తాపోపశమనం

తాపోపశమనం

రోహిణి ముందే రాళ్ళను పగలకొట్టి ,మంట ఎత్తించి రికార్డ్ సృష్టించిన ఎండలు రోహిణి రాకతో తోక ముడిచి చల్లబడి కొంత రిలీఫ్ ఇచ్చాయి  .ఆ ఎండల్లో అడ్రస్ కు కూడా చిక్కని మా బామ్మర్ది బ్రహ్మి  కాస్త చల్లబడ్డాక ఓకే సాయంత్రం మా ఇంటి గృహ ప్రవేశం చేశాడు రోప్పుకొంటు రోజుకొంటూ .’’ఎమయ్యావురా ?కనీసం ఫోన్ కూడా లేదు ?’’అన్నా పలకరింపుగా .’’నీకేం బావా నీడపట్టున కూర్చుని ఎన్నైనా కబుర్లు చెబుతావు .ఎండలో మాడే మా సంగతి నీకేం పట్టింది .బై ది బై ఎలా ఉన్నారు బావా ?అన్నాడు .’’ఏదోరా నీదయవల్ల ఇలా ఏడ్చాం .మీఅక్క నన్ను గది గుమ్మం దాటద్దని ని పక్కాగా ఆర్డర్ జారీ చేసి కర్ర పుచ్చుకొని గుమ్మం దగ్గర కావలి ఉంటోంది .ఇంకెక్కడికీ కదిలే పనే లేకుండా చేసిందిగదిలోనే మగ్గి పోతున్నా . ‘’అన్నా .’’అయినా  ఎండలు తగ్గాక నీకు ఈ రోప్పేమిట్రా?’’అడిగా .ఒకటో ఆరో డిగ్రీలు తగ్గినంతమాత్రాన ఎనడలు వెనక్కి పోయాయా ?’’వాడి ప్రశ్న .’’సరే పిల్లా జెల్లా ఎల్లా ఉన్నారు ?’’నా ప్రశ్న .’’బానే ఉన్నారు బా ‘’వాడి సమాధానం  ‘’ఇంతకీ నురుగులు కక్కుకుంటూ వచ్చావ్ ఏమిటి విశేషం ?’’అడిగా .’’నాకు సందేహాలోస్తే తీర్చినా నువ్వే కసిరి కొట్టినా నువ్వే తిట్టినా నువ్వేకదా బా !’’అన్నాడు బ్రాహ్మి .’’ఏమిటి నీ దేహానికోచ్చిన  సందేహం ‘’?ప్రశ్నించా .’’వస్తానుండు బావా ‘’అని వంటింట్లోకి పరిగెత్తి వాళ్ళక్కయ్య ఇచ్చిన చల్లని చెంబేడు ‘’తక్రం ‘’(మజ్జిగ )తాగి మూతి తుడుచుకొంటూ కుర్చీలో చేరగిలపడ్డాడు  . ‘’బావా ! నిన్నా మొన్నా పేపర్లలో తాపోప శమనం ‘’అంటూ తెగ రాస్తున్నారు .అర్ధమేమిటి ?’’అడిగాడు .’’వారి బడుద్దాయ్ ! వేడెక్కిన శరీరానికి కాస్త ఊరట కల్గించటం చల్లబరచటం అన్నమాట ‘’అన్నాను .’’బావా ! నువ్వు అనే ప్రతిమాట వెనకా ఒక ఫ్లాష్ బాక్ ఉంటుందని నా గట్టి నమ్మకం .ఇందులో కూడా ఏదైనా తిరకాసు ఉంటె విప్పు ‘’బ్రాహ్మి బతిమాలుడు .’’నువ్వు మొత్తం మీద కాలికేస్తే వేలికి ,వేలికేస్తే కాలికి లంకె పెడతావ్ .భలే వాడివే .సరే విను ‘’అన్నా .

‘’నిన్నా ఇవాళ పేపర్లలో’’ బొత్స ‘’జగన్ లో దూరుతున్నాడనే వార్తలు వస్తున్నాయి కదురా .అదొక ఉదాహరణ తాపోశామనానికి .రాహుల్ ఈ ‘’మే ఎండలా రెచ్చిపోయి’’ రోడ్లమీదికొచ్చి నడిచి ,పరుగులు పెట్టి యాత్రలు చేసి నాయకుల్ని ,జెండా మోసేవారిని పరిగెత్తించి చెమటలు పట్టిస్తుంటే ,కక్కాలేక మిన్గాలేక ,ఇక్కడ రాష్ట్రం లో ఏ మాత్రం లాభం లేదని తెలుసుకొన్న బొత్స జగన్ దగ్గరకు వెడితే ‘’కావలించుకొని తాపోపశమ నం కలిగిస్తాడని ఆశ కలిగింది .’’దానం ‘’వచ్చి  గడ్డం కింద చెయ్యి పెట్టి బతిమాలినా ‘’గులాం నబీ’’ వచ్చి గులాబి సెంటు చల్లినా’’ జైపాల్ ‘’ వచ్చి ఆపాలని ప్రయత్నించినా పచ్చ జెండా ఊపి ‘’ఫాన్ ‘’గాలికోసం ఆరాటపడి కాన్గీకి హాండ్ ఇచ్చేస్తున్నాడు .బహుశా జగన్ ఉత్తరాంధ్ర పరగణా అంతా రాసిస్తాడని ఆశ ఏమో ?’’అన్నాను .’’బావోయ్ ! మర్రిగింజ లాంటి ప్రశ్న నేనడిగితే మర్రి చెట్టే మోలిపించేశావ్ అందులోంచి .నువ్వు గ్రేట్ బా ‘’అన్నాడు మురుస్తూ .

‘’మరి జయమ్మ మాటో?’’ అడిగాడు సందేహాస్పదంగా –‘’నిస్సందేహం గ అదీ తాపోపశామనమే .కోర్టు నిర్దోషి అని తీర్పిచ్చి ఆమె పై ఉన్న వేడి వాడి అవినీతి విమర్శలకు నీళ్ళు జల్లి తాపోపశమానం కలిగించింది .జైల్లోనే ఉండిపోతుందేమో నని సంబరాలు చేసుకొందామనుకొన్న నల్లకల్లద్దాలాయన వేడి వేడి ఆశలపై తీర్పు నీళ్ళు జల్లినది .మళ్ళీ పట్టాభిషేకం జరిగి పన్నీరు సెల్వం స్వాగతిస్తూ పన్నీరు చల్లి శాంతింప జేశాడు .ఇక ప్రజల్లో కాక రగిల్చి ఓట్లు రాల్చు కొనే ఏర్పాట్లు చేసుకొంటోంది ,కరుణ కంట్లో కారం కొట్టి మండిస్తోంది  ఇప్పుడు ఆయనకు కావాల్సోస్తోంది తాపోపశమనం .’’అన్నాను .’’బావా ! నువ్వు భలే ముదురు .ఎక్కడో మొదలెట్టి ఎక్కడికో తేలుస్తావు ‘’అన్నాడు .

‘’మోత్కు పల్లి నరసింహం సంగతో ?’’బామ్మర్ది ప్రశ్న సంధానం .’’మాడ్చే ఎండల్లో మహా నాడు జరిపి నూజివీడు రసాలంత తీపిని పంచి అందరిని మెప్పించి ,అన్నగారికి భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేయించి తెలుగు దేశం పార్టీని జాతీయ పార్టీ గా తీర్చి దిద్దుతున్న చంద్రబాబు కు గొప్ప అభిమాని ,కార్య కర్త ,వక్త మోత్కు పల్లి నరసింహులు .తెలంగాణలో కే సి ఆర్ కు సింహ స్వప్నం .అసెంబ్లీ లో ఉన్నా బయట ఉన్నా అతనిమ మాటకు చేతకు విలువ ఉంది .అలాంటిప్రజా నాయకుడు ప్రజా జీవితం లో పగలనక రాత్రనక పార్టీకి సేవలన్దిస్తుంటే ,ఆ  వేడికి ఉపశమనం కల్గిస్తే బాగుంటుందని బాబు భావించి గవర్నర్ పదవి ఇప్పించాలనుకోవటం తప్పేమీకాదు .చేసిన సేవలకు కాస్త ఉపశమనం గా గవర్నర్ గిరీ అయితే హుందాగా గౌరవ ప్రదంగా ఉండి ,చల్లగా ఉంచ వచ్చుకదా అన్న ఆలోచన ఇది .కార్య రూపం త్వరలో దాల్చాలని కోరుకొందాం .అతని తాహతుకు సరి అయిన  యైన పదవి .దానికి హుందా గౌరవం తెచ్చే లక్షణాలు అతనిలో ఉన్నాయి .రోశయ్యగారు హాయిగా కడుపులో చల్లకదలకుండా గవర్నర్ గిరీ చేలా ఇస్తూ అజాత శత్రువుగా ఉన్నారు .అలానే నరసిమ్హులుకూడా అయ్యే అవకాశాలున్నాయి .’’అన్నాను .’’బావా ! ఎంత ఆశావాదివి బావా ?బాగు బాగు  భలే బావ మా భలే బావ ‘’అని కాస్త ఎక్కువగా ధూపం వేశాడు .’’ఇక చాలించు ‘’అన్నాను .

‘’మరి బాబు గారికి ?’’అడిగాడు నసుగుతూ .’’ఒరే బ్రాహ్మీ !ఏడాదికాలం లో తిరిగిన చోట తిరగ కుండా తిన్న చోట తిరగకుండా బాబు తెగ కస్టపడి కొత్త రాష్ట్రానికి ఒక గొప్ప ఇమేజ్ తెచ్చాడు .ఆయనకు తాపమే కాని ఉపశమనం ఉండడుబాబూ ! అమరావతి కట్టే దాకా ఆయన నిద్ర పోడు పోనివ్వడు .కనుక ఆయనకు తాపోప శమనం ప్రశ్నే లేదు .తాపం పెంచేవాడేకాని ఉపశమనాన్ని ఇచ్చేవాడుకాడు, పొందేవాడూ కాదు ‘’అన్నాను  .’’బావా ! నా బ్రెయిన్ వాష్ చేసి భలే ఫ్రెష్ గా చేశావ్ బావా .ఇక వస్తా .వెళ్ళొస్తా ‘’అని అదే పోత పోయాడు బ్రాహ్మి బామ్మర్ది

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-5-15 –ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

1 Response to తాపోపశమనం

  1. krishna అంటున్నారు:

    సమ”కాలిన ” రాజకీయాలమీద మీ వ్యంగ్యాశ్రం చాలా బాగుంది…..అది సంధించి మీరు మాకు “తపోప శమనం” కలిగించారు…ధన్యవాదాలు…..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.