిపిస్తాడు .ముఖం లో విషాదం కనిపిస్తోంది .అతన్ని చూసినందుకు ఆశ్చర్యం సంతోషం కలిగాయి .ఆత్మీయంగా హత్తుకోన్నాను .ఇలా చేయటం జపాన్ సంప్రదాయానికి విరుద్ధం. ఇండియాలోనూ ఇలా ఎవరూ ప్రవర్తించరు .’’నేనే రామయ్యను ‘’అన్నాను అతనితో .’’ఇక్కడికి ఎలా వచ్చావు ?’’అని అడిగాదు  .’’సముద్ర మార్గం ద్వారా ‘’అన్నాను జోక్ చేస్తూ  .’’నువ్వు టూరిస్ట్ లాగా లేవే ?’’అన్నాడు  .’’నేనిక్కడ చాలాకాలం నుంచి పని చేస్తున్నాను’’అన్నాను  .’’నాకు అర్ధమైంది నువ్వు కాంట్రాక్ట్ ఒప్పందం మీద పని చేస్తున్నావు ‘’అన్నాడు .నన్ను అర్ధం చేసుకోలేదు .’’లేదు హషిమోటో! నేనిక్కడే నివశిస్తున్నాను .’’అన్నాను అతనిముఖం లో నమ్మకం కనిపించలేదు .తర్వాత నవ్వేశాడు .’’ఓహో అలా జరిగిందా ?’’అన్నాడు .

రామయ్యగారికి ఒకే సారి రెండు డిగ్రీలు

రామయ్యగారు జీవితకాలం లో–  పనిచేసేటప్పుడు ఇంజన్ లోని  లోహ భాగాలను తినివేసే విషయం ,లూబ్రికంట్స్  కు తగిన ఎడిటివ్స్ ను కలిపే విషయం పైన  70 పేపర్లు  రాశారు. ఆయన చివరి శాస్త్రీయ పరిశోధనా పత్రం ‘’induction period of precipitation –a new index of motor oil quality and effectiveness of additives in them ‘’పరిశోధనా ఫలితాలలో కొన్నిటిని సిద్ధాంత పరంగా లూబ్రికంట్స్  లో నాణ్యత గురించి 1949 లో మోనోగ్రాఫ్ ప్రచురించారు .’’విస్కాసిటి ఎనామలి ఇన్ ఆయిల్ ,’’’’ఎఫెక్ట్ ఆన్ ఫ్రిక్షన్ ఇన్ మెషీన్స్ ‘’ప్రచురించారు మాస్టర్ డిగ్రీ  కోసం దీన్ని రెండేళ్ళ తర్వాత సమర్పించారు .దీన్ని పరిశీలించిన ‘’ఇన్ ష్టి ట్యూట్ ఆఫ్ పెట్రోలియం కమీషన్ ‘’ఆ పరిశోధన డాక్టర్స్ డిగ్రీ పొందటానికి పూర్తిగా అర్హమైనదని తీర్మానించింది .యు .ఎస్ .ఎస్ .ఆర్. కు చెందిన ‘’అకాడేమి ఆఫ్ సైన్స్  సుప్రీం ఎటేస్టేషన్ కమిషన్’’ అంగీకరించింది .వెంటనే రామయ్యగారికి మాస్టర్ అండ్ డాక్టర్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ డిగ్రీలు రెండూ ఒకే సారి ప్రదానం చేసింది  .

ఫాదర్ ఆఫ్    ట్రైబో కేమిస్ట్రి

రామయ్యగారి శాస్త్రీయ పరిశోధనలు ‘’కేమోటాలజి’’అనే కొత్త శాస్త్రం గా ఆవిర్భవించింది .ఇది మోటార్ ఆయిల్స్ ,ఉపరి తలాలమధ్య స్లైడింగ్  అందులో జరిగే మిశ్రమ రసాయన చర్యల గురించిన శాస్త్రం .పెట్రోలియం ను శుద్ధి చేసిన తర్వాత లభించే బేస్ ఆయిల్స్ లో సరైన , ఎడిటివ్ లను కలపాల్సిన  అవసరాన్ని కేమోటాలజి గుర్తించింది .దీన్ని  పాశ్చాత్య దేశాల వారందరూ అంగీకరించటం తో బాగా ప్రాచుర్యం లోకి వచ్చింది .ఇవాళ కేమోటాలజి ‘’ట్రైబో కెమిస్ట్రీ ‘’పేరుతొ బాగా ప్రసిద్ధమైంది .ఇదంతా రామయ్య గారు వేసిన బీజం .నేడు మహా వృక్షం గా విస్తరించింది .ఈ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది .అందుకే రామయ్యగారిని ‘’father of chemmotology ‘’,’’father of tribochemistry ‘’అంటే ‘’కేమోటాలజిపిత ‘’లేక’’ ‘’ట్రైబో కేమిస్ట్రి పిత ‘’గా గౌరవించి చెప్పుకొంటున్నారు .ఈ గౌరవం భారత దేశం లో జన్మించినందుకు మనమూ ,, రష్యా దేశం లో దాన్ని సాధించినందుకు అ దేశప్రజలూ  గర్విస్తారు . .రెండు దేశాల ప్రజలకూ ఇది అత్యంత సంతోషకరమైన విషయమే .

రామయ్య గారి భారత సందర్శనం లో మరికొన్ని విశేషాలు

డాక్టర్ సూరి భగవంతం ప్రకటన

రామయ్య గారు 1963 లో ఏప్రిల్ 22 నుండి జూన్ 5 వరకు సెంటిమెంటల్ టూర్ గా భారత దేశం సందర్శించారు .ఆనాటి రక్షణ శాఖ మంత్రి వి .కే.కృష్ణ మీనన్ కు సైంటిఫిక్ అడ్వైజర్ గా ఉన్న డాక్టర్ సూరి భగవంతం గారు రామయ్య వస్తున్న సంగతి ప్రజలకు మాస్కో ట్రిప్ నుండి రాగానే 1962 లో హైదరాబాద్ లోని ‘’ఆంద్ర సారస్వత భవనం’’ లో తెలియ జేశారు .అక్కడ చేరిన ఔత్సాహకులు సంబరం తో చప్పట్లు కొట్టి ఆనందించారు .రామయ్య గారి సమీప బంధువు శ్రీమతి డాక్టర్ సూరి శ్రీమతి తన చిన్నప్పుడుమూడో క్లాస్ చదువుతుండగా  రామయ్యగారి నుండి రామయ్యగారి అన్నగారు అనంత రామ శాస్త్రి గారికి అంటే తన తాత గారికి శుభాకా౦క్షల టెలిగ్రాం పంపటం,ఈయన అందుకోవటం  జ్ఞాపకం చేసుకొన్నారు . అంటే రామయ్యగారు మాస్కో లో కులాసాగా ఉన్నారని తెలిసి కుటుంబమంతా ఎంతో సంతోషం పొంది పండుగ చేసుకొన్నారు .రామయ్య గారి క్షేమ సమాచారాలు 1936లేక 1938లో కుటుంబానికి ఒక్కసారి  మాత్రమే తెలిసింది .అదికూడా’’ బాంబే క్రానికల్ పేపర్ ‘’లో’’ చాట్ వుడ్ హాల్ ‘’ అనే ఆయన రామయ్య గారి గురించి ఒక ఆర్టికల్ రాస్తూ అయన రష్యాలో ఉన్నాడు అని అందులో తెలిపాడు .అప్పటినుంచి అనంత రామయ్య గారు రష్యా రాయబారి విజయ లక్ష్మీ పండిట్ తో తరచూ సంభాషిస్తూ వివరాలు తెలుసుకొనే వారు .రష్యాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు .

ఢిల్లీ లో స్వాగత సంరంభం

ఢిల్లీ విమానాశ్రయం కు చేరుకొన్న రామయ్యగారికి  ,పార్లమెంట్ లో కమ్యూనిస్టు ,కాంగ్రెస్ మెంబర్లు ,ప్రముఖ ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్  కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం లో ప్రధాని నెహ్రు కేబినేట్ లో నీటి పారుదల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ బోతున్న డాక్టర్ కే.ఎల్.రావు ,హార్దిక స్వాగతం పలికి పూలహారాలతో ముంచెత్తేశారు .ఆ తర్వాత రామయ్యగారు పార్లమెంట్ హౌస్ కు  వెళ్లి లోక్ సభ పబ్లిక్ గాలరీలో ఆసీనులై ప్రధానమంత్రి జావహర్ లాల్ నెహ్రు  ‘’జాతీయ భాషల ‘’గురించి చేస్తున్న ప్రసంగాన్ని శ్రద్ధ గా విన్నారు .కాట్ర గడ్డ గంగయ్య గారు రామయ్య గారికి ఇష్టమైన ప్రదేశాలను దగ్గరుండి చూపించారు .మొగల్  కళ ,శిల్పకళ ,చరిత్రల మీద పుంఖాను పు౦ఖ౦గా  ప్రశ్నలు  సంధించి అడిగారు .రామయ్య  గారు తన కోసం ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన  చారిత్రిక చిత్రం ‘’మహా మంత్రి తిమ్మరుసు ‘తెలుగు ’సినిమా చూశారు .

ప్రముఖ సంస్థల సందర్శన

ఆనాటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీ దామోదరం సంజీవయ్య ,ఢిల్లీ యూని వర్సిటి వైస్ చాన్సలర్ శ్రీ చింతామణి దేశ్ ముఖ్  పార్లమెంట్ సభ్యులు కే సి పంత్ ,రావి నారాయణ రెడ్డి ,కే ఈశ్వర రెడ్డి ,కుమరన్ ,లక్ష్మీ దాస్ శ్రీమతి విమలాదేవి మొదలైన ప్రముఖులు రామయ్య గారి గౌరవార్ధం కే.ఎల్ రావు గారు ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు .మర్నాడు ఉదయం దేశ ముఖ్  గారింట్లో ఉదయం అల్పాహారం ,భార్య శ్రీ మతి దుర్గాబాయ్ దేశ ముఖ్  ఏర్పాటు చేశారు .తర్వాత ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ,వెంకటేశ్వర కాలేజ్ ,ఆంధ్రా స్కూల్,ఢిల్లీ యూనివర్సిటి లను సందర్శించారు .ప్రముఖ కూచిపూడి నృత్య దర్శకురాలు ఇంద్రాణి రెహ్మాన్ ను కలిసి మాట్లాడారు ఇంద్రాణి తలిదండ్రులు ,బహిష్కరింపబడిన సీతారాం బాపూజీ అనే విప్లవ నాయకుడు రామయ్యగారికి అమెరికాలో సన్నిహిత మిత్రులు .

ఆంద్ర మహా సభ సత్కారం

ప్రొఫెసర్లు ,ఇంజనీర్లు ,సైంటిస్ట్ లు  రచయితలూ ,జర్నలిస్ట్ లు ,పార్లమెంటరీ సభ్యులు మొదలైన వారందరూ కలిసి ‘’ఆంధ్రా  అసోసియేషన్’’ తరఫున జరిగిన సన్మానం లో పాల్గొన్నారు . హైదరాబాద్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి శ్రీ బూర్గుల రామ కృష్ణా రావు ,కొత్త లక్ష్మీ రఘురామయ్య లు రామయ్యగారిని భారత దేశం అంతా పర్య టించి ,ఇన్నేళ్ళలో జరిగిన మార్పులను పరిశీలించవలసిందిగా అభ్యర్ధించారు .మిగిలిన వారు ఆ రోజుల్లో చదువులకోసం అందరి ద్రుష్టి ఇంగ్లాండ్ పైన ఉంటె ,దాన్నికాదని రామయ్యగారు వలస వాద సిద్ధాంతాన్ని వ్యతి రేకించి,నాటి బ్రిటిష్ పాలకుల దేశమైన ఇంగ్లాండ్ కు ,అమెరికాకు ఉన్నత విద్య నేర్వటానికి వెళ్ళకుండా  ప్రజా పక్షాన పని చేసృన్న రష్యా వెళ్ళటాన్ని శ్లాఘించారు . విప్లవ కారుడైన బాజ్ పాయ్ తో అమెరికాలో రామయ్యగారికున్న స్నేహాన్ని రష్యాలో వీరేంద్ర నాద చటోపాధ్యాయ తో మిత్రత్వాన్ని  గూర్చి ప్రసంగించారు కొందరు   .రష్యాలో రామయ్య గారు టెక్నికల్ శ్రేణులకు శిక్షణ  నిచ్చిన విధానాన్ని ,సైంటిస్ట్ గా సోషలిస్ట్ సోవియర్ రష్యా పురోగమనానికి  తోద్పడిన వైనాన్ని ప్రశంసి౦చారు .ఇండియా రష్యాలు పరస్పరం అవగాహనకు రావటానికి తోడ్పడటానికి  రామయ్య గారు  తెలుగు రచనలను రష్యన్ భాషలోకి అనువదించటాన్ని ప్రముఖం గా పేర్కొని ఆయన కృషి ఆదర్శ ప్రాయం ఆచరణ సాధ్యం అనుసరణీయం అని మెచ్చుకొన్నారు .

ఎందుకు ఇండియా వచ్చానంటే!

వీటకన్నిటికి సమాధానం గా రామయ్య గారు ముఖ్యం గా   తాను వృద్ధుడైన ‘’తన అన్నగారు అనంత రామయ్య’’(నా అన్నయ్య)  గారిని చూడటానికి ఇండియా వచ్చానని ,స్వంత కనులతో భారతే సీమ అందాన్ని ఇక్కడి నదీ నదాలు పర్వత శ్రేణులు ,పూలూ ,మొక్కలు ప్రక్రుతి అందాలు దర్శింఛి పులకి౦చానని అచ్చతెలుగు మాటలతో అందరికి చెప్పి వారి కరతాళ ధ్వనులకు నిజంగానే పులకించిపోయారు .తన మాతృదేశం ఏ విధంగా రూపు మార్చుకోన్నదో తెలుసుకోవాలన్న ఆరాటం తనను ఇక్కడికి రప్పిం౦దన్నారు.గురజాడ అప్పారావు రాసిన అమర గీత౦ ‘’దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ‘’గీతం  పాడి వినిపిచారు  .విభిన్న వర్గాల ప్రజలను కలిసి వారితో సంభాషిం చాలని ఉందన్నారు.అప్పుడే అసలైన భారత దేశ నవీన ముఖం అర్ధమవుతుందని చెప్పారు  తాను  ఇండియా నుండి చాలా తీసుకు వెళ్లానని ,కాని దానికి బదులుగా  చాలా తక్కువ మాత్రమే ఆమెకు ఇవ్వగాలిగానని వినమ్రంగా ప్రకటించారు . రష్యా వెళ్ళిన తర్వాత తాను  దీనిమీదనే ఇక నుంచి ఎక్కువ శ్రద్ధ పెడతానని  వినయ పూర్వకం గా విన్న వించారు .తాను  చేసిన శాస్త్రీయ కృషి ఇండియాలో పెట్రోలియం పరిశ్రమకు తోడ్పడితే తనకంటే ఆనందించే వారు ఉండరని చెప్పారు .తనకు హృదయ పూర్వక స్వాగతం చెప్పిన వారందరికీ ,ఢిల్లీ లో  గడిపిన నాలుగు రోజుల్లో తనపై ప్రత్యెక  దృష్టిని  పెట్టిన వారికి కృతజ్ఞతలు చెప్పారు .వారి మనసులలో ఉన్న సందేహాలన్నిటికీ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి సంశయ విముక్తుల్ని చేశారు రామయ్య .మాతృభూమి తనను ‘’అమృతమయి ‘’గా ‘’అమృతమాయి ‘’గా పుత్ర వాత్సల్యం తో  ఆలింగనం చేసు  కొన్నందుకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకొన్నారు .ఇంతటి అనుభూతి మళ్ళీ మళ్ళీ రాదు అన్నారు .ఏప్రిల్ 26 వ తేదీ ఢిల్లీ లోని పాలం విమానాశ్రయానికి విశేష సంఖ్యలో ముఖ్యులు వచ్చి హైదరాబాద్ వెడుతున్న రామయ్య గారికి ఘనమైన వీడ్కోలు పలికారు .

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –8-5-15 ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.