’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -57

’ ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -57

24–ఫ్రెంచ్ సింబాలిక్ కవిత్వ ఘనుడు –పాల్ వెర్నేన్

విషయవా౦ఛలను  బాగా అనుభవించినా స్వచ్చమైన కవిత్వం రాసిన ఫ్రెంచ్ కవి పాల్ వేర్నేన్.30-3-1844ఫ్రాన్స్ లోని మెత్జ్ లో పుట్టాడు .తండ్రి నికొలాస్ అగస్టేవేర్లేన్ నెపోలియన్ సైన్యం లో కాల్బలానికి కెప్టెన్ గా ఉన్నాడు .లీజియన్ ఆఫ్ ఆనర్ గౌరవం పొందాడు .1851లో కుటుంబం పారిస్ కు మారింది .పాల్ చదువులో బాగా దూసుకుపోయాడు .సాహిత్యం లో ,అలంకార శాస్త్రాలలో ,మృత భాషలలో  ఆనర్స్ డిగ్రీ సాధించాడు ‘లైస్ బోనపార్టే నుండి డిగ్రీపొంది సిటి అడ్మినిస్ట్రేషన్ లో అకౌంట్ డిపార్ట్ మెంట్  లో క్లార్క్ గా చేరాడు .ధ్యాసమాత్రం కవిత్వం  మీద ఉండేది .పదమూడో ఏటనే బాడలేర్ పై ఆసక్తికలిగింది .తను అతనికంటే ఇంకా బాగా రాయగలను అనుకొన్నాడు ‘

ఇరవై లో కుర్ర బోహీమియన్ గాంగ్ తోకలిసి ఒక జట్టును ఏర్పరచాడు .వీళ్ళు తమను ‘’పార్నాస్సియన్లు ‘’గా పిలుచుకొన్నారు .నాయకుడు లేకంటే డీ లిజిల్ .ఆంక్షలు లేని రోమా౦టిజం ను  వ్యతిరేకించారు .మళ్ళీ క్లాసిజం రావాలి అని కోరుకొన్నారు .అదీ చాలా స్పష్టమైన విధాన లో టెక్నిక్ తో ఉండాలని ఆశించారు .దీనికి తగినట్లు వేర్నేన్ కవిత్వం రాసి దారి చూపించాడు. మొదటిపుస్తకం ‘’పోయెమ్స్ సాచుర్నీస్ ‘’ప్రచురించాడు .ఇరవై ఏళ్ళకే అ పేరులోని సాచురిన్ ను సార్ధకం చేసుకొన్నాడు .కవిత్వం లో సున్నితమైన నిర్మాణం ,మంద్ర స్వరం చూపాడు .సంగీత స్వరంలాగా కవితలు ఆకర్షించాయి .అందులో స్వచ్చత కనిపించింది .పవిత్రత దర్శన మిచ్చింది .వయోలిన్ శబ్దం లాగా దీర్ఘం గా ,చిరుగాలి సవ్వడిలా హాయిగా మాధుర్య విలసితంగా కవిత్వం రాశాడు .ఇంతవరకు బాగానే ఉంది .

అయ్యగారు మేజర్ అయ్యేసరికి దురలవాట్లలో పడిపోయి హోమో సేక్సువల్ గా  మారి  విపరీతంగా తాగిపూర్తిగా దారితప్పాడు .తండ్రి చనిపోయాడు తల్లి బాగా ఆప్యాయంగా చూసింది .మధ్య తరగతి గౌరవాన్ని చాలెంజ్ చేశాడు ప్రీస్ట్ లను అవహేళన చేశాడు .నాస్తిక జెండా ఎగరేశాడు .సమాజం పట్ల అసహ్యం ,ప్రయోగాలతో రెండవ పుస్తకం గా ‘’గాలేంట్ ఫెస్టివల్స్ ‘’రాసి అచ్చేశాడు .ఇవి మొజార్ట్ సంగీత ద్వనుల్లా ఉన్నాయన్నారు .అదే ఏడాదిలో మేటేల్డీ మాటీ డీ ఫ్లార్వేల్ తో ప్రేమాయణం సాగింఛి పెళ్లాడాడు .మంచి జోడీయే అని అంతా భావించారు.పెళ్ళితోనైనా దారిన పడతాడు అనుకొన్నారు.మనవాడికి ఇరవై అయిదు ఆ అమ్మాయి ఇతనికంటే చాలా చిన్నది .కాని బాగా అన్యోన్యం గా ఉన్నారు ఈ ఆనందాన్ని ‘’ది గుడ్ సాంగ్ ‘’కవితలలో పోదిగాడు .ఈసుఖ జీవితం ఎక్కువ కాలం లేదు .

పెళ్ళయిన న ఏడాదికే  ఫ్రాంకో –ప్రష్యన్ యుద్ధం1870లో  వచ్చింది. గురూగారు మళ్ళీ డోసుపెంచి తెగ తాగి వీరంగం వేస్తున్నాడు .పాత చెడు అలవాట్లకు బానిసైపోయాడు .ఉద్యోగం హుళక్కి అయింది .దీనికి తోడూ తల్లి దురాశతో ఉన్న డబ్బు అంతా స్పెక్యులేషన్ పై పెట్టింది .అంతా తిరు క్షవరమై చేతికి చిప్ప మిగిలింది .వేర్నేన్ కు అత్తవారు ఒక ఇల్లు ఇచ్చారు .ఒక రోజు పోస్ట్ లో ఒక అద్భుత కవిత్వం వచ్చింది రాసినవాడు కొత్తకుర్రాడు ఆర్ధర్ రిమ్బాడ్.వాడు ఇతని దగ్గరకు చేరి ఇద్దరూ ‘’ఒకటైపోయారు ‘’.

అర్దర్ తండ్రికూడా మనకవి తండ్రిలాగా ఆర్మీ ఆఫీసర్ .తల్లి కోపిష్టి .పదిహేనవ ఏట ఆర్ధర్ తను పార్నాస్సియన్ అయిపోయాననుకొన్నాడు .విచిత్రంగా పారిస్ కమ్మ్యూన్ లో చేరి అకస్మాత్తుగా వదిలేసి తానుఒక యోగిని అని ప్రకటించాడు .అప్పుడే వేర్నేన్ ను కలవటానికి తాను రాసిన వంద లైన్ల కవిత్వాన్ని వెంట తెచ్చాడు .ఇక్కడే తిష్ట వేశాడు.ఇల్ల్యూమినేషన్స్ పేరు  మీద   ఏదో భ్రమలో రాసిన కవిత్వం అది .వాడు మురికి బట్టలు మార్చేవాడుకాదు. సంఘాన్ని గూర్చి పట్టించుకోనేవాడు కాదు .మాజిక్ ,తంత్రాలు నేర్చి ప్రయోగించేవాడు .రిమ్బా ద్చేసేది అంతా    పరమ పవిత్రమైనదిగా వేర్నేన్ భావించాడు .వాడినే ఆరాధించాడు పెళ్ళాం సంగతి పట్టించుకోలేదు.ఆమె కుటుంబం వాళ్ళు ఒక సారి వీళ్ళ ఇద్దరిపై విరుచుకు పడ్డారు .వేర్నేన్ ఇల్లువదిలి బాయ్ ఫ్రెండ్  రిమ్బాడ్ తో కలిసి వెళ్ళిపోయాడు.

తమల్ని తాము ‘’సూర్య పత్రులు ‘’గ భావించి  ఈ జంట లండన్  చెక్కేశారు  .ఇద్దరి పోషణాభారం వేర్నేన్ తీసుకొని ఫ్రెంచ్ భాష నేర్పుతూ లండన్ లో ఇంగ్లీష్ లెక్చర్లు ఇస్తూ సంపాదించాడు .తర్వాత బెల్జియం చేరారు .ఏడాది కే ‘’మగ దాంపత్యం ‘’ముగిసింది .తాగిన మైకం లో ఒకరినొకరు తిట్టుకొన్నారు కొట్టుకొన్నారు .సహజం గా రిమ్బాడ్ హోమో సేక్సువల్ కాదు .మనకవి గారి కపి చేస్టలకు బలైనాడు ‘’;కోపో ద్రేకం తో బ్రస్సెల్స్ లో వేర్నేన్ వాడిపై కాల్పులు జరిపాడు ;కాల్పుగాయం చిన్నదే కాని వేర్నేన్ పడిపోయాడు .తల్లి ,పెళ్ళాం వచ్చి వాడితో స్నేహం వదులుకోమన్నారు ‘సరేనని వాళ్ళతో కలిసి వెళ్ళిపోతూ మరో రౌండ్ గుళ్ళు పేల్చాడు వేర్నేన్ .ఇది బహిరంగమై అరెస్ట్ అయి రెండేళ్ళు చువ్వలు లేక్కేశాడు .

ఈ లోగా రిమ్బాద్ భ్రమ  కవిత్వాలు రాసి ‘’ఏ సీజన్ ఇన్ హెల్ ;;ప్రచురించాడు .ఈ వింత విపరీత ధోరణి కవిత్వమే తర్వాత సర్రియలిస్ట్ లకు ‘’ బైబుల్ ‘’అయింది ;అపస్మారకం లో రాసిన కవిత్వం అని ముద్రపడింది ;రాసిన ఇరవై ఏళ్ళకు కాని ముద్రణ భాగ్యం పొందలేదు .రిమ్బాడ్ ఉద్యోగాలు ఏకం మారి దేనిలోనూ స్తిరపడకండా టీచర్ గా  సర్కస్లోను  ,డాక్ వర్కర్ గా డచ్ ఆర్మీ  సైనికుడిగా  సైప్రస్ క్వారీ లో కూలీగాఅనేక   అవతారాలెత్తాడు .  ,  విసుగెత్తి ఆఫ్రికా వెళ్లి ఫ్రెంచ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీలో ఉద్యోగం చేశాడు బంగారం ,దంతం దిగుమతి ఎగుమతి లో పని చేశాడు వెబ్ రివర్ ను ,అబిసీనియాలోనిఆగాదాన్ ప్రాంతాన్ని అన్వేషించాడు .ఆయుధ సామగ్రి దొంగిలించి స్థానికులకు అమ్మాడు .బానిసలను అమ్మేవాడనీ రూమర్ ఉంది .అబిసీనియా అమ్మాయి తో బ్రహ్మాండమైన భవంతిలో విలాసంగా జీవించాడు అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా అతనికి  సంక్రమించిన  సిఫిలిస్ వ్యాధి ప్రాణా ౦తకమైంది ;కాలికి గాయమై మానలేదు యూరప్ వెళ్లి కలికి శాస్త్ర చికిత్స చేసుకోవాలనుకొన్నాడు .ఆపరేషన్ సక్సెస్ కాని పేషెంట్  డైడ్.సిఫిలిస్ ముదిరి మార్సిల్లిస్ హాస్పిటల్ లో 1-8-1896మరణించాడు .అప్పటికి వయసు ముప్ఫై ఏడే రిమ్బాడ్ కు .

వేర్నేన్ జైలు నుంచి విడుదలయ్యాడు వయసు ముప్ఫై ఒకటి .నాస్తికత్వాన్ని వదిలేసి చిన్ననాటి పరిస్తితులకు వచ్చాడు భార్యను తల్లిని వచ్చి తనను తీసుకు వెళ్ళమని కోరాదు .పాపం నుండి విముక్తిపొందిన వాడుగా మారాడు .భార్య ఇతను జైల్లో ఉండగానే విడాకులు తీసుకొన్నది నమ్మలేదు ఇతనిని .మైండ్ బ్లాక్ అయి మళ్ళీ రిమ్బాడ్ ను జేర్మనీనుంచి వచ్చి తనతో ఉండమని కోరాడు .వాడికి అప్పటికే జ్ఞానప్రకాశం కలిగి మళ్ళీ ఈ రొంపిలోకి దిగటానికి ఇష్టపడలేదు .

జైలు లో ఉండగానే వేర్నేన్ కొన్ని పాటలు  రాశాడు .వాటిని ‘’రొమాన్సెస్ వితౌట్ వర్డ్స్ ‘’పేరుపెట్టి ప్రింట్ చేశాడు ‘అది జానపదసాహిత్యం లా సరళంగా సూటిగా ఉంటూ నర్మగర్భితం గా ఉంది .సెంటిమెంట్ తో వండిన కవితలివి ;ఎందరినో ప్రభావితం చేశాయి .’’take rhetoric  and wring its neck ‘’ అని తోటికవులను ప్రబోధించాడు .(అలంకార శాస్త్రాన్ని తీసుకొని దాని మెడ పిండండి) అనిభావం ‘

వేర్నేన్ జీవితం లో చివరి పద్దెనిమిది ఏళ్ళు నరకం అనుభవించాడు .చేసినతప్పులు మనసును కల్లోల పరచాయి .పశ్చాత్తాపదగ్దుడయ్యాడు .వర్జిన్ గాడ్ ఆఫ్ హెవెన్ కు గ్రీన్ గాడెస్ కు మధ్య ఊగిసలాడాడు .టీచర్ గ పని చేశాడు .కాని పాత తప్పులు కెలికి బాధించారు రిజైన్ చేశాడు .భూమి పుత్రుడిలా ఉండాలనుకొన్నాడు.కానీ అనుభవం  లేదు .ఒకసారి తాగిన మైకం లో తల్లినే బాదిపారేశాడు అరెస్ట్ చేసి జైల్జైల్లో పెట్టారు .విడుదలైనతర్వాత బారు గడపలు తొక్కుతూ తిరిగాడు .జ్ఞానోదయం కలిగింది .ఈ సారి అదిపక్కా గా నిలబడింది కాని వ్యభిచారం లో దిగిపోయాడు .ఈ స్తితిలోను కవితలురాశాడు ఏ పబ్లిషర్ కూడా ప్రింట్ చేయటానికి సాహసించలేదు ‘కఫే ల చుట్టూ తిరిగాడు కప్పుకాఫీకి పెగ్గు డ్రింక్ కీ ,ఒక పోస్టల్ స్టాంప్ కీ ‘

నలభైలలో నరాల బలహీనతత వచ్చింది .వాతరోగం వచ్చింది జుట్టురాలిపోయి బట్టతలయింది .వాగాబాండ్ లా ఉన్నాడని అనటోల్ ఫ్రాంక్ అన్నాడు .అతనిపాటలు  విలన్ మాటల్లా ఉన్నాయన్నారు .రాసింది ఏదీ క్లిక్ కాలేదు.మరీ డల్ అయ్యాడు .అయినా రాస్తూనే ఉన్నాడు .రాసిన దానికి మెరుగు పెడుతూనే ఉన్నాడు .పబ్లిష్ చేస్తూనే ఉన్నాడు ‘కొంత స్పష్టత కొంత అస్పస్తత కొంత లోతు కొంత బోలుతనం ఉండేది అవే ఆధునిక కవిత్వానికి దారి చూపాయి .తన పందోమ్మిదవ కవితా సంపుటిగురించి కలలు కంటు౦డగా కిడ్నీ ట్రబుల్  జీర్ణాశయ వ్యాధి వచ్చాయి .చేతిలో పెన్నీ కూడా లేని కడు బీదతనం లో ఉన్నాడు .8-1-1896లో యాభై రెండేళ్లకే మరణించాడు పాల్ వేర్నేన్ .అప్పటికే అందరూ అతన్ని మర్చేపోయారు .

అతను జీవి౦ఛిన కాలాన్ని ‘’ఫిండీ సీకిల్ ‘’అన్నారు .అంటే విలువల పతనకాలం అని అర్ధం.అతన్ని శాపగ్రస్త(కర్సేడ్ పోయెట్)అన్నారు .ఇలాంటివారు మలార్మే ,రిమ్బాడ్ ,ఆలీస్ డీ చామ్బెరీర్ .  వీరంతా కవితా సంప్రదాయాన్ని దిక్కరించినవారే .దానివలన ప్రజల ఆగ్రహ అవమాన అవహేళనకు గురయ్యారు. కాని1896’’సింబలిస్ట్ మాని ఫెస్టో’’విడుదల అయిన తర్వాత సింబాలిజం అనేకొత్త మాట ఆవిష్కారమైంది .అదే నూతన సాహిత్య ఉద్యమ౦ గా వచ్చింది .వేర్నేన్, రిమ్బాడ్,మలార్మేమొదలైన వారిని సింబాలిస్ట్ కవులుగా గుర్తించారు  .వీరంతా కోపెంహాన్ ఈస్తటిక్స్ ను ఆరాది౦చినవారే.విల్, అన్ కాన్షస్ మొదలైన పదాలను ,సెక్స్ విషయాలను వాడినవారే .డేలిరియం ,నార్కాటిక్స్,ఆల్కహాల్ బాధితులే మిడీవల్ సెట్టింగ్ చూపినవారే

వేర్నేన్ కవిత్వం సంగీత కర్తలకు బాగా ఉపయోగపడింది. దాన్ని చక్కగాస్వరపరచి వాడుకొన్నారు .కాలం మర్చిపోయిన ఈ కవిని మళ్ళీ కనుక్కున్నారు అతని వేషం భాష వారికి ఆరాధ్యమైనాయి అందుకే’’ ప్రిన్స్ ఆఫ్ పోయేట్స్ ‘’అని కీర్తించారు అభిమానులు . In poetry, the symbolist procedure—as typified by Verlaine—was to use subtle suggestion instead of precise statement (rhetoric was banned) and to evoke moods and feelings through the magic of words and repeated sounds and the cadence of verse (musicality) and metrical innovation.

Netsurf17 - Paul Verlaine.pngImage result for paul verlaine

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11—7-15-ఉయ్యూరు


About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.