మేమిద్దరం ,మా అన్నయ్యగారి అబ్బాయి రాంబాబు ,మా మూడవ కోడలు రాణి,మనవడు చరణ్,మనవరాలు రమ్య ఆరుగురం ఉదయం అయిదున్నరకు కారులో బయల్దేరి తేలప్రోలు దాకా వెళ్లి అక్కడ హైవే ఎక్కి ,సరాసరి రావులపాలెం వెళ్ళాము అక్కడ ”వశిష్ట ” గోదావరి లో పుష్కర స్నాలు చేశాము మంత్రం చెప్పే బ్రాహ్మణులు ఒకరిద్దరే ఉండటం తో నేనుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా అందజేసిన పుష్కర స్నాన మంత్రాల పుస్తకాన్ని ఉయ్యూరు నుంచి నా వెంట తీసుకొని వెళ్ళిన పుస్తకం ప్రకారం మావాల్లందరి స్నాన విధి చేయించి గోదావరినదికి ,పుష్కరునికి ,బృహస్పతి మొదలైన వారందరికీ అర్ఘ్యాలు ఇప్పింఛిపుష్కర గోదావరీ మహా స్నానం చేయించాను మాతో పాటు గోదావరి పుష్కర యాత్ర : రావులపాలెం , కోటిపల్లి , ద్రాక్షారామం ల దర్సనం
స్నానం చేసినవారికీ అలాగే చేయించాను ఽతర్వాథ ఆపుస్తకం ఆధారంగా మా రాంబాబు మా దంపతులిద్దరి చేత పుష్కర స్నానం అర్ఘ్యాలు చేయించాడు .ఆడవారు గోదారితల్లికి హారతులిచ్చారు .కారు ఆపిన ప్రదేశానికి ,స్నాన ఘట్టానికి పెద్దాగా నడవాల్సిన దూరం లేదు హాయిగా ఉంది నీటి ప్రవాహమూ బాగా ఉంది .సంతృప్తిగా పుష్కర స్నానాలు చేశాము అందరం ఏంతో సంతోషించాము రద్దీ లేదు ప్రశాంతంగాఉంది నదినుండి కారు దగ్గరకు చేరి కారెక్కిఆలమూరు ” గౌతమి” గోదావరి బ్రిడ్జి దాటి దారిలోచెట్టునీడన ఆగి ఉయ్యూరు నుంచి తెచ్చుకొన్న ఇడ్లీలు డ్రైవర్ తో సహా అందరం హాయిగా తిన్నాం .ఉయ్యూరులో బయల్దేరేతప్పటికే నాకు ఎందుకో విపరీతమైన నీరసం గాఉంది అయినా బయల్దేరాను . టిఫిన్ తర్వాత ఆలమూరు మండపేట లమీదుగా కోటిపల్లి చేరాము అసలు పేరు”కోటి ఫలి”అదే కోటిపల్లి అయింది ఆంటే ఇక్కడ” గౌతమీ ”గోదావరి లో స్నానం చేసినా దానం ఇచ్చినా ,పిండప్రదానం చేసినా మామూలు పుణ్యం కంటే కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది అని విశ్వాసం .ఇదివరకు రెండు సార్లు వచ్చాం ,ఇక్కడ నది ఒడ్డున చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వర మహాలింగం చిన్నదేకాని మహా మహిమాన్వితమైనది .కొటిపల్లి రేవు చాలా ప్రసిద్ధం. రవాణాకు ముఖ్యమైన రేవు .ఇక్కడి నుంచిలాంచీలో వెళ్లి ”ముక్తేశ్వర0 ”వెళ్లి అక్కడ ”క్షణ ముక్తేశ్వర స్వామిని”దర్శిస్తే మోక్షం లభిస్తుందని నమ్మక0 అక్కడ ”ఒక్క క్షణం ”ఉంది శివుని దర్శిస్తే క్షణం లోనే మోక్షం ఖాయం అందుకే క్షణ ముక్తేశ్వరం అనే పేరొచ్చింది .ఇప్పుదు వెళ్ళలేదు ఇదివరకో సారి వెళ్లాం
— కోటి పల్లి సినిమా షూటింగ్ లకు ప్రత్యేకం అక్కడున్న చెట్టు చూస్తె ఇదే కోటిపల్లి అని గుర్తించవచ్చు బాపు అందాలరాముడు ,ముత్యాలముగ్గుసినిమాలకు అందాన్ని పెంచింది ఈ కోటిపల్లి రేవే వంశీ మొదలైన దర్శకులందరూ ఈప్రా౦తపు అందాన్ని సేల్యులాయిడ్ పైకి ఎక్కించి సార్ధకం చేశారు .ఇక్కదా గౌతమీ నది అఖండంగా నిండుగా ఒదాలు పులకరింత గా ఉంది గొప్ప వాహిని
కోటి పల్లిలో రేవుదగ్గర ఒక బ్రాహ్మణుడు కనిపిస్తా ఆయనతో పుష్కర స్నాన విధి చెప్పించుకొని అందరం మహా ఆనందంగా మహా సంతృప్తిగా మహా పుణ్యం లభించేట్లు భక్తీ శ్రద్ధలతో స్నానాలు చేసి అర్ఘ్యాలు విడిచి జన్మ సార్ధకం చేసుకోన్నాం . పుష్కరుడు మిట్టమధ్యాహ్నం పన్నెండు నుంచి రెండుగంటలవరకు పుష్కరనది లో ఉంటాడని మూడుకోట్ల మంది దేవతలు అదేసమయం లో పుష్కరగోదావరి లో స్నాలాలు ఆచరిస్తారని పురాణాలు చెబుతున్నాయి మేము సరిగ్గా పన్నెండున్నరకు పుష్కర స్నానం చేసి పుష్కర సన్నిధిలో దేవతలతో కలిసి స్నానం చేసి ధన్యులమైనాము నిన్న అమావాశ్య ఘడియలు వెళ్లి నిజ ఆషాఢంవచ్చింది.ఉత్తరాయణ పుణ్యకాలమూ ఉంది .ఇవాల్టినుంచి సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటాడు .అంటే దక్షిణాయణ పుణ్యకాలం వచ్చిది అన్నమాట . ఇక్కడ ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఉన్నాయి .పి౦డ ప్రరాదనం చేసే ఘట్టాలు వేరుగా స్నాన ఘట్టాలు వేరుగా ఉన్నాయి .నాకు బాగా నీరసంగా ఉండటం నా ఒళ్ళు నా స్వాధీనం లో ఉండక పోవటం పైపెచ్చు నీరసానికి విరుగుడుగా ఇడ్లీలు తినటం తో పిండ ప్రదానం చేయలేదు అదొక్కటే లోపం .ఇంకా చాలా రోజులున్నాయి కనుక ఎప్పుడో అప్పుడు లేక అంత్య పుష్కరాలలో చేయచ్చు అనుకొన్నాము’.పన్నెండేళ్ళ క్రితం గోదారి పుష్కరానికి తెలంగాణాలోని కాళేశ్వరం ,ధర్మపురి కి మేమిద్దరం మా వియ్యపురాలు ఆదిలక్ష్మిగారువెళ్లి స్నానాలు చేశాం అప్పుడూ పిండప్రదానం చేయలేదని గుర్తు .
కోటి పల్లిలో మా కార్లు ఆపేసి పార్కింగ్ చేసిన చోటు నుండి సుమో వాహనాలలో రేవుకు ఒక అరకిలో మీటర్ దూరం వరకూ ఉచితప్రయాణం ప్రభుత్వం చేసింది దాన్ని బాగా నిర్వహిస్తున్నరు.ఆడవాళ్ళు కోటిపల్లి రేవు దగ్గరా ఉన్న చెట్టుకింద ఉయ్యూరునుంచి తెచ్చుకోన్నఅరటి దోప్పలలో ఆవునెయ్యిదీపాలు వెలిగించి నమస్కారాలు చేశారు . దారిలో ఉన్న సోమేశ్వరస్వామి ని దర్శిద్దామనుకొంటే ,గుడి మూసేశారని ఒక గంటకు కాని తెరువారని చెబితే దర్శనం చేయకుండానే నడిచి ఉచిత సుమో ఉపయోగించకొని ,మళ్లీ మా కారు దగ్గరకు చేరాం ,రమ్య దమ్ములేక మాతో కోటిపల్లి రాకుండా కారులో పడుకోంది.
కారెక్కి కొంతదూరం ప్రయాణం చేసి దారిప్రక్కన ఒక ఇంటి వసారాలో ఇంటివారి సహకారం తో అందరం డ్రైవర్ తోసహా పులిహోర ,వెజిటబుల్ బిర్యాని(మసాలా లేకుండా)పెరుగన్నమ నే దధ్యోజనం కడుపు నిండా మెక్కాం నేనేమీ తినలేకపోయాను మళ్ళీ కారెక్కి ”దాక్షారామ’చేరాం రెండుగంటలకు. మా ఇద్దరికీ ఒపికలు లేక నేను కాలు తీసి కాలు పెట్టె శక్తిలేక కారులో కూచుని మిగిలిన వారిని శ్రీభీమేశ్వరస్వామిదర్శనానికి పంపాము మేమిద్దరం రెండుమూడు సార్లు దర్శించాం లేటెస్ట్ గా మే ఇరవై ఏడు న కూడా సందర్శించం మా రమణతో సహా .జనమ్ విపరీతంగా ఉండటం వలన దాదాపు రెండున్నర గంటలకు దర్శనం చేసుకొని వాళ్ళు వచ్చారు .
సాయంత్రం అయిదున్నరకు కారెక్కి రాజమండ్రి వెళ్లి పుష్కర శోభ చూద్దాం అనుకొన్నాం .కాని ఎక్కడ రాజమండ్రిలో దిగనా కనీసం రెండుకిలోమీటర్లు నడవాలని చెప్పారు . సరే అని రాజమండ్రి అయినా చూడచ్చు బ్రిడ్జి పైన అయినా గోదావరీమాత దర్శనం రాత్రి దీపశోభ ,నదీమ తల్లికిఇచ్చే మహా హారతి చూడచ్చు అనుకొన్నాం…బ్రిద్డ్జి మీదకు కూడా కార్లను అనుమతి0చ నందువల్ల రాజమంద్రినుంచి సరాసరి బైపాస్ రోడ్డు ద్వారా జంక్షన్ ,గన్నవరం కంకిపాడు ద్వారా రాత్రి పదిన్నరకు ఉయ్యూరు చేరుకొన్నాం . దాదాపు అయిదు గంటలు నాన్ స్టాప్ గా డ్రైవ్ చేశాడు .డ్రైవర్ సతీష్ .యెసి కారుకావటం కారుకూడా కండిషన్ లో ఉండటం వలన ప్రయాణపు అలసట లేదు .సమర్ధం గా వేగంగా చాకచక్యం గా నడిపాడు మేము తిన్నదే అతనికీ పెట్టటం దానికే ఎంతో సంతోషించి ”నా కడుపు నిండా భోజనం పెట్టారు అమ్మగారు ‘అని చెప్పాడట రమణ తో ‘
ఇంటికి వచ్చి కొద్దిగా మజ్జిగ తాగిపడుకొన్నా నిద్రబాగానే పట్టింది .ఉదయమే లేచి దంతదావనంతర్వాత మళ్ళీ పడక సీను .యెలాగొఅలాగా వేడినీళ్ళ స్నానం చేసి దేవుడికి దణ్ణం మాత్రమె పెట్టుకొని సంధ్యవార్చకుండా ఒకటిన్నర ఇడ్లీ నంజి మంచం పైకి చేరాను ఇవాల్టి పూజను మా శ్రీమతినే కానిమ్మన్నాడు మా మనవడు వాళ్ళ ”డాక్టర్ బాబు ”నడిగి నా విషయం చెప్పి టాబ్లెట్లు తెచ్చి మింగించాడు .ఒకటి వేసుకోగానే ,గొప్ప రిలీఫ్ ఇచ్చ్సింది మళ్ళీ మంచం శరణం గచ్చామి. మాంచి నిద్రపట్టింది పావుతక్కువ రెండింటికి కంచం ముందు కూచుని ఏదీ సహించక ఏదో ఇంతకతికాను .మళ్ళీ పాన్పు సీను అయిదింటికి లేచి మెయిల్స్ చూసి మా ”పుష్కర యాత్ర ”రాయటం మొదలు పెట్టాను .ఇంతసేపు కూర్చుని ఎలా రాశానో నాకే ఆశ్చర్యంగా ఉంది .ఇది ముమ్మాటికీ” గోదావరి మహా పుష్కర ప్రభావమే ‘ఆ పుష్కరజలాలో పవిత్రత తో బాటు ఆ నీటిలో ఉన్న కరెంట్ మనల్ని అమిత ఆరోగ్య వంతుల్ని చేస్తుంది .దీనికి నేనే సాక్ష్యం మా కుటుంబమే సాక్ష్యం మా శ్రీమతికి ఇలా ప్రవాహ జలస్నానం చాలా ఇష్టం తన ఆరోగ్యం వెయ్యి రెట్లు పెరుగుతుందని భావిస్తుంది .మీ శ్రీమతి సత్యవతి గారికి గోదావరిమాత సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకొంటున్నాం సీసాలలొ పుష్కరజలాలు సమృద్ధిగా తెచ్చుకోన్నాం మా గుడిలోని భక్తులకు మా పిల్లలకు మిగిలిన వారికీ..దాదాపు నిన్న రాను పోను ఆరు వందల కిలో మీటర్లుప్రయాణం చేశాం ”జై మహా పుష్కర గొదావరి మాతాకూ జై ”
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -17-7-15-ఉయ్యూరు
Like this:
Like Loading...
Related
About gdurgaprasad
Rtd Head Master
2-405
Sivalayam Street
Vuyyuru
Krishna District
Andhra Pradesh
521165
INDIA
Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D