ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -43
18-వాస్తవితకు సాహిత్య గౌరవం తెచ్చిన ఫ్రెంచ్ రచయిత –ఎమిలీ జోలా -2
ఇరుకు గదిలో ఇద్దరు
ఉద్యోగం కోసం ఎదురుచూపులు మానేసి అప్పుచేసి దాంతో పోట్టకింత తింటూ ఒక మేడమీద పై భాగం లో చిన్నగది బాడుగకు తీసుకొని ,ఎత్తు మెట్లు ఎకుతూ దిగుతూ అక్కడ ప్రోఫెషనల్ బోహీమియన్ లా ఉన్నాడు . బద్ధకం గురించి చెబుతూ ‘’బద్ధకం మహా గొప్పది. దానివలన ఎవరూ చచ్చిపోరు .’’అంటాడు తన పూర్వ స్నేహితులిద్దర్నీ తనతోకలిసి వచ్చి లాటిన్ క్వార్టర్ లో ఉండమని ఆహ్వానించాడు .కాని సిజానే మాత్రం మూడేళ్ళు తండ్రితో తీవ్ర యుద్ధం చేసి వచ్చి చేరాడు . ఆ చిన్న ఇరుకు గదిలోనే ఇద్దరూ సర్దుకున్నారు .సిజనే కొచ్చే అలవెన్స్ తోనే ఇద్దరూ గడిపారు .ఇద్దరికీ విసుగనిపించి వేర్వేరుగా గదులు తీసుకొని వేరైపోయి ఉన్నారు. ఐక్స్ లో సిజానే ఇబ్బంది పడుతూ ఇంటికి వెళ్లి పోయాడు .జోలా ఒంటరిగా పేదరికం లో మగ్గుతూ గడిపాల్సి వచ్చింది .రోమా౦టిసిజం ను ఇంకా పట్టుకొని వేలాడుతూనే ఉన్నాడు అవి ఏమీ ప్రతి ఫలాన్ని పిండటం లేదు .’’ఈ నగరం లో విశ్రు౦ఖల వేశ్యా విహారం తప్ప ఏమీలేదు .పోనీ పల్లెటూళ్ళల్లో ఏదైనా ఉందనుకొంటే అక్కడ అంతా మూర్ఖత్వమే ‘’అన్నాడు జోలా .కని పించిన ప్రతి చోట ప్రేమ కోసం అన్వేషించాడు .కాని అదీ ఆకాశ కుసుమమే అయింది .’’everywhere sex but nowhere woman ‘’అనుకొన్నాడు .ఉద్యోగం వెన్నులో వణుకు పుట్టిస్తోంది .అవి తనను పూడ్చి పెట్టనిమ్మనుకొన్నాడు .
పిచికల్ని కాల్చుకు తిన్న అతి దరిద్రం
కొంతకాలం దరఖాస్తు పెట్టకుండా ఉద్యోగం వేట చేశాడు .అతని ఆకారం, దుస్తులు ,చూపులు చూసిన వారెవ్వరూ ఇంటర్వ్యు చేయట౦ , ఉద్యోగం ఇస్తానన్న సాహసం చేయ లేకపోయారు .తనకు తాను అంచనా వేసుకొన్నాడు తాను వేసుకొన్న మార్కులు కూడా చాలా పూర్ .కవి ,స్వేచ్చా ప్రేమ తో ఉన్న బోహీమియన్ అను కొనేవాడు .ఇరవై ఒక ఏడాది వరకు అస్కలిత ఘోటక బ్రహ్మ చారి గా ఉన్నాడు .ఒక వేశ్య దొరికితీ ఆమె తో కొన్ని నెలలు గడిపాడు .ఈ కలయిక సుఖాన్ని ఏమీ అందించలేదు .బీదరికాన్ని ,బీద జనాన్ని చీదరించుకొనే జోలా ,సంఘాన్ని తిట్టిపోశాడు ,కాని దాన్ని సహించాడు .చాలీ చాలని దుస్తులు ,ఎప్పుడూ కడుపులో ఆకలి మంటలు .కళ్ళల్లో క్రోధం అదీ జోలా పరిస్థితి .రాయటానికి అసలు ఇష్టపడే వాడు కాదు . గైడీ మొపాసా అనే ప్రముఖ రచయిత రాసిన దాన్ని బట్టి జోలా గదిలో పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని ఉండేవి వాటిని కర్టెన్ రాడ్ మీద ఉదికి౦చు కొని ఆత్మా రాముడికి శాంతి కలిగించేవాడు . అంతటి దుర్భర దారిద్ర్యం అనుభవించాడు జోలా .లేక పోతే అవి తెచ్చుకొని వదిలేసిన రొట్టేముక్కల్నిదక్షిణ ప్రాంతం నుండి పంపిన ఆలివ్ ఆయిల్ లో ముంచు కొని తినేవాడు . మరీ దారుణంగా పతనమై పోయాడు ఆర్ధికం గా .అప్పుడు తెలిసింది ఒక స్నేహితుని ద్వారా తన తండ్రి ఒక పబ్లిషింగ్ కంపెనీ లో ఒక ఉద్యోగాన్ని కుదిర్చాడని తెలిసింది .
ఉద్యోగం –మొదటి కదా పుస్తకం –మొదటి నవల
ఆ మాట విని ‘’విశ్వాసం మళ్ళీ వచ్చింది .నిజమే అని నమ్మాను .ఇప్పుడు నాకు నవ్వు వస్తోంది ‘’ ఆకంపెనీ అధికారి మన్సూర్ హేచాటీ జోలా రచయిత అని తెలుసుకొని ప్రొమోషన్ ఇచ్చి అడ్వర్ టైజ్ డిపార్ట్ మెంట్ లో ఎక్కువ జీతం ఇచ్చి ప్రోత్సహించాడు .ఈ విషయాన్ని సిజానే కు రాస్తూ తన పాత రచనలపై అభిప్రాయాలకు మెరుగులు దిద్దాలనుకోన్నానని చెప్పాడు .బాగా వినిపించాలని బాగా చూడాలని అనిపిస్తోందన్నాడు ఇదివరకు లేని కొత్తభావాలు తనలో వికసిస్తున్నాయన్నాడు ప్రకృతి లో చాలా కవిత్వం ఉంది అలా కనిపిస్తుంది కూడా అన్నాడు .ఇది వరకు రాసిన రొమాంటిక్ కధలను అన్నిటినే సేకరించి మేగజైన్స్ లో ప్రచురించేట్లు చేశాడు . మిగిలినవీ రాశాడు. వీటినన్నిటిని కలిపి ‘’’’స్టోరీస్ ఫర్ నినాన్ ‘’పేరుతొ ప్రచురించాడు . ఇదే జోలా మొదటి పుస్తకం .అప్పటికి ఆయన వయసు 25.తర్వాత వేశ్యతో తాను గడిపిన అశాంత జీవితాన్ని ఒక నవలగా ‘’కన్ఫెషన్స్ ఏ క్లాడ్ ‘’.రాశాడు .దీన్ని తన ప్రియ మిత్రులైన సిజనే ,బైలీ లకు అంకితమిచ్చాడు ఈ నవల సిగ్గుమాలిన నవల అని అందరూ ముందు అన్నా తర్వాత విపరీతమైన విజయాన్ని సాధించి ఉత్సాహాన్నిచ్చింది .ఈ సందర్భం గా సిజనే –జోలా చిత్రాన్ని గీసి బహూక రించాడు అందులో జోలా లోని కల ,నిశ్చయం రెండూ సమతూకం లో కనిపిస్తాయి .
ఫ్లాబర్ట్ చెప్పే నేచురలిజం చూసి దాని ప్రచారం విని తెలుసుకొని తన రచన చాలా పేలవం గా ,జీవం లేనిదానిలా ఉందని జోలా గ్రహించాడు .’’మాడంబోవరీ’’రాసినందుకు ఫ్లాబర్ట్ ను అందులో అనైతికత ఉందని కోర్టుకు లాగారు అందులో అన్నీ చాలా వివరంగా ఫ్లాబర్ట్ రాశాడు .’’మంచి అభిరుచి ‘’ చదువరులకు అందించాలనే ఆలోచన వచ్చింది .ఇదే నేచరిలిజం కు దారి తీసింది “”zola envisioned a kind of writing which would shock the world by its power and range ,a series of books from which nothing could be excluded .’’అనే ఒక ఆలోచనలోకి వచ్చాడు .ఈ సందర్భం లో జోలా ‘’When I attack a subject ,I want to force the whole universe into it ‘’అని చెప్పుకొన్నాడు .జోలా పని చేస్తున్న కంపెనీ దాని అధికారి హచాటీ లవి భిన్న ఆలొచనలుగ ఉండేవి .తన జీవిత చరిత్రగానే రాసిన ‘’కన్ఫెషన్స్ ‘’నవల అతని కంపెనీలో ద్వేషాలు పెంచింది .మూడేళ్ళు అలాగే లాక్కొచ్చి రాజీనామా చేసేశాడు .వెంటనే చారిత్రాత్మకం గా గొప్ప నవల ‘’ది ఇస్స్యు ‘’ను ధారావాహికం గా పారిస్ వార్తాపత్రికకు రాశాడు .దీన్ని మెచ్చిన సంపాదకుడు ఆ పత్రికలో రెగ్యులర్ కాలం రాయమని కోరాడు .’’A young man versed in all the arts whose books ,few but excellent ,have already produced a sensation ‘’అని మెచ్చుకొన్నాడు కూడా .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-6-15 –ఉయ్యూరు