గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 పంచస్తవి రాసిన కురత్తైవార్( కూరేశకవి – (10 39)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

  1. పంచస్తవి రాసిన కురత్తైవార్( కూరేశకవి  – (10 39)

రామసోమయాజికి సువత్సామ్క మిశ్ర  కంచిలో 10 39 లో జన్మించాడు. రామానుజుని శిష్యుడు. సంపన్న కుటుంబం వాడు. ఐశ్వర్యాన్ని త్యజించి శ్రీరంగం చేరి రామానుజాచార్య శిష్యుడయ్యాడు. సన్యాసిగా ఉంటూ భిక్షాటనతో జీవించాడు. ఆయన జ్ఞాపక శక్తి అసాదారణమైంది. ఒక సారి రామానుజుడు బోధాయన వృత్తిని బ్రహ్మ సూత్రాలపై రాసి కాశ్మీరు వెళ్ళాడు. పురుకేశ అనబడే కురత్తైవార్ ఏకసందాగ్రాహి కనుక అప్పటికప్పుడు దానిని అప్పగించాడు. ఈ విధంగా రామానుజులకు శ్రీభాష్యం రాయడానికి తోడ్పడ్డాడు. అది ఆయన అపూర్వ రచన. కులోత్తుంగ మహారాజు రామానుజుని ఆహ్వానించి శైవ మతాన్ని స్వీకరించమని కోరితే కూరేశ రామానుజుని యొక్క వైష్ణవ సంప్రదాయం యొక్క విశిష్టతను చాల సూటిగా, ఘాటుగా వివరించాడు. కోపించిన రాజు అతని గుడ్లు పీకేయించమని ఆజ్న జారీ చేసాడు. కూరేశుడు శ్రీరంగంలో భట్టార్ కుటుంబ వ్యవస్థాపకుడు.

కూరేశుడు మధుర కవి. ఇతనిది పవిత్ర జీవితం. ఆయన రాసిన’’ వైకుంఠ స్తవం’’ వైకుంఠంలో   విష్ణుమూర్తి వైభవాన్ని వర్ణించాడు. ‘’ఆత్మానుస్తవం ‘’ లో విష్ణుమూర్తి అవతార మహిమలను వర్ణించాడు. సుందర బాహుస్త్వంలో విష్ణు మూర్తి మహిమలను వర్ణించాడు. వరదరాజ స్తవంలో కంచి వరదరాజ స్వామిని కీర్తించాడు. లక్ష్మీ దేవి వైభవాన్ని శ్రీ స్తవం లో వివరించాడు. ఈ అయిదింటినీ కలిపి ‘’పంచ స్తవి ‘’ అంటారు. కూరేశుని జీవితంపై కూర్మనారాయణుడు ‘’కూరేశ విజయం’’ రాసాడు.

శ్రీవత్సామ్కుని కుమారుడు పరాశరభట్టు 1061 లో జన్మించి విష్ణు సహస్రనామ భాష్యం, శ్రీరంగ రాజ స్తవం శ్రీ గురురత్న కోశం, క్షామ శోడశి తనిస్ష్లోకి  హస్తశ్లోకి రాసారు. దొడ్డయాచార్యుడు పరాశర విజయంలో యీతని జీవిత చరిత్ర వర్ణించారు.

  1.  వీరశైవాన్ని ప్రబోధించిన బసవ నమంత్రి  1156

లింగాయతులకు వీరశైవ వ మతాన్ని స్థాపించిన బసవడు కాలచూరి రాజు బిజ్జలుని ప్రధాన మంత్రి. 1156 లొ రాజయ్యాడు. వీరశైవాన్ని వ్యాప్తి చేసిన ఏకోరాముడు పండితారాధ్యుడు రేవన్న మరుల ,విశ్వారాధ్యుడు శివుని పంచ ముఖాలుగా భావిస్తారు. వీరంతా శివుని అవతారాలే. బసవడు వీరాశైవ  విశ్వాసాన్ని పునః స్థాపించాడు. చరిత్ర ప్రకారం పై ఐదుగురు బసవని సమకాలికులే. కొందరు ఆయనకంటే పెద్దవారు కొందరు చిన్నవారు. బసవ విజయంలో శంకరారాధ్యుడు బసవని జీవితం వివరించాడు. పాల్కునికి సోమన బసవ పురాణంలోనూ బసవన గద్యలోనూ ఆయనగురించి చెప్పాడు. సోమనాధుడు పండితారాధ్యుని జీవితంపై పండితారాధ్య చరిత్ర రాసాడు. సోమనాధుడు భ్రుంగీ రిత గోత్రుడు. గురు లింగని కుమారుడు. ప్రతాప రుద్రుని కాలంలో 1140 -149 6 లో జీవించాడు. సాంఘిక సంస్కరణలను రచనలలో బసవడు ప్రతిబింబింప జేశాడు .కుల లింగ వివక్షతలను దూరం చేశాడు .షట్ స్థవ వచనం ,కాలజ్ఞాన వచనం ,మంత్రం గోప్యం ,ఘటచక్ర వచనం ,రాజయోగా వచన రచన లు చేసినట్లు తెలుస్తోంది .భక్తిమార్గమే ముక్తికి సోపానం అన్నాడు బసవ లింగాయతులకు  లింగ ధారణ.తప్పని సరి చేశాడు .

  1. చైతన్యప్రభు అనే గౌరా౦గు డు- 1486

నిమాయ్ అన్న పేరు ఉన్న గౌరాన్గుడు జగన్నాధ ,శచీ దంపతులకు బెంగాల్ లోని నాడియా జిల్లాలో 1486 లొ జన్మించాడు. ఈ గ్రామం   భాగీరధి నదీ తీరంలో ఉంది. చిన్నతనంలోనే తాను గొప్పవాడు అవుతానని తెలుసుకున్నాడు. సనాతన మిశ్ర కుమార్తె విష్ణు ప్రియను వివాహం చేసుకున్నాడు. గౌర వర్ణంలో అందంగా ఉండటం వలన గౌరాన్గుడు అనే పేరు వచ్చంది. సర్వ సంగ పరిత్యాగం చేసి శ్రీకృష్ణ చైతన్య అనే పేరు పొందాడు. శ్రీకృష్ణుని దివ్యలీలల్ను కీర్తనలుగా రాసి గానం చేసేవాడు. భక్తీ మార్గాన్ని ప్రబోధించాడు. 12౦  ఏళ్ళు జీవించి 15 27 లో మరణించాడు. గోపాల చరిత్ర ప్రేమామృతం సంక్షేప భాగవతామ్రుతం ,హరినామ కవచం, దాన  కేళి చింతామణి రచించాడు. భారతదేశమంతా పర్యటన చేస్తూ శ్రీకృష్ణ భక్తితత్వాన్ని వ్యాప్తి చేసాడు. వేదాంతం లో ‘’అచింత్య భేదా భేద ‘’సిద్ధాంతం ప్రచారం చేశాడు .శ్రీకృష్ణుని అవతారంగాచైతన్య మహాప్రభువు ను భావిస్తారు .

  1. కృష్ణ ప్రేమను రాసిన కవి కర్ణ పూరుడు-( 1524)

బెంగాల్లో నాడియా జిల్లలో కాంచనపల్లె లో శివానందసేనుని కుమారునిగా కవి కర్నపూరుడు 1524 లో జన్మించాడు. చైతన్యుని బెంగాలీ భక్తులతో పూరీ వరకు యాత్ర చేసి చైతన్యుని జీవితాంతం వరకు వాసుదేవభట్టు అనే  లక్షాధికారి ప్రాపకంలో ఉన్నాడు. కుమార హట్ట అనే గురువు వద్ద ఈనాటి కలకత్తాకు ఉత్తరాన ఉన్న హైలసారులో విద్య నేర్చాడు. జీవ గోస్వామి శిష్యుడు కూడా. ఈయన రాసిన “గౌరామ్గనోద్దేశ  దీపికను” 1577 లో రాసి చైతన్యుడు జీవితాన్ని ఆయన అనుచరుల గత జీవితాలను ముఖ్యంగా చైతన్య తండ్రి జగన్నాధ జీవితాన్ని శ్రీకృష్ణుని తండ్రి నందుని చరిత్రను, దశరధ చరిత్రను రాసాడు. ఆయన శ్రీకృష్ణుని గోపికలలో ఒకదడిగానూ రామాయణంలో కపిసేనలో ఒకనిగానూ భావిస్తారు. 1543 లో రాసిన చైతన్య చంద్రోదయంలో చైతన్య జీవిత సర్వస్వాన్ని వివరించాడు. అలంకార కౌస్తుభమూ రాసాడు. చమత్కార చంద్రిక, ఆనంద బృందావన చంపూ లలో  శ్రీకృష్ణ ప్రేమను వర్ణించాడు.

Inline image 1

  1. బ్రహ్మ సూత్రం భాష్యం రాసిన వల్లభాచార్య

లక్ష్మీభట్ట కుమారుడైన వల్లభాచార్యుడు గొప్ప శ్రీకృష్ణ మత బోధకుడు. 1478 నుండి 1550 వరకూ జీవించాడు. వ్యాసుని బ్రహ్మ సూత్రాలకు’’అను భాష్యం’’ రాసాడు. వల్లభ మతం అనయాయులలో చైతన్యుడు ప్రధానుడు. వీరికి శ్రీకృష్ణుడే సర్వము. వల్లభాచార్య ప్రేమామృతం మధుర మహాత్మ్యం మధురాష్టకం యమునాస్తవం రచించాడు. భాగవతంపై అనేక ఉపాన్యాసాలు చేసాడు. ఈయన చరిత్రను గోపాలదాసు వల్లభాఖ్యానకం లో వర్ణించాడు. బాబూ సీతారామ శాస్త్రి వల్లభ దిగ్విజయం రాసాడు. కాశి లోనిమనికర్నికా ఘాట్ లో గంగానది లో మునిగి జీవితం చాలించాడు .పుష్టిమార్గ ప్రబోధకుడు వల్లభా చార్య .పదహారు గ్రంధాలు రాశాడు .

వల్లభుని కుమారుడు గోపీనాధుడు, విఠలుడు. విఠలుడు తండ్రి లాగా గొప్ప కవి. క్కృష్ణప్రేమామ్రుతం, యమునా స్తపది రాస సర్వస్వం తో బాటు గీత గోవిన్డంపై వ్యాఖ్య రాసాడు. ఈయన కుమారులు కూడా గొప్ప కవులే. వల్లభుని సోదరుడు రామచంద్రులు కృష్ణ కుతూహలం, గోపాల లీల, రసిక రంజని  రోమావళి శతకం రాసాడు.

Inline image 2  Image result for vallabhacharya

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-8-15-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.