గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
211-మణ విక్రమ మరియు పద్దేనిమిదిన్నర కవులు
జామోరిన్ మణ విక్రమ రాజు ఆస్థానం లో పదిహేనవ శతాబ్దిలో తమాషాగా పద్దేనిమిదిన్నర మంది సంస్కృత కవులు వర్దిల్లారు .జామోరిన్ రాజు స్వయం గా కవి పండితుడు ,సాహితీ పోషకుడు .పయ్యూరు పట్టారి కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సోదరులు ,ఒక కుమారుడు తిరువాపురం ,తిరువేగాపురంకు చెందినఅయిదుగురు బ్రాహ్మణులు వీరిలో ఉన్నారు . ,ముల్లపల్లి పట్టేరి ,చేన్నాసు నారాయణ నంబూద్రి ,కకసేరి నంబూద్రి ఉద్దండకవి కలిసి 18మంది కవులు .ఉన్నట్టు నంబూద్రి అనేకవి మలయాళం సంస్కృతాలలో కవికనుక ఈయను’’ అర సంస్కృత కవి’’గా పేర్కొన్నారు.కనుక వీరు పద్దేనిమిదిన్నర కవులైనారు .
పయ్యూరు కుటుంబం లో పెద్దవాడు మహర్షి అనే ఆయన మీమాంసలో దిట్ట .అయిదవ సోదరుడు నారాయణ పట్టేరి .మరిద్దరు సోదర్లు శంకర ,భువన దాసులు .మహర్షి కొడుకు పరమేశ్వర గురించి ఉద్దండకవి తన ‘’మల్లికా మారుతం ‘’లో రాశాడు .’’కోకిల సందేశం ‘’లో మహర్షికవిని ‘’మీమాంస త్రయ కులగురువు ‘’అని ప్రశంసించాడు .ఈ సోదరులు మీమాంస శాస్త్రం పై రాసిన గ్రంధాలు మలబారు ప్రాంతం లో ఎక్కడ పడితే అక్కడ లభిస్తాయి .తిరువపారకవి ‘’లక్ష్మీ మానవేద చంపు ‘’రాశాడు .బ్రహ్మదత్తుని పుత్రుడు నారాయణ ‘’సుభద్ర హరణ కావ్యం ‘’రచించాడు .
ఈ కుటుంబం లోని వాడే అయిన చేన్నాసు నారాయణ ‘’తంత్ర సముచ్చయం ‘’అనే కళా గ్రంధం రాశాడు .ఇతనివి ,కకసేరి నంబూద్రి వి వ్యంగ్య చాటువులు మలబారు తీరం అంతా ప్రచారం లో ఉన్నాయి .కోపించిన రాజు జమోరిన్ వీళ్ళను దండించాడు .కకసేరి దామోదరుడు ఉద్దండకవికి ప్రత్యర్ధి .’’ఇందుమతి రాఘవం ‘’రాశాడు .మన విక్రమ రాజు స్వయంగా కవి,పండితుడు కనుక ‘’అనర్ఘ రాఘవం ‘’పై వ్యాఖ్యానం రాశాడు .కనక సభా పతి కొడుకు సాంబ శివుడు శ్రీవత్స గోత్రీకుడు .గోపాల సముద్రం లో ఉండేవాడు .’’శృంగార విలాస భాణం’రాశాడు .ఇలా ఈ కవి కుటుంబం అంతులేని సంస్కృత సాహితీ సంపదను వెలువరించింది .
212-ఉద్దండకవి
రంగనాధ ,రంగా౦బ లకుమారుడైన ఉద్దండుడు వాదూలస గోత్రీకుడు .కంచి దగ్గర లాట పుర నివాసి .దక్షిణ భారతం లోని ప్రసిద్ధ శాస్త్ర వేత్తల వద్ద శాస్త్రాధ్యయనం చేశాడు .మలబారు రాజ్యం లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి వెళ్ళాడు అక్కడ వాదం లో అందర్నీ ఓడించి జమోరిన్ రాజు మణ విక్రముని అభిమానం పొంది ఆస్థాన విద్వాంసుడయ్యాడు .ఉద్దండ ప్రతిభ మిగిలిన వారికి తీవ్ర అసూయ కలిగించింది .ఒక పండితుని భార్య అతన్ని ఎలాగోఅలాగా భ్రస్టు పట్టిస్తానని శపథం చేసి అనేకమంది సాయం తో ప్రయత్నించింది చేరువైంది .వారికుమరుడే కాకసారి భట్టాతిరి .
పన్నెండేళ్ళ ఈ బాలుడు ఉద్దండుని వాదం లో ఓడించాడు .మలయాళం లో ‘’వసుమతీ విక్రమం ‘’సంస్కృతం లో ‘’ఇందుమతి రాఘవం ‘’నాటకం రాశాడు .ఇతని ‘’కోకిల సందేశం ‘’లో కాలికట్ లో ఉన్న ప్రేయసికి పంపిన సందేశం ఉంది .ఇది కాళిదాసు మేఘ సందేశం ను పోలి ఉంటుంది .కాలికట్ రాజులు రాజా రవి వర్మ ,గోదావర్మల ఆస్థానకవి వాసుదేవకవి రాసిన దానికి సమాధానం గా ‘’భ్రమర సందేశం ‘’రాసి పంపించాడు ఆ కవికి .మాలతీ మాధవం లోని కధకు వివరణగా పది అంకాల ‘’మల్లికా మారుతం ‘ప్రకరణంగా ’రాశాడు .ఉద్దండుడు దీన్ని కొంత మెరుగు పరచాడని అంటారు.ఉద్దండకవిత్వం సుందర మధురంగా ఉంటుంది .సామెతలు జాతీయాలు సమర్ధవంతంగా ప్రయోగించాడు .
ఉద్దండకవి స్నేహితుడు శంకర మారార్ ను గురువాయూర్ కృష్ణ దేవాలయం లో కలుసుకొన్నారు ఉద్దండుడు మొదలు పెట్టిన ‘’కృష్ణ విజయం ‘’ను శంకరకవి పూర్తీ చేశాడు .ఉద్దండుని సమకాలీన కవిసుకుమారుడు లేక ప్రభాకరుడు ‘’కృష్ణ విలాస కావ్యం ‘’రాశాడు .కావ్యం అంతే సుకుమారంగా ఉంటుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-8-15 –ఉయ్యూరు
,