1-దేవీ ప్రియ రాసే రన్నింగ్” కామెంటరి ”
”వామ ”చూపు తో అవుతోంది ”ఫన్నింగ్ కామెంటరి ”
2- ”తెలక పల్లి” రవి కి కనిపిస్తుంది ”యోగ”
”యెర్ర ”దనాన్నిపూర్తిగా మింగే ”డేగ ”.
3-”మోడీ ”తెచ్చాడు యోగాకి అంతర్జాతీయ” మహా యోగం”
చాపకింద నీరు అవుతోంది లలిత్ మోడీ ”అభియోగం ”
4- అధికారం రాక ముందు అంతా ”నీతి మంతులే ”
వచ్చాక అవుతారు బీరకాయిలో ”నేతి మంతులు”
5-”చంద్రు”లిద్దరి మధ్య రాచకీయ ”పోరు”
మీడియా కధనాలతో చెవులు ”హోరు ”
6- ఎవరి డబ్బు ఎవరు ఎందు ”కిస్తున్నారో ”
బెమ్మకైనా తెలీని ”కిమిన్నాస్తిరో”.
7- తెలుగు నాట వర్షాలే” వర్షాలు ”
బాబు అడుక్కి జనం హర్షాలే” హర్షాలు ”
8- చానెళ్ళ పై ఏడాది పైగా ”నిషేధం”
ప్రజాస్వామ్యానికి మరో” మానిషాదం ”
9- ఆద్వానికి మళ్ళీ గుర్తొచ్చింది ”ఎమర్జెన్సీ”
భయ పెడుతోందేమో ”మోడీ యమఅర్జెంసీ ”
10-వోటుకుఇస్తుంటే ” కోట్ల నోటు ”
ఇక ఎన్నిక లెందుకు”దండగ చేటు ”
11-నేడు తండ్రుల దినం – ”ఫాదర్స్ డే ”
పేర్ల తో అవుతోంది” ఫూలర్స్ డే ”
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ -21-6-15 -ఉయ్యూరు
—