ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34 15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -34

15- కవిత్వమే ఉపశమనం గా జీవించిన ఎమిలి డికిన్సన్-2 (చివరిభాగం )

మూడో ప్రేమా మొగ్గలోనే వాడిపోయింది

రెండవ సారి జరిగిన సంఘటన తో ఎమిలీ డికిన్సన్ మరీ కుంగిపోయింది .తండ్రితో కలిసి ఫిలడెల్ఫియా వెళ్ళింది. అక్కడ రివరెండ్ చార్లెస్ వాడ్స్ వర్త్ గారి బోధన విన్నది .ఆయన అంటే అభిమానం ,ప్రేమ ఆరాధనాకలిగాయి . ఆయన బోధనలుబాగా నచ్చి  ప్రేమలోపడింది .అప్పటికే అతనికి పెళ్లి అయి నలభై ఏళ్ళ వయసులో ఉన్నాడు .ఆమె వయసు ఇరవై మూడో ఇరవై నాలుగో ఉంటుంది అప్పుడు . అతను ఆర్చ్ స్ట్రీట్ ప్రెస్ బిటేరియన్ చర్చి  కి పాస్టర్ గా ఉన్నాడు .చాలా అంకితభావంతో పనిచేస్తున్నాడు .తాను తన బోధనకు ఆకర్షితురాలైన ఎమిలీ గుండెల్లో ప్రేమ జ్వాల రగిలి౦చి నట్లు ఆయనకు తెలియనే తెలియదు . అం హీర్స్ట్  తిరిగి వచ్చేసింది  కాని ఆ మధుర భావనలు ఆమెను వదిలిపెట్టలేదు .అపస్మారకం గా ఆ పాస్టర్ ఆమె మనసులో ఉండిపోయాడు .ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ఫిలడేల్ఫియాకు వెళ్ళింది .కాని అంగుళం కూడా ప్రేమ రధం ముందుకు సాగలేదు .అతనిమనసు మార్చలేకపోయింది .అతనితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేదని ఆ గ్రామప్రజలు చెప్పుకొనేవారు. ప్రేమ కవాటం మూసుకు పోయింది . చేసేదిలేక ఈ సంఘటనలను నాటకీయంగా కవితలలో చొప్పించింది .కలలో ఆతనితో సాంగత్యం జరిగినట్లు కవితలు రాసింది .ఇంత చేసినా చివరికి ఎమిలీకి నిరాశే మిగిలింది ‘’అంతా భ్రాంతి యేనా జీవితానా నిరాసేనా “‘’అని దేవదాసులో పార్వతి లాగా పాడుకోవటమే మిగిలింది .తన దుఃఖాన్ని విరహాన్ని చాలా హై పిచ్ లో వ్యక్తం చేసుకొన్నది .అది వాస్తవం కాకపోయినా కలల సౌధం లో విహరించి ఆత్మ తృప్తి పడింది .అందుకోసమే అంటే ఆత్మోపశమానం కోసమే కవిత్వం రాసింది ఎమిలీ డికిన్సన్ .తనను తానూ ఆయనకు అంకితమై పోయినట్లు ,దేవుడు అందరికి అన్నీ  ఇచ్చి తనను నిర్లక్షం చేశాడని బాధ భరించలేనిదని కవితలలో వాపోయింది .

ఎమిలీ మాటలలోనే ఆమె దుఖాన్ని బాధను ప్రేమారాదనను తెలుసుకొందాం –‘’I gave my self to him ‘’,’’mine by the right of the white election ‘’,’’God gave a loaf to every bird ,just a crumb to me ‘’,’’the heart asks pleasure first ‘’,’’I can not live with you ‘’,pain has an element of blank ‘’,the element of blank grew wider ‘’, ఎమిలి ‘’the fugitive whom to know was life ‘’అని భావించిన వాడ్స్ వర్త్ ను 20 ఏళ్ళు చూడనే లేక పోయింది .1880 వేసవి లో ఒకసారి అతను వచ్చాడు .ఆ తర్వాత రెండేళ్లకే అతను చనిపోయాడు .అతని చిత్రం అతను బోధించిన సెర్మన్ ల గ్రంధం ఎమిలీ డికిన్సన్ పదిలంగా గుప్తంగా దాచుకొని  భద్ర పరచిన దాచుకొన్న వాటిలో దొరికాయి .

25 ఏళ్ళు   తనకోసమే తాను జీవించిన ఎమిలి

ఇరవై అయిదేళ్ళు ఎమిలి డికిన్సన్ తనకోసమే తాను జీవించింది .సంగీతం అంటే ఆమెకు అభిమానం .కాని ఇతరులతో కలిసిపాడటానికి ఒప్పుకోనేదికాదు .వాళ్ళు అక్కడమ్యూజిక్ రూమ్ లో  సమూహంగా గానం చేస్తుంటే బయట హాల్ లో ఒంటరిగా కూర్చు౦డిపోయేది .ఇంటి ప్రక్కల ఉన్నవారికి చిన్న చిన్న కవితలు పూలు పంపేది కాని వాళ్ళ ఇళ్ళకు ఎన్నడూ  వెళ్లేదికాదు .ప్రేమికుడు వడ్స్ వర్త్ మరణించిన తర్వాత మరీ ఒంటరిదై పోయింది .అతడు మరణించాడని ఆమె అనుకోలేదు తనలో శ్వాసిస్తున్నాడని భావించేది .తమకు ఎడబాటు అనేది లేదనుకోనేది .’’I do not yet fathom that he had died and hope I may not till he assist me in another world ‘’అని రాసుకొన్నది .ఎనిమిది నెలల తర్వాత ఆమెకు నెర్వస్ బ్రేక్ డౌన్ వచ్చింది .చివరి రోజులలలో తండ్రికి స్నేహితుడైన ‘’జడ్జ్ లార్డ్ ‘’తో సన్నిహితం గా ఉండేది .ఆయన కూడా ఎమిలీకంటే ముందే చనిపోయాడు .బ్రైట్స్ డిసీజ్ అనే వ్యాధి 55 వ ఏట సోకింది ఎమిలీకి .15-5-1886 న ఎమిలీ డికిన్సన్ మరణించింది .

మరణానంతర౦  కవితా సేకరణ ముద్రణ

జీవించి ఉండగా ఏ పుస్తకాన్నీ అచ్చు వేయటానికి ఎమిలీ ఒప్పుకోలేదు .ఆమె మరణం తర్వాతే వాటిని ముద్రించటం జరిగింది .ఇది చాల కష్ట సాధ్యమైన పని అయింది .ఆమె రాసిన వెయ్యి కవితలు వేర్వేరు ప్రదేశాలలో లభించాయి .అవి చిందర వందరగా  గజిబిజిగా రసీదుల వెనకా బ్రౌన్ పేపర్ ల మీదా రాయ బడి ఉన్నాయి .ఒకే పాదానికి అనేక రూపాలూ ఉండేవి .ఒకే పదానికి వేర్వేరు మాటలుకూడా రాయబడి అందులో దేన్నీ స్వీకరించాలో తెలియని సందిగ్ధత కూడా ఏర్పడింది .ఎమిలీ చివరి సంవత్సరాలలో సన్నిహితం గా ఉన్న ప్రక్కింటి యజమాని మేబెల్ లూమిస్ టాడ్  తో ఎమిలీ అన్న కూతురు లవినియ డికిన్సన్ కలిసి ఎలాగో అలాగా కొంత పరిష్కరించి మొదటి భాగం గా 115 కవితలతో ‘’Poems of Emily Dickinson ‘’ పేరుతొ 1890 లో ముద్రించింది .అప్పుడే చిన్న డిక్షనరీ ‘’DICKINSONIANA’’ ప్రచురణ జరిగింది . తర్వాతా ఆమె పూర్తీ కవితలన్నీ ముద్రణకు వచ్చాయి .ఎమిలీ రాసిన ఉత్తరాలు అచ్చు అయ్యాయి .ఆమెపై అనేక జీవిత చరిత్రలు వచ్చాయి .1950లో ఎమిలీ మొత్తం కవితలు ఉత్తరాల వ్రాత ప్రతులన్నీకొని  సేకరించి హార్వర్డ్ యూని వర్సిటి కి అందజేశారు .వీటిని పుస్తకాలుగా ప్రచురించినా ,సాహిత్యాభిమానులకు సంత్రుప్తికలుగలేదు .ఇంకా నాణ్యమైన అధీకృత ప్రచురణలు రావాలని డిమాండ్ చేశారు .చివరికి ఈ బాధ్యతను ప్రముఖ విద్యా వేత్త అమెరికా దేశపు మొట్ట మొదటి ముఖ్య కవి ఎడ్వర్డ్ టేలర్ కవితలను ప్రచురించిన  థామస్ హెచ్ జాన్సన్ కు అప్పగించారు .ఆయన జాగ్రత్తగా ఎడిట్ చేసి  ఎమిలీ కవితలను 1939లో ప్రచురించాడు .

ఏది నిజం ఏది కల్పన

ఎమిలీ కవితలలో నిజం ఎంత?కల్పనా ఎంత అని ఇంతవరకు ఎవరూ విడమర్చి చెప్పలేక పోతున్నారు .విలియం స్టాన్లీ ‘’Emily was a spirit that emerged independent of the material event ‘’అన్నాడు .సంఘటనను అనుభవాన్ని జోడించి అత్యద్భుతంగా రాసిన కవిగా మరో విమర్శకుడు చెప్పాడు .ఆమెలో శైలీ భేదాలు చాలాఉన్నాయన్నారు .ఆమె ఒక సృజన శీల కవి అన్నారుకొందరు .న్యు ఇంగ్లాండ్ అంటే మాసా చూసేట్స్ కు చెందిన హైమ్స్ ను కొత్త తరహాలో కొత్త ధ్వనులతో అమెరికన్ కవిత్వం లో ప్రవేశ పెట్టి కొత్త వొరవడి సృష్టించింది .సమకాలీన కవులకు  దిగ్భ్రమ కల్గించి ,అభిమానులకు ప్రేరణకలిగించి రెండు తరాల తర్వాత కవిత్వ పటుత్వం తో మెప్పించింది .సస్పెండేడ్ రైమ్స్ ,స్లాంట్ రైమ్స్ హాఫ్ రైమ్స్ కు ఆద్యురాలైంది .కొత్త కవిత్వ పరిభాషను సృష్టించింది .ఎన్నో భావచిత్రాలను సృష్టించింది .’’No other poet has accomplished  more dazzling comprehensions –emotional tension is tightened in ‘’death’s  ‘’stiff stare ‘’in the word zero to describe the feeling of horror upon encountering a snake ‘’zero at the bone ‘’అని ఆమె ప్రత్యేకతను కీర్తించారు

శోక తప్త వనితగా ను, ఆనందం తో చిందులు వేసే   చిన్నపిల్లగాను  రెండు విధాలా కవిత్వం రాసింది .అప్పుడప్పుడు ఆమె ‘’స్పాయిల్ద్ చైల్డ్ ‘’అన్న భావనా చదివే వారికి కలిగిస్తుంది .చివరగా ఒక మిస్టరి మిగిలిపోయింది అంటారు రచయిత లూయీ అంటర్ మేయర్ ‘’The mystery of Emily Dickinson is not the way she lived, but the way she wrote ,a mystery which enabled a New England recluse(lonely) to charge the literature of her country with poems she never cared to publish ‘’.

Inline image 1  Inline image 2

Inline image 3

A solemn thing – it was – I said –
A Woman – White – to be –
And wear – if God should count me fit –
Her blameless mystery –
Emily Dickinson, c. 1861[83]
They shut me up in Prose –
As when a little Girl
They put me in the Closet –
Because they liked me “still” –

Still! Could themself have peeped –
And seen my Brain – go round –
They might as wise have lodged a Bird
For Treason – in the Pound –

Emily Dickinson, c. 1862[19]

 

A solemn thing – it was – I said –
A Woman – White – to be –
And wear – if God should count me fit –
Her blameless mystery –
Emily Dickinson, c. 1861[83]
They shut me up in Prose –
As when a little Girl
They put me in the Closet –
Because they liked me “still” –

Still! Could themself have peeped –
And seen my Brain – go round –
They might as wise have lodged a Bird
For Treason – in the Pound –

Emily Dickinson, c. 1862[19]

 

ఎమిలీ సంపూర్తి

మరో ప్రసిద్దునితో మళ్ళీ కలుద్దాం

మీ –దుర్గాప్రసాద్ -28-5-15 ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.