ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -42
18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా
సవ్యంగా సాగని బాల్య౦
తన రచనలన్నిటిని వారసత్వాన్ని (హెరిడిటరి)ఆధారం గా చేసుకొని రాసి సాహిత్యం లో రియలిజానికి పట్టం కట్టిన ఎమిలీజోలాది మాత్రం మిశ్రమ వారసత్వం .తండ్రి ఫ్రాన్సిస్కో జోలా సగం ఇటాలియన్ సగం గ్రీకు వాడు. ఇంజనీర్ గా సాహసిగా పేరున్నవాడు తల్లి కోర్ఫు ఐలాండ్ కు చెందినది .ఆమె తండ్రి తాలూకు వారు వెనిస్ దేశస్తులు ఆమె పేరు ఫ్రాంకో ఎమిలే ఆబర్ట్ .పారిస్ దగ్గర డౌర్డాన్ గ్రామం లో పుట్టింది పారిస్ లో జోలా 2-4-1840న జన్మించాడు .అసలుపేరు’’ ఎమిలీ ఎడౌర్డ్ చార్లెస్ ఆంటోని ‘’.పుట్టగానే బ్రెయిన్ ఫీవర్ తో బాధ పడి రెండేళ్లకు కోలుకొన్నాడు .దీనికి తగ్గట్లు కళ్ళకు షార్ట్ సైట్ (హ్రస్వ ద్రుష్టి )ఉండేది .దీనితో ఎడమకన్ను కొంచెం పైకి లేచినట్లు కనిపించేది .ఈ పరిస్తితులలో ధనికుడైన తండ్రి కుటుంబాన్ని దక్షిణ ఫ్రాన్స్ కు తరలించాడు .పెళ్లి అయ్యే దాకా అక్కడే ఉన్నాడు .అక్కడ ఒక కాలువ తవ్వాలని ప్లాన్ లో ఉండేవాడు .అనుకోకుండా తీవ్రమైన చలి జ్వరం వచ్చి ప్లూరసి జబ్బు తో బాధ పడి చనిపోయాడు .కుటుంబానికి తండ్రి మిగిల్చింది ఐక్స్ సిటీ మీద వేసిన ఒక దావా మాత్రమె .ఈకేసులో తండ్రికున్న ఆస్తి చాలాభాగం అమ్మేయాల్సి వచ్చింది .చాలా తక్కువ ఆస్తి మాత్రమె కుటుంబానికి మిగిలింది .ఎమిలీ యవ్వన జీవితం అంతా ఈ ఆర్ధిక లేమి వలన డిప్రెషన్ తోగాడిచి పోయింది .తక్కువ ఖరీదైన లాడ్జిలలో ఉంటూ తరచుగా ప్రదేశాలు మారుతూ గడిపాడు .చివరికి తల్లి అతన్ని ఐక్స్ లోని ఒక బోర్డింగ్ స్కూల్ లో చేర్పించింది . ముగ్గురు మిత్రులు
మిగిలిన సహా విద్యార్దులకంటే వయసులో పెద్దవాడుగా ఉన్న జోలా స్కూల్ లో పెద్దగా పేరు తెచ్చుకోలేక పోయాడు .తోటి విద్యార్ధులు అతని ఎగుడు దిగుడు కన్నులను చూసి వెక్కి రించేవారు అతని పారిస్ నగర ఉచ్చారణ విని హేళన చేసేవారు .దీనితో పిరికితనం వచ్చి ఆత్మ రక్షణ లో పడాల్సి వచ్చింది. కాని ఇద్దరు ఆత్మీయ మిత్రులను మాత్రం సంపాదించుకో గలిగాడు అందులో బాగా తెలివిగల ఐక్స్ లోపుట్టిన పాల్ సిజనే ,సిజనే స్నేహితుడైన బైలీలు .పది హేనేళ్ళ ఈ ముగ్గురూ కలిసి పల్లె ప్రాంతపు అందాలను అనుభ వీస్తూ పరిశోధన చేస్తూ కాలవలలో ఈతలు కొడుతూ నదిగట్ల మీద విక్టర్ హ్యూగో ,ఆల్ఫాన్సో డిలామర్టి న్ , ఆల్ఫ్రెడ్ డి మ్యూసేట్ ల రొమాంటిక్ రచనలు చదువుతూ .కాల క్షేపం చేశారు .వీటికన్నిటికి ప్రేరకుడు సిజనే .తర్వాత అయిదేళ్ళలో సిజనే రంగుల బొమ్మలు గీస్తూ గడిపాడు .ఎమిలీ జోలా కవిత్వం తో, బాలడ్స్ రాస్తూ మూడు అంకాల నాటకాలు రాస్తూ కాలక్షేపం చేశాడు తోటి మిత్రులకు రాబోయే సాహిత్యాన్ని గురించి తెలియజేస్తూ కళ కున్న బాధ్యతను వివరిస్తూ చదువు పై శ్రద్ధ పట్టలేక పోయాడు జోలా .
ఆర్ధిక కు౦గు బాటు
ఇంటి దగ్గర తల్లి పరి స్తితులూ బాగాలేవు ..దరిద్రం పెరిగి పోయింది తినటానికి తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చింది .ఆమె తలిదండ్రులే ఇప్పటిదాకా అండగా నిలిచారు .కాని వారూ ఇక ఏమీ చేయ లేని నిస్సహాయులైపోయారుకూతురికీ, మనవడికీ . చిల్లిగవ్వ కూడా చేత లేక జోలా తల్లి నిస్సహాయురాలైంది .ఎవరో పుణ్యాత్ముల దగ్గర అప్పు గా కొన్ని ఫ్రాన్కుల డబ్బు తీసుకొని భర్త తాలూకు బంధువులు ఏదైనా సాయం చేస్తారనే ఆశ తో పారిస్ వెళ్ళింది. కొడుకు జోలాను ఇంట్లో మిగిలిన కర్రా బుర్రా కూడా అమ్మేసి మూడవ తరగతి మెట్రో రైల్ టికెట్ కొనుక్కొని పారిస్ వచ్చి తనను కలవమని చెప్పింది .
కవిత్వం పై పిచ్చి
18 వ ఏటా జోలా పారిస్ చేరాడు .అది విలాసవంత మైన పై డాబుల నగరం మూడవ నెపోలియన్ దాన్ని పునర్నిర్మించాడు .లాభాల వేటగాళ్లకు ,పరాన్నభుక్కులకు నిలయం .అసాంఘిక చర్యలకు అడ్డా .తాను వచ్చిన పల్లెటూరికి దీనికి ఆస్తి మశాకాంతరం ఉందనిపించింది జోలాకు .పారిస్ ను చూసి షాక్ అవటమేకాక ఆనందం కూడా పొందాడు .ఇక్కడ స్కాలర్ షిప్ వచ్చి లీసీ సెయింట్ లూయీ లో చేరాడు అక్కడ అతను ఇష్టం లేని వాడుగా ,అక్కడివాళ్లు అతన్ని ఒప్పుకోలేని వారుగా కనిపించారు .ఇక్కడ కూడా అతని పారిస్ ఉచ్చారణ కు మొదట అవహేళన జరిగినా అతను స్థానికుడు కనుక సరిపోయింది .చదువు మీద ద్రుష్టి పెట్టలేదు. స్నేహితుల్ని పట్టించుకోలేదు .సాహిత్యం చదవటం ,రాయటం అనే రెండు విషయాల మీదే దృష్టిని కేంద్రీకరించాడు. అవే అతని శ్వాస, ఊపిరి అయ్యాయి .కవిత్వమే అతని ప్రేయసి అయి మురిపించింది లోకాన్ని మరిపించింది .ఆ తర్వాత నేచరిస్ట్ రచయితలలో అగ్రగామి అని పేరొచ్చినా అతనికి కవిత్వం మీద అభిమానం మాత్రం పోలేదు .ఇరవై ఏళ్ళ వయసులో కవిగా గుర్తింపు మాత్రమేకాదు రొమాంటిక్ ఫిగర్ గానూ గుర్తింపు వచ్చింది ‘’మన ఆకలి తీర్చుకోవటానికి తిందాం తాగుదాం కాని మన ఆత్మలను పవిత్రం గా దూరం గా ఉంచుకొందాం ‘’అని చెప్పేవాడు .
మరణం అంచు లోంచి బైటికి
19 వ ఏట జోలా మళ్ళీ చావు దగ్గరకు వెళ్ళాడు .తీవ్రంగా టైఫాయిడ్ జ్వరం వచ్చి రెండు నెలలు మంచం మీదనే ఉండిపోయాడు .కొంచెం కోలు కొనే సమయం లో నోరు అంతా అల్సర్ ల తో నిండిపోయి మాట్లాడ లేక పోయాడు.మానసికం గా బాగా కు౦గి పోయాడు .హైపో కా౦డ్రియాకు అది తర్వాత దారి తీసింది . ఈ వ్యాధి వలన వచ్చిన రచనా విధానం లో మార్పు వచ్చింది . సిజనే కూడా కావితలు రాసేవాడప్పుడు .అతనికి జాబు రాస్తూ జోలా ‘’ఒరే ముసలి మూర్ఖా !నువ్వు నాకంటె గొప్పగా కవిత్వం రాయగలవు .నీ కవిత్వం కంటే నా దానిలో వాస్తవికత ఉండచ్చు కాని నీదానిలో కవితా స్పర్శ ఎక్కువ .నువ్వు హృదయం తో రాస్తావు .నేను మనసుతో అంటే బుద్ధి తో రాస్తాను .నీది హృదయవాదం నాది బౌద్ధికవాదం ‘’అన్నాడు
అనేక ఆలోచనలు
టైఫాయిడ్ నుంచి కోలుకొన్నాడు కాని స్కూల్ అంటే మరీ చిరాకేసింది .లాయర్ అవ్వాలనిపించింది పరీక్ష రాసి తప్పాడు డిప్లమా రాలేదు దీనిపై ‘’the open sesame to all the professions ‘’అను కొన్నాడు .దీనిపై దీర్ఘ కవిత రాశాడు .ఒక షాడో బిజినెస్ మాన్ అవతారం ఎత్తాలనుకొన్నాడు .ఈ విషయమై బైలీకి రాస్తూ ‘’ఏదో ఒక సంస్థలో గుమాస్తాగా చేరాలని ఉంది. ఇది నా నిరాశా దృక్పధం తో తీసుకొన్న నిర్ణయం .నా భవిష్యత్తు చిద్రమై పోతుంది .ఆఫీసులో పని చేసినా భవిష్యత్తు లేదు నైతిక పతనం తో చీకటి లోకి జారిపోవటమేనేమో ‘’అన్నాడు .అనుకోన్నట్లే నెపోలియన్ డాక్స్ లో బుక్ కీపర్ ఉద్యోగం వచ్చింది .రోజూ రెండుమైళ్ళు నడిచి ఉద్యోగానికి వెళ్ళాలి. జీతం నెలకు ముప్ఫై ఫ్రాంకులు .చేరి ,జీతం చాలక, నడవ లేక రెండు నెలలకే మానేసి మళ్ళీ ఉద్యోగాన్వేషణలో పడ్డాడు
.
ignature | ![]() |
---|
ignature |
---|
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-15- ఉయ్యూరు