ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -38
16- అమెరికా ఆధునిక నవలా సాహిత్యానికి ఆద్యుడు -మార్క్ ట్వేన్ -4(చివరిభాగం )
మానవత్వ ద్వేషి –మానవ హితైషి
ఈ రకమైన కుటుంబ విషాదాలు మార్క్ ట్వేన్ జీవితం లో మార్పులు తెచ్చాయి .మనుష్య ద్వేషిగా సర్వ ప్రపంచ ద్వేషి గా ఉన్న ఆయన సమతుల్యత లో పడ్డాడు .జీవిత చరమాకం లోని 15ఏళ్ళు ,పూర్వ జీవితం లో ఎంత రాశాడో అంతే కాక ఎక్కువ కూడా రాశాడు అదీ ట్వేన్ గొప్పతనం .అయితే ఇవి సగం సగం రాతలుగా మిగిలాయి .వీటిలో మానవ ప్రవ్రుత్తి ,విధి, ,గౌరవ౦ ,నీతి ఎక్కువ .అన్ని రకాల ఫీలింగ్ లకు స్థానం కల్పించాడు అమెరికా దేశపు రిపబ్లిక్ పాలన మిగిలిన దేశాల పూర్వపు రిపబ్లిక్ లలాగే అంత రించి పోతుంది అనుకొన్నాడు .దీనికి కారణాలు అవినీతి ,పిరికితనం మానవ స్వభావం గా భావించాడు .’’వాట్ ఈజ్ మాన్ ‘’అని ఒక పుస్తకం రాశాడు .శతాబ్దం మారిన తోలి రోజుల్లో రాసిన ఈ పుస్తకం 1906లో ముద్రణ పొందింది .కార్య కారణాల చర్చ చేశాడు ఇందులో .’’He castigated humanity but he loved people ,especially the people of his time and place ‘’.’’ప్రిన్స్ అండ్ పాపర్ (రాజు –పేద )నవలలో ను’’ జోన్ ఆఫ్ ఆర్క్ ‘’లో ఫ్రెంచ్ చరిత్రను చేర్చాడు .ఈ రెండు తన అద్భుత నవలలు అన్నాడు మార్క్ ట్వేన్ .కాని ఫలితాలు ఆశావహం గా రాలేదు .అమెరికాలో ఉన్నంత హాయి, గుర్తింపు ఇతర దేశాలలో పొందలేక పోయాడు .
స్వచ్చతకు మారుపేరు తెల్లని వస్త్ర ధారణ
అరవైలలో నల్లని చిక్కని జూట్టు పల్చబడి తెల్లబడింది .మొదటి నుండి అలవాటైన తెల్లని వస్త్రాలే ధరించేవాడు కళ్ళల్లో చురుకుదనం తగ్గ లేదు మీసం ఆయన వ్యక్తిత్వానికి చిహ్నం గా మారింది .బతికి ఉన్న ఒకే ఒక కూతురు క్లారా పియానిస్ట్ ఆసిప్ గాబ్రిలోవిచ్ ను పెళ్లి చేసుకొన్నప్పుడు మాత్రం తెల్ల వస్త్రాల బదులు ఆక్స్ ఫర్ యూని వర్సిటి డాక్టర్ ఆఫ్ లిట రేచర్ ప్రదానం చేసినప్పుడు ధరించిన స్కార్లెట్ రంగు బట్టలు కట్టుకొన్నాడు . కనెక్టి కట్ లోరెడ్డింగ్ వద్ద తనకు కావలసిన రీతిలో చక్కని ఇల్లు కట్టుకొన్నాడు .కాని ఇక్కడ ఎక్కువ కాలం ఉండకుండా నే చనిపోయాడు .తన జీవితం హెయిలీ తోక చుక్కతో ముడి పడి ఉంది అని భావించేవాడు .అది కనిపించినప్పుడు జన్మించి మళ్ళీ 75 ఏళ్ళకు కనిపించిన తర్వాతా 21-4-1910 న మరణించాడు .
అమెరికా కొత్త సాహిత్య ప్రపంచ సృజన
అమెరికన్ సాహిత్య సరిహద్దు అన్వేషకుడు మార్క్ ట్వేన్ .విషయ౦ లో, శైలిలో అద్వితీయుడే .కొత్త సాహిత్య ప్రపంచాన్నే సృష్టించాడు.తాను చూసింది తెలుసుకొన్నది అంతా తన రచనలలో నిక్షిప్తం చేశాడు ప్రజల జీవన విధానం, భాష ,ప్రవర్తన అలవాట్లు, భయాలు ,విశ్వాసాలు ,కోరికలు,అంతరంగాలు అన్నీ అందులో పొదిగాడు .ఆ ప్రజల ప్రతినిధిగా రాశాడు .అమెరికా రాష్ట్రాల ప్రజల మనోభావాలకే ఆయన రచనలు ప్రతినిదులైనాయి .నేటివిటి ప్రతి రచనలో ప్రతి ఫలించింది .ఇదే ఇతరులకు మార్గ దర్శకమైంది ‘’all modern American literature comes out of one book by Mark Twain called ‘’Huckleberry Finn .All American writing comes from that . There is nothing before .There has been nothing as good since ‘’. అని మరో అమెరికన్ ప్రసిద్ధ నవలా రచయితా నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎర్నెస్ట్ హెమింగ్ వే చెప్పాడు ఇది అక్షర సత్యం .
భాష మీద అనితర సాధ్యమైన పట్టు సాధించి దానిలోనూ మార్గ దర్శి అయ్యాడు మార్క్ ట్వేన్ .తన మార్క్ ను సృష్టించు కొన్నాడు .మాట్లాడే భాషకు రాసే భాషకు ఉన్న అనేక అంతరాలకు స్వస్తి పలికి మాట్లాడే భాషనే రాసేభాషగా తీర్చి దిద్ది కొత్త సాహిత్యభాషకు ఒరవడి పెట్టాడు .అంతకు ముందు ఏ రచయిత ఈ సాహసం చేసి ఉండలేదు .అదీ అతని క్రెడిట్ .నూతన సాహిత్య పరిభాష హాస్యం లో కొత్తపద సృష్టి వ్యంగ్యం లో వినూతనత్వం ఆయన తెచ్చినవే .చాల సులభం గా అతి సహజం గా భాషను వాడాడు .భాషలో జీవం నింపాడు .ప్రజలలోవ్యాపించి ఉన్న పదాలకు సాహితీ గౌరవం కలిగించాడు .ఈ పదాలు మనవే మనం మర్చిపోయాం అని గుర్తు చేశాడు .మన భాష ఇంత మహాత్తరమైనదా అని ఆశ్చర్య పోయేట్లు రాశాడు .అతని రచనలో వ్యంగ్యపు చురుకు పాలు అవహేళన చెన్నాకోలు దెబ్బలు ఉంటాయి .చురుక్కుమన్నా మహా సంతోషం గా ఉంటుంది .ఆయన పదాలు పదబంధాలు గొప్ప ఉదాహరణలుగా సాహిత్యం లో నిలిచిపోయాయి .ఆయన ఏది రాసినా ,ఏది చెప్పినా ఒక సాహిత్య క్రీడగానే భావించారు .అమెరికా జాతి మానవ మనసులను ,మనుష్యులను ఇంత గొప్పగా ఆవిష్కరించిన రచయిత అంతకు ము౦దు ఎవ్వరూ లేరు .ఆయనకున్న ఆలోచనా ఎవరికీ రాలేదు .అందుకే చరితార్ధుడు చిరస్మరణీయుడు అయ్యాడు మార్క్ ట్వేన్ .ఆయన సృజనకు జోహార్లు .
మార్క్ ట్వేన్ చేసిన చమత్కారాలు చూపిన చెమక్కులు ఎన్ని చెప్పినా తనివి తీరదు .కొన్ని ఆయన మాటల్లో చదివితేనే అందులోని సొగసు చూడగలం .అవి ఆ నాటి నుండి సాహిత్యం లో గొప్ప ఉదాహరణలుగా కోటబుల్ కోట్స్ గా చలామణి లో ఉన్నాయి –
1-To be good is noble ,but to show others how to be good is nobler and no trouble .
2-Good breeding consists in concealing how much we think of ourselves and how little we think of the other person .
3-Of all God’;s creatures there is only one that can not be made the slave of the lash .That one is the cat .If man could be crossed with the cat it would improve man but it would deteriorate the cat .
4-If you pick up a starving dog and make him prosperous ,he will not bite you >this is the principal difference between a dog and a man .
5-man is the only animal that blushes . or needs to
6- prosperity is the best protector of principle
7- In the first place God made idiots .This is for practice .
8-When in doubt tell the truth .
మార్క్ ట్వేన్ ప్రభావం
మార్క్ ట్వేన్ జీవించిన కాలం లో ఆయన ప్రభావం ఎంత ఉండేదో చెప్పటం కష్టం .ఈ నాడు మాత్రం ‘’ది అడ్వెంచర్స్ ఆఫ్ టాం సాయర్ ‘’మాత్రం బాల సాహిత్యం లో మహోత్క్రుస్ట మైనదిగా గుర్తింపు పొందింది .కాని దానినే 1877 లో రివ్యు చేసి ‘’అనవసర చెత్త ‘’అన్నారు .యాభై ఏళ్ళ వయసులో ట్వేన్ రాసిన హకల్ బెరిఫిన్ నవల పెద్దగా సంచలనం సృష్టించలేదు .ఇది టాం సాయర్ వచ్చిన తొమ్మిదేళ్ళకు వచ్చింది .దీన్ని టాం కు సీక్వెల్ అనుకొన్నారు .సాంకేతిక దృష్ట్యా హకల్ బెరిఫిన్ భాషా శాస్త్ర పరంగా గొప్ప విజయమే సాధించింది .మాండలికం అమెరికన్ సాహిత్యం లో మొదటి సారిగా ప్రవేశించింది ఈ నవల ద్వారానే .అదొక ఘన విజయం .ఇందులో ఏడు రకాల మా౦డలీకాలున్నాయని పరిశోధనలో తెలిసింది .ఒక్కవాక్యం లో దీన్ని ‘’half comic ,half perilous saga ,a boy’s odyssey which has become a national myth ‘’అన్నారు .
మార్క్ ట్వేన్ కు కౌమార దశ అంటే అమితమైన అభిమానం .అది అప్పుడే జరిపోయిందే అనే బాధ కూడా ఉండేది .అదొక స్వర్గ సీమ అనుకొనేవాడు .ఆయన తాను వివాహ ద్వేషి (misogynist ) స్త్రీ ద్వేషి అని ధైర్యం గా చెప్పుకోలేని పిరికి వాడు అన్నారు విమర్శకులు .కాని మగవారి గురించి ఎంత రాశాడో ఆడవారి గూర్చికూడా అలానే రాశాడు .అయితే చీము నెత్తురు రక్తం మాంసం ఉన్న వ్యక్తిత్వం గల మహిళలు ఆయన రచనలో కనిపించరు అనే అభియోగం ఉంది .కాని మార్క్ ట్వేన్ తన భార్య దృష్టిలో ఎప్పుడూ ‘’యూత్ ‘’యే.
మార్క్ ట్వేన్ సాహిత్య పదాలలో ‘’soil and soul ‘’ప్రతి చోటా దర్శనమిస్తాయి .లూయీ అంటర్ మేయర్ మార్క్ ట్వేన్ ను ‘’paradox is the very key to the conflicts which while they made Mark Twain creatively mature ,kept him from growing up emotionally .A self confessed ,self divided spirit ,holding all the contra dictions together ,there remains the rude but loving skeptic ,the free and un flinching chronicler who was also the innocently swaggering ,endlessly resourceful ,,and eternally impressive boy ‘’ను అభి వర్ణించాడు .
శాస్త్ర సాంకేతిక జ్ఞానం
శాస్త్రీయ పరిశోధన అంటే మార్క్ ట్వేన్ కు అమితాసక్తి .స్నేహితుడు నికోలా టెస్లా తోకలిసి టెస్లా కున్న లేబరేటరిలో పరిశోధనలు జరుపుతూ గంటలకొద్దీ కాలం గడిపేవారు .మూడు పరిశోధనలకు పేటెంట్ హక్కు పొందాడు .ఆయన రాసిన ‘’కనెక్టికట్ యాంకీ ఇన్ కింగ్ ఆర్ధర్స్ కోర్ట్ ‘’నవలలో ‘’టైం ట్రావెల్ ‘’విషయాన్ని ప్రస్తావించాడు .ఇది అప్పటి సమకాలీన ఆవిష్కరణ .ఆర్ధర్ గారి ఇంగ్లాండ్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టాడు .ఇదే తర్వాతా సైన్స్ ఫిక్షన్ లో ‘’ఆల్టర్ నేట్ హిస్టరీ ‘’గా గుర్తింపు పొందింది .1909లో ప్రముఖ శాస్త్రీయ పరిశోధకుడు ఎడిసన్ మార్క్ ట్వేన్ నివసిస్తున్న కనెక్టికట్ లోని రెడ్డింగ్ కు వచ్చి అతని పరిశోధనపై రెండు రీళ్ల షార్ట్ ఫిలిం షూట్ చేశాడు .అదొక్కటే ట్వేన్ జీవితం పై చిత్రించబడిన ఒకే ఒక్క ఫిలిం .
లేబరేటరిలో మార్క్ ట్వేన్ -1894
మని కలెక్టింగ్ స్పీకర్
సునిసిత మైన హాస్యాన్ని వ్యంగ్యాన్ని జోడించి స్పాంటేనియస్ గా మాట్లాడటం మార్క్ ట్వేన్ గొప్పతనం .ఇదే తర్వాత కాలం లో ‘’ స్టాన్డప్ కామెడి ‘’గా గుర్తింపు పొందింది .ఎన్నో క్లబ్బులలో ‘’ పెయిడప్ టాక్స్ ‘’ఇచ్చాడు .లండన్ సావేజ్ క్లబ్ లో కూడా మాట్లాడి గౌరవ సభ్యునిగా ఎన్నికయ్యాడు .ఇంతటి అరుదైన గౌరవం పొందినవారు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ తో సహా ముగ్గురే ముగ్గురు .వియన్నా వెళ్లి అక్కడిక్లబ్ లో ‘’జర్మనీ భాషలో దారుణాలు ‘’(హారర్స్ ఆఫ్ జెర్మని లాంగ్వేజ్ ) అనే విషయం పై మాట్లాడి అందరిని మెప్పించాడు .ప్రిన్స్ టన్ యూని వర్సిటి లో ఉపన్య సించి దాని గౌరవ సభ్యుడయ్యాడు .
బాలికల క్లబ్
ఆడ పిల్లలను కోల్పోయిన మార్క్ ట్వేన్ 1906 లో ‘’’’ఏంజెల్ ఫిష్ అండ్ ఆక్వేరియం క్లబ్ ‘’స్థాపించి బాలికలను ఆహ్వానించి తన దియేటర్ లో నాటికలు ఆడామని సంగీతకచేరీలు చేయమనేవాడు .’’నా జీవిత ముఖ్య ఆనందం ఈ క్లబ్ ‘’అని రాశాడు .1908లో .ఏంజిల్ ఫిష్ బాలికలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు .
ఘన నివాళి
మార్క్ ట్వేన్ మరణానికి సంతాపం ప్రకటిస్తూ ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ విలియం హోవార్డ్ టాఫ్ట్’’మార్క్ ట్వేన్ బౌద్ధిక విజ్ఞానాన్ని హాస్య వ్యంగ్య ఆనందాన్ని లక్షలాది ప్రజలకు అంద జేశాడు ఇంకా ఎందరినో ప్రభావితం చేశాడు. ఆయనది అమెరికా హాస్యం .ఆయన రచనలను ఇంగ్లాండ్ దేశం తో సహా అనేక దేశాలు చదివి అభినందించాయి. అమెరికా సాహిత్యానికి అరుదైన గుర్తింపు మార్క్ ట్వేన్ వలన లభించిందన్నది పరమ సత్యం ‘’అని ఘన నివాలులర్పించాడు .
అందరివాడు
ఇ౦పీరియలిజానికి మార్క్ ట్వేన్ వ్యతిరేకి .స్పష్టంగా దీన్ని తెలియ జేశాడు .జాతి వివక్షత ను కాదన్నాడు .మహిళాహక్కులు కావాలన్నాడు . స్త్రీలకు వోటుహక్కు ఉండాలని ‘’వోట్స్ ఫర్ వుమెన్ ‘’.అనే ఉపన్యాసం లో చెప్పాడు .అంధ రచయిత’’ హెలెన్ కెల్లర్’’విద్యా పురోభి వృద్ధికి సహకరించాడు .’’లైఫ్ ఆన్ ది మిసిసిపి ‘’లో రాసిన బోటింగ్ ఇండస్త్రి లోని ‘’యూనియన్ ‘’ల గురించి రాసిన వాటిని ఇప్పటికీ యూనియన్ హాళ్ళలో చదువుతున్నారంటే ఆయన రచనా ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది .’’కార్మిక ఉద్యమం ‘’ను మార్క్ ట్వేన్ ప్రోత్సహించాడు .
మార్క్ ట్వేన్ పూర్తీ
డి లిట్ ట్వేన్
మరో ప్రముఖునితో కలుద్దాం
మీ –గబ్బిట డుర్గా ప్రసాద్ -1-6-15-ఉయ్యూరు