గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
326-శతావధాని,అవధాన విధాన కర్త – వేమూరి శ్రీ రామ శాస్త్రి (1870
వేమూరి శ్రీ రామ శాస్త్రి నెల్లూరు జిల్లా కందుకూరు తాలూకా జువ్వి గుంట అగ్రహారం లో 1870లో పుట్టాడు .వెలనాటి వైదిక కుటుంబం హరితస గోత్రం.వేదం, శ్రౌత ,జ్యోతిశాలను పితృపాదుల వద్దనే నేర్చాడు .తర్వాత సాహిత్య వ్యాకరణాలు అభ్యసించాడు .చిన్న నాటినుంచే కవిత్వం అబ్బి ‘’శతావధానం ‘’పై మోజు ఏర్పడి కన్యా కుమారి నుండి కాశ్మీర్ దాకా 24వ ఏట నుండి అనేక ముఖ్య పట్టణాలలో తన శతావధాన విద్యా ప్రదర్శన చేసి గౌరవింప బడ్డాడు .పూనా లో చేసిన అవధానానికి డా.భండార్కర్ అబ్బుర పడ్డాడు .అసాదారణ ధారణాసామర్ధ్యం ఉన్నవాడు .బరోడా లో మహా రాజు సమక్షం లో శతావధానం చేసి గాయక్వాడ్ చేత విశేష సన్మానం అందుకొన్నాడు .1903లో కాశ్మీర్ వెళ్లి ‘’గ్రైవేయక బంధం ‘’అనే కావ్యాన్ని సంస్కృతం లో రచించాడు .1911లో ధిల్లీ లో తానూ రాసిన ‘’ధిల్లీ ప్రభ ‘’లేక దర్బార్ ‘’ఖానేద’’రచనకు ధిల్లేఎ దర్బార్ లో బహు ప్రశంసలు సన్మానం పొందాడు .సంస్కృత సాహిత్యపు లోతులు తరచిన వాడు కనుక 14 భాషలలో అనర్గళం గా మాట్లాడ గలిగే నేర్పు అలవడింది .ఆనాడు ఇంతటి బహు భాషా పాండిత్యం ఉన్న వారు లేరు .తెలుగు సంస్కృత హిందీ భాషలలో రచనలు చేశాడు .సంస్కృతం లో ‘’అవధాన విధానం ‘’’’గురు కల్పం ‘’,నూతనోదయనం ‘’రచించాడు బెజవాడలో స్థిరపడ్డాడు ..
327-వింజమూరి వీర రాఘవా చార్య (1855-1920)
కౌశిక గోత్రానికి చెందిన వైష్ణవుడు వీర రాఘవాచార్య .పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకా దొంతవరం గ్రామస్తుడు .బెజవాడలో ఉంటూ సంస్కృత పండితుడుగా ఉద్యోగించాడు .బహు ముఖీన ప్రతిభా సంపన్నుడు .సంస్కృతం లో ‘’రామానుజ స్తోత్రత్రయి’’,మానససందేశం ,హనుమత్ సందేశం ,పానక నరసింహ స్తోత్రం ,రఘువీరగాద్య వ్యాఖ్య చతుశ్లోకీ వ్యాఖ్య ‘’రాశాడు .
328-తిరుపతి కవులు
దివాకర్ల తిరుపతి శాస్త్రి ,చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి కవి ద్వయాన్ని తిరుపతి కవులు అంటారు .అఆషు కవిత్వం తో అవధాన విద్యనూ ప్రదర్శించి ఆంద్ర దేశం అంతటా బహు సన్మానాలు అందుకొన్నారు .వీరి సంస్కృత రచన ‘’కలి సహస్రం ‘’
దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (1853)తమ్మన శాస్త్రి(1862) సోదరులు గొప్ప శతావధానులు .పిఠాపురం రాజాస్థాన కవులు .సుబ్బరాయ శాస్త్రి సంస్కృతం లో ‘’రావు వంశ ముక్తావళి ‘’రాశాడు .
329-దూతాంగద నాటక కర్త -సుభట (1200)
సోమదేవుడు ,నామి సాదు సుభట కవి ని బాగా కీర్తించారు . ఇతని ‘’దూతాంగద’’నాటకాన్ని అన్హిల్ విద్ రాజు త్రిభువన పాల దేవుని కాలం లో 1242లోగుజరాతు లోని సోమనాధ జ్యోతిర్లింగ దేవాలయ పునః ప్రతిష్టాకార్యక్రమం లో ప్రదర్శించారు .
330-చాయా నాటక కర్త -వ్యాస రామ దేవుడు (1380
రామాభ్యుదయం ,పాండవాభ్యుదయం ,సుభాద్రాపరిణయం అనే మూడు నాటకాలను వ్యాస రామ దేవుడు1402-15 మధ్య రచించాడు .రాయపూర్ కాలకూరి రాజులఆస్థానకవి .ఈ నాటకాలను చాయా నాటకాలు అంటారు .బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షా వంశం పై విఠలకవి చాయా నాటకం రాశాడు .సావిత్రీ చరిత్ర ,శంకర లాల కూడా చాయా నాటకాలే .’’హరి దూతం ‘’అనే చాయా నాటకం శ్రీ కృష్ణ రాయ బార కద.
331- అద్భుత దర్పణ ‘రచయిత -మహా దేవుడు (1700)
మద్రాస్ రాష్ట్రం లో పలమనేరు నివాసి కౌండిన్య గోత్రీకుడు కృష్ణ సూరి కుమారుడు మహా దేవుడు .నీలకంఠుని సహవాసి .పదిహేడవ శతాబ్ది వాడు .’’అద్భుత దర్పణం ‘’అనే కావ్యం లో రామ రావణ యుద్ధ పురోగతిని హనుమ లంక నుండి తిరిగి వచ్చిన దగ్గర నుండి అద్భుతంగా వర్ణించాడు .
332-అభిదా వ్రుత్తి మాత్రుక రాసిన -ముకుళ(855-894)
భట్ట కల్లటుని కొడుకు ముకుళ.కాశ్మీర్ రాజు అవంతీ వర్మ ఆస్థానం లో 855-884కాలం లో ఉన్నాడు .’’అభిదా వ్రుత్తి మాతృక ‘’రాసి అక్షరాల ఉత్పత్తినిగూర్చి వివరించాడు .ఇతని కొడుకు హర్శతుడు ‘’జయ దేవ ఛందస్సు ‘’పై వ్యాఖ్యానం రాశాడని అభినవ గుప్తుడు నాట్య శాస్త్ర వ్యాఖ్యానం లో తెలియ జేశాడు .
333హృదయ దర్పణం రాసిన –భట్టనాయకుడు (855-884
భట్టనాయకుడు భారతం పై ‘’హృదయ దర్పణం ‘’రాశాడు .అభినవ గుప్తుడు ,జయ రధుడు ఈ కవి శ్లోకాలను ఉదాహరించారు .ఇది అలంకార గ్రంధం ఇందులో భట్టు రసమే మంచి కవిత్వానికి సారం ,గుర్తింపు అన్నాడు .ధ్వనికి దీనికి సంబంధం లేదు అన్నాడు అందుకే అభినవ గుప్తుడు రుయ్యకుడు దీన్ని వ్యతిరేకించారు . 855-884కాలపు అవంతి వర్మ రాజు ఆస్థానం లో ,కాశ్మీర్ రాజు శంకర వర్మ ఆస్థానం లో భట్టు ఉండి ఉంటాడు ..’’భామహాలంకారం ‘’పై విస్తృత వ్యాఖ్యానం రచించాడు .న్యాయ శాస్త్రం పై భట్టు కున్న పట్టు ను అభినవ గుప్తుడు పేర్కొన్నాడు .
334-మహా సాధ్యాయ పాల -ధనికుడు
ధనికుడు ధనుంజయుని సోదరుడు గా భావిస్తారు .కొందరు ధనిక ధనున్జయులు ఒక్కరే అంటారు .అతని రాత ప్రతులైన ‘’అవలోక ‘’లో తానుముంజ రాజు ఉత్పలుని ‘’మహా సాధ్యాయ పాల ‘’అనే అధికారి నని చెప్పుకొన్నాడు .వసంతా చార్యుని తండ్రి అయి ఉండవచ్చు .యితడు వాక్పతిరాజు (974)కాలం వాడు .కవిత్వం రాశాడు తన స్వంత కవిత్వాన్ని ధనుంజయుని అలంకార శాస్త్రానికి ఉదాహరణలుగా ఇచ్చాడు
335-రూప దీపిక కర్త -బహురూప మిశ్ర (1100
మహా మహోపాధ్యాయుడని పించుకొన్న మిశ్రా పన్నెండవ శతాబ్ది మొదటి వాడు .ధనుంజయ ,ధనికుల రచనలకు వ్యాఖ్య రాశాడు .వాటిని దశ రూపాలు అన్నాడు .అతని వ్యాఖ్యానం పేరు ‘’రూప దీపిక ‘’.దీనికి మించిన వ్యాఖ్యానం లేదని అభిజ్నులన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-15 –ఉయ్యూరు