—
ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -35
16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -1
అమెరికా సాంప్రదాయ సాహిత్యం (క్లాసిక్ లిటరేచర్ )ఎమర్సన్ ,లాంగ్ ఫెలో ,తోరో , హతారన్ వలన 19 వ శతాబ్దపు మధ్యభాగం లో బాగా స్థిరపడింది .అమెరికా సివిల్ వార్ తర్వాత న్యు ఇంగ్లాండ్ అంటే మాస చూసేట్స్ రాష్ట్ర సంస్కృతిని,పెద్దరికాన్ని చాలెంజ్ చేసే ఇద్దరు మహా రచయితలు వచ్చారు .అందులో న్యు యార్క్ నివాసి పెద్ద గొంతుకతో తిరస్కార గర్జనలు చేసి అసలైన అమెరికా కవిత్వానికి ‘’లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘’తో ఆద్యుడై నిలిచినవాడు’’ వాల్ట్ విట్మన్’’ కవి .రెండవ వాడు మిస్సోరీ రాష్ట్రానికి చెందిన స్థానిక భాషా సంప్రదాయాలకు పట్టం కట్టిన మార్క్ ట్వేన్ అని అందరు పిలిచే’’ సామ్యుల్ లాంగ్ హార్న్ క్లేమేన్స్’’ ఈ ఇద్దరితో అసలైన అమెరికా కవిత్వం ,నవల ,సాహిత్యం లో ప్రవేశించాయి .వారిద్దరూ అమెరికా జాతీయ కవిగా జాతీయ నవలా రచయితగా గుర్తింపుపొంది తరతరాలుగా అమెరికా సాహిత్యాన్ని ప్రభావితం చేస్తున్నారు .అచ్చమైన అమెరికా దేశీయ సాహిత్యం వీరిద్దరి తోనే ప్రారంభమైంది .
బాల్యం – తండ్రి సంచార జీవితం
శామ్యూల్ క్లేమేన్స్ అనే మార్క్ ట్వేన్ వర్జీనియాకు చెందిన – జాన్ మార్షల్ క్లేమేన్స్ ,కెంటకి కి చెందిన జెన్ లాంటన్ క్లేమేన్స్ దంపతుల సంతానం లో ఆరవ వాడు . 30-11-1835 న మిస్సోరీకి సరిహద్దులో ఉన్న ఫ్లారిడా లో జన్మించాడు .ఆనాడు ఆ గ్రామ జనాభా వందమంది మాత్రమె .ట్వేన్ తండ్రి చాలా సూటిగా నిజాయితీగల లాయర్ మాత్రమె కాక వ్యాపారి కూడా .దేనిలో చేయ్యిపెట్టినా ఉప్పు నిప్పు అయ్యేది .అన్నిరకాల వ్యాపారాలలో చేతులు కాల్చుకొన్న ఘటం .ముక్కు సూటి మనిషి ఈ లక్షణాలే మార్క్ ట్వేన్ కూ సంక్రమించాయి .వీరి కుటుంబం బ్రిటిష్, ఐరిష్ రక్తం తో కలిసిపోయింది .వీరి పూర్వీకులు అరిస్టో క్రట్స్ .అని తెలుస్తోంది .స్థిమితంగా స్తిరంగా ఒక చోట ఉండలేదువారు .జీవితం ఎప్పుడూ అభద్రతా భావం తోనే వారికి గడిచింది .క్వేకర్ సంప్రదాయం లో పెరిగిన వంశాలు వారివి .
మార్క్ ట్వేన్ కూ ఈ అస్తిరత తప్పలేదు .ట్వేన్ పుట్టటానికి కొన్ని నెలల ముందే తండ్రి వీరి కుటుంబాన్ని టేన్నేసే నుండి ఫ్లారిడాకు మార్చాడు .లాగ్ కేబిన్ లలో క్లాప్ బోర్డ్ ఇళ్ళల్లో ఉన్నాడు .తండ్రి ఆదాయం ఏమంత పెద్దగా ఉండేదికాదు .అందుకని మళ్ళీ కుటుంబాన్ని మిస్సోరి లోని ‘’హానిబాల్’’ కు క్లేమేన్స్ నాలుగో ఏట మార్చాడు .ఇక్కడే మార్క్ 18 ఏళ్ళు వచ్చేదాకా ఉన్నజ్ఞాపకం .కాని జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలనుకొన్నాడు .
కళ్ళముందు చరిత్రనే నవలగా మార్చిన ఘనుడు
హానిబాల్ జనాభా 500..ఇదే తాను పుట్టిన ఊరుగా ఆయన భావించేవాడు .ఆ గ్రామ పద్ధతులను ,వాతావరణాన్ని ,ప్రజలని మనసులో బలంగా నిలుపుకొన్నాడు .ఆ విషయాలలో ఏ రకమైన మార్పులూ రాలేదని ఆయన రాసిన నవలలో మనకు కనిపిస్తుంది .’’టాం బ్లా౦ కెన్ షిప్ ‘’అనే తిరుగుబోతు కుర్రాడు ఎప్పుడూ నదిలో కాలక్షేపం చేసేవాడు ,ఆ ఊరి పెద్ద తాగుబోతు కొడుకు అమెరికా దేశపు నవలా చరిత్రలో ‘’హకిల్ బెర్రిఫిన్ ‘’ గా మార్క్ ట్వేన్ చేత అవతారం దాల్చాడు .ఆకుర్రాడు నాగరిక లక్షణాలు తనకు వద్దనే తత్త్వం వాడు .అలాగే శామ్యూల్ తల్ల్ల్లి ఆ నవలలో ‘’ఆంట్ పోలీ’’ అయింది .తమ్ముడు హెన్రి ఆదర్శవంతామైన సిడ్అయ్యాడు .ఎంతోకాలంగా బానిస బతుకు హీనంగా బతుకుతూ బానిస క్వార్టర్ లలో ఉంటున్న నీగ్రో –ఈ నవలలో ‘’జిం ‘’అయ్యాడు . సగం మొరటుతనం సగం నాగరికత ఉన్న వితంతువు హక్ అనుచరి ‘’మిసెస్ హాలిడే ‘’కాస్తా నవలలో’’విడో డగ్లాస్ ‘’అయి కూర్చుంది .ట్వేన్ తో ఆడి పాడి తిరిగిన స్నేహిత బృందం కూడా డ్యూక్ ,డాఫిన్ వగైరా వేర్వేరు పాత్రలద్వారా నవలలో స్థానం సంపాదించుకొన్నారు .వేసవికాలాలు గడిపిన ఫారం హౌస్ ఆయన అ రాసిన అనేక నవలలో సజీవమై శాశ్వతంగా నిలిచిపోయింది .ఇవన్నీ నవలా పుటలలో చేరిపోయాయి .దీనికి కారణం అది అంత పెద్ద విశాలమైన ఫారం హౌస్ కాకపోవటమే అన్నాడు మార్క్ ట్వేన్ .ఇదీ ట్వేన్ మార్క్ నవల .అదే అమెఇకా అసలైన సాహిత్యమై చరితార్ధమయింది. కాదు అలా చేశాడు మార్క్ ట్వేన్ .నేటివిటికి పట్టం కట్టాడు .ఎక్కడో ఇంగ్లాండ్ లోనో ఫ్రాన్స్ లోనో లేక ఏ ఇతర వలసవాదుల కధలనుకాక తాను పుట్టి పెరిగిన తన తోటి జీవించిన వ్యక్తుల ,పరిసరాలను సాహిత్యం లోకి ఎక్కించి ఇదీ అసలైన అమెరికా జనజీవితం అని చూపించిన ఘనత సాధించాడు మార్క్ ట్వేన్ .
తండ్రి మరణం –కుటుంబ బాధ్యత
ట్వేన్ కు 12 ఏళ్ళు రాగానే తండ్రి చనిపోయాడు .అప్పటికి కుటుంబ ఆర్ధిక పరిస్థితి పరమ దయనీయం గా ఉంది .చేతిలో చిల్లిగవ్వ నిలవ చేయకుండా తండ్రి చనిపోయాడు .అప్పటికి ఎలిమెంటరి స్కూల్ లో మాత్రమె చదివిన ట్వేన్ అర్ధాంతరంగా చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది .చేసేది లేక పెద్దన్న ఓరియన్ దగ్గర ‘’ప్రింటర్స్ డెవిల్ ‘’గా అప్రెంటిస్ చేశాడు అంటే .అచ్చు అక్షరాలూ కూర్చటం ,అచ్చు అయినదానిలో తప్పులు సరిచేయటం అంటే ప్రూఫ్ రీడింగ్ ,చేస్తూ ఉండే వాడన్నమాట . అందుబాటులో ఉన్న ప్రతిపుస్తకాన్ని చదివేవాడు .ఇరవైవ ఏడు వచ్చేసరికి ఇంగ్లీష్ క్లాసిక్ సాహిత్యమంతా చదివేశాడు . నైపుణ్యం గల .ప్రింటర్ గా యాత్రీకుడిగా మంచిపేరు పొందాడు .తూర్పు వైపున్న న్యు యార్క్, ఫిలడెల్ఫియా వగైరా ప్రాంతాలన్నీ తిరిగి చూశాడు .మళ్ళీ అన్న ఓరియన్ పనిలో చేరాడు .అప్పుడు అన్న అయోవాలో ‘’కియోకుక్ ‘’లో ఒక పత్రికను నడుపుతున్నాడు. జర్నలిజం అంటే ఇష్టమే ఉన్నా పెద్దగా ఆసక్తి లేదు అన్నదమ్ములిద్దరికి .కాని అదే వారిద్దరినీ విద్యా వంతులకంటే ఎక్కవ చదువు వచ్చేట్లు చేసింది అనటం లో అతిశయోక్తి లేదు .తనగురించి రాసుకొంటూ ‘’నేను న్యూస్ పేపర్ రిపోర్టర్ గా నాలుగేళ్ళు నగరాలలో పని చేశాను .అప్పుడు ప్రతి విషయం లోను ఉన్న లోపలి విషయాలను క్షుణ్ణంగా పరిశేలి౦చ గలిగానూ .శాసనసభకు రిపోర్టర్ గా రెండు సమావేశాలకు పని చేశాను .అప్పుడు నేను ‘’చిన్న బుర్రల పెద్ద మనుషుల్ని’’ ముగ్గుర్ని చూశాను .వారిలో ఉన్న అతి స్వార్ధ బుద్ధి ,పిరికితనం జీర్ణించుకుపోయిన మనసులు ,తో ఉన్న ‘’దేవుడు చేసిన మనుషుల’’ను చూశాను .’’అని యాభై ఏళ్ళ వయసులో మార్క్ ట్వేన్ ఒక కరే స్పాం డెంట్ కురాసిన ఉత్తరం లో పేర్కొన్నాడు .ఇలాంటి వారి దుష్ప్రవర్తన ప్రభావం వలనకాని లేక ఏదో సాహసం చేయాలన్న తల౦పు తోకాని దక్షిణ అమెరికా వెళ్లి సంపద సాధించాలనన్నకొ రికతోగాని ఉండేవాడు .కానీ ఇవన్నీ ఊహా ప్రపంచపు గాలి సౌదాలేనని తెలుసుకొని వాటి జోలికి పోకుండా ఒక మిసిసిపి పైలట్ దగ్గర అప్రేన్ టిస్ గా చేరాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-5-15 ఉయ్యూరు