ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -52

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -52

21-ప్రముఖ ఫ్రెంచ్ ఆధునిక ఇంప్రెష నిజం చిత్రకారుడు- అగస్టే రేనార్

చిత్రం వినోదం

20 ఏళ్ళ వయసులో ఆగస్టీరేనార్ తాను గీసిన కొన్ని చిత్రాలను ‘’గ్లేయిర్ ‘’అనే పెయింటర్ కు చూపించాడు .ఒక సారి చూసి ‘’చేతకాని పని చేసి పెయింట్ తో నిన్ను నువ్వే  వినోద పరచుకోన్నట్లున్నాయి  ‘’అన్నాడు .కుర్రాడు వెంటనే ‘’నాచిత్రం నాకు వినోదం  కలిగించక పోయిన రోజు పెయింటింగ్ వేయటం  ఆపేస్తాను ‘’అన్నాడు .చిత్రాలలో వినోదానికి అంత ప్రాధాన్యత నిచ్చాడు రేనార్ .అన్ని రకాల చిత్రాలు గీశాడు .అవి వినోదాన్నే కాదు ఆశ్చర్యాన్నీ కలిగించాయి .అనేక శైలులలో  చిత్రించాడు వైవిధ్యం అతని ఊపిరి .పాలెట్ నైఫ్ టెక్నిక్ దగ్గర్నుంచి,ఎకడమిక్ డ్రాయింగ్ లదాకా అన్నీ చేశాడు .సాధారణం నుంచి సంక్లిష్టం దాకా ప్రయాణించాడు .నగ్న చిత్రాలు కుటుంబ చిత్రాలు కూడా గీశాడు .సూర్య కాంతిలో మెరిసే ప్రక్రుతి దృశ్యాలు ,స్నాన ఘట్టాలలో విషయాలు ,చిన్నారుల నవ్వుల అందాలు అన్నీ అతని చిత్రాలలో జీవం పోసుకోన్నాయి .

సంగీతం నుంచి చిత్రలేఖనానికి

మొదటిసారిగా రేనార్ కాన్వాస్ మీద చిత్రం గీయ లేదు .పోర్సేలీన్ తో చేశాడు ఫ్రాన్స్ దేశం లో లిమోజేస్ అనే చోట రేనార్ 24-2-1841 జన్మించాడు. అసలు పేరు పియరీ అగస్టే రేనార్ .కూలి పని చేసుకొనే అతని తలిదండ్రులు పారిస్ కు మారారు .కొడుకు సంగీత విద్వా౦సుడవుటాడని ఆశించారు .గురువు సంగీతంమేస్తారు .కాని రేనా ర్ చేతులకు  పియానో వాయించటం కంటే పెన్ను తీసుకొని రాయటానికే ఇష్టం గా ఉండేది .14 వ ఏట పారిస్ లోని చైనా ఫాక్టరీలో అప్ర౦ టిస్ గా చేరాడు .కుండలు జాడీలపై చేతి తో పెయింటింగ్ వేసేవాడు .కాని ఇది ఎక్కువ కాలం సాగలేదు .వాణిజ్యపరమైన డిజైన్లు రూపొందించాడు .ఫాన్ లకు ,ట్రేలకు డిజైన్లు వేసి బాగానే డబ్బు కూడ  బెట్టి గ్లేయర్ ఆర్ట్ క్లాసుల్లో చేరాడు .ఇక్కడే సిసిలీ మొనేట్ అనే అతనితో పరిచయమై స్నేహితుడయ్యాడు .అతను ఇతన్ని కళా ప్రపంచపు ద్వారాలు తెరిచి చూపించాడు .కేధలిక్ అయినా కనిపించిన ప్రతిదానిలో అందాన్ని చూసేవాడు .స్టూడియోలకు  సెలూన్ లకు వెళ్లి విషయాలు అర్ధం చేసుకొనేవాడు .తాను  లోవర్ మధ్య ఉన్నట్లు ఫీల్ అయ్యేవాడు. నిజానికి అతను ఉన్నది మౌంటెన్ బ్లీన్ ఫారెస్ట్ దగ్గర .ఆ అరణ్యం అతన్ని బాగా ఆకర్షించింది .

యువ ఆర్టిస్ట్స్  అసోసియేషన్

24  వయసులో రేనార్ గీసిన రెండు చిత్రాలను సెలూన్ మెచ్చి ఆహ్వానించింది ..కాని తన విధానం లో తానూ వేసి చిత్రాలను పంపిస్తే తిరస్కరించింది సెలూన్ .కానీ అది వైఫల్యం కాదు .పోర్త్రైట్లకు కమీషన్ వచ్చేది .మురికి కూపం లోంచి మకాం రూ సెయింట్ జార్జ్ కి మార్చాడు .ఒంటి మీదకు 33 వచ్చాయి .స్వంత కాళ్ళ మీద నిలబడే సత్తా వచ్చింది. ఇరవై మంది ప్రయోగకులతో కలిసి ఒక సొసైటీ ఏర్పాటు చేశాడు .ఇందులో డేగస్ ,పిస్సరొ ,మొనేట్ ,సిజన్నే ,కూడా సభ్యులే .వీరందరూకలిసి మొదటి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు .చూసినవాళ్ళు పిల్లికూతలు అరుపులు కేకలతో నిరుత్సాహ పరచారు .మళ్ళీ రెండో ప్రదర్శన పెడితే మొదటిదానికంటే భీభత్సం జరిగింది .రేనార్ చిత్రాలను చూసి మొనేట్ అతనికి ప్రతిభ లేదని ఆ విషయం అతనితో చెప్పమని రేనార్ స్నేహితుడికి చెప్పి ఇంక పెయింటింగ్ జోలికి రేనార్ ను వెళ్ళ నీయ వద్దు అనిఒక ఉచిత సలహా పారేశాడు .   ,

ఇంప్రెష నిస్టులు

ఈ కొత్త ఆర్టిస్ట్ గ్రూప్ ను చీదరించుకొన్నారు, అవహేళన చేశారు అందరూ .మొనేట్ ఒక కాన్వాస్ పై ‘’ఇంప్రెషన్- సన్ రైజ్ ‘’చిత్రించాడు .దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఈ గ్రూపు కు ‘’ఇంప్రెష నిస్టులు ‘’అని ముద్ర వేశారు .ఈ పేరును ఈ గ్రూపు తిరస్కరించలేదు .ఆహ్వానించారు .’’treating a subject in terms of the tone and not of the subject itself is what distinguishes the Impressionists from other painters ‘’అని తమ భాష్యం చెప్పుకొన్నారు .వాస్తవానికి ప్రతిబింబం కాదుకాని దాన్ని మరో రకం గా ఆవిష్కరించటమే వారు చేసిన పని .జ్ఞానేంద్రియ జ్ఞానానికి ప్రాధాన్యమిచ్చి ,ప్రకాశవంతమైన చిత్రాలు గీటమే ధ్యేయంగా పని చేశారు .పెయింట్ స్ట్రోక్ లతో ఫలితాలు రాబట్టారు ‘’they succeeded in in blurring the out lines of objects and merging them with the surroundings .This method permitted the introduction of one color into the area of another without degrading or losing it –thus enriching the color effects .The technic of vivid strokes seemed best to their efforts at retaining rapidly changing aspects ‘’అని ‘’the history of impressionism ‘’లో రేవాల్ద్ రాశాడు కాంతికి  చాయకు ఉన్న అనంతమైన మార్పుల్ని గుర్తించటం వాటిని కొత్తగా పిగ్ మెంట్ భాషలో చూపటం ఇందులో ప్రత్యేకత .దీనితో స్టూడియోలకే పరిమిత మైనచిత్రకళ  బాహ్య ప్రపంచం లోకి వచ్చి పొలాలు  అడవులు సరసులు ,సుడులు తిరుగుతున్న నీటి ప్రవాహాలు చిత్రాలలో దర్శన మిచ్చాయి .మొనేట్ ఏకంగా ఒక పడవ మీదే స్టూడియో నిర్మించుకొన్నాడు .చీకటి వెలుగుల  చిందు లాట దర్శించి చిత్రించాడు  .సిజన్నే లాగా రేనార్ కూడా ‘’దిఆర్ట్ ఆఫ్ ఇమ్మీడిఎట్ ‘’ను అభినందించాడు .ఇదే సెన్సిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నారు .ఒక ఆకు అంతర్నిర్మాణం  ఎలా ఉందొ చెప్పటానికి దాన్ని చిత్రవధ చేయక్కరలేదు స్పాంటేనియస్ విజన్ ఉంటె చాలు అంటాడు .

Inline image 1     Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 ఉయ్యూరు


గబ్బిట దుర్గా ప్రసాద్

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.