ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -41 –
17-పోస్ట్ -ఇంప్రషనిస్ట్ ఫ్రెంచ్ పెయింటర్ – పాల్ సిజేన్ (Paul Cezanne)-3(చివరిభాగం )
తండ్రి మరణం తో ఆర్ధిక పుష్టి-అయినా దిన కూలీ జీవితమే
1886 లో సేజనే తండ్రి మరణించటం తో ఆస్తిలో వాటాలభించి ఆర్ధిక పుష్టి కలిగింది .ఆర్ధిక భద్రత లభించి ధనవంతుడని పించుకొన్నా కూడా దిన కూలీ లాగా నే సాధారణ జీవితం జీవించాడు .గుర్రబ్బండీ కూడా కొనుక్కోలేదు .బయటికి తనను తీసుకొని వెళ్ళటానికి ఒక కిరాయి బండిని మాత్రం ఏర్పాటు చేసుకొన్నాడు .ఇది కూడా విలాసమే అనేవాడు .
ఆగిపోయిన బ్రష్
.కూలి విషయం లో ఒకసారి వాడితో గొడవ పడి,67 ఏడేళ్ళ వయసులో నడిచి పోతానని భీష్మించాడు .అనుకోకుండా తుఫాను వచ్చి గాలి వేగానికి రోడ్డుమీద కూలిపోయాడు .పూర్తిగా తడిసిపోయాడు .ఒక లాండ్రీ వాగన్ ఆయన్ను ఇంటికి చేర్చింది .మర్నాడు ఉదయం తానూ వేస్తున్న పోర్ట్రైట్ కు మెరుగులు దిద్దాడు అప్పటికే డయాబెటిస్ ఉంది .ఒకవారం తర్వాత 22-10-1906న 67 వ ఏట సిజనే పెయింటర్ చనిపోయాడు .అతని బ్రెత్ తో పాటుపెయింటింగ్ బ్రష్ కూడా ఆగిపోయింది .చనిపోయే ముందు కొన్ని చిత్రాలపై ఫిర్యాదులు రాశాడు .ఆస్తిని భార్యను మినహాయించి కొడుక్కు దాఖలు పరచాడు విల్లు రాసి
సిజనే చిత్ర ప్రత్యేకత
సిజనే అంతర్ సంఘర్షణలు మాత్రం అతని చిత్రాల్లో ప్రతి ఫలించలేదు .ప్రశాంత మైన ప్రభావం కోసమే తపన పడ్డాడు .తనకు నచ్చని చిత్రాలను నేలమీదే బ్రష్ లతోబాటు పడేసేవాడు .లేకపోతే పాలెట్ కత్తితో వాటిని చించేసే వాడు .వాన్ గొఘ్ చిత్రాలలో కనిపించే మానసిక సంఘర్షణ సిజనా ఫినిషింగ్ కాన్వాస్ ల లో కనిపించదు . సిజనే కోరింది ప్రశాంతత (సెరినిటి)మాత్రమె అదీ అతని ప్రత్యేకత .అతని రేంజ్ అంత గోప్పదేమీకాదు .అంటే వైవిధ్యం ఎక్కువ లేదని అర్ధం .ఎప్పుడు గీసినా అవే చెట్లు కొండలు పూలు పళ్ళు పేకాట ఆడేవాళ్ళు లనే చిత్రించేవాడు .అతని రంగుల ప్రస్తారమూ హద్దులోనే ఉండేది .’’ఎప్పుడు గీసినా మూడే మూడు ప్రాధమిక రంగులతో ,వాటి నుండి వచ్చిన రంగులతోనే చిత్రించు ‘’అని చెప్పిన గురువు ‘’పిసార్రో ‘’మాటకు కట్టుబడి చిత్రించాడు .నలుపు ,కారునలుపు ,సియన్నా మొదలైన రంగుల జోలికి పోలేదు .తానూ సృష్టించుకొన్న రంగుల సామరస్యానికే (హార్మని ) కట్టు బడ్డాడు .మూడే మూడు రంగులతో తన కళా విశ్వరూపాన్ని చూపాడు అవేనీలం ,ఆకుఅచ్చ ,ఊదా రంగులు .(blue green pink tan )అవే అతని రంగుల సర్వస్వం . ‘’he used these colors not mere accents in a design or as decorative units but as blocks of pure form ,basic elements of structure ‘’ అని అతని పై పరి శోధన విశ్లేషణా చేసిన వారు చెప్పారు .
ఇంప్రెష నిస్ట్ లు సంప్రదాయం గా వస్తున్న లైట్ అండ్ షేడ్ లను తిరస్కరించి ముందుకు సాగారు .కాని సిజనే ‘’’’modulated’’ his pigments and defined his objects not by outlines but by subtly contrasting planes and patches of color ,a continual change and ‘’de composition ‘’of light . అని అతను తొక్కిన కొత్తదారిని గురించి వివరించారు .లాండ్ స్కేప్ లలో సాధారణత ఉన్నా ,ఏదో ఒక నియమానికి సూత్రానికి బద్ధుడై చిత్రించలేదు . తాను చిత్రించినవాటి లో ‘’క్యూబికల్ ,కొనికల్ ఆకారం లో ఉన్నవి తర్వాత కాలం లో అందరికి ప్రేరణగా నిలిచి క్యూబిక్ ఆర్ట్ గా పేరు తెచ్చుకొంటు౦దని ‘’ప్రక్రుతి ప్రధానం గా రేఖాగణితం లాగా ఉంటుంది ‘’అనే నిర్వచనం వస్తుందని సిజనేకు తెలిస్తే అమితాశ్చపోయేవాడు .
నిత్య జీవితం లోని విషయాలను విశ్వ సత్యాలకు అనుసంధానం చేశాడు చిత్రాలలో .అతిని నిశ్చల చిత్రాలలోనే కాదు లాండ్ స్కేప్ లుకూడా ప్రేమ మయం గా ఉండటం అతని ప్రత్యేకత .యాపిల్ పళ్లను ఆరంజ్ లను చిత్రించటం లో సాధారణ వస్తువులలో ఉన్న ఆశ్చర్యానుభూతిని ,వాటికున్న పరస్పర సంబంధాన్ని తెలియ జెప్పాడు .అతని దృష్టిలో ఒక జగ్ ఒక మగ్ ,రుమాల పండుముక్క చిత్రం లో తాత్కాలికంగా చోటు దక్కించుకొని ఒక పర్వతానికున్న ప్రాధాన్యతను పొందుతుంది .అంటాడు . దీన్ని చూసే శ్రీ శ్రీ ‘’కుక్క పిల్లా సబ్బు బిళ్ళా కాదేదీ కవితకనర్హం ‘’అన్నాడెమో !అతని దృష్టిలో ‘’literature express itself by abstractions ,where as painting ,by means of drawing and color ,gives concrete shape not only to perception but sensations ‘’ అని అభిప్రాయ పడ్డాడు . సాహిత్యం ఇవ్వలేని ఆకృతిని నిండుతనాన్ని చిత్రం ఇవ్వ గలుగుతుంది అని భావించాడు . ఈ సెన్సేషన్ అంటే ఇంద్రియానుభవమే చిత్రకారుడు సిజనే సాధించిన అద్భుత విజయం .దీనికి అతను ప్రక్రుతి ఉన్నతికి ,అర్ధంకాని విషయాలకు వినమ్రుడౌతాడు.అతని చిత్రాలు బ్రోకెన్ వర్ణాలకు తనకు ఇష్టం లేని తానూ లక్ష్య పెట్టని ఈ ప్రపంచానికి దూరంగా ఉండి సంతోషించటానికి మార్గ దర్శకాలయ్యాయి .అవన్నీ శాంతికి ప్రశాంతికి మహా చిహ్నాలుగా నిలిచిపోయి చరితార్ధతను సాధించాయి . ఎక్కడా ఆటవికత ఉండదు .అందులో ఒక క్రమ ద్రుష్టి ఉండి పవిత్రత తో శాశ్వతత్వాన్ని బోధిస్తాయి .ఈ ప్రశాంతత ఆతను పడిన మానసిక వేదన అంతర్ జ్వలన నిరాశ వలన లభించినదే .అందుకే తనకు మొదటి డీలర్ గా ఉన్న వోలార్డ్ ను తనపై నమ్మకం ఉంచుకోమని చెప్పాడు .కాని 115 స్టింగ్ ల తర్వాతా కూడా తాను గీసిన పోర్ట్రైట్ సంతృప్తినివ్వలేదు .’’he had failed to realize his sensations and could not coalesce his color planes into a solidly perfected form .’’Still ‘’ he conceded ‘’the shirt –front is not bad ‘’అన్న పెర్ ఫెక్షనిస్ట్ ప్- పెయింటర్ పాల్ సిజనే .
పతన ఉత్థానాలు –చీకటి కాలం
1861-1870 కాలం సిజనే చిత్రకళా జీవితానికి చీకటి రోజులు –మూడవ నెపోలియన్ సెలాన్ ల సంఖ్య తగ్గెట్లు కొందరి చిత్రాల్ని తిరస్కరించేట్లు చేశాడు .తిరస్కరింప బడినవారిలో ఇంప్రెష నిస్టులు కూడా ఉన్నారు .వారిని విప్లవకారులుగా భావించాడు .వారి శైలికి ప్రభావితుడయ్యాడు . కాని వారితో స్నేహానికి దూరంగా ఉన్నాడు సిజనే .సిగ్గు, మొరటుతనం ,కోపం లు చుట్టుముట్టి డిప్రెషన్ లోకి వెళ్ళాడు .ఈ కాలం లో వేసినవన్నీ నల్ల రంగు చిత్రాలే .1867 లో కూర్బేట్ ప్రభావానికి లోనై ‘’పాలెట్ నైఫ్ ‘’తో చిత్రాలు గీశాడు .వీటినే తర్వాతి కాలం లో’’ un couilarde’’ అంటే ‘’విరిలిటి ‘’అంటే మగతనం ఉన్న చిత్రాలు అన్నాడు పాలెట్ నైఫ్ తో సిజనే గీసిన చిత్రాలు ‘’ఆధునిక ఎక్స్ప్రేషనిజం’’కు నాంది పలికింది అని అతనే సృష్టికర్త అని రాస్తూ లారెన్స్ గోయింగ్ ‘’although it was incidentally that ,the idea of art as as an emotional ejaculation made first appearance in this moment ‘’అన్నాడు . ఇందులో అతని శైలి పరి పక్వమై నిలిచింది .ఇదే అతని చీకటికాలం ఈ కాలం లో గీసినవన్నీ ‘’ఈరోటిక్ ,వయోలేంట్ ‘’విషయా అంటే కామ ,హి౦సాత్మకాలే నన్నమాట .
ఇంప్రెషనిస్ట్ కాలం
1870-78 కాలం అతను ఇంప్రెష నిస్ట్ అనిపించాడు పారిస్ వదిలి మార్సేలీస్ కు చేరినతర్వాత లాండ్ స్కేప్ లేక్ ప్రాదాన్యమిచ్చాడు .యుద్ధం ముగిసిన తర్వాత పారిస్ చేరి పిసార్రో తోకలిసి లాండ్ స్కేప్ లు గీశాడు .తనను పిసార్రో శిష్యుడనని చెప్పుకొన్నాడు అతన్ని ‘’గాడ్ ది ఫాదర్ ‘’అని కీర్తించాడు పిసారో ప్రేరణ తో నల్ల రంగులు వదిలేసి మెరిసే రంగులు వాడాడు పారిస్ ,ప్రావెంస్ ల మధ్య తిరిగాడు .మొదటి ఇంప్రెష నిస్ట్ ప్రదర్శన1877లో ఇచ్చాడు .కొన్ని అమ్ముడుపోయి కొంత ధనలాభం కలిగింది .ఇందులో వ్యంగ్యం అధిక్షేపణ అధికం .వీటిని చూసిన గర్భిణీ స్త్రీ లకు ఎల్లో ఫీవర్ తో పుట్టే బిడ్డను కనటం ఖాయం అన్నారు విమర్శకులు .
పరిపక్వ దశ
1878-90 కాలం సిజనే చిత్రకళా జీవితం లో పరిపక్వ దశగా భావిస్తారు .ప్రావెంస్ లోనే ఉండేవాడు 1885-88 కాలం అతని నిర్మాణ దశ .1886 గొప్ప మలుపు తెచ్చింది .ఎమిలీ జోలా తో స్నేహానికి దూరం గా ఉన్నాడు .జోలా నవలలో తనను ఒక పాత్రగా రాయటం తో చిన్ననాటి స్నేహానికి స్వస్తి చెప్పాడు .జోలా నమ్మక ద్రోహం చేశాడని భావించాడు –
అ౦తిమకాలం
1890-96కాలం లో పెయింటింగ్ లకు దూరం గా ఉండిపోయాడు .కాని అతని పేయింటింగ్ లకు ప్రాచుర్యం బాగా వచ్చి నవ తరానికి చెందిన యువ చిత్రకారులు సిజనే ను తమ ఆదర్శ చిత్రకారుడని భుజాలకెత్తుకొన్నారు . 1903 నుంచి తన స్టూడియోలోనే చిత్రాలు గీశాడు .
సిజనే చనిపోయాక పెట్టిన ప్రదర్శనలో అతని చిత్రాలు హాట్ కేక్స్ లాగా అమ్ముడు పోయాయి. అతని శిష్యులుసిజనే క్యూబిజానికి ఆద్యుడు అని అంటూ అతని ప్రతిభను ‘’ “Cézanne is one of the greatest of those who changed the course of art history . . . From him we have learned that to alter the coloring of an object is to alter its structure. His work proves without doubt that painting is not—or not any longer—the art of imitating an object by lines and colors, but of giving plastic [solid] form to our nature.” (Albert Gleizes and Jean Metzinger in Du “Cubisme”, 1912)[37]
అని ప్రశంసించారు .సిజనే ప్రభావం పికాసో ,బ్రేక్ ,మెట్జిన్జర్ ,గ్లీజేస్ ,గ్రీస్ మొదలైన ప్రముఖ చిత్రకారులమీద అదికం గా ఉంది .సిజనే ను జీనియస్ అన్నారు .అతనిపేర ఒక మెడల్ ఏర్పాటు చేశారు .
మరో ప్రముఖునితో మళ్ళీ కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-6-15 ఉయ్యూరు