గోపాల కృష్ణాష్టకం -2
5-కుమారులిద్దరూ కృష్ణ ,రవి
తలిదండ్రుల సంస్కారం తో పెరిగి
తమదైన విధానం తో విలసిల్లుతున్నా
ఇద్దరికీ వారు నిత్య ఆరాధ్య దైవాలే
ఇద్ద్దరు కోడళ్ళు ,మనుమలు మనవ రాళ్ళు
ఆ ఇంటి సౌభాగ్య చిహ్నానికి ఆన వాళ్ళు
దేశీయత నిండిన విదేశ జీవన యానం
విదేశం లో వెదజల్లుతున్న జంట విజ్ఞాన ప్రసూనం .
6-అక్క డాక్టర్ శ్రీమతి అన్నపూర్ణకు నుద్దియౌ బావ
డాక్టర్ శ్రీ నరసింహ శర్మ ఏం. డి. రాచకొండ
సాహితీ సౌరభాలు వెదజల్లే ఏరాడ కొండ
వైద్యం లోనేకాక ఆంధ్రాంగ్ల గీర్వాణాల మేలిమి కలయిక
మా గోపాల కృష్ణ దంపతులకు అక్కా బావా
ఆది ఆదర్శదంపతులు భళిరా వారే వా .
వారిద్దరి సంస్కారానికీ వీరిద్దరి నీరాజనాలు
వసుధైక కుటుంబ భావనలకు వెదజల్లిన బీజాలు .
7-సిద్ధ యోగిపు౦గ వులను తల్లికి అంకిత మిప్పించి
మహిళా మాణిక్యాలను జీవన సహచరి అర్ధాంగి కిప్పించి
క్షేత్రాలనేమో తన్నుతీర్చి దిద్దిన కోగంటి వారి కందజేయించి
ఋణము తీర్చుకొన్నట్టి ఘనులు గోపాల కృష్ణ
పట్టు బట్టి తెలియ కుండ ‘’గీర్వాణకవుల ‘’న౦కితమిచ్చి
గోపాల బంధుకోటి లోఒకడనై సరస జేరి
ధన్యుడనైన నా భాగ్య గరిమ ఎన్న దరమే
సరసభారతికి శ్రేయో మూర్తి గోపాల కృష్ణ మూర్తి .
8-పుట్టిన దేశం పై ,పెరిగిన గ్రామ౦ పై ఎంతటి ఆరాధన !
ఎన్నెన్నో దాన ధర్మాలు చేసి చేతికి ఎముక లేదని పించారు
ఉయ్యూరు ఊసులకు ,ఊసుల్లో ఉయ్యూరుకు పరవశులౌతారు
ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ వారిది అభయ హస్తమే
పెడ దారిన పడిన వారికి అందించే ఆపన్న హస్తమే
బంధువులందరి నోళ్ళలో నానే ‘’కృష్ణ ‘’–‘’కృష్ణ మామ ‘’
స్నేహపు విలువ తెలిసిన అక్షర తేజో మూర్తి గోపాల మైనేని
వర్ధిల్లాలి వారి దాంపత్యం సుఖశాంతులతో ఏండ్లు ఎన్నేని .
మీ ఆప్తుడు ,ఆత్మీయుడు – దుర్గా ప్రసాద్ -28- 6-15-ఉయ్యూరు