గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 188-హరివంశ కావ్య కర్త-లోలంబ రాజు –‘’

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

188-హరివంశ కావ్య కర్త-లోలంబ రాజు –‘’

హరిహర రాయల ఆస్థానం లో లోలంబరాజ కవి ఉండేవాడు .సూర్య పండితుని వంశానికి చెందినా దివాకరుని పుత్రుడు  .’’హరివంశ’’ కావ్యంఅయిదు కాండలలో  రాశాడు .’’సుందర దామోదర ‘’కావ్యం లో శ్రీకృష్ణ చరిత్ర రాసి కంస వధ తో పూర్తీ చేశాడు .వైద్య శాస్త్రం లో నూ అపార అనుభవమున్నవాడు . ఉపయుక్త వైద్య గ్రంధాలు చక్కని కవిత్వం తో రాశాడు .

189- డిండిమ కవి సార్వ భౌముడు -అరుణ గిరి నాధుడు

మొదటి రాజనాధుడు అభిరామా౦బికల కుమారుడుఅరుణ గిరినాధుడు .సామశాఖకు చెందిన గౌతమ గోత్రీకుడు .మాతామహుడు అభిరాముడు ‘’శ్రీకంఠ ఆగమ శాస్త్రం ‘’లో మహా పండితుడు ‘’.డిండిమప్రభు’’లేక మొదటి డిండిమ గా ప్రసిద్ధుడు .సభాపతి మేనమామ ,నృత్తరాజు పితామహుడు .శ్రీకవిగా తాతగారు సురేంద్ర అగ్రహారం లో పేరు పొందాడు ఎనిమిది భాషలలోపండితుడు .యజ్నా౦బిక ను  వివాహమాడాడు.  .ఎవరిని ఓడించినా డిండిమ (ఢక్క)ను మోగించి జయభేరిగా సూచించేవాడు .అందుకే రెండవ డిండిమకు  కవి సార్వ భౌముడు అనే బిరుదు వచ్చింది .విజయనగర రాజు రెండవ దేవ రాయలకాలం లో 1422-48కాలం లో ఉండేవాడు .కవిమల్లుని చర్చల్లో ఓడించాడు .’’సోమవల్లి యోగానందం ‘’అనే ప్రబంధాన్ని రాశాడు .హాస్య వ్యంగ్య అవహేళనాత్మక రచన ఇది .

అరుణ గిరినాదుడైన డిండిమ భట్టు కుమారుడే రెండవ రాజ శేఖరుడు .ఇతనికీ డిండిమ కవిసార్వ భౌమ బిరుదు ఉంది .రెండవ డిండిమ భట్టు  అంటారు .సాల్వనరసింహ రాయల ఆస్థానకవి .సాళువాభ్యుదయం రాశాడు .ఇతన్ని గురించి మొదటిభాగం లో తెలుసుకొన్నాం .

190-పాండవాభ్యుదయ కవి- శివ సూర్య

అభిరాముని కొడుకు సభాపతికి స్వయంభు అనే కొడుకు ,అభిరామ కామాక్షి అనే కూతురు ఉన్నారు .స్వయంభు రెండవ డిండిమ కూతుర్ని పెళ్ళాడాడు .వీరికుమారుడే శివ సూర్య కవి .వీళ్ళది శ్రీ వత్స గోత్రం .సూర్యకవి ఎనిమిది కాండల’’ పాండవాభ్యుదయం ‘’కావ్యం రాశాడు .ఇది మహా భారత కధ .ఇతని కొడుకు భాస్కరుడు హాలఘట్టి రాజు ఆశ్రితుడు .’’వల్లవాభ్యుదయం’’ అనే అయిదు  అంకాల  నాటకం రాశాడు .శ్రీరంగం దగ్గర తిరువనక్కాల్ లో జంబు నాద  ఉత్సవాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించారు .అభిరామ కామాక్షికి కృష్ణ ,రామ అని ఇద్దరు కొడుకులు .

అభిరామ కామాక్షి కూడా గొప్పకవి .శ్రీరామ కధను ‘’అభినవ –రామాభ్యుదయం ‘’కావ్యం గా ఇరవై నాలుగు కాండలలో రాసింది .

191- .కవిరాజ రాజు  -రెండవ అరుణ గిరి నాధుడు .

నాలుగవ డిండిముడు లేకకుమార డిండిమ అయిన రెండవ అరుణ గిరినాధుడు రాజనాధుని కొడుకు .పరేంద్రఅగ్రహారం లో ఉండేవాడు .వీరనరసింహ రాయల  కృష్ణ దేవరాయల ఆస్థానకవి .1505-1530కాలపు కవి .బహుభాషా వేత్త గా సుప్రసిద్ధుడు .’’డిండిమ కవి సార్వసార్వ భౌమ ‘’’’కవిరాజ రాజ ‘’బిరుదాంకితుడు .’’వీరభద్ర విజయం ‘’అనే నాటకం రాశాడు .ఇందులో—వీరభద్ర జనం నుండి దక్ష యజ్ఞయ విధ్వంసం వరకు కద ఉంది .భూపతి రాయ పురం లో రాజ నాద ఉత్సవం లో ఈనాటకాన్ని  ప్రదర్శించారు .

192- భాగవత చంపు రాసిన -మూడవ రాజనాధుడు

కుమార డిండిమ కొడుకే మూడవ రాజ నాధుడు .విజయనగర రాజు అచ్యుత దేవరాయల కోరికపై ‘’భాగవత చంపు 1530-42‘ లో ’రాశాడు .శ్రీకృష్ణుని చరిత్ర ఇది .ఈ కవి రాసిన ‘’అచ్యుత రాయాభ్యుదయం ‘’పన్నెండు కాండల కావ్యం .మొదటి విజయనగర పాలకులనుంచి మొదలు పెట్టి తుళువ వంశ రాజులను ,వారి చంద్ర వంశాన్ని గురించి రాశాడు .నరస వీరనరసింహ కృష్ణ రాయల వరకు వర్ణించాడు .కృష్ణ దేవరాయల మరణం తర్వాత నరసింహ రాయల మూడవ భార్య ఓబులాంబ కొడుకు అచ్యుతరాయలు రాజు అయ్యాడు .ఈ కావ్యం లో ఎక్కువగా అచ్యుత రాయల దక్షిణ దేశ దండయాత్రల గురించే రాశాడు .అతని తీర్ధ యాత్రాక్రమాన్నీ వివరించాడు .బిజాపూర్ సుల్తాన్ ను ఓడించి ఘన విజయం సాధించటం తో కావ్యం పూర్తి  అవుతుంది .

కుమార డిండిను కూతురు ను మల్లికార్జున లేక స్పులింగకు ఇచ్చి పెళ్లి చేశారు .యితడు లక్ష్మణ సావిత్రిలకొడుకు .ఇతని తాత సోమనాధుడు సభాపతి దేశికుని శిష్యుడు .మల్లి ‘’సత్యభామ పరిణయం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .మూలనాడు ఉత్సవాలలో దీన్ని ప్రదర్శించేవారు .

193- సుభద్ర ధనుంజయ నాటకకర్త -మొదటి రాజ నాధుడు –

కుమారడిండిమ కాక రెండవ రాజనాదునికి ఒక కూతురు ఉంది .ఈమెను స్వయంభు కుమార్తె కొడుకు మొదటి రాజనాద్ కు ఇచ్చి పెళ్లి చేశారు .  స్వయంభు కు స్వయంభునాద ,కుమారుడు ఇతడు ‘’శంకరా నంద చంపు’’రాశాడు ఇది శివార్జునుల యుద్ధ కద .దీనితో బాటు ‘’కృష్ణ విలాస’’కావ్యమూ రాశాడు .ఇది పధ్నాలు కాండలు.’’’సుభద్ర –ధనుంజయ ‘’అనే అయిదంకాల నాటకం రాశాడు ‘’రత్నేశ్వర ప్రసాదాన ‘’అనే మరో అయిదు అంకాల నాటకమూ చేశాడు .కాశీలోని రత్నేశ్వర స్వామి అనుగ్రహం తో రత్న చూడ ,రత్నావతి ల వివాహం జరిగిన విధానం వర్ణించాడు ‘’మదన గోపాల విలాసం ‘’అనే భాణమూ రచించాడు ఇది రాదా కృష్ణుల ప్రేమ శృంగార కద.’’హరిశ్చంద్ర చంపు ‘ను సోమవారం నాడు రాశానని చెప్పాడు .

ఈ విధంగా డిండిమ వంశం లోని అనేక మంది కవులు అద్భుత కావ్య సృష్టి చేసి ఇంగువ కట్టిన గుడ్డ సామెతను నిజంగానే రుజువు చేసుకొన్నారు   .

194- తంజావూర్ దివాన్ -గోవింద దీక్షితులు

వసిష్ట గోత్రీకుడైన గోవింద దీక్షితుల భార్య నాగాంబ యజ్ఞనారాయణ ,వెంకట మఖ లు కొడుకులు .తిరు నాగేశ్వరం పట్టేశ్వారం లో ఎక్కువగా ఉన్నాడు .తంజా వూరు రాజులు చెవ్వప్ప ,అచ్యుత ,రఘునాధ రాయల ఆస్థానం లో మంత్రి పట్ట్టేశ్వారం  ఇప్పటికీ భార్యా భర్తల చిత్రాల అంతఃపురం లో చూడచ్చు .ఇంట్లో దీక్షితులు పరమ సంప్రదాయ బద్ధం గాను రాజాస్థానం లో పరమ పవిత్రం గా న్యాయ ధర్మాలకోసమూ పని చేసేవాడు .రాజకీయ దురంధరుడుగా పేరు .రఘునాధ గోవింద దీక్షితుల ఆత్మీయతపై గొప్ప శ్లోకం ప్రచారం లో ఉంది .’’చినామాద్యంత నామానౌ మహీ ప్రుద్వీశ తా ఉభౌ

శాస్త్రే శస్త్రే చ నిపుణా భాహువేషు హవేషు చ ‘’

దీక్షితులు అద్వైతా చార్యులుగా ప్రసిద్ధి చెందాడు .స్వయంగా కవి పండితుడు మహా రచయిత .అప్పయ్య దీక్షితులపై వీరాభిమానం ఉన్నవాడు .ఆయనను ‘’కల్ప తరువు ‘’పై భాష్యం రాయమనికోరాడు .అయన పరిపాలనలో ఎన్నో మండపాలు ,కావేరినదిపై అనేక స్నాన ఘట్టాలు నిర్మింపజేశాడు ఎన్నో అగ్రహారాలను రాజుల చేత దానం ఇప్పించిన దక్షుడు . .ధర్మ శాస్త్ర పారమెరిగినవాడు .న్యాయ బద్ధ పాలనకు అ౦కితమైనవాడు .వాదప్రతివాదాలు విని సామరస్యంగా సమస్యను పరిష్కరించటం గోవింద దీక్షితుల ప్రతేకత .వేదం లో చెప్పబడిన సకల క్రతువులు యజ్ఞాలు యాగాలు చేసిన పరమ కర్మిష్టి .జీవితం చివరలో అన్ని రాజ కార్యాలను సంపదను అన్నిటిని భగవంతునికి సమర్పించి కర్మ ఫల త్యాగాం తో జన్మను సార్ధకం చేసుకొన్న పుణ్యాత్ముడు .అద్వైత ఫలాన్ని మాత్రమె ఆశించిన మహా నైష్టికుడు.కుంభకోణం లో అమ్మవారు మంగలాంబ సన్నిధిలో తపస్సుతో గడిపి మోక్షాన్నిపొందిన పదహారవ శతాబ్దపు మహనీయుడు  గోవిన్దదీక్షితులు .కుంభకోణం ,తిరువది,పట్టేశ్వరం లలో గోవింద దీక్షితుఅలను అక్కడి శివలింగాలలతో పూజించి జ్ఞప్తికి తెచ్చుకొని కృతజ్ఞత తెలియ జేసుకొంటారు’ ఆ శివలింగాలలో గోవింద దీక్షితులను దర్శిస్తారు అంటే పరమాత్మలో ఐక్యమయ్యాడని భావం .ఆయనకూ ఆయన ధర్మ పత్నికి అక్కడ విగ్రహాలు నెలకొల్పి గౌరవించారు.

దీక్షితులకు సంగీత జ్ఞానం అపారం  ఆధునిక శాస్త్రీయ సంగీత సిద్ధాంత కర్తలు ముగ్గురిలో ఒకరు దీక్షితులు .మిగిలిన ఇద్దరు రామామాత్యుడు ,సోమనాధుడు . కుంభకోణం లోని రామస్వామి దేవాలయం ,నిర్మించాడు దివాన్ బహదూర్ గా ఉన్నప్పుడు .అప్పుడే ఈ రామస్వామి దేవాలయానికి  చక్రపాణి దేవాలయానికి మధ్య కారిడార్ కూడా నిర్మింప జేశాడు .

గోవింద దీక్షితుల రచనలలో’’సాహిత్యసుధ ‘’సంస్కృత సాహిత్య చరిత్ర .ఎందారోకవుల పరామర్శ.తన గురువులను రఘునాధ రాయాల గురించి రాశాడు. ‘కుమారుడు  వెంకట మఖి  తన ‘’చతుర్దండి ప్రకాశిక ‘’లో తన తండ్రి దీక్షితులు ‘’సంగీత సుధానిధి ‘’రాశాడని ,రామాయణం లోసు౦దరకా౦డకు వ్యాఖ్యానం కూడా రచించాడని చెప్పాడు .

గోవింద దీక్షితుల ఇద్దరు కొడుకులు యజ్ననారాయనుడు వేంకటేశ్వరుడు లేక వెంకట మఖి .వెంకట మఖి నీలకంఠకు గురువు ,’’సాహిత్య సామ్రాజ్య కావ్య ‘’ ‘’వార్తికాభారణ ‘’రచయితకూడా.

యజ్ననారాయణ  దీక్షితులు సర్వతోముఖ ప్రతిభకలవాడు .కవిత్వం లో దిట్ట .రఘునాధ రాయల ఆస్థాన కవి .రాజే యజ్ఞనారాయణ గురువుకూడా .అఆతను రాసిన పద మూడుకాండల’’సాహిత్య రత్నాకరం ‘’ఇప్పుడు లభించి అందుబాటులో ఉంది .’’ రఘునాధ విలాసం ‘’ అనే అయిదు అంకాల నాటకం ,’’రఘునాధ భూప విజయం ‘’అనే తంజావూర్ నాయక రాజుల చరిత్రకావ్యం ,రఘునాధుని సింహళ సమీప ద్వీప విజయం  ఇందులో ఉన్నాయి.వెంకటేశ్వర రచన ‘’చిత్ర బంధ రామాయణం ‘’కు వ్యాఖ్యానమూ రాశాడు .ఇలా గోవింద దీక్షితుల కుటుంబం వారూ గోప్పకవులై సాహిత్య రచన చేసి దీక్షితుల గౌరవాన్ని ఇనుమడింప జేశారు .

195-రత్న ఖేటుడు అనే అభినవ భావ భూతి – శ్రీనివాస దీక్షితులు

భావస్వామి కొడుకు కృష్ణకవి మనవడు శ్రీనివాస దీక్షితులు భావ స్వామికి ఆరవ తరం వాడు ‘’భాష్య’’రచయిత .విశ్వామిత్ర గోత్రం.ఇతనికి ముగ్గురు కొడుకులు కేశవ అర్ధనారీశ్వర ,రాజ చూడామణి .సాయంకాల దిక్చక్రాన్ని అద్భుతంగా వర్ణించి నందుకు చోళ రాజు ‘’రత్నఖేట ‘’బిరుదాన్నిచ్చాడు .ఆ పేరే నిలిచిపోయింది .అప్పయ్య ,గోవింద దీక్షితులకు సమకాలీనుడు .’’షద్భాష చతుర ‘’,’’అద్వైత విద్యాచార్య ‘’,అభినవ భవ భూతి ‘’’’దంతిజ్యోతి దివా  ప్రదీపు ‘’అనేగోప్ప బిరుదులూ అందుకొన్నాడు .గొప్ప పండిత విజ్ఞాని .వేదాంతం పై విస్తృత రచనలు చేశాడు .పద్దెనిమిది నాటకాలు ,అరవై  కావ్యాలు రాసినట్లు తెలుస్తోంది .శివలీలలను వర్ణిస్తూ ‘’సితికంఠవిజయం ‘’రాశాడు .దమయంతీ పరణయాన్ని ‘’భైమపరిణయం ‘అనే నాటకంగాను ,రుక్మిణీ కల్యాణాన్ని’’భైష్మిపరిణయం  ‘’చంపువును  రాశాడు .అతని ‘’సాహిత్య సంజీవిని ‘’,’’భావోద్బేధీ’’,’’రసార్నవ ‘’,’’అలంకార కౌస్తుభ ‘’’’కావ్య దర్పణ ‘’,’’కావ్య సార సంగ్రహ’’,’’సాహిత్య సూక్ష్మ సరణి ‘’అలంకార గ్రంధాలు .జింజి రాజు సూరప్ప కోరితే ‘’భావనా పురుషోత్తమ ‘’అనే దృష్టాంత నాటకం రాశాడు ‘’196- కావ్య దర్పణ రచయిత -రాజ చూడామణి

రత్న ఖేటశ్రీనివాస ,కామాక్షిల పుత్రుడు రాజ చూడామణి .తంజావూర్ పాలకుడు రఘునాధరాయల ఆస్థానకవి .’’రఘునాధభూప విజయం ‘’రాశాడు.కవిత్వం లో తండ్రికి తగ్గ కొడుకు .మీమాంసలో గొప్పవాడు .అనేక కావ్యాలు నాటకాలు  అలంకార గ్రంధాలు రచించాడు .1636లో జైమిని సూత్రాలకు ‘తంత్ర శిక్షా మణి ;వ్యాఖ్య ;రాశాడు .’’రుక్మిణీకలాపం ‘’అనే పదికాండల కావ్యం రుక్మిణీదేవి  చరిత్ర .’’శంకరాభ్యుదయం ‘’రాశాడు కాని ఆరు అధ్యాయాలే దొరికాయి.’’భారత చంపు ,’’కంస వధ ‘’,’’వృత్త రత్నావళి ‘’,’’సాహిత్య సామ్రాజ్య’’,’’చిత్ర మంజరి ‘’కూడా అతని రచనలే ‘.ఇందులో వృత్త రత్నావళి శంకరాచార్యుల ‘’తారావళి ‘’కి అనుసరణ..యమక కావ్యంగా ‘’రత్న ఖేట విజయం ‘’రాశాడు .ఇది తండ్రి కవితా ప్రతిభకు నీరాజనమేకాక త్ర్యర్దికావ్యం .ఇందులో శ్రీ రామ శ్రీ కృష్ణ ,పాండవ కధలున్నాయి .ప్రత్యక్షర శ్లేష వైభవం తో ‘’మంజు భాషిణి ‘’అనే గద్యరచనా చేశాడు. భోజుని రామాయణ చంపు దీనికి ఆధారం .రామాయణ యుద్ధ కాండ కధ.

శృంగార సారస్వత ‘’అనే భాణం కూడా రాజ చూడామణి రాశాడు .ఆనంద రాఘవ అనే అయిదు అంకాల నాటకమూ రాశాడు .సీతారామ కల్యాణం నుంచి పట్టాభిషేకం దాకా కద ఉంది .’’కమ లిని కల హంస ‘’అనే నాలుగు అంకాల నాటకం ‘కమలాకరుని కూతురు కమలిని కి ,కలహంస కు జరిగిన వివాహమే కద ఈ నాటకాలు రఘునాధుని ఆస్థానం లోను చిదంబరం లోను  ప్రదర్శింపబడేవి . .తన కావ్య దర్పణం లో అలంకార చూడామణి విషయం ప్రస్తావించాడు .

197-నైషద పారిజాత కర్త -కృష్ణాధ్వరి

రఘునాధ రాయలు రాజ్యం లో;కృష్ణాధ్వరి లేక కృష్ణ దీక్షిత ,లేక అయ్యదీక్షితులు ఉండేవాడు .ఈ కవి ‘’నైషద పారిజాతం ‘’అనే ద్వ్యర్ది కావ్యం రాశాడు .ఇందులో నల చరిత్ర పారిజాతాపహరణం కధలను జోడించాడు.అలాగే’’ రఘునాధ భూపతీయం’’అలంకార గ్రంధం లో తన ప్రభువు రఘునాధ రాయలను శ్లాఘించాడు .

ఇతని కుమారుడే మృత్యుంజయుడు .గురువు రాజ చూడామణి దీక్షితుడు.ఇతని ‘’ప్రద్యుమ్నోత్తర చరిత్ర ‘’అనే పదకొండు కాండల కావ్యం లో వజ్రపురి రాక్షసుని కుమార్తె కు  ప్రద్యుమ్నునికి జరిగిన వివాహాన్ని గురించి రాశాడు .మృత్యుంజయుని కొడుకు అనంత నారాయణుడు జయ దేవుని గీత గోవిందం లాంటి ‘’గీతా శంకరం అనే సంగీత రూపకం రాశాడు.

198-శివ తత్వ రహస్యం కర్త-నీల కంఠ లేక అయ్యదీక్షితులు

నారాయణ భూమి దేవి లకుమారుడు నీల కంఠుడు .అప్పయ్యదీక్షితుని తమ్ముడు అచ్చతి కిస్టకు  మనవడు .అయ్యదీక్షితులుగా ప్రసిద్ధి ;గోవింద దీక్షితుల కుమారుడు వెంకట మఖి వద్ద విద్య నేర్చాడు .’’కైయాట’’పైవిమర్శ రాశాడు’’.శ్రీకంఠ వేదాంతం లో లోతులు చూసిన వాడు .’’శివ తత్వ రహస్యం ‘’రాశాడు .తాని నలుగురు సోదరులూ మహా కవులే .ఇతని ‘’నీల కంఠ చంపు’’ పాలసముద్ర మధనం ,అందులో హాలాహలం రావటం శివుడు మింగటం కద దీన్ని 1637లో రాశాడు .’’శివలీలార్నవ ‘’ఇరవై రెండుకా౦డలలో శివుని అవతారమైన మధురలో అర్చింప బడే  హల్సాశ్వనాద కు సంబంధిన ఆరవైనాలుగు లీలలను వర్ణించాడు .’’గంగావతరణం ‘’ ఎనిమిది కాండలకావ్యం .దివిజ గంగ భూమిని చేరిన కద.’’కలివిదంబన’’,సభారంజన ‘’,’’అన్యాపదేశ శతకం ‘’,శాంతివిలాసం ‘’,వైరాగ్య శతకం ‘’,ఆనంద సాగరసస్తత్వం ‘’మొదలైనవిమిగిలిన వైవిధ్య రచనలు .’’

అయ్యా దీక్షితుల ‘’చిత్రమీమాంస దోషాదికారం ‘’ లో జగన్నాధ పండితరాయల సిద్ధాంతాలను విమర్శిస్తూ అప్పయ్య దీక్షితుల సిద్ధాంతాలను అన్నిటినీ సమర్ధించాడు .’’ఏడు అంకాల ‘’నల చరితా౦తకం’’నాటకం రాశాడు .కవిగా గొప్ప పేరు సంపాదించాడు.అతని ఊహలు అద్భుతం ఉత్ప్రేక్షలు నిరుపమానం .

ఇతని మూడవ కుమారుడు గీర్వాణేంద్రుడు  ,’’శృంగార కోశ భాణం’’రాశాడు.అన్యాపదేశ శాతాకమూ చేశాడు .ఇతని నలుగురు సోదరులూ కవులే .ఇందులో అతిరాత్ర యజ్ఞుడు ‘’కుశకుముద్వతీయం ‘’అనే నాటకం రాశాడు .అచ్చ దీక్షితులు అతని నల చరిత్ర నాటకం పై వ్యాఖ్యానం రాశాడు .

199-చిత్ర రత్నాకర హాస్య కవి -చక్ర కవి

లోకనాద అంబ ల కుమారుడే చక్రకవి .పతంజలి రామ చంద్రుల సోదరుడు .పాండ్య ,చేర రాజులు తనని ఆదరించారు నీలకంఠ దీక్షితులు మెచ్చినకవి .పదిహేడవ వ శతాబ్దం వాడు ‘ఆశువుగా ధారాళంగా రుక్మిణి జానకి గౌరీ ,ద్రౌపది ల కళ్యాణాలను వర్ణించాడు .ఎనిమిదికాండల ‘’జానకీ పరిణయం ‘’ఇందులో భాగమే .మిగిలినవి పద్య గద్యాత్మకం ‘’’చిత్ర రత్నాకరం ‘’హాస్య పూరిత రచన .శ్లోకం లో మొదటిభాగం ప్రశ్న రెండవ భాగం లో సమాధానం రాశాడు .

200- యమక కవి-ఏక దినప్రబంధ రచయిత – వేంకటేశ

వేంకటేశుడు శ్రీనివాసుని కుమారుడు వేంకటేశుని మనవడు .ఆత్రేయ  గోత్రీకుడు . .కనెల్ దగ్గర అరశనపల్లి లో   1596లో పుట్టాడు.’’’రామ యమకార్నవం ‘’,రామచంద్రోదయ ‘’కావ్యాలలో యమకం లో రస  బంధం గా  రామకధను రాశాడు .

సూర్యనారాయణ యజ్ఞేశ్వర జ్ఞానంబ ల కుమారుడు .ఆలూరి బ్రాహ్మణుడు .ఎన్నో యజ్న యాగాలు చేసిన కుటుంబం .1601లో లింగాయ ప్రభు దర్బారులో ఒకే రోజులో ఒక ప్రబంధం  రాస్తానని శపథం చేసి ‘’ఏక దిన ప్రబంధం ‘’ను మహా భారత కధగా చెప్పాడు .

భారద్వాజ గోత్రానికి చెందిన మలయా కవి రామనాధ కవిపుత్రుడు .మదురై జిల్లాలో ఉండేవాడు .పద్దెనిమిది కాండల మీనాక్షీ పరిణయం ‘’రాశాడు .ఇందులో మీనాక్షి సుందరేశుల వివాహం వర్ణించాడు .’’పార్వతీ పరిణయం ‘’ను ఎనిమిదికాండల లో రాశాడు .కాళిదాసు కుమార సంభవం రీతిలో ఈశ్వర సుమతి ‘’రచించాడు .

మనవి

ఇప్పటి వరకు తంజావూరు నాయక రాజుల పాలనలోను ,అంతకు ముందు విజయ నగర సామ్రాజ్యం లోను ప్రభ వించిన కవులను, వారి సాహిత్య  ప్రక్రియా వైవిధ్యాలను ,ఒకే కుటుంబానికి చెందినతాత తండ్రి కుమారుడు మనవడు లు సృష్టించిన సాహిత్యాన్ని గూర్చి చెప్పుకొన్నాం .ఆ రాజుల సాహిత్య పోషణా ,ప్రజానురంజక పాలనా తెలుసుకొన్నాం .

‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’రెండవ భాగం లో ఇప్పటికి 54మంది సంస్కృతకవుల గురించి తెలియ జేసే అదృష్టం నాకు దక్కింది .అంతకు ముందు మొదటిభాగం లో146మంది అమరభాషాకవులను గురించి రాసిన విషయం దానిని సరసభారతికి ఆత్మీయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా)గారికి అంకితమిచ్చి శ్రీ మన్మధ ఉగాది వేడుకలలో 15-3-15న  ఆవిష్కరణ జరిపిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది .ఈ రెండవ భాగం 14-5-15 న ప్రారంభించాను .అప్పుడప్పుడు రాస్తూ 54మంది కవులను ఈ రోజుతో  పూర్తీ చేశాను .ఇప్పటికి 200మంది గీర్వాణ కవుల కవితా గీర్వాణం గురించి రాసిన  అదృష్ట వంతుడిని నేను. రెండవ భాగానికి ముఖ్య ఆధారం  ‘’history of classical Sanskrit literature’’రచయిత శ్రీ ఏం క్రిష్ణమాచారియార్  అని ముందే తెలియజేశాను .ఈ గ్రంధాన్ని కొని నాకు పంపి చదివించి రాయిస్తున్న ప్రేరణ మూర్తి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి మరో సారి కృతజ్ఞతలు తెలుపు కొంటున్నాను .ఇది ఫుల్ స్టాప్ కాదని ,కామా యేనని మనవి చేస్తూ ,వీలువెంట మిగిలిన కవులను గురించి కూడా రాస్తానని తెలుపుకొంటున్నాను .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ – 9-7-15-ఉయ్యూరు

 

,

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.