ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33

.  ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -33

15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్

అమెరికన్ కవయిత్రి  ఎమిలీ డికిన్సన్ రాసినవి ఎనిమిది వందల కవితలైనా జీవితకాలం లో ప్రచురింపబడిన కవితలు ఏడు మాత్రమే.దీనికి ఆమె చుట్టూ వ్యాపించిన అంతుతెలియని మిస్టరీ యే కారణం  .యదార్ధం కాని అనేక జీవిత చరిత్రలు ఆమె చుట్టూ అల్లేశారు .అందులో ఊహాగానాలే ఎక్కువై అసలు నిజం మరుగున పడి పోయింది .అయినా శతాబ్దాల కాలం ఆమె అజ్ఞాత వ్యక్తిగా జనం వెంట బడి వదలలేదు .బాలికగా ఉండగానే అద్భుత సౌందర్య వతి అని పించుకోంది.అబ్బాయిల గుండెల్లో గాలమై గుచ్చుకొన్నది .మొదటరాసిన కవిత్వం లో శృంగారమే ఎక్కువ .కాని ముఖం లో ఏభావమూ జ్యోతకంయ్యేదికాదు.ఆకర్షణ తక్కువైనా మనిషి కొట్టొచ్చినట్లు కనిపించటం ఆమె ప్రత్యేకత .నల్ల కంచు రంగు కళ్ళు ,తెల్లటి శరీరం తో టైటాన్ లాగా అగుపించేది .ఫోటో తీయటానికి ఒప్పుకోని ఎమిలీ తానె స్వంతంగా తన చిత్రాన్ని మధురజ్ఞాపికగా చిత్రి౦చు కొన్నది .’’’నా ఫోటోలు ఏవీలేవు .నేను’రేన్ అంటే ముక్కు వంకరగా పొట్టి రెక్కలతో గుండ్రని కురచ తోక తో సన్నని కాళ్ళతో కొంచెం మాత్రమె పొడవుగా ఉన్న ‘’జీవ రాయి పిట్ట ‘’(కంప చిట్ట పిట్ట )లాంటి చిన్నదాన్ని .’’అని చెప్పుకొన్నది .ఇలా తన గురించి చెప్పుకొన్న విషయాలు చాలా అరుదుగా మాత్రమే ఉన్నాయి .

ఒంటరి జీవితం

ఎమిలి డికిన్సన్ అమెరికాలో మాసా చూసేట్స్ రాష్ట్రం లో ఆమ్ హీర్స్ట్ లో 1830 లో డిసెంబర్ 10 న జన్మించింది .ఏ ఇంటిలో పుట్టిందో ఆ ఇంటిలోనే జీవించి ఆ ఇంట్లోనే మరణించింది .ఎప్పుడైనా కొద్దికాలం బయటిప్రదేశాలకు వెళ్ళినా ఆమె అక్కడే ఉండేది ఎప్పుడూ .బాల్యం ఆనందంగా గడిచింది .అన్న విలియం ఆస్టిన్ ,చెల్లెలు లవీనియా ఉండేవారు .ఇరవై ఏళ్ళు వచ్చాక ఒంటరి జీవితానికే అలవాటు పది పోయింది .కాలక్షేపంగా యెడ తెగకుండా లెక్కలేనన్ని కవితలు రాసేది . కాని వాటిని ప్రచురించటానికి ఒప్పుకోనేదికాదు .బయటి ప్రపంచం తో సంబంధమే ఉండేదికాదు ఆమెకు .బయటి ప్రజల పై ఏవగింపు కవితలలో కనిపించేది .తానెవ్వరికి చెందని దానినని బయటివారూ అలాంటివారే అయితే వారితో జతకట్టగలనని ఇది బయటికి చెప్పద్దని చెబితే ఇద్దర్నీ వెలి వేస్తారని  రాసుకొన్నది .ఆకవితలు చూద్దాం –

‘’I am no body !Who are you ?-Are you nobody ,too –Then there is a pair of us –don’t tell !-They would banish us ,you know ‘’

‘’How dearly to be somebody !How public ,like a frog –To tell your name the livelong day –To an admiring bog ‘’

కుటుంబ నేపధ్యం

ఎమిలీ తండ్రి కౌంటీలాయర్ ,శాసన సభ్యుడు ,గవర్నర్ కౌన్సిల్ మెంబర్ .పిల్లలు విద్యలో ఉన్నతి సాధించారు .ఎమిలి మాత్రం ఆటగోలు తనం తో ,ఏదీ పట్టని దానిలాగా ఉండేది .దేవుని గూర్చి తండ్రి గురించి చెప్పేది .ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తె తండ్రి ఎడ్వర్డ్ డికిన్సన్ అచ్చంగా బ్రౌనింగ్ కవి భార్య అయిన ఎలిజబెత్ బార్రేట్ తండ్రి మౌల్టన్ బారేట్ లాగా ఉండేవాడని పిస్తుంది .కాని కవయిత్రి ఎలిజబెత్ లా కాకుండా.ఎమిలి బాల్యం నుండి తిరుగుబాటు ధోరణి తో ఉండేది .ఎమిలీ ఆమ్ హీర్స్ట్ అకాడెమీ లోను ,మౌంట్ హోలీ యెక్ ఫిమల్ సేమినరి లోను చదివింది .శ్రద్ధగా చదివినట్లు కనిపించేదికాదు .ఏదీ పట్టనట్లే ప్రవర్తించేది .లెక్కలు ,జామెట్రీ ,కేమిస్త్రి ,ఆస్ట్రానమి లలో బాగా అభి వృద్ధి కనపరచినా ఆమెకు చర్చి కట్టుబాట్ల విషయం లో ఇష్టం ఉండేదికాదు ..ఆటగోలు తనం ,ఉండేదని క్రిస్టియన్ గా ఉండటానికి అభ్యంతరం చెప్పేదికాదని ,ఆత్మ న్యూనతా భావం ఉండేదని ఆమె స్నేహితులు చెప్పేవారు ..ఈ మాటే తండ్రితో ‘’నేను చెడ్డ దాన్నే నాన్నా !’’అని చెప్పి ఒక్క ఏడాదిలోనే హోలీ యోక్ కు గుడ్ బై చెప్పేసింది .

ఇరవైలలో ఏదో జరిగి ఉంటుంది

ఎమిలీకి ముప్ఫై ఏళ్ళు వచ్చాక అన్నిటినీ పూర్తిగా విసర్జిన్చేసింది .కాని ఆమె జీవితం లో ఇరవై ముప్ఫై ఎల్లమధ్య ఏదో సం థింగ్ జరిగి ఉంటుందని చరిత్రకారుల నమ్మకం .అందుకే ప్రపంచానికి దూరంగా బతకటం అలవాటు చేసుకొన్నది అని భావన .కనుక శారీరక మానసిక ఉపశమనం కోసం ఏకైక విధానంగా కవిత్వం రాయటం ప్రారంభించి కడదాకా కొన సాగించింది .ఆమె భద్రంగా రహస్యం గా రాసుకొని దాచుకొన్న డైరీ వలన ఈ విషయాలన్నీ వెలుగు లోకి వచ్చాయి .ఆమె జీవితం లో ఓడిపోయిందని అర్ధమవుతుంది .దాన్ని ఆమె ‘’ప్రపంచానికి లేఖ ‘’అని పేరుపెట్టింది .ఇంకేముంది ఊహలు చేసే వారికి చేతినిండా పని దొరికింది .అనేక పుక్కిటి పురాణాలు ఆమె చుట్టూ అల్లారు .అందులో నిజమెంతో కల్పనా ఎంతో తెలియనంత జటిలమైపోయింది ఆమె యదార్ధ జీవితం .1930లో ‘’the life and mind of Emily Dickinson ‘’ అనే పుస్తకాన్ని జేనేవీవ్ టగ్గార్డ్ అనే రచయిత రాసి ప్రచురించాడు .ఎమిలీ జీవితం లో ఇద్దరు ప్రేమికులు ఉన్నారని వారి వలననే ఆమెలోని  శృంగారాభావం తెగిపోయిందని తెలియ జేశాడు .అందులో ఒకడు లియోనార్డ్ హంఫ్రీ అనే అతను ఆమెకు ఇరవై ఏళ్ళు రాకముందే చనిపోయాడు .రెండవ వాడు జార్జి గౌల్డ్ .ఇతను ఆమె తండ్రికి భయపడి దూరమై ఆమెను ఒంటరిదాన్ని చేసి ఇంటి గార్డెన్ కే పరిమితమయ్యేట్లు చేశాడని .కాని ఎమిలీకి అతను అంటే గుండె నిండా ప్రేమ ఉండేదని ,కాని బహిర్గతం కాకుండా అణచు కొన్నదని రాశాడు .కనుక బయటి ప్రపంచం తో సంబంధం లేకుండా ‘’Nun of Amherst ‘’గా మిగిలిపోయిందని చెప్పాడు .

అదే ఏడాది జోసేఫిన్ పోలేట్ అనే ఆతను ‘ఎమిలీ  దికేంసన్  –ది హ్యూమన్ బాగ్రౌండ్ ‘’పేర ఒక పుస్తకం రాసి మూడో వ్యక్తిని చెప్పి అతని వలననే ఆమె ప్రేమ జీవితం భగ్నమైపోయిన్దన్నాడు. ఆ భావాలే ఆమె కవిత్వం లో చోటు చేసుకొన్నాయని తేల్చాడు .యితడు ఎమిలీ కుటుంబానికి అతి సన్నిహితురాలన హెలెన్ హంట్ భర్త ఎడ్వర్డ్ హంట్ .రెండేళ్ళ తర్వాత ‘’ఎమిలి దికేంసన్ ఫేస్ టు ఫేస్ ‘’పుస్తకం రాసిన మార్తా డికేంసన్ బియాంచి అంటే ఎమిలీ మేనకోడలు ఎమిలి కి పెళ్లి అయిన ఒకబ్బాయితో ఎఫైర్ ఉండేదని అతనిభార్యకు అన్యాయం చేయలేక ఎమిలి కుమిలిపోయి ,ఇంటికీ , ఏకాంతానికి  అంకితమై పోయిందని వివరించింది .1938లో మరొక పుస్తకం ‘’దిస్ వజ్ ఏ పోయేట్ ‘’రాసిన జార్జ్ ఫ్రిస్బీ విచేర్ ఈ గాసిప్ లకు స్వస్తిపలికాడు .సూటిగా విషయ పరంగా పరిశోధన చేసి ఆమె జీవితాన్ని ఆవిష్కరించాడు . ఇందులో ఎమిలి కి ఇరవై –ముప్ఫై ఏళ్ళ మధ్యకాలం లో రెండు పెద్ద నష్టాలు జరిగాయని .మొదట గా ఆమె చేత ‘’డియర్ ఫ్రెండ్ అండ్ టీచర్ ‘’అని పించుకొన్న బెంజమిన్ ఫ్రాన్క్లిన్  న్యూటన్  అనే గొప్ప సారస్వతారాధకుడు ,కాలానికంటే ముందు ఆలోచించే బుద్ధి జీవి .ఆమె ఇతని ప్రభావం లో పడేనాటికి అతని వయసు ఇరవై ఏడు –ఆమెకు పద్దెనిమిది .కాని మూడేళ్ళ తర్వాత న్యూటన్  తనకంటే పన్నెండేళ్ళు పెద్దదైన మరో అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు .దురదృష్ట వశాత్తు న్యూటన్ రెండేళ్ళ తర్వాత క్షయ వచ్చి చనిపోయాడు ఈ విషయాన్ని థామస్ వెంట్ వర్త్ విద్డింగ్గ్ట న్   అనే ఒక విద్వాంసుడికి ఉత్తరం రాస్తూ ఎమిలీ ‘’నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు .అతను నాకు అమరత్వం (ఇమ్మోర్టాలిటి )బోధించాడు .దానికి దగ్గరవుతున్నసమయం లో అతను మళ్ళీ తిరిగి రాలేదు .తర్వాతా నా గురువు మరణించాడని తెలిసింది ,అప్పటినుంచి నాకు అక్షరమే నా మిత్రమైంది .మరొకాయన నాజీవితం లో ప్రవేశించాడు .కాని ఆయనే నన్ను గురువుగా అనుకోని సంతృప్తిపడక ఈ దేశం వదిలి వెళ్ళిపోయాడు . ఈ రెండు నష్టాలు ఆమె కవిత్వాన్ని భర్తీ చేశాయి .తరచుగా ఆమె రాసిన లైన్లు ‘’ I never lost as much but twice ‘’ఈ విషయాన్ని ద్రువీకరిస్తాయి .కాని ఆ రెండుకవితలు బాగా ప్రాచుర్యం పొందాయి .

1-‘’My life closed twice before its close –It yet remains to see –If immortality unveil –A third event tome ‘’

‘’2-‘’So huge so hopeless to conceive –As these that twice befell -.Parting is all we know of heaven –And all we need of hell ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-5-15 –ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.