గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 388-దత్తకుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2

388-దత్తకుడు

పాటలీ పుత్రం లో మధురఅనే బ్రాహ్మణ  కు కుమారుడు .తల్లి చిన్నప్పుడే చనిపోతే తండ్రి ఒక బ్రాహ్మ స్త్రీకి దత్తత ఇచ్చాడు కనుక ‘’దత్తకుడు ‘’అనే పేరు స్తిరపడింది .ప్రపంచ గతిని పరిశీలిస్తూ ,దానికి తగిన క్షేత్రం ఒక నాట్య కత్తే ఇల్లు అనుకోని అక్కడ ఉండి వారి కళా రహస్యాలన్నీ బాగా పరిశీలించి అర్ధం చేసుకొన్నాడు .ఆమె దత్తకుడినితమ వ్రుత్తి అయిన  కామ శాస్త్రం పై గ్రంధం రాయమని ప్రోత్సహించింది .ఈ విషయం వాత్సాయనుడు కామ సూత్రాలలో తెలియ జేశాడు .దత్తకుడు ‘’దత్తక సూత్రాలు ‘’రాస్తే జయమంగళుడు వ్యాఖ్యానం రాశాడు .అయితే ఈ సూత్రాలు దొరకలేదు కాని శ్యామలకుడు ,ఈశ్వర దత్తుడు తామ నాటకాలలో ఇందులోని శ్లోకాలను ఉదాహరించారు .శూద్రకకవి ‘’పద్మ ప్రాభ్రుతక ‘’లో ఒక పాత్ర దట్టక రచనను పేరడీ చేస్తుంది .అది ఓం తో ప్రారంభ మౌతుంది .

గంగ వంశపు రెండవ మాధవ వర్మ రాజు దత్తక సూత్రాలపై ‘’వ్రుత్తి రాశాడు .యితడు దుర్వినీతుడికి అయిదవ తరం వాడు .క్రీ శ .380లో ఉండేవాడు .ఈ వ్రుత్తి లో రెండుపాదాలలో రక్త ,విరక్త ,వేశ్యలు ,శయనోపచారాలు ఉన్నాయి .ఇందులో మొదటి పాదం

‘’యద్దత్తకేన ప్రమదాహితార్ధం  కాంతానువృత్తం కదితం స్వతంత్రే    –తస్మాన్ సమాహృత్య సమస్త మన్యం  వేశ్యా౦గ నా వ్రుత్త మహం  ప్రవక్ష్వే  ‘’

దట్టక సూత్రాలతో బాటు ‘’కూచిమార గ్రంధం ‘’అనేది కనిపిస్తోంది .వాత్సాయనుడి కాలాని కంటే ముందే శయనోపచారాదికాలు సంగ్రహించి దత్తకుని పేర ఈ సూత్రాన్ని నిర్మించినట్లున్నది అంటారు ‘’సంస్కృత వాజ్మయ చరిత్ర ‘’లో మల్లాది సూర్య నారాయణ శాస్త్రి గారు .

‘’కూచిమారేణ తపసా యత్కృతం క్రీడనం పురా –తత్ప్రవక్ష్యామి చిత్రార్ధం నానార్ధ పద నిశ్చయం ‘’ కూచిమారుని పేరా ఎవరో ఈ తంత్రాన్ని రాసినట్లు తెలుస్తోంది అన్నారు శాస్త్రీజీ .మూడు పటలాలు ఉన్న ఈ తంత్రం లో వ్రుష్వ యోగాలు ఎక్కువగా చూపించాడు .

వీరణా రాధ్యుడు  మొదలైన వారు ‘’పంచ రత్నం ‘’మొదలైన స్వతంత్ర కామ శాస్త్రాలు రాశారు .

 

ఇంతకీ కామ శాస్త్రం అంటే ఏమిటి ?ఇది ఒక ప్రాచీన శాస్త్రం .ప్రజాపతి ప్రజల్ని సృష్టించి ధర్మార్ధ కామాలకు సాధనాలై వారిజీవనానికి కారణమయ్యే లక్ష అధ్యాయాలకు పరిమితమైన శాస్త్రాన్ని చెప్పాడు .ధర్మ ఒకటే అయినా దేశాలను బట్టి మారింది .వైవస్వత మనువు ధర్మాదికారమైన శాస్త్రం రాశాడు .అర్ధం మొదలైన వాటి గురించి చెప్పే అర్ధ శాస్త్రం బృహస్పతి ప్రవచించాడు .శివుని అనుచరుడైన నంది కామాన్ని వేరు చేసి వెయ్యి అధ్యాయాల కామ సూత్రం  రాశాడు .దీన్ని స్వేతకేతువు సంగ్రహించి అయిదు వందల అధ్యాయాల కామశాస్త్రం రచించాడు .దీన్ని ఇంకా సంక్షేపం చేసి కాధ్రవ్యుడు ‘’సామ్ప్రయోగికం ,కన్యా సంప్ర యుక్తం ,భార్యాదికారిక ,పర దారికం ,వైశిరం ,ఔపనిషదికం మొదలైన వాటితో నూట ఎనిమిది అధ్యాల శాస్త్రం గా మార్చాడు .

ఇందులో వైశిరం ను ఆధారం గా చేసుకొని పాటలీ పుత్ర వేశ్యల కోరిక మేరకు దత్తకుడు ‘’వేశ్యాధికరణం ‘’రాశాడు .చారాయనుడు సాదారనాదికరనం ,సువర్ణ నాధుడు సంసాంప్ర యోగికం ,ఘోటక ముఖుడు కన్యా సంప్ర యుక్తాన్ని ,గోవర్ధనుడు భార్యాదికారాన్ని ,గోణికా పుత్రుడు పరదారికాన్ని కుమారుడు ఔపనిషధ మును ,వేర్వేరు గ్రంధాలుగా రాశారు .  ఇందులో భద్ర వేయ నిర్మిత మైన గ్రంధం చాల విస్తృత రూపం లో ఉంది .కనుక దత్తకుడు మొదలైన వారు  సింప్లీఫై చేశారు .కాని ఇవి అసంపూర్ణాలు అని గ్రహించి వాత్సాయనుడు చదవ టానికి వీలుగా ఉండే చిన్న గ్రంధం గా కామ సూత్ర’రాశాడు ‘

ధర్మార్ధ కామ మొక్షాలలో మూడవదికామం .కామం లో శృంగార సంబంధమైన విషయాలను చెప్పింది కామ సూత్ర.

399-వాత్సాయనుడు (400-300 bc)

వాత్సాయనుడు అనగానే కామ సూత్రాలు జ్ఞాపకం వస్తాయి అంత పాప్యులర్ పేరు ఆయనది .వాత్సాయన ముని లేక మహర్షి అనికూడా అంటారు .అసలుపేరు మల్లనాధుడు .వీరిది  వాత్సాయన గోత్రం న్యాయ భాష్యం రాసిన పాక్షిల స్వామి తో సంబంధం ఉన్నవాడు అంటారుకాని రుజువులేదు .ఈయన తనరాజు కుంతలా శాతకర్ని భార్య  రాణి మలయావతి   హత్యతో సంబంధం ఉన్నవాడనే ప్రచారం ఉంది .-చరిత్రలో పదమూడవ శాతకర్ణి అనే ఆంద్ర శాతవాహన రాజు మ్రుగేన్ద్రస్వేతకర్ని కొడుకు .ఇతనిపాలనాకాలం క్రీ పూ 615-607అని మత్స్య పురాణం ,కలియుగ రాజ వృత్తాంతాలలో ఉంది .ఇది అసంబద్ధమని చరిత్రకారులు భావించి వాత్సాయనునికాలం క్రీ పూ మూడు నాలుగు శతాబ్దాల మధ్య అన్నారు .’వాత్సాయనుడు ,కౌటిల్యుడు ఒకరే అనే భ్రమలో కొందరు పడ్డారు .అది నిజం కాదు .

కామ సూత్ర సాంఘిక శాస్త్రమేకాక యుజేనిక్స్ కూడా .సద్ధర్మ చారిణి అయిన భార్య ఉత్తమా ఇల్లాలుగా ,ఇంటిని తీర్చి దిద్దు కొనే మహిళగా భర్త మనీపర్స్ పై పెత్తన దారుగా ,ఉండాల్సిన విధానం అంతా ఇందులో వివరించాడు .పురుషుడు విలాస వంతంగా ,బహు సంస్కృతుల ప్రలోభం లో పడి దారి కానని వాడుగా ,విశ్రు౦ఖల  విహారిగా ,పరకాంతా సక్తుడిగా ,విహార వినోద వేశ్యాలోలుడిగా ఉంటే ,అమ్మాయిల వెంట తిరిగే జులాయిగా ఉంటే అతనికి కావలసిన సకల సౌకర్యాలు ఇంట్లోనే కలుగ జేసి కొంగుకు ఎలా కట్టేసుకొని అతని సౌఖ్యం తన సంతృప్తి ఎలా తీర్చుకోవాలో చెపిన దాంపత్య శృంగార నీతి శాస్త్రం .

వెయ్యి సూత్రాలున్న ఈ శాస్త్రం సులభం గా అందరికీ బోధ పడేట్లు రాశాడు .పూర్వకవులందరూ కామసూత్రాధ్యాయ సంపన్నులే .వారి కావ్యాలలో ఉన్న నాయకా నాయికలే దీనికి ఉదాహరణ .కాళిదాసు శకుంతలను అత్తవారింటికి పంపే సన్నివేశం లో కణ్వ మహర్షి చేత చెప్పించిన ‘’శుశ్రూణత్వగురూ ‘’శ్లోకం లో నీతులే కాకుండా ,కామ సూత్రా లోని ఏకచారిణీ వృత్తం లోనిదే అవటమేగోప్ప నిదర్శనం  .మాలతీమాధవం లో ‘’ఏవం హి కామ సూత్ర కారామామన నంతి’’అని చెప్పాడు . పెద్దన గారు మనుచరిత్రలో ప్రవరుని చేత వరూదినితో ‘’కామ శాస్త్రాధ్యాయిని నావచిం చెదు’’అనిపించినా సంగతి మనకు తెలిసిందే .వ్యాఖ్యాతలు కూడా కామసూత్రాలను ఉదాహరించారు.వీటి ప్రాచుర్యం అంతటిది .

వాత్సాయనుడు ఈ గ్రంధానికి మొదటి శ్లోకం లో ‘’ధర్మార్ధ కామేభ్యోనమః ‘’అని ప్రారంభించి గ్రంధాంతం లో ‘’తదేత బ్రహ్మ చర్యేణపరేణచ సమాధినా –విహితం లోక యాత్రార్ధం న రాగార్దోన్య సంవిది

‘’రాక్షణే ధర్మార్ధ కామానాం స్థితిం స్వం లోక వర్తినీం –అస్య శాస్త్రస్య తత్వజ్నో భవల్యేవజితేన్ద్రియః ‘’ అని పూర్తీ చేశాడు .కామ శాస్త్ర ఫలం ఏమిటో విస్పష్టం చెప్పాడు .గృహస్త ధర్మాలను చక్కగా జరుపుకోవటానికి ఉద్దేశిందే తప్ప రాగం కోసం కాదన్నాడు .దీని సారం గ్రహిస్తే ధర్మార్ధ కామాలకు పరస్పరవైషమ్యం లేకుండాజితే౦ ద్రియుడై ఐహిక ఆముష్మిక సాధనం గా జీవన యాత్ర సాగించాలని బోధించాడు .

భార్యనువదిలి పరభార్యల వెంట బడే వారి చేస్ట ల్ని చూపించే భాగం మాత్రమె చదివితే ఆ కోరిక పెరుగుతుంది కాని సాకల్యం గా చదివి అర్ధం చేసుకొంటే కులపాలికా ప్రణయానికే అధిక ప్రాధాన్య మిస్తారు ఇవ్వాలి అని వాత్సాయనుని కామం లేక కోరిక .భర్తకు గృహ క్రుత్యాలలో చేదోడు వాదోడుగా ఉండటం మాత్రమె కాదు ఆతని కామానికి ఇంట్లోనే కల్లెంవేయాలి దానికి కావలసిన’’ దినుసులన్నీ ‘’చెప్పాడు వాత్సాయనుడు .వాటిని అర్ధం చేసుకొని భర్తకు తనకూ సుఖాన్ని సంతృప్తిని కలిగించాలి ,పొందాలి .భర్త గృహం దాటి శృంగారానికి బయటికి పరి గేత్తకుండా కట్టడి చేసే సమస్త విద్యలు భార్య నేర్వాలని ఆయన భావన దాంపత్యం చక్కగా పండాలి సత్సంతానం కలిగి వంశాభి వృద్ధి జరగాలి .పడక గది సౌఖ్యం కోరుకోవటం మగాడి ఆంతర్యం దాన్ని అర్ధం చేసుకొని ప్రవర్తించాలి .వివిధ భంగిమలలో ,కోణాలలో రతి సౌఖ్యం అందుకోవాలి దంపతులు అప్పుడే పరిపూర్ణత అని వాత్సాయనుని ఆలోచన .ఈ కామ సూత్ర వ్యాఖ్యానాలే మనకు మధ్య ప్రదేశ్ లోని ఖజురాహో దేవాలయాలపై ఉన్న అద్భుత శిల్పాలు అవేవో కామకేళీ విలాసాలు కావు .సుఖ సంసారానికి మార్గ దర్శకాలు .మనం బజారు లో చూసే చౌకబారు కామ సూత్రాలు చూసి అదే ఆయన చెప్పాడని అనుకొంటే ‘’కామపప్పు ‘’లో కాలేసినట్లే దిగ జారి నట్లే .

కామ సూత్రా కు యశోధరుని జయ మంగళ వ్యాఖ్య ,వీర భద్రుని ‘’కందర్ప చూడామణి ‘’భాస్కరనరసింహ శాస్త్రి ‘’వ్రుత్తి ‘’,ఉత్తమమైనవి .’’వాత్సాయనీయం కిల కామ సూత్రం వ్యాఖ్యాయితత్కైశ్చ్య దిహాన్య దైవ’’అనేదాన్ని బట్టి యశోధరునికి ముందే కొన్ని వ్యాఖ్యలున్నాయని అర్ధమవుతోంది .కాని అవి కనిపించలేదు .భాస్కర వంశ సంజాతుడు నరసింహ శాస్త్రి కాశీ నివాసి .సర్వేశ్వర శాస్త్రి శిష్యుడు .యితడు వ్యాఖ్యాన కారికలో ‘’వత్సోపరి వాత్సల్యా ద్వాత్సాయన నామ కామ శాస్త్రం యః ‘’అని ఉన్నందున వత్స రాజు మీది ప్రేమచే కామ సూత్ర రాశాడని చెప్పాడు .ఈ వత్సరాజు ఎవరో మాత్రం చెప్పలేదు .

వీరభద్రుడు కామ సూత్రాలకు ‘’కందర్ప చూడామణి ‘’వ్యాఖ్య ను స్మరి౦చిన  నరసింహ శాస్త్రి వ్రుత్తీ కంటే అర్వాచీనమైనది అని తేల్చారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు .శాస్త్రి పద్దెనిమిదవ శతాబ్ది పూర్వార్ధం వాడు .శాస్త్రి ‘’అజ్ఞాత ఆనందమైన మోక్షం కంటే జ్ఞాతానందమైన కామమే ఉత్తమ పురుషార్ధం ‘’అన్నాడు ఇతని ఇంటిపేరు భాస్కర కనుక ఆంధ్రుడు అయి ఉండచ్చు .కామసూత్ర అన్ని భాషల్లోకి అనువాదం పొంది ప్రపంచ ప్రసిద్ధమై చలన చిత్రంగానూ వచ్చింది ..

Inline image 1  Inline image 2

400-‘’జయ మంగళ వ్యాఖ్య కర్త ‘’ యశోధరుడు (700-800)

‘’జయమంగళ’’ అనే వ్యాఖ్యానం రాసినది యశోధరుడు కాదని శంకరుడు లేక శంకరాచార్య అని ఒక కధనం ఉంది .చాణక్యుని అర్ధ శాస్త్రం పై ,కామనందకి నృత్య శాస్త్రం పైనా ,భట్టికావ్యం మీద ,ఈశ్వరుని ‘’సాంఖ్యాయన సప్తశతి’’పైనా వ్యాఖ్యానాలు రాసింది శంకరుడు .యశోధరుడు లేక ఇంద్ర సేనుడు ఒక రాయసకాడు మాత్రమే అంటారు  .శంకరుడు ఎవరో తేలలేదు .కాని వ్యాఖ్య మాత్రం కొక్కోకం కంటే తరువాతి కాలానిది .పదమూడవ శతాబ్దికి ముందు రాసింది మాత్రం కాదు .శంకరుడు కామసూత్రాలకు వ్యాఖ్యానం రాశాడు .యశోధరుడు ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య వాడు .యితడు ఒక సామంత రాజని గురువు ‘’ఇంద్ర పదుడుఅనే బిరుదిచ్చాడని  ఒక కద ఉంది .వ్యాఖ్యావతరికలో తానను బాగానే సమర్ధించుకొన్నాడు

401- ‘’రతి రహస్యం ‘’రాసిన -కొక్కోకకవి (1200)

వాత్సాయన కామసూత్రాలు తర్వాత వచ్చిన ప్రసిద్ధ కామశాస్త్ర గ్రంధాన్ని కొక్కోక కవి రాశాడు అందుకే దీనికి ‘’కొక్కోకం ‘’అని పేరు .కొన్ని వ్రాత ప్రతులను బట్టి యితడు సింహళ పాటలీయుడని ,బారి భద్రుడు అని ,సింహళ దేశం వాడని వేరు వేరుగా చెప్పారు  .చివరికి సింహళీయుడే అని తేల్చారు.ఇతని ముత్తాత ప్రసిద్ధ పండితుడు ‘’తేజోకుడు ‘’.తండ్రి  ‘’గద్య విద్యాధర ‘’బిరుదుపొందినవాడు .మల్లినాధుడు కొక్కోకకవిని ముందుగా పేర్కొన్నాడు .ఇతనికాలం పదిహేనవ శతాబ్దం కావచ్చు అంటారు మల్లాది శాస్త్రిగారు .

కొక్కోక శాస్త్రం అవతారికలో కొక్కోక కవి తనను గురించి చెప్పుకొన్నాడు –

‘’కొక్కోక నామ్నా క్రుతినా క్రుతోయం శ్రీ వైన్య  దత్తస్య కుతూహలేన —-సకల కలాకలాప నిష్ణాతో వాగ్విలాస జిత బ్బృహస్పతిః కొక్కోనామా కవిః నందికేశ్వర ,శ్వేత కేతు పాంచాల దత్తక చారాయణ సువర్ణ నాద ఘోటక ముఖ గోవర్ద గోణికాపుత్ర  కూచిమార వాత్సాయన ప్రభ్రుతిభిః క్రుతేభ్య శాస్త్రేభ్య స్సార మాణాయ రతి రహస్యాఖ్యం గ్రంధ మారభామానః ‘’

ఇందులో వైన్యదత్తుడు ఎవరో మనకు తెలియదు .పైన పేర్కొన్న వారి గ్రంధాలను కొక్కోక కవి చదివినట్లు అనిపించదు వారిని స్మరించటం మాత్రామే చేసి ఉంటాడు అన్నారు మల్లాదివారు .కనుక మొత్తం మీద ఈకవి వాత్సాయన కామ సూత్రాలను మాత్రమె ఆధారంగా చేసుకొని తన శాస్త్రాన్ని రచించాడని తెలుస్తోంది .

కొక్కోక శాస్త్రం లో పది పరిచ్చేదాలున్నాయి .కంచ నాధుడు ‘’దీపిక ‘’పేరుతొ ,రామ చంద్ర బుదేన్ద్రుడు ‘’ప్రకాశిక ‘’పేరుతొ దీనికి వ్యాఖ్యలు రాశారు .కామసూత్రాలను అనుసరించి రాసినా దానికంటే లోకం లో కొక్కోకం బాగా వ్యాప్తి చెందింది .’’దిండుకింద పుస్తకం’’అయింది చాలా ఇళ్ళల్లో .కొక్కోకాన్ని కుంభ రాణ ,నయచంద్రుడు ఉదాహరించారు  కనుక పన్నెండవ శతాబ్దం లో రాసి ఉంటాడని కృష్ణ మాచారియార్ ‘’హిస్టరీ ఆఫ్ క్లాసికల్ సాంస్క్రిట్ లిట రేచర్ ‘’లో నిర్ణయించాడు .  .

Inline image 3

కొక్కోకం అన్ని భాషల్లోకి అనువాదం పొందింది ముఖ్యంగా ఇంగ్లీష్ అనువాదం”కోక శాస్త్ర ” తో అందరికి దగ్గరయ్యింది .

సశేషం

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -2-9-15- ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.