గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః –గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా)దంపతుల సౌజన్యం తో
గురు పూజోత్సవ ఆహ్వానం
సుమారు 70 సంవత్సరాల క్రితం ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేన్యులు కీ .శే.కోట సూర్య నారాయణ శాస్త్రి గారి చిత్ర పట ఆవిష్కరణ కార్య క్రమం వారి కుటుంబ సభ్యుల సమక్షం లో గురుపూజోత్సవం నాడు 5-9-2015శనివారం ఉదయం 10 గం లకు సరసభారతి ,మరియు పి. ఆర్. ఎస్. ఏం. జూనియర్ కళాశాల సంయుక్త ఆధ్వర్యం లో ఆ కళాశాల ఆవరణలో జరుగుతుంది ..ముఖ్య అతిధిగా శాసనమండలి సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ విచ్చేస్తారు .చిత్రకారుడు శ్రీ టి. వి .ఎస్. బి .శాస్త్రి (ఆనంద్),దంపతులు ,మా గురుపుత్రులు తమ కుటుంబాల తో పాల్గొని కార్యక్రమానికి వన్నె తెస్తారు .ప్రముఖ సంగీత విద్వాంసురాలు శ్రీమతి సింగరాజు కల్యాణి గారు సంగీత కచేరి తో వీనుల విందు చేస్తారు . . శ్రీ రాజేంద్ర ప్రసాద్ కు ,గురు పుత్రుల కుటుంబాలవారికి , ,ఆర్టిస్ట్ శ్రీ ఆనంద్ దంపతులకు , కళాశాల అధ్యాపకులకు ,సంగీత విద్వాంసురాలు శ్రీమతి కల్యాణి గారలకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది . ప్రతిభ గల ఒక పేద విద్యార్దినికి, ఒక విద్యార్ధికి శ్రీ మైనేని గోపాల కృష్ణ దంపతులు ఏర్పాటు చేసిన శ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి స్మారక నగదు బహుమతిని సరసభారతి ద్వారా అందజేయ బడుతుంది ..పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రిక ఆగస్ట్ లో అంద జేస్తాము .
గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు –మరియు పి.ఆర్ ఎస్ ఏం .కాలేజ్ –ఉయ్యూరు
26-6-15 –ఉయ్యూరు