ఇటలీ మహిళోద్యమ నిర్మాత –మోజోన్ని
1837లో ఇటలీలోని రెస్కాల్దిన్ లో అన్నా మేరియా మోజోన్ని జన్మించింది .ఫెమినిస్ట్ గా గ్ర్టింపు పొందింది స్త్రీ విమోచనోద్యమ సారధిగా తన సత్తా నిరూపించుకోన్నది .ఇటలీలో మహిళా వోటు హక్కు సాధించిన ఘనత మజోన్ని కే చెందుతుంది .
చార్లెస్ ఫోరియర్ స్థాపించిన ‘’ఉటోపియన్ సోషలిజం ‘’పై ఆకర్షణ కలిగి ముందుగా అందులో చేరింది .క్రమంగా ఎదిగి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం చేసింది .స్త్రీలకు అన్నిటా సమాన హక్కులు కావాలని ఉద్యమాలు నిర్వహించింది .పితృ స్వామ్య బంధాలనుండి మహిళా విముక్తురాలై ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తూ తానను తానూ తీర్చి దిద్దుకోవాలనేది మజోన్ని మహత్తర ఆశయం .ఇటాలి సివిల్ కోడ్ లో మార్పులు తేవటానికి ‘’మహిళలు –సాంఘిక బంధాలు ‘’అనే పుస్తకాన్ని 1864 లో రాసి అందులో ఇటలీ కుటుంబ న్యాయం గురించి చర్చించింది .1877లో మహిళలకు ఓటుహక్కు ఇవ్వాలని ఇటలీ పార్లమెంట్ కు మెమొరాండం సమర్పించిన ధీశాలి మోజోన్ని .1878లో పారిస్ లో ’మహిళాహక్కులకోసంజరిగిన అంతర్జాతీయ కాంగ్రెస్ కు ఇటలీదేశం తరఫున ప్రాతి నిధ్యం వహించింది .
ప్రముఖ ఆంగ్ల రచయిత జాన్ స్టువార్ట్ మిల్ రాసిన ‘’ది సబ్జేక్షన్ ఆఫ్ వుమెన్ ‘’ పుస్తకాన్ని ఇటలీ భాషలోకి అనువదించి 1879 లో ప్రచురించింది .1881 లో మేధావులు రాడికల్స్ ,రిపబ్లికన్లు సోషలిస్ట్ లు అందరు కలిసి మహోద్రుతంగా నిర్వహించిన ‘’అందరికి సమాన వోటు హక్కు ‘’ఉద్యమంలో అగ్రభాగాన నిలిచి స్పూర్తినిచ్చింది .అందులో మహిళా వోటు హక్కును కూడా చేర్చి నినదించింది .1881 లో స్త్రీల సాధికారత కోసం ‘’లీగ్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ దిఇంట రెస్ట్ ఆఫ్ వుమెన్ ‘ సంస్థనుమిలన్ లో స్థాపించింది . 83 ఏళ్ళు జీవించి ఆననా మేరియా మోజోన్ని 1920లో చనిపోయింది