ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -58

’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -58

25-ఛంద స్ శాస్త్ర వేత్త- (స్ప్రంగ్ రిధం సృష్టికర్త )జెరార్డ్ మాన్లి హాప్కిన్స్

తనకాలం లో గుర్తింపు పొందకపోయినా పుట్టిన వందేళ్ళకు జెసూట్ టీచర్ హాప్కిన్స్ కవి 1930-40-కాలపు  రాడికల్  కవులపై తీవ్ర ప్రభావాన్ని చూపాడు . ఈకవి చనిపోయిన ముప్ఫై ఏళ్ళ తరువాతకాని అతని కవితలు ప్రచురింపబడలేదు .అందులోని శైలి  అందరూ దిగ్భ్రమ చెందారు .ఈ కవిదారిలో ఆడెన్ ,స్పెండర్ డిలాన్ ధామస్ ,మొదలైన ఇరవయ్యవ శతాబ్దపు కవులు కవిత్వం రాశారు .చూడగానే ఇంప్రెస్ అయెట్లు ఉండటం ఈ  కవిత్వ లక్షణం .రూపకలంకారాలకు పట్టం కట్టాడు .సంక్షిప్త అర్ధం తో కవిత లల్లాడు

హాప్కిన్న్స్ లండన్  లోని  స్స్ట్రాఫోర్డ్ ఎసేక్స్ లో 11-6-1844పుట్టాడు .పదహారోఏట కవిత రాసి ప్రైజ్ కొట్ట్టేశాడు .మరో రెండేళ్లకు హీరోయిక్ కప్లేట్స్  రాసి మళ్ళీ ప్రైజ్ నొక్కాడు .వయసు పద్దెనిమిదిలో  బాలియోల్ కాలేజిలో చేరి వాల్టర్ పాటర్స్ లాగా కవిత్వం రాశాడు .అప్పటికే సంగీతం చిత్రలేఖనలలో నైపుణ్యం ఉంది .మతం తో మమేకమయ్యాడు ..మత పద్ధతులను అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించేవాడు .ఇరవై మూడవ ఏట కేధలిక్ మతాన్ని తీసుకొన్నాడు కార్డినల్ న్యూమాన్ అయాడు .అప్పటినుంచి అంకిత భావంతో  ప్రీస్ట్ గా పని చేశాడు .రాసిన కవితలన్నీ తగల బెట్టేశాడు’ .కవిత్వం ఒక విలాసం అని త్యజించాడు .క్రిస్టల్ ఫీల్డ్ ఆక్స్ ఫర్డ్ ,డబ్లిన్ లలో ప్రచారాలు నిర్వహించాడు .నలభై ఏళ్ళు వచ్చాక డబ్లిన్ రాయల్ వర్సిటిలో గ్రీక్ బోధించాడు .మరింత కఠిన నియమాలతో జీవించాడు .మురికి వాడల్లోని జనం జీవన పరిస్తితులకు చలించి అక్కడికి వెళ్లి సేవచేయటం మొదలు పెట్టాడు .ఇక్కడే టైఫాయిడ్ జ్వరం వచ్చి నలభై అయిదవ ఏట 8-6-1889 మరణించాడు .

కవిత్వం మళ్ళీ రాయటం ప్రారంభించాక రాసినది అంతా ప్రకాశ మానం గా రాశాడు .సడలని విశ్వాసం ఆరాధన తో రాశాడు .తన జీవితానికి అన్వయించుకొంటూ రాశాడు .మానవ ప్రపంచం కాదు ఆయనకు కనిపించింది దైవ ప్రపంచమే .మానవ ప్రపంచం లో భయం ,అనుమానం కనిపించాయి .స్నేహితుడు రిచర్డ్ వాట్సన్ డిక్సన్ కు జాబు రాస్తూ నగర జీవితం లోని పేదల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని చలించి పోతున్నానని ,తన జాతి పతనం కలవర పరుస్తోందని  ఆ శతాబ్దపు నాగరకతలో బోలుతనం గోచరిస్తోందని అని తెలియ జేశాడు .ఆస్థాన కవి అయిన రాబర్ట్ బ్రిడ్జ్ కి ఉత్తరం రాస్తూ త్వరలోనే ఒక మహా విప్లవం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తన భావనలు కమ్యూనిస్ట్ భావనుగా ఉన్నాయేమోనని కాని అదినిజమని ,ధనిక దేశమైన ఇంగ్లాండ్ కస్టాల పాలై గౌరవ మర్యాదలు ,విజ్ఞానం ,సుఖం ఆశలు కోల్పోయి జీవించే రోజులు దగ్గరలో నే ఉన్నాయని చెప్పాడు .అట్టడుగు వర్గాలవారికి విద్య నేర్పక పోతే తాము సర్వనాశనమై పోతున్న విషయం తెలుసుకోలేరని వ్యధ చెందాడు .ఇవన్నీకాకపోయినా ఇందులో కొన్ని భావాలు  కవితల్లో దించాడు .సానేట్స్ రాసి అందులో అనారోగ్య సంతోష విషాదాన్ని రాశాడు .దైవ ప్రపంచాన్ని ప్రస్తుతించాడు .తను రాసినదాన్ని తిరస్కరిస్తారేమోనన్న భయమూ అతన్ని పీడించి ప్రచురించటానికి సాహసం చేయలేక పోయాడు .ఇవన్నీ అద్భుత కవిత్వాన్ని ఆవిష్కరించినవే అయినా చనిపోయేదాకా ప్రచురితానికి నోచుకోలేదు .

భౌతిక వాద విజ్రు౦భణ మతపరమైన యదార్ధత లమధ్య అగాధాన్ని గమనించాడు హాప్కిన్స్ .తనలోని ఆధ్యాత్మిక వ్యక్తిని జాగృతం చేశాడు .తాను రాసినవి తన సన్నిహిత మిత్రుడు బ్రిడ్జెస్ కు ఇచ్చాడు .అందులోని కవితా పంక్తుల్ని చదివి దిగ్భ్రమ చెందాడు బ్రిడ్జెస్ .’’పోయెమ్స్ ఆఫ్ జేరార్డ్ హాప్కిన్స్’’పేరుతొ విడుదలచేశాడు .అందులో హాప్కిన్ చెప్పిన ‘’స్ప్రుంగ్  రిధం ‘’గురించి వివరించాడు .హాప్కిన్స్ కు గొప్ప శ్రోతలు ఉండేవారు .అందులోని చందోరీతుల్ని ఆస్వాది౦చేవారన్నాడు హాప్కిన్స్ .పదమూడేళ్ళ తర్వాతహాప్కిన్ చెప్పినదానిలోసత్యాన్ని  యువ కవులు గుర్తించారు .రెండవ ఎడిషన్ లో హాప్కిన్ ను అర్ధం చేసుకొని స్వాగతించారు

a poetic metre approximating to speech, each foot having one stressed syllable followed by a varying number of unstressed ones.అని స్ప్రంగ్  రిధం ను నిర్వచించారు .’’the poetical language of an age should be the current language heightened to any degree and unlike itself but not an absolete one ‘’అంటాడు హాప్కిన్స్ .తనకవిత్వం లో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చునని క్రమంగా దోష రహితమై మిల్టన్ శైలిని అందుకొంటు౦ దని  రిడ్జేస్ కు రాశాడు .హాప్కిన్స్ దైవం ఆవహించి రాయలేదు ప్రతీక లో  మునిగి రాశాడు .ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించి భగవంతుని ఉత్కృష్ట తను ఆవిష్కరించాడు .ఉదాహరణకు ఒకటి చూద్దాం ‘’glory be to God for drappled things –For skies of couple color as a brinded cow

for rose moles all in stipple upon trout that swim –fresh fire coal chestrnut falls ,finches wings

land scape plotted and pieced –fold fallow and plough and all trades their gear and tackle and trim ‘’అంతేకాదు మరో కవితలో ‘’man must begin know this ,where nature ends-nature and man can never be fast friends ‘’అని ఆనాడే హెచ్చరించాడు  ‘’మెటఫర్ లను బ్రేకింగ్ పాయింట్ దాకా సాగదీసి వదిలేవాడు హాప్కిన్స్ .ఒకోసారి స్విన్ బరన్ కవిని మించిపోయి రాసేవాడు ‘’I caught this morning morning ;s  minion ,king—Dom and day light ;s Dauphin ,dapple dawn drawn falcon in his riding ‘’

1935కు హాప్కిన్ ప్రాముఖ్యం ఏమిటో లోకానికి తెలిసింది అతని కవితల కొత్త ఎడిషన్ తెచ్చారు రాసిన ఉత్తరాలను ప్రచురించారు .’’ఏ హోప్ ఫర్ పోయిట్రీ’’’లో సి డే లేవిస్ –హాప్కిన్స్ ప్రతిభ ఏమిటో వివరించాడు .’’no poet since Donne has drawn his material from so wide a radius . By him the language which his prosody swings to the other extreme ,for it is based on the rhythms of common speech .he is a true revolutionary poet ‘’అన్నాడు .హాప్కిన్స్ దిస్వేచ్చా స్వరమే కాని హద్దులలోనే ఉంది .ప్రయోగాత్మక కవుల పై అధిక ప్రభావం చూపాడు .వాళ్ళు ఆధునిక కవిత్వాన్ని అతని సంప్రదాయాలను జాతీయాలను చేర్చి పుష్టి కలిగించారు .అతనిప్రయోగాలు మరింతా లోతుగా అన్వేషి౦చటా నికి తోడ్పడ్డాయి .అందుకే ఆ తరం లో పూర్వీకుడిగా హాప్కిన్స్ జేజేలు అందుకొన్నాడు .మరింత సరళీకృత కవిత్వ భాషకు నాందిపలికాడు .అతను వాడిన ఆడంబర పదజాలం నేడు అత్యవసరం తప్పనిసరి అయ్యాయి .భావోద్రేకాల పొంగు కు అతనికవిత్వం నిలయమైంది .రచయిత లూయీ అంట ర్ మేయర్’’ the world was prodigal  with vision .Nature was a divine turmoil and God an eternal exuberance ‘’అని చెప్పిన మాటలు పూర్తీ యదార్ధం .

Image result for gerard manley hopkinsImage result for gerard manley hopkinsImage result for gerard manley hopkins

Image result for gerard manley hopkins

మరో ప్రముఖుని తోకలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ .-11-7-15-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.