దశమ వార్షికోత్సవ చినుకు సంచిక
‘’ఇక చినుకు రాదు .అయిపొయింది ,ఆగిపోయింది ‘’అని కొందరు సంబర పడుతున్న కాలం లో చినుకు సాహిత్యపు వానై ,వరదై, పదవ వార్షిక ప్రత్యేక సంచికగా రెండు రోజుల క్రితమే వచ్చి అందర్నీ ఆశ్చర్య పరచింది . రావు అనుకొన్న వర్షాలు ఈ మధ్య విపరీతంగా కురిసి హర్షాన్ని తెచ్చాయి ఆంద్ర దేశానికి .ఇప్పుడు ‘’ఈ చినుకూ’’ అంతే .
ముచటైన ముఖ చిత్రం ముందుగా మనల్ని ఆకట్టు కొంటుంది .’’అక్షరాలూ సేకరిస్తూ చల్లుకుంటూ సాహితీ సేద్యం చేస్తున్న నండూరి మాటలు ఎంకిపాటల్లా కమ్మగా ఉన్నాయి.ఎండ్లూరి వారి అష్ట విధనాయికలు సంచికకు ఒక హైలైట్ అయితే, పన్నాల వారు అబ్బూరివారితో చేసిన ఇంటర్వ్యు మరో హెవీ లైట్ .’’సహన ద్రుష్టి తో సమీక్షించ గలిగే వ్యక్తిత్వాలే –సముదాత్త జీవన గమనానికి ‘’పధ సూచికలు అన్న సి నా రే కవిత అందరికి గణపాఠమే .’’అత్యాధునిక జీవన శైలిలో –అంతర్గతంగా దాగిన తృష్ణ ‘’వావి వరసలు విస్మరించే పశుకామ తృష్ణ అని నిఖిలేశ్వర్ సమాజ పోకడను చిత్రించారు .భండారు వారి మనం మరచిన’’ హరికధ’’ను బాగానే ‘’గానం’’ చేశారు .ఎందుకో నరేంద్ర కద మధురాంతకం గా లేదు .సినీకవుల గేయాలు చర్విత చర్వణాలే అయినా ‘’ఆపాత మధురాలే ‘’.జాన్సన్ గారీమధ్య ఏదిరాసినా ‘’చోమన దడి ‘’గా కొత్తగా ఉంటోంది .కవన శర్మ కధకు హాట్సాఫ్ .రాంబాబు గారికద నిజం గా ఆయన ‘’కధా వేదగిరి ‘’అనిపించింది .చలపాక కద కరెంట్ టాపిక్ .పండుముసలి వింజమూరి గారు గోప దంపతులకు గౌరవం తెచ్చారు .’’రాయ్ ‘’గారు రాయాల్సింది పొందికగా రాశారు .
30 కధలు ,20 కవితలు ,8 సమీక్షలు ,10 విశ్లేషణలు ,ఒక ముఖా ముఖం వగైరాలతో బృహత్తర అక్షర వాహినిగా ఏప్రిల్ –మే కలగలపు ప్రత్యెక సంచికగా చినుకు దర్శనమిచ్చింది .కొని చదివి పదిల పరచుకోవలసిన సంచిక ఇది .
గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 –ఉయ్యూరు .