గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
336-ఉత్పల దేవుడు (930)
అభినవ గుప్తుని గురువు లక్ష్మణ గుప్తుని గురువే ఉత్పల దేవుడు .ఉదయకారుని కొడుకు .930వాడు .ఇతని గురించి క్షేమేంద్రుడు చెప్పాడు .’’ఈశ్వర ప్రత్యాభిజ్న సూత్రం ‘’రాశాడు .దీనికి అభినవ గుప్తుడు వ్రుత్తి 1015లో రాశాడు .ఉత్పలుని గురువు సోమానందుడు ప్రత్యభిజ్న మార్గ స్థాపకుడు .ఉత్పలుని సంగీత పారమ్యాన్ని అభినవ భారతి ప్రస్తుతించాడు .’’శివ తత్వ నాటకం ‘’లో బసవ రాజు ‘’ఉత్పలాఘం పరిమళం కృతి శాంజ్న ధరస్యచ ‘’అని అన్నాడు .
337-కావ్య కౌతుక కర్త -భట్ట తౌతుడు’
భట్ట తౌతుడు రాసిన ‘’కావ్య కౌతుకం ‘’కనపడటం లేదు .కాని అతను కవి గురించి ,కావ్యం గురించి చెప్పిన శ్లోకాలను మాణిక్య చంద్రుడు ఉదాహరించాడు .’’ప్రజ్ఞా నవ నవొన్మేషశాలినీ ప్రతిభా మత –తదను ప్రాపణా జీవ ద్వర్ణణా నిపుణః-తస్య కర్మ స్తుతం కావ్యం ‘’.ఈ గ్రంధం నకలు రాజ చూడామణి దీక్షితుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది .అతడు తౌతుని నిర్వచనాలనే పాటించాడు .కవిని గూర్చి తౌతుడు చెప్పిన భావాలు అమోఘం ఆదర్శం అనుసరణీయం
‘’నానృషిః కవిరిత్యుక్తః రుషి శ్చ కిల దర్శనాత్ –విచిత్ర భాషా ధర్మం స్తత్వ్వ ప్రఖ్యా చ దర్శనం
స తత్వ దర్శనాదేవ రుషేషుపటితః కవిః-దర్శనాద్వర్ణరూయ రూడ్హా లోకే కవిశ్రుతిః
తయాహి దర్శనే సంచే నిత్యోభ్యాయాది కవెర్మునేః-నోదితా కవితా లోకే యావ జ్ఞాతా ణ కర్మణా (కావ్యాను శాసనం )
దీనిపై అభినవ గుప్తుడు గొప్ప వ్యాఖ్య రాసి ‘’వివరణ ‘’అని పేరుపెట్టాడు .తన లోచన వ్యాఖ్యలోనూ దీన్ని ఉటంకించాడు .రస భావం పై లోల్లట ,శంకుక లకు ఉన్న అభిప్రాయాలను భట్ట తౌతుడు మెరుగు పరచాడు .
338-రాజానక రత్న కాంతుడు (1640
దౌమ్యాయన గోత్రీకుడైన శంకర కాంతుని కొడుకు రత్నకాన్తుడు ..కాశ్మీర దేశస్తుడు .అతని ‘’శారద ‘’కావ్యపు రాత ప్రతులు శ్రీనగర్ లో భద్ర పరచ బడినాయి .కవి ,సాహిత్య శాస్త్ర వేత్త .రత్న శతకం అనబడే చిత్ర భాను శాతకం లో .సూర్య వర్ణన పరమాద్భుతం గా చేశాడని పేరు వచ్చింది .1680లో దీన్ని కూర్చాడు .రత్నాకరుని ‘’హరవిజయం’’ పైన ,వాసు దేవుని ‘’యుదిష్టిర విజయం ‘’పైనా విపుల వ్యాఖ్యానాలు రాశాడు .అలాగే జగద్దారుని ‘’స్తుతి కుసుమాంజలి ‘’యశస్కరుని ‘’దేవీ స్తోత్రం ‘’లపైన కూడా వ్యాఖ్యలు రాశాడు .’’కావ్య ప్రకాశం ‘’పై ‘’సార సముచ్చయం ‘’,మంచి పేరుపొందింది .ఇతని వంశం వారు ఇప్పటికీ శ్రీనగర్ లో ఉన్నారు .’’కారి కున’’ కుటుంబం గా వీరికి సంఘం లో గౌరవ స్థానం ఉంది .
339-భావ ప్రకాశన కర్త-శారదాతనయుడు (1100-1200
కాశ్యప గోత్రీకుడైన భట్ట గోపాలుని కొడుకే శారదాతనయుడు .మేరుత్తర జన పదం లో మాతార పూజ్య నివాసి .విష్ణువు గురించి ముప్ఫై యజ్ఞాలు చేసి ‘’వేద భూషణం ‘’అనే వ్యాఖ్యానాన్ని వేదాలపై రచించాడు .ఇతని కొడుకు కృష్ణుడు, తాత శారదా తనయుడు వేదం లోను శాస్త్రాలలోను గొప్ప పండితులు .కాశీలో విశ్వేశ్వర భక్తుడు.‘శివానుగ్రహం తో జన్మించిన వాడే భట్ట గోపాలుడు .గోపాలుడు పద్దెనిమిది విద్యలలో అపార పాండిత్యం ఉన్నవాడు .శారదా దేవి ని ప్రసన్నం చేసుకొని కుమారునికి జన్మనిచ్చి శారదా తనయుడు అని నామకరణం చేసుకొన్నాడు క్రుతజ్ఞతగా .దివాకరుని వద్ద విద్య నేర్చాడు .నాట్య శాల స్థాపించి కల సేవ చేశాడు .ప్రత్యభిజ్న సిద్ధాంత అవలంబకుడు .దీని మూలం కాశ్మీరం .అభినవ గుప్తుడు వ్యాప్తి చేశాడు . శారదా తనయుడు సంగీత మూలాలను గుర్తించి 36తత్వాలను ప్రత్యభిజ్న సిద్ధాంతానికి అన్వయించాడు .పరమాత్మ ,జీవాత్మ ప్రక్రుతి లపై విపులమైన చర్చ చేశాడు .దీని ఆధారం గా తన నాటకాలలో నాటక రసాన్ని ప్రేక్షకులు అనుభ విన్చేట్లు చూశాడు .ప్రేక్షకానందం జీవుడు ప్రపంచ సుఖాలను అనుభవిస్తూ పొందే ఆనందంగా చెప్పాడు .ప్రత్యభిజ్న వేదాంతం లో కూడా రాగం, విద్య, కళ ఉన్నాయన్నాడు.భోజుని శృంగార ప్రకాశను అనుసరించాడు .పదమూడవ శతాబ్దపు కవులు ఇతన్ని ఎక్కువగా ఉదాహరించారు కనుక కాలం పన్నెండు పదమూడు శతాబ్దాల మధ్య అని తేల్చారు .
సంగీతం పై ‘’శారదీయం ‘’రాశాడు కావ్య ప్రకాశకు వ్యాఖ్య రాశాడు .అతని ‘’భావ ప్రకాశానం ‘’ఉద్గ్రంధం .పది అధికారికలపై విస్తృత చర్చ చేశాడు .
340-రసకల్పద్రుమ కర్త-చతుర్భుజుడు
‘’రస కల్పద్రుమం ‘’రాసిన చతుర్భుజ కవి సహిస్టఖాన్ ను మెప్పించాడు .ఆశక ఖాన్ కొడుకు. ఇతాముద్దౌలాకు మనవడు చతుర్భుజుడు అని అంటారు .రసకల్ప ద్రుమం లో వెయ్యి శ్లోకాలు ,అరవై అయిదు ప్రస్తావాలున్నాయి .సహిస్తాఖాన్ గొప్పసంస్క్రతకవి కవి .1689లో అతను రాసిన శ్లోకాలున్నాయి .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -27-8-15 –ఉయ్యూరు
శ