ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -5

20- వ శతాబ్దపు ఫ్రెంచ్ మహా శిల్పి –అగస్టీ రోడిన్ -3(చివరిభాగం)

అసాధారణ శిల్ప నైపుణ్యం

మిగిలిన కళాకారులు రోడిన్ శక్తి సామర్ధ్యాల లతోపాటు అతని విధానాలను ఇప్పుడు బాగా అర్ధం చేసుకొన్నారు .విమర్శకులు రోడిన్ ను పొగడ్తాలతో మున్చేస్తున్నారు .కాని అందులోనూ కొంత జాగ్రత్తా పాటించారు .అతని సాహిత్య ప్రజన తక్కువ అన్నారు అతని సూటి నిజాయితీ తనాన్ని మెచ్చ కుండా ఉండలేక పోయారు .’’కళాకద ‘’అనే పుస్తకం లో ఎస్ రీనాక్ ‘’రోడిన్ చేసిన వ్యక్తిగత సామూహిక శిల్పాలు’’ డోనటేల్లో ‘’శిల్పాల స్పూర్తి నిస్తున్నాయి .మార్బుల్ లో రోడిన్ తన మనోభావాలన్నీ గొప్పగా ప్రదర్శించాడు .భారీతనం ఆకారాలలోనే కాదు అందం లో భావ వ్యక్తీకరణలో అసాధారణం గా ఉంది ‘’అని రాశాడు .

న్యూడ్ హ్యూగో

ఈ అసాధారణం అనే పదం  రోడిన్ కు యాభై ఆరేళ్ళు వచ్చిన తర్వాతవిక్టర్ హ్యూగో శిల్ప  ప్రదర్శన నాడు  మళ్ళీ బయటికొచ్చింది .పాన్దియన్ లు ఆర్డర్ చేస్తే దీన్ని శిల్పీకరించాడు రోడిన్ . ఇందులో నేటివ్ సెన్స్ ను చూపించాడు .కవి  నవలా రచయిత అయిన హ్యూగో ను భారీ శిల్పంగా నగ్నంగా వదులైన బట్టతో చూపించాడు .కానని వాళ్ళు కోరింది ఫ్రాక్ వేసుకొని దర్జాగా కనిపించే హ్యూగో .ఇది చూసి వాళ్ళు అ రోడిన్ అభి రుచిని తిట్టిపోశారు .శిల్ప సౌందర్యం తెలియని ఎద్దు మొద్దు అన్నారు .జుగుప్స కలిగించే భంగిమలకు ఆకర్షితుడు అని దుయ్య బట్టారు

సాంస్కృతిక ఇంప్రెష నిజం –తిరస్కరింప బడిన బాల్జాక్ శిల్పం .

మరో రెండేళ్ళ తర్వాతనాటక కర్త బాల్జాక్ భారీ శిల్పాన్ని1898లో న్యు సెలూన్ లో  ప్రదర్శించాడు .దీన్ని ‘’సొసైటీ ఆఫ్ మెన్ ఆఫ్ లెటర్స్ ‘’సంస్థ ఆర్డర్ చేసింది .రోడిన్ గీసిన బాల్జాక్ శిరసు స్కెచ్ ను చూడగానే వాళ్ళు అగ్గిమీద గుగ్గిలమై తిరాస్కరించారు .ఆ విగ్రహం మెట్రో పాలిటన్ మ్యూజియం లో ఇప్పుడు ఉంది .కాని రోడిన్ ఇందులో సాంస్కృతిక ఇంప్రెష నిజం ‘’ను ప్రవేశ పెట్టాడు .అందువల్ల పురాతన గ్రీకు శిల్పం ళా కనిపించింది.కొందరికి ప్రాధమిక  గోథిక్ శిల్పం ళా తోచింది .మరికొందరికి చరిత్రకు పూర్వం ఉండే నిలబడ్డ పొడవైన శిలలాగా (మెన్హిర్స్) అనిపించింది .నిరాశ చెంది రోడిన్ బాల్జాక్ శిల్పాన్ని ఏమీ మార్చ లేదు తన ధోరణిలోనే చెక్కాడు .పొట్టిగా లావుగా ఉండేఅసలైన  బాల్జాక్ ను శిల్పీకరించలేదు .కాని సింహ శిరసు చైతన్యం తో చెక్కాడు దీన్ని అర్ధం చేసుకొన్నా విశ్లేషకుడు ‘’లామేన్ టైన్ ‘’’’thi figure of an element ‘’అన్నాడు .పేపరు వాళ్ళు కాకిగోల చేశారు .మునిసిపాలితీవాళ్ళు క్షమించరాని అవమానం అన్నారు .దీనీపై ఎన్నో కధనాలు అల్లి ,దూషించారు .ఒకప్పుడు చాలా రియలిస్టిక్ గా చేస్తున్నాడు రోడిన్ అన్న వాళ్ళే ఇప్పుడు అతనికి నేచురల్ గా  ఉండటం అంటే ఏమీ తెలియదు అని అన్నారు .ఈరకమైన వ్యతిరేక ప్రదర్శన రోడిన్ ను మనస్తాపానికి గురి చేయతమేకాడు ఆరోగ్యం పైనా ప్రభావం చూపింది .

చైతన్య పరాకాస్ట

రోడిన్ చేతిలో ఇంకా ఎన్నో అద్భుతాలు ఆవిష్కరింప బడాలి ..ఎన్నో చిరకాలం గుర్తుంచుకోదగిన చిత్రాలు ,శిరస్సులు ఆయన చేయాలి అందులో ముఖ్యం గా జార్జి బెర్నార్డ్ షా ,గుస్టేవ్ మాలర్ ,చార్లెస్ బాడర్లె ,జోసెఫ్ పులిట్జర్ మొదలైనవి .ఇవన్నీ సజీవ చైతన్యం తోణికిస లాదేట్లు నిర్మించాడు .చివరగా’’పోప్ బెనడిక్ట్ -15  ‘’పరమాద్భుత శిల్పం ,ఇవికాక 1909-11 మధ్య కాలం లో ఎన్నో చిన్న చిన్న కంచు విగ్రహాలు ,నాట్యం చేసేవారిని తయారు చేసి ప్రాణ ప్రతిష్ట చేశాడు .ఇంతగోప్పగా ధైర్యం గా చురుగ్గా అంతకు ముందెప్పుడూ దూసుకు వెళ్ళలేదు .న్యు యార్క్ ట్రిబ్యూన్ పత్రికలో ఎమిలి జేనార్  రివ్యు రాస్తూ ‘’they reach far out into space ,so they delineate not so much a specific dance in motion or a pair of acrobats as they do a flowering –out of dynamic energy expressed through the metal forms and the space they measure ‘’అని కీర్తించారు .

గౌరవ ఆదరాలు

అరవైలలో రోడిన్ ను పారిస్ లోని గ్రేట్ ఎక్సి బిషన్ లో సత్కరించటం ప్రారంభించారు .  అప్పటికి ఇంకా ఆయన శిల్పిస్తున్న ‘’నరక ద్వారం ‘’పూర్తికానేలేదు .తిరస్కరింప బడ్డ బాల్జాక్ శిల్పం తో బాటు వందలాది శిల్పాలు చిత్రాలను ఒక ప్రత్యెక భవనం లో పెట్టి దానికి’’రోడిన్ పెవిలియన్ ‘’అని పేరు పెట్టారు .తాను చేస్తున్న మాధ్యమానికి రోడిన్ కొన్ని సూత్రాలు రాశాడు .అసలైన శిల్పి బాహ్య సౌందర్య ప్రదర్శనలో తృప్తి చెందడు .అందులో దూసుకు వచ్చే  పదార్ధాన్ని ఆస్వాదిన్చేట్లు చేయాలి అన్నాడు .’’నేనేదీ కొత్తగా సృష్టించలేదు సృష్టిలో ఉన్నదానినే మళ్ళీ కనుక్కొన్నాను .ప్రతిదీ ప్రకృతిలోనే ఉంది .కళాకారుడు ప్రకృతిని అనుసరిస్తే అన్నీ అందుకోగలదు .మనవ శరీరం దేవాలయ యాత్రలాంటిది .దేవాలయం లో ఉన్నట్లే ఒక మధ్య బిందువు ఉంటుంది .దాని చుట్టూ అంతా అల్లుకు పోయి విస్తరిస్తుంది .ఆధునికులు చాయను అనుసరించారు పూర్వీకులు కాంతిని దర్శించారు .మనకు మైకేలాన్జేలో లోని ఆధ్యాత్మిక ప్రాధాన్యం తెలిస్తే గ్రీకులలాగా ప్రవర్తిస్తే అతని శిల్పాలలో అవిశ్రాంత చైతన్యాన్ని దర్శించగలం .

ఫలితం ఆశించకుండా చేసే కృషిని మనసును అర్ధం చేసుకో గలం ‘’అన్నాడు రోడిన్ .చివరగా ‘’the martyrdom of the creature tormented by un reliable aspirations ‘’అన్నాడు .

హద్దులు మీరిన అభిమానం

 

తాను భావించిన విషయాలన్నిటినీ జీవితకాలం లో ముసలితనం లోనే సాధించాడు రోడిన్ .తన శిల్పాలు తనకాలపు ఆధ్యాత్మిక భావనలకు ప్రకటనలే అంటాడు .మొదటి ప్రపంచ యుద్ధప్రారంభం రోడిన్ ను నిరాశ్ పరచింది .అది అతని జీవా శక్తికి విఘాతం కలిగించి చావుకు కారణం అయింది .ఫ్రాన్స్ దేశం లో ఇంధనం కొరత బాగా ఏర్పడింది .రోజ్ రోడిన్ దంపతులు చలికి వనికిపోఎవారు .1916జులై 10 నరోడిన్ కు తల తిరిగినట్లు అనిపించింది .మేడ మెట్ల నుంచి జారి పడ్డాడు .మంచం మీదనే ఉండిపోయాడు .ఎందరెందరో మహిళలు ఆయన అభిమానులు ,వచ్చి విపరీతంగా అయన చుట్టూ మూగారు .ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కబుర్లతో కాల క్షేపం చేశారు .భార్య రోజ్ వీళ్ళను చూసి కొంత అసూయ కొంత జుగుప్స కోపం తో భర్తకు దూరంగా ఉంది .వాళ్ళ కోలాహలం భరించలేక పోయింది వాళ్ళ అభిమాన శిల్పి మరణ శయ్యమీద ఉన్నాడని వాళ్లకు స్పృహ లేకుండా పోయినందుకు విచారించింది కాని ఆ విషయం ‘’మాస్టర్ ‘’కు చెప్పే సాహసం చేయ లేక పోయింది ,నిస్సహాయం గా నిస్చేస్తం గా ఉండిపోయింది .రోడిన్ చుట్టూ చేరిన ఆడవాళ్ళు తమలో తాము కలహించుకొని జుత్తూ జుట్టూ పట్టుకొని పోట్లాడుకొన్నారు .తిట్టుకొన్నారు కొట్టుకొన్నారు .చాలా అసభ్యంగా ప్రవర్తించారు .చివరికి జూడిత్ క్లాడ్ వచ్చి పరిస్తితిని చక్క బరచాల్సోచ్చింది .

యాభై ఏళ్ళ కాపురం తర్వాత రోజ్ ను  పెళ్ళాడిన రోడిన్

సెప్టెంబర్ లో రోడిన్ కు ప్రభుత్వ పెన్షన్ ఇచ్చారు ,ఈ పెన్షన్ తో రోజ్ జీవితం గడవటం కష్టం అనిపించింది రోడిన్ కు .ఆమె ను వివాహమాడి భార్య అని తెలియ జేస్తేనే ఆమెకు న్యాయం చేసిన వాడిని అవుతాననుకొన్నాడు.అప్పుడే చట్టప్రకారం తనకున్నదంతా ఆమెకు దక్కుతుందని భావించాడు .1917 జనవరి లో రోజ్ ను రోడిన్ పెళ్ళాడాడు యాభై ఏళ్ళు ఆమెతో కలిసి జీవించి తన 68వ ఏట రోజ ను పెళ్లి చేసుకొని ఆమెకు చట్టా భద్రత కల్పించాడు .ఈ వివాహ వేడుక ముగియగానే రోజ్ కు విపరీతమైన దగ్గు వచ్చి ,గదులను వెచ్చ చేసుకోవటానికి బొగ్గు కూడా లేకుండా గడిపి కొన్ని వారాల తర్వాతా రోజ్ మరణించింది .

మహా శిల్పి మహాభి నిష్క్రమణం

భార్య రోజ్ మరణం తర్వాత రోడిన్ ఎనిమిది నెలలు మాత్రమె జీవించాడు .వాతావరణం తట్టుకోలేనిదిగా ఉండేది .విపరీతంగా దగ్గు తెరలు తెరలుగా వచ్చేది .చలి మరీ విజ్రుమ్భించింది .గడ్డకట్టే చలి బాధించింది .వేడి చేసుకొనే బొగ్గు లేదు .ఈ నరక యాతన భరిస్తూ చివరికి 17-11-1917న  77 ఏళ్ళ వయసులోఅమరశిల్పి రోడిన్  మరణించాడు .మాదన్ లో రోజ్ సమాధి దగ్గరే రోడిన్ సమాధిని కూడా ఏర్పాటు చేశారు .వారి సమాదులమీద కంచు శిల్పం ‘’ది దింకర్’’ను ఉంచారు

.                 రోడిన్ ‘’సర్ఫేస్ మోడలింగ్ కళ’’

1870లో ఇటలీ యాత్ర తర్వాతా అనుకోకుండా రియలిజం కు మారాడు .  1900 నాటికి రోడిన్  ఫ్రాన్స్ దేశపు మహా శిల్పి అని పించుకొన్నాడు .తర్వాత ప్రపంచ మహా శిల్పులలో ఒకడై ప్రపంచ వ్యాప్త కీర్తిని పొందాడు .ధన సంపన్నులేందరో ఆయనకు మహా శిల్పాలు తయారు చేసే బాధ్యతలు అప్పగించారు దాన్ని సార్ధకం చేసుకొన్నాడు .

నేచరిస్ట్ అయిన రోడిన్ భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యత నివ్వకుండా ,వ్యక్తిత్వానికి ఎమోషన్ లకు మాత్రమె విలువ నిచ్చాడు .తరతరాల సంప్రదాయాన్ని ,గ్రీకుల ఆదర్శ వాదాన్ని వదిలేసి ,బోరోక్ నియో బోరోక్ ల డేకరేటివ్ కళను కూడా దూరం చేసుకొని తనదైన రీతిలో వృద్ధి  చేశాడు ,ప్రతి శిల్పం రక్త మాంసాలతో వ్యవహరిస్తున్నట్లు గా తీర్చి దిద్దాడు .భావోద్రేకాలను  అతి స్పష్టంగా వ్యక్త పరచాడు .మనిషి మానసిక స్వభావాలు అతని భౌతిక స్వరూపాలకు ప్రతి బింబాలు అని భావించాడు .రోడిన్ ది ’’సర్ఫేస్ మోడలింగ్ కళ’’అంటారు .అతను సృష్టించిన ‘’దింకర్ ‘’శిల్పాన్ని గురించి రోడిన్ ‘’అందులోని మనిషి మెదడు తో నేకాక  నుదురు ,ముక్కు పుటాలు ,బిగ బట్టిన పెదిమలు ,చేతులు కాళ్ళ లోని ప్రతి కండరం ,ముడిచిన పిడికిలి బిగ పట్టిన మడమలు అన్నీ ఆలోచిస్తాయి అంటాడు .

శిల్పం లో సర్వ  సత్తాక స్వేచ్చ

రోడిన్ శిల్పాలే కాదు శిల్ప ఖండాలు కూడా సర్వ సత్తాక స్వేచ్చను వ్యక్తం చేస్తాయి .శిల్ప ఖండాలైన బాహువులు లేకుండా కాళ్ళు  లేకుండా ,తలలేకుండా ,చేసినవి అనూచానంగా వస్తున్న సంప్రదాయానికి తిరస్కరణలే .ఒకే మాదిరి మూస పోకడ నుండి తమకు తాము వ్యక్తిత్వం తో ప్రకాశించేట్లు చేశాడు .వీటికి ఉదాహరణలే వాకింగ్ మాన్ ,మెడిటేషన్ వితౌట్ ఆర్మ్స్ ,ఐరిస్ ,మెసెం జర్ఆఫ్ ది గాడ్స్ శిల్పాలు.

బాధ ,సంఘర్షణ ఆధునిక కళకు ‘’హాల్ మార్క్ ‘’అన్నాడు రోడిన్ . ‘’Nothing, really, is more moving than the maddened beast, dying from unfulfilled desire and asking in vain for grace to quell its passion.”’’అన్నాడు రోడిన్ .

సంగీత కళాభిమానం

 రోడిన్ కు వీర ఆరాధకుడు కవి బాడరెల్ . రోడిన్ కు సంగీతం ఇష్టం .గ్లాక్ చేసిన ఒపేరా మ్యూజిక్ అంటే అభిమానం .ఫ్రెంచ్ కేతడ్రిల్స్  .పై గ్రంధం రాశాడు రోడిన్ .అందరూ మర్చిపోయిన’’ ఎల్ గ్ర్రీకో ‘’ ,అప్పటికి ఇంకా ప్రాధాన్యం పొందని ‘’వాన్ వొఘ్ ‘’ల సంగీతాన్ని స్వంతం చేసుకొన్నాడు రోడిన్ .

రోడిన్ శిల్పకళలో పరిణామం

తన శిల్పాన్ని తయారు చేయించుకొంటూ జార్జి బెర్నార్డ్ షా రోడిన్ ముందు కూర్చున్నాడు .అప్పుడు రోడిన్ ను బాగా గమనించిన ఆయన ‘’రోడిన్ అనేక అద్భుతాలను ఆవిష్కరించాడు’’అన్నాడు . .తన బస్ట్ శిల్పం తయారీలోని వివిధ దశలను గమనించిన షా ‘’ కళావిర్భావ పరిణామ దశలన్నీ చూపించాడు రోడిన్ ‘’అని శ్లాఘించాడు ‘’మొదటగా బైజాంటిన్ మాస్టర్ పీస్ లాగా ,బెర్నిని ని లాగ  ,తర్వాత గొప్ప హూడన్ ల కళా సంవిధానం దర్శింప జేశాడు .అతని చేతులు ఒక శిల్పి శిల్పించే చేతుల్లా ఉండవు .’’ఎలాన్ వైటల్ ‘’చేత లాగా అంటే అంతరాత్మ చేత లాగా ఉంటుంది అన్నాడు .’’ది గాడ్ ఆఫ్ హాండ్ ‘’అనేది రోడిన్ చేతి పనే .

రోడిన్ వర్కింగ్ మోడల్

ఏ శిల్పం చేసినా మొదట మట్టి తోనే చేసేవాడు దీనికి అతి నిపుణులైన సహాయకులను పెట్టుకొనేవాడు .తర్వాత ప్లాస్టర్ తో చివరికి కంచు తో చేసేవాడు .అదీ అతని పని తీరు .ఈ విధం గా 19 వ శతాబ్దపు శిల్ప కళ దానికి ప్లాస్టర్ ను వాడే తీరుకు నాంది పలికాడు రోడిన్ .

రోడిన్ ప్రత్యేకత

శిల్ప కళను సంప్రదాయ విధానానికి భిన్నంగా తీర్చి దిద్దాడు రోడిన్ .రిపిటీషన్ నుంచి దాన్ని తప్పించాడు  .20 వ శతాబ్దపు శిల్పకళకు దారి చూపాడు . His popularity is ascribed to his emotion-laden representations of ordinary men and women – to his ability to find the beauty and pathos in the human animal.

రోడిన్ జీవితకాలం లో అతన్ని మైకేల్ ఆంజేలో తో పోల్చేవారు .ఆ యుగపు గొప్ప శిల్పి అని భావించారు .రోడిన్ చనిపోయిన మూడు దశాబ్దాలకాలం లో ఆయన్ను అందరూ మర్చిపోయారు .1950 నుంచి రోడిన్ ఆరాధన మళ్ళీ ఊపు అందుకొన్నది .ఆధునికకాలపు మహా శిల్పి అని గుర్తించారు .రోడిన్ చేసిన’’ వాకింగ్ మాన్ ‘’శిల్పం 20 వ శతాబ్దపు ‘’ఆముక్త కళ’’ అంటే ఆబ్ స్ట్రాక్ట్  స్కల్ ప్చర్  ఆర్ట్ కు మార్గ దర్శకమైంది .

బాల్జాక్ శిల్పం

See adjacent text.

Nude man holding is hand out, as if explaining a point.

జాన్ బాప్టిస్ట్

the thinker

మరో వ్యక్తితో మళ్ళీ కలుద్దాం

 

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-15 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.