గీర్వణ కవుల కవితా గీర్వాణం-2
౩౦౩-సామంత భద్ర (క్రీ శ100)
క్రీ శకం మొదటి శతాబ్దపు జైనకవి సామంత భద్ర .’’వీర వంశా వలి ‘’శ్వేతాంబరుల కావ్యం లో పదహారవ ఆచార్యుడిగా గుర్తింప బడ్డాడు .’’ఆరాధన కదా కోశం ‘’అనేప్రభ చంద్రుని కదల గ్రంధం లో భద్రుని గురించి ఉంది .కంచిలో ఆచార్యుడుగా ఉండి ఉండాలి .గర్భకోశవ్యాధి పీడితుడు .అయినా కంచి నుండి పౌన్ద్రపురం గుండా బెనారస్ నడిచి వెళ్ళాడు .కాశీలో శివుని విగ్రహాన్ని పార్శ్వ నాదుడిగా మార్చి తన మాయా జాలం చూపాడు .’’దేవాగమ స్తోత్రం ‘’,’’స్వయంభు స్తోత్రం ‘రాశాడు .ఆది పురాణం లో అతనిపై ప్రశంస ఉంది .’’నమస్తమ్మాంత భద్రాయ మహాతే కవి వేధసే –యద చీవజ్న పాతేన నిర్భిన్నః కుమతా ద్రయః
కవీనాం గమకానాం చ వాదీనాం వాగ్మిమానపి –యశాస్సమంత భద్రీయం మూర్ధ్ని చూడా మణీయతే ‘’.
304-సిద్ధ సేన దివాకర (100)
‘’న్యాయ వార్త ‘’రాసిన సిద్ధ సేన దివాకరుడు సమంత భద్ర తో పాటు ఉటంకింప బడ్డాడు .ఇద్దరు రెండురకాల జైన సంప్రదాయాలకు చెందినవారు. ఎవరి సంప్రదాయం లో వారు ఘనులని కీర్తింప బడ్డారు .సిద్ధ సేనుడుకూడా శివ విగ్రహాన్ని తీర్ధంకరుడిగా మార్చాడని ఉంది .కొన్ని సందర్భాలలో ఇద్దరు వేరు కాదు ఒకరేనేమోనని పిస్తుంది .కాని హరి భద్ర సూరి, జిన సేనులు వీరిద్దరిని వేరు వేరు వ్యక్తులుగా పేర్కొన్నారు దివాకరుని తల్లి దేవాశికా.తండ్రి ఉజ్జయిని రాజ పురోహితుడు .వృద్ధ వాదిగురువుకు శిష్యుడై కుముద చంద్ర గా గుర్తింపు పొందాడు .సూరి బిరుదు పొందాడు .తర్వాతపేరు సిద్ధ సేన దివాకర అయింది .ప్రాకృత సాహిత్యాన్ని అంతటినీ సంస్కృతం లోకి మార్చేస్తానని ఒక సారి గురువు తో అన్నాడు .ఈ తప్పుకు గురువు ‘’పరాహ్నిక ప్రాయశ్చిత్తం ‘’చేయించాడు .పన్నెండేళ్ళు మూగగా ఉండి పవిత్ర క్షేత్ర సందర్శనం చేస్తూ గడపమన్నాడు .అలా తిరుగుతూ ఉజ్జయిని చేరాడు .మహా కాళ దేవాలయం లో బస చేశాడు .శివుని యడల భక్తీ చూపక పోవటం తో పూజారులు అసహ్యిన్చుకొన్నారు .విక్రమాదిత్యునికి చెప్పారు ఆయన వచ్చి సిద్ధ సేనుడిని శివుడికి మొక్కమన్నాడు .’’కళ్యాణ మందిర ‘’మంత్రాలను చదువుతూ శివ లింగాన్ని జైన తీర్ధన్కరుడిగా మార్చాడు .అతని ప్రతిభకు మెచ్చి విక్రమాదిత్యాదులు జైన తీర్ధం పుచ్చుకోన్నారట .దీన్ని జ్ఞాన సెందు ఆది పురాణం లో రాశాడు .
305-ఏకనాధుడు (1528-1609)
దేవగిరికి చెందిన జనార్దన పంత్ కొడుకు ఏకనాధుడు .తీర్ధ యాత్రలు చేస్తూ అద్భుతాలు ప్రదర్శించాడు .మహారాష్ట్ర భక్తకవి శేఖరులలో నామదేవ ,తుకారాం ల మధ్య ఏకనాదుడిని నిలిపారు .భక్తిమార్గ ప్రబోధకుడు .1528-1609ల మధ్య జీవించాడు .మరాఠీ గీతాలేకాక ‘’హస్తామలకం ‘’,స్వాత్మ సుఖం ‘’అనే వేదాంత గ్రంధాలు రాశాడు .భగవద్గీత పదకొండవ అధ్యాయానికి విస్తృత వ్యాఖ్యానం రాశాడు .
306-మహా రాజ మూడవ కృష్ణ రాజ ఒడియార్ (1785
1785లో జన్మించిన కృష్ణ రాజ ఒడియార్ మైసూరు రాజు విద్వత్ కవి ,కవి జనాభిరాముడు .ఈ రాజు రాసిన ‘’దేవతా ధ్యాన మాలిక ‘’అనేక దేవీ దేవతా స్తోత్రకదంబం .చిత్రాలతో సహా ఉన్నాయి .’’సూర్య చంద్రాది వంశావతరణం ‘’1857లో రాయబడిన రామాయణ మహా భారత౦ కు చెందినవి, యదురాజ, కృష్ణ రాజ పరాక్రమాలకు సమంధించిన వంద కధలు .’’కృష్ణ కదా పుష్ప మంజరి ‘’చాముండీ మంగళ మాలిక ,మృత్యుంజయ స్తోత్రం, రామాయణ కదా పుష్ప మంజరి కూడా రాజావారి రచనలే .మైసూరులో ముద్రింప బడినాయి .
307-కస్తూరి శివ శంకర శాస్త్రి (1833-1917)
అమలాపురం తాలూకా కూచి మంచి వారి అగ్రహారం లో 1833లో జన్మించాడు .ఎనభై మూడవ ఏట 1917లో మరణించాడు .వాదూలస గోత్రానికి చెందిన నియోగి బ్రాహ్మణుడు .ఇతని వంశం వారు స్థానిక రాజుల నవాబుల ఆస్థాన మంత్రులు.వేదం తో బాటు రాజకీయ వ్యవహారాలలోనూ చురుకుగా ఉండేవారు .వీరికి ‘’దేశ పాండ్య ‘’అనే గౌరవ స్థానం ఉండేది ఈ గౌరవం మనకవి చిన్నతనం లో తండ్రివరకు ఉండేది .వీరేశ లింగం గారు ఇతని తండ్రికి పెద్దన్నగారు .ఆయన వరకు రాజ భ్రుతి వచ్చేది .శాస్త్రి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి లో కళావిభాగం లో పాతికేళ్ళు పని చేశాడు .శివానంద లహరి ‘’స్తోత్రకదంబం ,ద్వాదశ మంజరి ,సముద్రాస్టకం,శూలపాణి శతకం నృసింహ స్తోత్రంమొదలైన వి రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-8-15- ఉయ్యూరు