గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
359- వీణ కనిపెట్టిన సంగీత రత్నాకర ‘’కర్త-2 – — -సారంగ దేవుడు(1100-
సారంగుని ‘’సంగీత రత్నాకరం’’ ఏడు భాగాలలో ఉంది .ప్రతిభాగం మరలా ప్రాకారాలుగా విభజించాడు .మొదటిది ‘’స్వరాధ్యాయం ‘. సంగీత స్వరాలు , శ్రేణులు వగైరాలపై రాశాడు . రెండవది’’రాగాధ్యాయం ‘’ మాధుర్యం లోని తరగతులను రకాలను నిర్వచించి ఉదాహరణలిచ్చాడు ’.మూడవది ‘’ప్రకీర్ణాధ్యాయం ‘’లో సాంకేతిక పద వివరణ ఇచ్చాడు .నాల్గవది ‘’ప్రబందాధ్యాయం ‘’లో సంగీతం కూర్చటానికి నియమాలు తెలియ జేశాడు .అయిదవదైన ‘’తాళాధ్యాయం ‘’లో తాళాలలోని కాలంకొలతలను ,ఆరవదైన ‘’వాద్యాధ్యాయం ‘’లో సంగీత వాద్యాల ప్రయోజనాల గురించి ,ఏడవది ‘’నృత్యాధ్యాయం ‘’లో నాట్య,నటనలను వివరించాడు . ఈ గ్రంధం పై సింగ భూపాలుడు ,కేశవుడు ,కల్లినాధుడు ,హంసభూపాలుడు ,కుంభ కర్ణుడు విపుల వ్యాఖ్యలు రాస్తే ,హిందీలో గంగారాముడు సుదీర్ఘ వ్యాఖ్య రాశాడు .,
360-కర్నాటక సంగీతం అనే పేరు తెచ్చిన -సోమరాజ దేవుడు సర్వేశ్వరుడు (1116-1127)
భూలోక మల్లుడు అనబడే సర్వేశ్వరుడు రాజు .1116-1127లో పాలన చేశాడు జీవిత సర్వస్వం పాటకు నాట్యానికి అంకితం చేశాడు . దక్షిణ భారత సంగీతానికి ‘’కర్నాటక సంగీతం ‘’ అనే పేరు ఆయన పాలించిన కర్నాట దేశం వలన వచ్చింది .రాజరిక దర్పాన్ని ప్రక్కకు పెట్టి ‘’కుండలి ‘’అనే నాట్యాన్ని మహారాష్ట్ర నర్తకికి నేర్పిన ఉదారుడు .తర్వాత దానికి ‘’గోండిని ‘’అనే పేరు వచ్చింది .తన ఆస్తానం లో ప్రబంధాలకు ప్రదర్శన కల్గించాడు .తన ‘’మానసోల్లాసం ‘’లో 2500శ్లోకాలకు సంగీతం సమకూర్చి కొత్త విధానమైన ప్రబంధానికి మార్గ దర్శి అయ్యాడు .సారంగుడు శారదా తనయుడు మరొక సోమేశ్వరుని గురించి చెప్పారు .ఈ ఇద్దరూ ఒకటే నని రుజువు లేదు .సోమరాజ దేవుడు ‘’సంగీత రత్నావళి ‘’రాసినట్లు విషయ సూచిక లో ఇచ్చాడు కాని అది సోమేశ్వర రాజు రచన కాదు బహుశా 1174-1177కాలం లో గుజరాత్ ను పాలించిన చాళుక్య అజయ పాలుడు అనే ప్రతీహార రాజు కావచ్చు .
361-నటాంకుశం కర్త-మహిమ భట్టు (1400
మహిమ భట్టు ‘’నటాంకుసం ‘’కర్త .ఇదులో రసానికి , అభినయానికి ఉన్న సంబంధాలను వర్ణించాడు .దీనికి ఆధారం శక్తి భద్రుని ‘’ఆశ్చర్య చూడామణి ‘’పద్నాలుగవ శతాబ్ది తర్వాత వాడు మాత్రం కాదు .ఇందులో ‘’ప్రతిజ్ఞా యౌగంద రాయణం’’నాటకాన్ని ఉదాహరించాడు.
‘’రాగ సాగరం ‘ అనే పౌరాణిక శైలో మూడు అధ్యాయాలగ్రంధం నారదునికి దత్తిలకునికి మధ్య జరిగిన సంభాషణ లలో రాగాల రకాలు ధర్మాలు మొదలైన వాటి చర్చ ఉంది .సారంగ దేవుని ప్రస్తావన ఉన్నది .ఇది పద్నాలుగవ శతాబ్దం కంటే ముందు రచన మాత్రం కాదు .
362- సంగీత సమయ సార కర్త -పార్శ్వ దేవుడు (1230)
గౌరీ ,ఆదిదేవ దంపతుల కొడుకు పార్శ్వ దేవుడు .శ్రీకంఠ జాతికి చెందినవాడు గురువు మహా దేవ రాయలు .జైనుడు సంగీతమే మోక్షానికి మార్గం అని దర్శనాలు కాదని నమ్మాడు .’’సంగీత సాకారుడు ‘’,’’శృతి జ్ఞాన చక్ర వర్తి ,’’అభినవ భారతాచార్యుడు ‘’అని తనను తాను చెప్పుకొన్నాడు .భోజ ,సోమేశ్వర ,పరమార్ది లను పేర్కొన్నాడు .ఇతని గ్గ్గురించి సింగ భూపాలుడు చెప్పాడు కనుక పదమూడవ శతాబ్దం వాడు .తొమ్మిది అధికరణలున్న ‘’సంగీత సమయ సారం ‘’రచించాడు .నాదం ధ్వని స్థాయి రాగం ,ధోక్కిఓడలైన వాట్ని గురించి చర్చించాడు .తాళ ,వాద్య ,అభినయ ,రాగ,ప్రస్తార లను గురించి వివరించాడు చివరికి ‘’అద్వ యోగం ‘’తో సమాప్తి చేశాడు .రాజకవులైన ప్రతాప ,దిగంబర ,శంకరులను ఉటంకించాడు .’’పంచాతాళేశ్వరో యద్వా హృదం గద్య మధాపి వా –ఆలిక్రమీ యమే భోక్తం ప్రతాప పృధివీ భుజం ‘’
సశేషం
శ్రావణ పౌర్ణమి రాఖీ శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -29-8-15