గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
154—శివ స్వామి
‘’కప్ఫానాభ్యుదయం ‘’ అనే ఒకే ఒక కావ్యం రాసిన శివ స్వామి కవి కాశ్మీర్ రాజు అవంతి వర్మ వర్మ ఆస్థానం లో ఉండేవాడు .కాలం క్రీ శ 855-884. బౌద్ధ ధర్మావలంబి.బౌద్ధం అంటే వీరాభిమానం .పైన పేర్కొనబడిన కావ్యం బుద్ధుని స్తుతి తో ఆరంభ మవుతుంది .ఇరవై కాండలున్న ఈ కావ్యం లో దక్షిణా పద రాజు కప్ఫాన చేసిన దండయాత్రల వర్ణనలున్నాయి .శ్రావస్తి రాజు ప్రసేన జిత్తు రాజ్యం పై సాగిన దండ యాత్ర ఇది ..ఈ యాత్ర మలయ పర్వతాల ద్వారా జరుగుతుంది .యాత్రమధ్యలో అనేక ఋతువులు గడిచి పోతాయి .సిల్వన్ అందాలు ప్రేమికుల సరసాలు అన్నీ ఇందు లో కవి వర్ణించాడు .యుద్ధం లో విజయం సాధించినా ,కప్ఫాన వేదాంత ధోరణిలో పడిపోయాడు .ప్రపంచ బంధాల నుండి విముక్తుడై ప్రశాంత పవిత్ర జీవితం గడిపాడు .బుద్ధ భగవానుని శిష్యునిగా మారి నిర్వాణ సుఖం పొందాడు .
శివ స్వామి కావ్యం మాఘుని శిశుపాల వధ కావ్యాన్ని , కిరాతార్జునీయాన్ని పోలి ఉంది .యమకాల గమకాల సొగసు చూపించాడు .బంధ కవిత్వం లోనూ ప్రజ్ఞ చూపాడు . కాని కావ్యం పూర్తిగా లభ్యం గా లేదు ‘
155-జిన సేన కవి
జినసేనకవి వీరాచార్య శిష్యుడు . వీరాచార్య సుభాద్రుడు ,లోహార్యుల కాలం లో ఉన్న పవిత్ర గ్రందాల కు అధిపతి .శ్వేతాంబర జైన మతానికి ఆచరణాంగాల్లో నిష్ణాతుడు .వీరాచార్యుడు,శిష్యుడు జిన సేన కవి ఇద్దరు కలిసి రాష్ట్ర కూట రాజు అమోఘ వర్మను జైన మతం లోకి మార్చారు . రాజు సర్వ సంగ పరిత్యాగం చేసి రాజ్యాన్ని కుమారుడికి 875 లో పట్టాభి షేకం చేశాడు .వీరాచార్యుడు రాజుకు సన్నిహితుడై ‘’గణిత సార సంగ్రహం ‘’లో ప్రశస్తి చేశాడు
గుణ సేనుడి శిష్యుడు గుణ భద్రుడు అకాల వర్ష కు చెందిన రెండవ కృష్ణ రాజు కు ఆచార్యుడు. జిన సేనుడు అమోఘ వర్మ మనవడు మొదటి కృష్ణ రాజు కాలం లో ‘’పార్శ్వాభ్యుదయం ‘’ను 814లో రాశాడు .ఆది పురాణం లో జినసేనుడు 42 అధ్యాయాలు రాశాడు .చివరి అయిదు అధ్యాయాలను శిష్యుడు గుణ భద్రుడు పూర్తీ చేశాడు .ఈ విషయాన్ని ఉత్తర పురాణం లో చెప్పాడు .దీన్ని లోక సేన కవి రాష్ట్ర కూట రాజు రెండవ కృష్ణుడి కాలం అకాల వర్ష లో 897 జూన్ లో రాశాడు .పార్శ్వాభ్యుదయం కాళిదాసమేఘ సందేశానికి అనుకరణ.కాళిదాసు శ్లోకం లోని చివరి పాదాన్ని గ్రహించి మిగిలిన మూడు పాదాలు తాను కూర్చాడు .23 వ జైన తీర్ధ౦కరుడైన పార్శ్వనాధుని చరిత్రే ఇది .జిన సేనుని కవిత్వం ఉన్నత సంప్రదాయం లో ఉందడి విశిష్ట గుణ గరిష్టంగా ఉంటుంది .కాళిదాసు కవిత్వానికి సరి సమానంగా ఉంటుంది .కాని కాళిదాసును మించి మాత్రం కవిత్వం ఉండదు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-6-15 ఉయ్యూరు