గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 341-కావ్య దాకిని కర్త-గంగానందుడు (1506-)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

341-కావ్య దాకిని కర్త-గంగానందుడు (1506-)

బికనీర్ మహా రాజు కర్ణుని(1506-1527) ఆస్థానకవి- గంగానందుడు .మిదిలలోని తీర్ధ భుక్త నివాసం .అతని ‘’కావ్య దాకిని ‘’లో అయిదు ’’ ద్రుష్టి ‘’లున్నాయి.కవితా దోషాలను గురించి వివరించే గ్రంధం .దోషం లో ఏ లోపం లేక పొతే గుణం గా భావించ వచ్చా ?అప్పుడు అది గుణం కాని దోషం కాని కాదా?అన్న దానిపై విపుల చర్చ చేశాడు .తన  ‘’కర్ణ భూషణం ‘’అనే ఆలంకారిక గ్రంధం లో  .భగదత్తుని కావ్యం ‘’భ్రుంగ దూతం ‘’లో  ‘’,మందారమంజరి’’ నాటకం పై రస చర్చ చేశాడు .

342-కావ్య కళానిధి రాసిన -కృష్ణ సూది (1200)

జగన్నాధ పండిత రాయల వంశం వాడిన కృష్ణ సూది శివరాముని కుమారుడు .కంచి దగ్గర సేయ్యార్ నదీ తీరం లో ఉత్తర మల్లూర్ నివాసి .’’కావ్య కళానిధి ‘’రాశాడు .తన ప్రాపు అయిన కొల్లం రాజు రామ వర్మ ను వర్ణిస్తూ ఛందో రీతులను వివరిస్తూ ఉదాహరణలు ఇచ్చాడు .

గోపాలాచార్య కొడుకు  సంతలూరి కృష్ణ సూరి ‘’అలంకార మీమాంస ‘’లో జగన్నాధుని రసగంగాధారం ను ఏకి పారేశాడు .కృష్ణ సూది కృష్ణా జిల్లావాడు .’’సాహిత్య కల్ప లతిక ‘’కూడా రాశాడు .

కాకతి ప్రతాప రుద్రుని(1290) ఆస్థానం లో ఉన్న భల్లట కవిని వీర భల్లట అంటారు .నాట్య శాస్త్ర నిష్ణాతుడు .’’నాట్య శేఖరం ‘’రాశాడని అభినవ భూషణ కర్త శ్రుంగార శేఖరుడు తెలియ జేశాడు .

343-రసప్రకాశ కర్త-కృష్ణ శర్మ(1600-1700)

వాసుదేవ యోగీశ్వరుని శిష్యుడు కృష్ణ శర్మ ‘’మందారమానంద చంపు ‘’రాసి అందులో ఛందస్సు అలంకారాలు మొదలైన వాటిని చర్చించాడు .ఇది ఒకరకం గా విజ్ఞాన సర్వస్వం.అప్పయ్య దీక్షితులనుండి నిర్వచనాలను గ్రహించి రాశాడు .కనుక పదిహేడవ శతాబ్ది వాడు  .ఇతని ‘’రస ప్రకాశం ‘’మమ్మటుని ‘’కావ్య ప్రకాశ’’కు వ్యాఖ్యానమే .

344-‘’రస ప్రదీప’’కర్త – ప్రభాకర కవి (1550)

మాధవ భారతి కుమారుడు ,రామేశ్వరుని మనవడు అయిన ప్రభాకరుడు విశ్వామిత్ర గోత్రీకుడు .’’రస ప్రదీపం ‘’అనే అలంకార భాష్యం1583లో  రాశాడు .మూడు అధ్యాయాల ఈ గ్రంధం లో కవిత్వానికి కావలసిన ముఖ్య విషయాలు ,రసం ధ్వని లపై విపులంగా చర్చించాడు .1629’’దేవీ మహాత్మ్యమ్’’రాశాడు  .దీనికి ‘’లఘు సప్త శతి స్తవం ‘’అనే పేరు కూడా ఉంది .’’ఏకావళీ ప్రకాశ  ‘’తో బాటు ‘’కుమార సంభవం, వాసవ దత్త ‘’లపై వ్యాఖ్యానాలు కూడా రచించాడు .

రామేశ్వర భట్టుకు నారాయణ ,శ్రీధర ,మాధవులు కుమారులు .1513లో పుట్టిన నారాయణ అక్బర్ చక్ర వర్తి ఆర్ధిక మంత్రి తోడర్ మల్ కు అభిమానుడు .యితడు’’ వ్రుత్తి రత్నాకరం ‘’కు వ్యాఖ్య రాశాడు .ప్రభాకరుని కొడుకు కృష్ణ ‘’వాగీశ్వరీ  సంస్తవం ‘’రాశాడు .

345-సామ రాజ  దీక్షితులు(1650

బిందు పురందర కుటుంబానికి చెందిన సామరాజ  దీక్షితులు ‘’శ్రీ దామ చరిత ‘’కావ్యాన్ని 1681లో రాశాడు .త్రిపుర సుందరీ మానస పూజన స్తోత్రం ‘’’’అక్షర గు౦ఫ  ‘’, ఆర్యా త్రిశతి ,లతో బాటు అలంకార గ్రంధం ‘’శృంగారామృత లహరి ‘’రచించాడు.

ఇతని కొడుకు కామరాజు లేక కామ రూప శాస్త్రి ‘’శృంగార కలిక ‘’ను ‘’కావ్యేందు ప్రకాశ’’అనే అలంకార గ్రంధాన్ని రాశాడు .కామ రాజు కొడుకు వ్రజ రాజు లేక హరదత్తుడు ‘’రసమంజరి ‘’పై భాష్యాన్ని ,’’శృంగార శతకం ‘’,షడ్రుతువర్ణనం ‘’,ఆర్యా త్రిశతి ముక్తకం అనే రసిక రంజన కావ్యం రాశాడు .వ్రజ రాజు కొడుకు జీవరాజు మాధవ సేన మహా రాజు ఆస్థానకవి .’’గోపాల చంపు ‘’,రస తరంగిణి పై’’ సీతు ‘’అనే వ్యాఖ్యానాన్ని రచించాడు .అంటే సామరాజ వంశం కవితా సంపన్నం అన్నమాట .

346-సాహిత్య కౌముది రాసిన- బలదేవ విద్యా భూషణుడు (1720

దామోదర దాసు శిష్యుడు ,చైతన్యుని అనుయాయి బలదేవుడు బెంగాల్ దేశస్తుడు .జైపూర్ రాజు జయ సింహు నికాలం లో ఉన్నాడు అంటే పద్దెనిమిదవ శతాబ్దం వాడు .ఇతని ‘’సాహిత్య కౌముది ‘’భరతుని సూత్రాలపై వ్యాఖ్యానం తో బాటు స్వీయాభిప్రాయ వివరం కూడా .ఈ సూత్రాలనే’’ కారికలు’’ అని మమ్మటుని ‘’కావ్య ప్రకాశ ‘’లో పొందుపరచ బడినాయి .వివరణలు చూస్తె మమ్మటుడే కారికల కర్త అనిపిస్తుంది .

విద్యా భూషణుడు గొప్ప సాహిత్య శాస్త్రజ్ఞుడు .చైతన్యుని శిష్యుడు. చైతన్యుడు కృష్ణావతారం అని భావించి ఆయన గీతాలకు వ్యాఖ్య రాశాడు .

347-అలంకార కౌస్తుభ కర్త -విశ్వేశ్వరుడు (1720)

లక్ష్మీధరుని కొడుకు విశ్వేశ్వరుడు పాండే వంశానికి చెందిన వాడు .ఆల్మోడా నివాసి .అతనికి తొమ్మిదవ తరం వారు ఇంకా అక్కడే ఉంటున్నారు .18వ  శతాబ్ది ప్రారంభం ఇతనికాలం .సాహిత్య మేధావిగా ప్రసిద్ధి చెందాడు ఇంతటి మేధావులు బహు తక్కువ కాలమే జీవిస్తారని మనకు తెలుసు .అలాగే విశ్వేశ్వరుడు 34వ ఏట నే శివ సాన్నిధ్యానికి చేరుకొన్నాడు .ఛందస్సు ,అలంకార శాస్త్రాలలో అనేక గ్రంధాలు రాశాడు .అందులో ముఖ్యమైనవి ‘’అలంకార కౌస్తుభం ‘’,అలంకార కర్ణాభరణం ‘’,అలంకార కుల ప్రదీపం ‘’,అల౦కారముక్తావళి,కావ్య లీల ,కావ్య రత్నం ‘’,రస చంద్రిక ,’’.భాను దత్త్తుని రసమంజరి ,పై గొప్ప వ్యాఖ్యానం రాశాడు .అలంకార కౌస్తుభం లో తాను  రుక్మిణీ పరిణయం అనే సంస్కృత నాటకం ,శ్రింగార మంజరి అనే ప్రాకృత నాటకం రాసినట్లు చెప్పుకొన్నాడు

348-సాహిత్య రత్నాకర కర్త-ధర్మ సూధి.(1530

ధర్మ సూది లేక ధర్మ భట్టు కృష్ణా జిల్లాకు చెందినా పెద పులి వర్రు గ్రామస్తుడు .హరితస గోత్రానికి చెందిన వెలనాటి బ్రాహ్మణుడు .వీరి పూర్వీకులు వారణాసిలో ఉండటం వలన ఇంటిపేరు ‘’వారణాసి ‘’అయింది .సన్యాసం స్వీకరించి రామానంద లేక గోవి౦దానంద సరస్వతి అయ్యాడు .అమిత రామ భక్తుడు. రాముడే అన్నిటికీ మూలం అని నమ్మాడు .

సోదరుడు నారాయణ గొప్ప వేద పండితుడు .తాత సాహిత్య విశారదుడు .సూది పదహారవ శతాబ్ది వాడు .న్యాయ శాస్త్ర నిష్ణాతుడు .కాని చందోలంకార శాస్త్రాలపైనా మోజున్న వాడు .’’సాహిత్య రత్నాకరం ‘’రాశాడు .అందులో ఛందస్సుపై చర్చ చేసి ఉదాహరణలుగా రామునిపై శ్లోకాలు ఇచ్చాడు .విద్యానాద విశ్వేశ్వరులు రాజాశ్రయం లో రాజులపై అలంకార శాస్త్రాలు రాసినందుకుదుయ్య బట్టాడు.శంకర భాష్యం  కు,రత్న ప్రభ కు  విపులమైన టీక రాశాడు  .’’కృష్ణ స్తుతి’’ కూడా చేశాడు .’’హంస సందేశం ‘’అనే ప్రాకృత కావ్యం రాశాడు .వ్యాయోగం ,నరకాసుర వధ కు మంచి పేరు.కృష్ణుని బాల్యం పై ‘’బాల భాగవతం ‘’రచించాడు ,

349-అలంకార నికష రాసిన -సుధీంద్ర యోగి (1650)

‘’అలంకార నికష ‘అనే మినీ గ్రంధం ’రాసిన సుధీంద్ర యోగి తన గురువు, విజయేంద్రయతి శిష్యుడు మధ్వా చార్యుడు అయిన  సుధీంద్ర యోగి ని స్తుతిస్తూ రాసిన అలంకార గ్రంధం .’’సుభాద్రాపరిణయ’నాటకమూ రాశాడు .ఈయన గురువు సుభద్రా ధను౦జయం రాశాడు .సుదీన్ద్రుడు పది హేడవ శతాబ్ది వాడు,తంజావూర్ పాలకుడు రఘునాధ నాయకుని చేత సన్మానం పొందాడు .

విశ్వేశ్వరుని ‘’చమత్కార చంద్రిక ‘’కూడా ఇలాంటిదే .అందులోని ఉదాహరణలు సి౦గ భూపాలుని( 1330) పై ప్రశంశలే  . విశ్వేశ్వరుని శిష్యుడు నాగనాధుడు . ‘’మదన విలాసం ‘’అనే నాటకం రాసి రాచర్ల రాజు సింగ భూపాలుని కొడుకు మాచు నికి గౌరవంగా అంకిత మిచ్చాడు .అనపోత రాజు కాలం1369 లో వేసిన శిలాశానకర్త ఇతడే.1425’’కవితావ తారిక ‘’రాశాడు  .పురుషోత్తమ సూది దీనికినాగ భూపాలునిపై  ఉదాహరణలు కూర్చాడు .మాచ రాజు మనవడే నాగ .1400లో గంగాపుర రాజు .

350-రసప్రపంచం కర్త -వెంకట  శాస్త్రి (1700

ఆనివిల్ల యజ్ఞనారాయణ కుమారుడే వెంకట శాస్త్రి .పశ్చిమ గోదావరిజిల్లా కాకరపర్తి నివాసి .సకల శాస్త్ర వైదుష్యం ఉండటం చేత విజయనగర ,దార్లపూడి మహారాజులచేత సన్మా నాలందు కొన్నాడు .’’మహేశ్వర మహా కావ్యం ,సతీ స్తోత్రం ,భాస్కర ప్రశస్తి ,రుక్మిణీ పరిణి కావ్యం రాశాడు .’’అలంకార సుధా సింధు ‘’,’’రస ప్రపంచం ‘’ఆతని శేముషికి నిదర్శనాలు .నూజివీడు రాజు మేకా వెంకట నరసింహ అప్పారావు పై ఉదాహరణలిస్తూ ‘’అప్పారాయ వంశ చంద్రోదయం’’ రాశాడు .దీనికి రాజు మెప్పుగా వల్లూరు మిల్లి అగ్రహారాన్ని 1745లో బహూకరించాడు .అక్కడే సోమయాగం చేసి ‘’శ్రౌతసూత్రాలు ‘’’పై విపుల టీక రాశాడు .

ఈయన కుమారుడు నారాయణ కూడా ఇలాగే ‘’సాహిత్య కల్పద్రుమం ‘’రాసి నూజివీడు జమీందార్ జగన్నాధ అప్పారావు కు అంకితమిచ్చాడు .ఇతని కొడుకు బాలకవి అనబడే  వెంకట శాస్త్రి తన ‘’చిత్ర చమత్కార మంజరి ‘’ని పెద్దాపురం రాజు వత్సవాయి  తిమ్మ జగపతి కి అంకితమిచ్చాడు .’’సూర్య స్తవం ,కూడా రాశాడు .

351-స్వప్న వాసవ దత్త ను మొదట గుర్తించిన –శ్రీ యతి రాజ స్వామి

శ్రీ  యాదుగిరి  యతి రాజ సంపత్కుమార రామానుజ అనే శ్రీ యతిరాజ స్వామి  మైసూర్ లోని మెల్కోటే మఠ పీఠాది పతి .సన్యాసాశ్రమం స్వీకరించటానికి ముందు మైసూర్ పురావస్తు శాఖలో అధికారి .’’గొప్ప సాహిత్య వేత్త. భామహుని పై చాలా విశ్లేషణాత్మక వ్యాసాలూ రాశాడు .’’స్వప్న వాసవ దత్త ‘’నాటకాన్ని మొదటి సారి కనుగొన్నది ఈయనే .శృంగార ప్రకాశ లోని కొన్ని అధ్యాయాలను కనుగొనిగొప్ప ఉపోద్ఘాతం రాసి  ముద్రించిన ఘనత కూడా యతి రాజ స్వామిదే .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-8-15 -ఉయ్యూరు

మనవి –

గీర్వాణ కవుల  కవితా గీర్వాణం లో 146మంది సంస్కృత కవుల గురించి వారి కవితా సామర్ధ్యాన్ని గూర్చి రాసి సరసభారతికి అత్యంత ఆప్తులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి అంకితమిచ్చి ,వారి మేనకోడలు డా శ్రీమతి జ్యోతి , మేనల్లుళ్ళ సౌజన్యం తో ముద్రించి సరసభారతి నిర్వహించిన శ్రీ  మన్మధ ఉగాది వేడుకలలోమాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారి చేత ఆవిష్కరింప జేసిన విషయం  సాహితీ  బంధువులకు తెలిసిన విషయమే .ఇంకా ఎందరో మహా కవులుండి పోయారని వారిని గురించి కూడా రాయాలని ఉందని ఆ గ్రంధం లోనే తెలియ జేశాను .

అనుకోకుండా  14-5-2015 న ‘’గీర్వాణ కవుల  కవితా గీర్వాణం(2) రెండవ భాగం అంతర్జాలం లో రాయటం ప్రారంభించాను .దీనికి ముఖ్య ఆధారం శ్రీ ఏం .క్రిష్ణమాచారియార్ ఆంగ్లం లో రాసిన ‘’History of Classical Sanskrit literature ‘’అనే వెయ్యి పేజీల బృహత్ గ్రంధం .దీన్ని నాకోసం మైనేని గోపాల కృష్ణ గారు అమెరికా నుండి పంపారు .దాన్ని చదువుతూ ,అర్ధం చేసు కొంటూ ,ఈ రెండవ భాగాన్నిమొదలు పెట్టి రాయటం ప్రారంభించాను .ఇది అలా అలా పెరిగి పెరిగి రెండవ భాగం లో 147నుండి 351కవుల గురించి అంటే రెండోభాగం లో 204 మంది గీర్వాణ కవుల పుణ్య చరిత్రలను రాశాను .రెండు భాగాలలోనూ కలిపి 351మంది గీర్వాణ కవి వరేణ్యు  లగురించి రాశానన్నమాట .ఇది నేను ఊహించలేదు .  ఆ గ్రంధం ఆధారంగా ఇంకా సుమారు ఇరవై  మంది పై రాయాల్సి ఉంది .

వీరుకాక మన తెలుగు వారిలో సంస్కృత రచనలు చేసిన సర్వశ్రీ విశ్వనాధ ,చెరువు ఆంజనేయ శాస్త్రి ,చింత గుంట  సుబ్బారావు ,తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి ,శతావధాని పాలపర్తి శ్యామలా నంద ప్రసాద్ మొదలైన వారి పై రాయాల్సి ఉంది .వీరి గుఱించిన సమాచారం పొన్నూరు సంస్కృత కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి ,చీరాలకాలేజి రిటైర్డ్  జియాలజీ లెక్చరర్ ,వందలాది సంస్కృత రచనలను స్వంత ఖర్చు తో ముద్రించి ఉచితంగా అందజేస్తున్న శ్రీ  రావి మోహన రావు ,ప్రస్తుతం విజయ వాడలో ఉంటున్న సంస్కృత మహా పండితులు శ్రీ ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి ,విజయ వాడ లెక్చరర్, శతావధాని, విశ్వనాధ సంస్కృత రచనపై పరిశోధన చేసిన ,స్వయంగా సంస్కృత రచనలు చేసిన శతావధాని డా. శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ ,జిల్లెళ్ళమూడి  సంస్కృత కాలేజి రిటైర్డ్ ప్రిన్సిపాల్ మహా వక్త ,ప్రస్తుత విజయవాడ వాస్తవ్యులు డా.మల్లాప్రగడ శ్రీమన్నారయణ గార్లను సంప్రదించి వారి వద్ద ఉన్న విలువైన సమాచారాన్ని సేకరించమని ఫోన్ నంబర్లు ఇచ్చి నన్ను ప్రోత్సహించారు ‘’గీ ర్వాణం మొదటి భాగాని’’కి ముందుమాట రాసిన డా రామడుగు వెంకటేశ్వర శర్మ గారు .శర్మగారికి కృతజ్ఞతలు .అలాగే నేను పై వారిని  సంప్రదించాను .అందరూ  సహృదయత తోస్పందించి వారి వద్ద ఉన్న సమాచారాని విలువైన పుస్తకాలను నాకు పంపించారు .వీరందరికీ నా కైమోడ్పు . ఇది ఒక బృహత్తర ప్రయత్నం అని వారందరూ వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఇది సరస్వతీ  సమార్చనం గా నేను భావిస్తున్నాను . మా ఇలవేల్పు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి కృపా కటాక్షం, శ్రీ సరస్వతీ మాత అనుగ్రహం లేక పొతే ఇంత అక్షర రాసిని కూర్చటం నావల్ల అయ్యేదా?

పూర్తిగా రాసిన తర్వాత ‘’ఈ సోది’’ మాటలు రాస్తే బాగుందేదికదా అని పించవచ్చు.కాని ‘’సుందరానికి తొందరెక్కువ ‘’అనే సామెత ఉండనే ఉంది. అప్పటి దాకా ఆగలేక శ్రీ వరలక్ష్మీ వ్రతం శుభ సందర్భం గా  ఈ విషయాలు మీ ముందు  ఉంచాను .దుర్గా ప్రసాద్ -28-8-15

శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.