గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 238-సంతాన గోపాల శతక కర్త- లక్ష్మి రజని

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

238-సంతాన గోపాల శతక కర్త- లక్ష్మి రజని

మలబారులోని కదాతనాడు రాకుమారి లక్ష్మీ రజని 1890 కాలం నాటిది. ఆమె రాసిన సంతాన గోపాల కావ్యం 3 కాండలలో ఒక బ్రాహ్మణుడు తన 10 మంది సంతానాన్ని వరుసగా కోల్పోవటం, అర్జునుడు చివరివాడిని బతికిస్తానని శపథం చేసి నెరవేర్చుకున్న కథఉన్నది .. దీనికి మెచ్చిన శ్రీకృష్ణుడు వైకుంఠం లో ఉన్న మిగిలిన పిల్లల్ని కూడా తీసుకు వచ్చి అప్పగిస్తాడు. చివరి కాండలో యమకాన్ని బాగా దట్టించింది.

239- కవిరత్న- జ్ఞాన సుందరి

కుంభకోణానికి చెందిన జ్ఞాన సుందరి  నాట్యకళాకారిణి. అక్కడే పెరిగి 19 10 లో చనిపోయింది. శ్రీవత్స గోత్రానికి చెందిన కుప్పుస్వామి శాస్త్రి అనే బహు గ్రంథకర్త శిష్యురాలు. తాను అనేక కావ్యాలు రచించినట్టు చెప్పినా ఆరు స్థభాకాలలో రాసిన “హాలాస్య చంపూ” మాత్రమే లభ్యమైంది. దక్షిణ జిల్లాలలో ఆమె చేసిన ఉపన్యాసాలు, నాట్యాలు సంగీత కచేరీల గురించి చాలా మంది ఇప్పటికీ చెప్పుకుంటారు. బార్ ఎట్ లా చేసిన మదురైకి చెందిన ఆర్ ఫిషర్ ఆమె పోషకుడు. మైసూర్ సంస్థానానికి వెళ్లి రాజును మెప్పించి “కవిరత్న” బిరుదు పొందింది.  మదుర మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణాన్ని మృదుమధురంగా వర్ణించింది.

240 –సంస్కృత ఉపాధ్యాయిని – కామాక్షి

కౌండిన్య గోత్రీకుడైన ముత్తు క్రుష్ణన్ అయ్యర్ ను వివాహమాడిన కామాక్షి 19 02 లో తంజావూరు జిల్లా గణపతి ఆగ్రహారానికి చెందిన పంచాపకేశయ్య కుమార్తె. ఉత్తర తమిళనాడులోని బాలికల పాఠశాలలో సంస్కృత ఉపాధ్యాయినిగా పనిచేసింది. కాళిదాస కవిత్వాన్ని ఔపోసిన పట్టిన కామాక్షి ‘’రామ చరిత’’ అనే చిన్న కావ్యం రాసింది.

సోదరి బాలా౦బాళ్ మద్రాసు  నివాసి. దక్షిణ భారతంలో గొప్ప జాతీయ నాయకురాలు. సంస్కృతం నేర్చుకునే వారి కోసం’’ ఆర్య రామాయణం’’ రాసింది.

241-భారత భౌగోళిక చరిత్ర రాసిన- రామకవి

18 వ శతాబ్దానికి చెందిన  శేఖర బాదామి రాజు ఆస్థానంలో రామకవి ఉండేవాడు. “పాండవ దిగ్విజయం” రాసాడు. ఇందులో పాండవులు భారతదేశాన్ని జయంచటం ఉంది. ఇది మహాభారతం కంటే ఉద్గ్రంధం. భారతదేశంలోని ప్రదేశాలన్నింటినీ వర్ణించాడు. పౌరాణిక గాధలను జోడించి కథ చెప్పాడు. ఆనాటి  సంఘ ఆచారాలు, పద్ధతులు, మతాలు, చట్టాలు సంస్థలు మొదలైనవాటినన్నింటినీ వర్ణించాడు. మహమ్మదీయ దండయాత్ర ముందు తర్వాత కథ నడుస్తుంది.    విక్రమాదిత్య, శాలివాహన, భర్తృహరి, శంకరాచార్య, ప్రభాకర భట్ట, జూమార్ నంది కాంభోజరాజు జయచంద్రుడు ఒరిస్సా రాజు ప్రతాప రుద్రుడు, శూర భట్ట మొదలగు వారి చరిత్రలన్నింటినీ ఇందులో రాసాడు. దీనికి ఆధార౦  భవిష్య, స్కంద పురాణాలు రుద్ర విజయం, విశ్వ గుణాదర్శం గా తెలియ చేసాడు.

242- ప్రపంచ దర్పణ కర్త- వెంకట కవి సార్వభౌముడు

జోగి భుక్త, పార్వతిల కుమారుడు 18 వ శతాబ్దిలో గోదావరి జిల్లాలో ఉండే వాడు. తాను సైన్స్ తో సహా అన్ని శాస్త్రాలలో ప్రవీణుడని చెప్పుకున్నాడు. “ప్రపంచ దర్పణ” రాయటానికి సిద్ధం చేసుకున్నాడు. అది బృహత్  విజ్ఞాన సర్వస్వం. ధర్మ కాండ, అర్థ కాండ, కామ కాండ అనే  మూడు భాగాలలో ఉన్నది.   ఇందులో మంత్ర శాస్త్రం, కవిత్వం, అలంకార శాస్త్రం మొదలయినవన్నీ ఉన్నాయి. అనేక కావ్యాలనుండి ఉదాహరణలు ఇచ్చాడు .

243-భువన ప్రదీపిక కర్త- రామకృష్ణ శాస్త్రి

మైసూరుకు చెందిన మూడవ కృష్ణ రాయ ఒడయార్ రాజు ఆస్థానంలో హసన్ లో ఉంటూ రామకృష్ణ శాస్త్రి కవి “భువన ప్రదీపిక” రాశాడు. ఇది ఓకే విజ్ఞాన సర్వస్వం. ఇందులో సృష్టి ఆవిర్భావం, మన్వాదుల చరిత్ర , భోగోళిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, దక్షిణ భారత చరిత్ర, ఓడవార్ రాజ వంశ చరిత్ర, పురాణాలు చాతుర్వర్ణాల వారి ధర్మాలు, యోగ ,వేదాంతం, అన్ని రాశి పోశాడు. ఈ వంశంలో ధర్మ రధుని కుమారుడు చాముండ రాయలు శ్రావణ  బెల్గోలాలో గోమఠేశ్వరుని స్థాపించాడు. వినయాదిత్య భల్లలుడు యాదవ పురి నిర్మించాడు.

244-రసప్రపంచ కర్త-వెంకట శాస్త్రి

పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్తికి చెందిన ఆన్విల్ల యజ్న నారాయణ కుమారుడు వెంకట శాస్త్రి సర్వ శాస్త్ర పారంగతుడు. పెద్దాపురం ,దార్లపూడి మహా రాజుల చేత గొప్ప సన్మానాలు పొందాడు. “మహేశ్వర మహాకావ్యం”, “ సతీ శతకం”, “భాస్కర ప్రశస్తి” కావ్యాలు- “అలంకార సుధా సింధు”, “రస ప్రపంచం” అనే అల౦కారగ్రందాలు రాసాడు. నూజివీడు జమీందారులు మేక వెంకట నరసింగ అప్పారావుపై ‘’అప్పారాయ యశశ్చంద్రో దయ కావ్యాలు రాసాడు. మెచ్చిన రాజు వల్లూరుమల్లి అగ్రహారాన్ని ప్రదానం చేసాడు. అక్కడ సోమయాగం చేసాడు. “శ్రౌత సూత్రాలు” పై భాష్యమ్  రాసాడు.  కుమారుడు నారాయణ కవి “సాహిత్య కల్ప ద్రుమం” రాసి నూజివీడు  జమిందారుజగన్నాధ అప్పారావుకు అంకితమిచ్చాడు. నారాయణ కవి కొడుకు వెంకట కవి ‘’బాల కాళిదాసు’’గా ప్రసిద్ధుడు. ఇతడు “చిత్ర చమత్కార మంజరి” రాసి పెద్దాపురానికి చెందిన వత్సవాయి తిమ్మ జగపతి మహారాజుకు అంకితమిచ్చాడు. చిత్ర కవిత్వముగా ‘’సూర్య శతకం ‘’రాసాడు.

245-నేపాల్ రాకుమార కవి-జగజ్జోతిర్మల్ల

నేపాల్ కు చెందిన త్రిభువన్ మల్ల రాజకుమారుడు జగజ్జోతిర్మల భాక్తపురానికి రాజు. గొప్ప సంగీత విద్వాంసుడు, శాస్త్రజ్ఞుడు. ఉత్తర దేశంలో సంగీతంపై సారిన గ్రంథం లేదని అభిలాషుడు రాసిన సంగీత చంద్రను  నేపాలీ భాషలో రాసాడు. దీనికి’’ సంగీత భాస్కర’’ అనే వ్యాఖ్యానాన్ని మిధిలకు చెందిన వంగమణి రచించాడు. ‘’సంగీత సార సంగ్రహం ‘’అనే గ్రంధాన్ని రచించాడు. 16 17- 1633    కాలంలో పరిపాలన చేసాడు. పద్మశ్రీ రాసిన ‘’నాగ రస సర్వస్వం’’ కు  విపుల వ్యాఖ్యానం రాసాడు.      నేపాలీ భాషలో’’ హర గౌరీ వివాహం’’ అనే సంగీత రూపకం రచించాడు. ఈ రాజు ఇతర రచనలు’’ స్వరోదయ దీపిక,’’ ‘’గీత పంచాసిక,’’ సంగీత భాస్కరం’’.. ముప్పై మూడు అంశాలపై శ్లోకాలను సమీకరించి శ్లోక సంగ్రహంగా రూపొందించాడు.

ఇతని కుమారుడు ప్రతాప మల్లుడు కూడా కవి. ఇతని కుమారుడు జగత్ప్రకాశ మల్ల ‘’పద్య సముచ్చయం’’ అనే నీతి కావ్యం రాసాడు. ఇతని కుమార్తె, కొడుకు అనంతుని ప్రీరణ చే ఘనశ్యాముడు నాట్య శాస్త్రంపై ఉన్న “హస్త ముక్తావళి” కి వ్యాఖ్యానం రాసాడు.

246-వైణిక శిఖామణి– వెంకట వైద్యనాథ దీక్షితులు

తిరువాడ మరుదూర్ లో నివసించిన దీక్షితులు వెంకట మఖి మనవడు. తాత గారి నుండి సంగీత జ్ఞాన్నాన్ని వారసత్వంగా పొందాడు. గొప్ప వైణిక విద్వాంసుడు. వెంకటమఖి రాసిన చతుర్దండి ప్రకాశికను  విపులీకరిచాడు.’’ వైణిక శిఖామణి’’బిరుదాంకితుడు.   ఎతియాపురం రాజులు సంగీతాన్ని బాగా ప్రోత్సహించారు.

247- ఆంధ్ర జాన్సన్- కొక్కొండ వెంకట రత్నం పంతులు

1842- 1916 కాలపు వాడైన  కొక్కొండ వెంకట రత్నం పంతులు అఖండ ప్రజ్ఞావంతుడైన ఆంధ్ర దేశపు పండితుడు. ‘’మహా మహోపాధ్యాయ’’ బిరుదాంకితుడు. మద్రాస్ ప్రేసిడేన్సీ  కాలేజీలో, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో తెలుగు పండిట్ గా పనిచేసాడు. మహా సంస్కృత విద్వాంసుడు, కవి. సంస్కృతములో ‘’బిల్వ నాద శతకం,’’, తను మధ్య ఆర్యా శతకం ‘’, ‘’తను మధ్య గీతా శతకం’’తో బాటు  ‘’వరదారాజ స్తుతి’’,’’ తారావళి స్తుతి ‘’,, బ్రహ్మ విద్యా స్తుతి, ‘’కాళహస్తీశ్వర స్తుతి ‘’మొదలైన 50 స్థవాలు రాసారు. ‘’ఆంధ్ర భాషా సంజీవని ‘’అనే పత్రిక నడిపారు. ఆయన రాసిన’’ గీత మహంత’’ కావ్యం జయదేవుని గీత గోవి౦దానికి అనుసరణ. ఫిలాసఫీ లో కూడా ఆయన దిట్ట. వేదాంతంలో ’’అక్షర సాంఖ్య ‘’ పద్ధతిని కనుగొన్నాడు. ‘’మార్గ దాయని ‘’అనే గ్రంథంలో ఈ సిద్ధాంతాలను వర్ణించాడు. ఆయనకు తమిళ, కన్నడ భాషలలో గొప్ప ప్రావీణ్యం ఉంది. తెలుగులో’’బిల్వేశ్వరీయం ‘’మొదలయిన 25 గ్రంథాలను రాశాడు. సమకాలీనులలో మహోన్నత శిఖరం కొక్కొండ. మద్రాస్ లాయర్ విద్యా వినోద పానపాకం ఆనందాచారి ఈయన శ్రేయోభిలాషి. ఈయనకు ఆంద్ర జాన్సన్ బిరుదు ఇచ్చారు. పంతులు గారిని ‘’సాహిత్య నిరంకుశుడు’’ అంటారు.

248- వీణాగాన కళానిధి- దూర్వాసుల సూర్యనారాయణ శాస్త్రి

1843- 1896 కాలానికి చెందినా వాడిన దూర్వాసుల సూర్య నారాయణ శాస్త్రి ‘’వీణా గాన కళానిధి ‘’బిరుదాంకితుడు. విజయ నగర మహా రాజు ఆనంద గజపతి రాజు ఆస్థానంలో  ప్రధాన సంగీత విద్వాంసుడు. సంస్కృతంలో తెలుగులో అనేక కృతులు రచించాడు. కాంభోజి రాగంలో ‘’పరమానంద సముద్ర వీచికయం ‘’అనే కృతిని పెరెన్నిక  కన్నది. కల్యాణి రాగంలో రాసిన ‘’దేవి దేహి సతతం’’ కీర్తనకు మంచి ప్రాచుర్యం ఉంది. ప్రఖ్యాత వైణిక విద్వాంసుడు వీణ వెంకట రమణ దాసు ఈయన శిష్యుడు. శాస్త్రి గారు దాస మహానుభావుని తండ్రి పెద  గురువాచార్యుల శిష్యుడు.

249- అభినవ శంకరాచార్య- మార్తాండ మాణిక్ ప్రభు మహారాజ్

1860 – 1936 కాలపు మాణిక్ ప్రభు మహా రాజ్ నిజాం రాష్ట్రంలో మాణిక్ నగరంలో ‘’సకల మత సంప్రదాయాన్ని’’ స్థాపించాడు. సంగీతంతో సహా అనేక శాస్త్రాలలో ప్రావీణ్యం ఉండేది. పలు భాషలలో పాటలు రాశాడు. సంస్కృతంలో రాసిన ‘’జ్ఞాన మార్తాండ’’ గీతం మణిపూస. ‘’అభినవ శంకరాచార్య’’ బిరుదాంకితుడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-4-8-15-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.