గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩
401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-3(చివరిభాగం )
ఇప్పుడు సమస్యా వలయం లోకి ప్రవేశించి అందులోనుంచి శాస్త్రిగారు ఎలా తప్పించుకొని రాణించారో చూద్దాం .
సహస్రావధాని డా.గరికపాటి నరసింహా రావు ‘’దుర్వారూఢంప్రణమతి జనో విఘ్న నాశాయ నిత్యం ‘’అనే సమస్యను ఇస్తే చెరువు అవధానిగారు మందాక్రాంత శ్లోకం లో
‘’అర్వాచీనైఃవిషయ గణనా దూర్వహై ర్ర్దుష్ప్ర యం –సర్వారాధ్యం సకల విషయై స్స్వాగమై స్షంస్య మానం
శర్వా పత్యం గజవరముఖం పార్వతీ తోష హేతూం-దుర్వారూఢం ప్రణమతి జనో విఘ్న నాశాయ నిత్యం ‘’అని పూరించారు
అర్ధం –విషయ బాహుళ్యం తో బరువవెక్కిపోతున్న నేటి జనాలకు అంతు పట్టనిన,వాడు ,అన్నికార్యాలకు ఆరాధ్యుడైనవాడు ఆగమాలచే స్తుతి౦ప బడినవాడు ,పార్వతీ పరమేశ్వరులకు సంతోష హేతువైనవాడు మూషక వాహనుడైన గజాస్యుదడైన గణపతిని జనం విఘ్ననాశాలకోసాం ప్రణమిల్లుతారు .
శ్రీ వారణాసి వెంకటేశ్వర శాస్త్రిఇచ్చిన సమస్య –‘’హహహాహా ,హహహా ,హహాహహః హ హాహా హః హాహా హాహా ను అందరూ హాహా అనేట్లు మెచ్చగా ఇలా పూరించారు మత్తేభస్వారి చేస్తూ పూరించారు
‘’హహ హాహా హహాహ హహహాహ ,హాహాహా ,హహాహా , ,హాహహే
త్యనుయాటం నిజ కాంక్షిణ౦ , పరిముహుప్సం ప్రార్ధమానం రహః
అభిమానేన చ కాంక్ష యా ప్రణయతఃస్మేరాస్యయా హుం కృతం
–‘’హహహాహా ,హహహా ,హహాహహః హ హాహా హః హాహా హాహా ‘’
భావం –ఏకాంతం లో తాను ప్రియు రాలి ని గురించి హంకారం చేసి వెంబడించిన సందర్భం లో తనను కోరే ప్రియుని పై స్నేహం కొద్దీ అభిమానం తో ప్రియురాలిచేత హు౦కా రాలు చేయ బడ్డాయి .
సన్యాసి ప్రతి రోజూ రతి సుఖాన్ని కోరుతున్నాడు అనిశ్రీ కొంపెల్ల వెంకటరామ శాస్త్రి ఇచ్చిన సమస్యను మహార్ధవంతగా మాలినీ వృత్తం లో చెప్పారు –
‘’యమనియమ విశిష్టో నైస్టికత్వేచ శిష్టః –శ్రుతిశిరసి నిగూఢంతత్వ మన్యేషమాణః
నిభ్రుత సుఖ మయోయం సంశ్రితో –యోగాభూమీ రతి సుఖ మభి వాంచత్యన్వహం శాటికాటః’’ తాత్పర్యం –యమనియమాలతో కూడిన నిస్టతో శిష్టుడైన శ్రుతుల అంతాల లోని రహస్య తత్వాన్ని అన్వేషిస్తూ ,నిశ్చల సుఖమయుడై ,యోగ భూమిని ఆశ్రయించిన సన్యాసి లోకాతీతమైన ఆనందాన్ని కోరుతున్నాడు .
‘’చంద్రః ఖేలన మాచ రంతి విబుధాః సంసర్గతో వర్ధతే ‘’అనే సమస్యను శ్రీ ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ ఇచ్చారు .శాస్త్రిగారు ప్రశ్నా సమాధాన రూపంగాశార్దూలం లో పూరణ చేశారు –‘’
‘’రాకాపూర్ణ విలాసినీ నిటలకే లాలాటికః కో భవత్-దైత్యేంద్రే దశ కంధరే వినిహతే కుర్వంతి కిం కే ముదా
దోషశ్చాపి గుణః కదం భవతి చేత్ ఏనం సమాదీయతే –చంద్రః ఖేలన మాచర౦తి విబుధాః సంసర్గ తో వర్ధతే ‘’

అర్ధం –పూర్ణిమా అనే నుదుట బొట్టు గా నిలిచేది ఎవరు ?చంద్రుడు ,రావణుడు చనిపోతే ఎవరేం చేస్తారు ?దేవతలు సుఖం గా క్రీడిస్తారు .దోషం గుణం ఎప్పుడవుతుంది?సహనం వలన అంటూ మూడుభాగాలు చేసి సమాధానంగా చెప్పి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు .ఇప్పుడు అవధానిగారి అనువాద ప్రతిభను దర్శిద్దాం –
‘’అనువుగాని చోట అధికులమనరాదు ‘’అన్న వేమన పద్యాన్ని సంస్కృతం లోకి అనువదించమని శ్రీ ఆర్ త్రినాధ శర్మ కోరితే
‘’ఆశక్తతాయాం నాదిక్యం యుక్తం దోషో ల్పతా-దర్పణేపర్వతస్స్వల్పో దృశ్యతే ఖాలు వేమన ‘’అని చెప్పారు .
శ్రీ కాశీభట్ట శేషయ్య శాస్త్రి – ‘’అడిగెదనని కడువడిజనునడిగి తనమగుడ నుడువడనినుడి యుడుగున్ –వెడవెడచిడి ముడితడబడనడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు వెడలన్ ‘’అనేపద్యాన్నిస్తే అంటే అందంగా
‘ప్రుచ్చామీతి ప్రచలతి-వతివవదతీతి చలతి నచలతి –స్థలతి చ పది పది-వివలతి న భవత్యేక త్ర జడమతిః కమలా ‘’అని సొగసుగా గీర్వాణం గా మార్చారు .
యేమని చెప్పను ?దుర్యోధనునిభార్య భానుమతి ఏకాంతం లో కర్ణుడితో చదరంగం ఆడుతోందని ఆకాశం లో తారలు చెవులు కొరుక్కుంటున్నాయి –అని శ్రీ ఊర కొండల రావు గారి ప్రశ్నకు అవధాని
‘’కిముచ్యతే యచ్చ్చతురంగ సక్తా-శుద్ధాంత రాజ్ఞీ కురునాయకస్య –కర్ణేన పాకం విజనే స్తి తేతి –కర్ణేజపావ్యోమ్ని విలోక్య తారాః ‘’అ ని సంస్కృతీకరించారు .
మరిప్పుడు ఆశువులోకి సులువుగా ప్రవేశిద్దాం
అవధానిగారి మీసాలపై శ్లోకం చెప్పమని శ్రీ ఎస్ వి రాఘ వేంద్ర రావు అడగగా
‘
’గీర్వాణాంధ్ర గిరాం ధురంధర మతి స్నిగ్ధ ప్రచారోచ్యతే –దర్పా వేశిత చంచ రీక విలస్త్పత్రావలీ సుందరే
స్మేరా౦కూర సిత ప్రకాశ మిలవాత్ జ్యోత్స్నా తమ శ్రీకరే -కావ్య శ్రీ హృదయం గమే విలసతః మామ శ్మశ్రుణీ’’అని మీసాల పద్యం దర్జాగా చెప్పారు .
అర్ధం –గీర్వాణ,ఆంద్ర ప్రచారోద్యమాలు ,అహంకార ఆవేశాలు గల తుమ్మెద రేకుల్లా అందమైన ,చిరునవ్వు మొలకకు సంబంధించిన తెల్లని కాంతి కలియటం వలన వెన్నెల ,చీకటి సంపదలను కలగ జేసే కావ్యశ్రీ హృదయమనోహరమైన నా మీసాలు బాగా ప్రకాశిస్తున్నాయి .వెంకట శాస్త్రిగారు కూడా ‘’రెండుభాషలకుమేమె కవీశ్వరులం ‘’అని తమ మీసాలు చెపుతున్నాయని చమత్కరించటం మనకు తెలిసిందే .
గజ కేసరి యోగం గురించి శ్రీ గురజాల హనుమంతరావు ప్రశ్నకు శాస్త్రి గారు
‘’గజ కేసరి యోగేన న ఫలం గజ సి౦హ యో ఃజాతకే యస్య యోగోయం –స ఏ వైశ్వర్య మ్రుచ్చతి ‘’అని శ్లోకం చెప్పారు –గజ కేసరి యోగం గజానికి సింహానికి ఫలించదు .ఎవడికి అగజకేసరి యోగం పడుతుందో వాడు ఐశ్వర్య వంతుడు అవుతాడు అని భావం .
శ్రీమతి చెరువు లక్ష్మీదేవి గారు ‘’బాలా ‘’స్తుతి చేయమనికోరగా
‘’శ్రీ మాతుః పరదేవతా వర చిదావిష్కార మార్గ ప్రదాం –భండా యోధన ఘోర రాక్షస గణాహంకార హుంకారిణీం
నిత్యార్భా పరభక్త మానస చిదా కాం క్షైకసందాయినీం –బాలాం బాల సుధాంశు దారి నితలాం బాలారుణాం భజే ‘’అని భక్తీ పూర్వకం గా స్తుతించారు .
సంపూర్ణ సంస్కృత శతావదానాన్ని చూసి గోదావరి ఏమనుకొంటోందిఅని శ్రీ ధూళిపాళ ప్రభాకర కృష్ణ మూర్తి ప్రశ్నించగా అవధానిగారు
‘’గ్రీష్మోష్మ నిష్క్వధి త సర్వ జలాకులాం మాంఉచ్చూనయత్య హహకో యమమావదారః
కాశ్మీర శీతల మనోజ్ఞ రసార్ద్ర భావైః మామేన శీతల యతీహ వాదాన విద్యా ‘’అని గడుసుగా చెప్పారు
అర్ధం –ఎండాకాలం లో ఆవిరి చే తుకతుక ఇగిరిపోతున్న అన్ని నదీ జలాలు కలిగిన నన్నే ఉప్పొంగేట్లు చేస్తున్నాడే ఈ గొప్ప కవితా రసధార కల వాడేవరు ?ఈ వదాన విద్య కాశ్మీర భూముల్లాగా మనోజ్ఞ రసార్ద్ర భావాలతో నన్ను చల్ల బరుస్తున్నాయి అనుకొన్నది గోదావరీ మాత .
ఈవిధంగా శాస్త్రిగారు గీర్వాణ అవధానాన్ని రసప్లావితం చేశారు .కండగల ఆశు కవిత్వం తో కదను తొక్కారు . పృచ్చక వృశ్చికాల పని పట్టారు . రసజ్నులను తనియించారు .అవధాన మహా యజ్ఞాన్ని సునాయాసంగానిర్వ్వహించి సెబాష్ అని పించుకొని క్లిష్ట సమస్యలనూ సమయస్పూర్తిగా పూరించి ,వహ్వా అనిపించారు. వారి పాండిత్య గరిమకు ,భాషా పాటవానికి ఈ అవధానం మైలు రాయిలానిలిచింది .తెలుగువారికే స్వంతమైన అవధాన సరస్వతిని శాస్త్రిగారు సంపూర్ణ సంస్క్రుత శతావదాన స్వర్ణ పల్లకీలో ఊరేగించారు . అవధానాంతరం శాస్త్రిగారికి ‘’ఉభయ భారతి ‘’బిరుదును ప్రదానం చేసి సత్కరించారు .ఆచార్య దోర్బల ప్రభాకర శర్మ ప్రస్తుతి శ్లోకాలు రాసి వినిపించారు .
‘’ఆకలంకాద్వయ విద్వదున్నత గుణశ్రీసౌరభో దంచితం –లలితా౦ద్రీశివ సంస్క్రుతామృత మయ వ్యాహార విభ్రాజితం
భయ భారా సనయోద్యతమ్ శుభ పరః –శ్రీ సత్య నారాయణో’’భయ భారత్యభి’’ నూతనావలిత సుష్మశ్రు ద్వయం మన్మహే ‘’
డా కొంపెల్ల రామ సూర్యనారాయణ

‘’మీ యవదాన వేళ,వినీల వియత్తల మందు దోచే ఏదో ఒక కాంతిపుంజము అని మెచ్చుకొన్నారు .
డా రామడుగు వెంకటేశ్వర శర్మ ‘’బహ్వసాదారణ ప్రజ్న గతా రూఢ,ధారణా మకుట విస్పార కాంతికి ‘’ఉడుగరలు సమర్పించారు .
మహా సహస్రావధాని డా.గరికపాటి నరసింహారావు ‘’మీసము గల్గు భారతివి ,మీ సములేరి వదాన విద్యలో ‘’అని కీర్తిస్తూ
‘’గ్రీష్మర్తు ప్రతిభా సమాన రవియై ,గీర్వాణ పాదోదియై –భీష్మా చార్య షరా ప్రసార నిభమై ,వేవేల్గులన్ జిమ్ము ,శా
ష్మాకంద రస ప్రవాహమనగా ,వాణీశ్రవః కుండలా –ర్చిష్మత్వా కలితావదాన మిదిఅచ్చెర్వున్ ప్రసాది౦ చెడిన్’’అని కీర్తి కిరీటం పెట్టారు .
ఆచార్య బేతవోలు రామ బ్రహ్మం గారు ‘’అవధానాలలో ఎక్కడో ఒకటో అరా పద్యాలు బాగున్నవి చూశాం .కాని మీ యావత్ అక్షరం ముదం చేకూర్చింది ‘’అని మెచ్చుకొంటూ
‘’అవధానంబన నిట్టు లున్డవలెనయ్యా రండు వీక్షి౦పుడో –అవధానుల్ గనుడ౦చు చూపెడు గతిన్ వ్యాహార శోభా సము
త్సవమున్ భావ శశి ప్రభాకవిత సౌందర్యంబు చూపించి నా –డవు ,దీక్షా సముపాసితాచ్చ శశికంతా సత్యనారాయణా ‘’అని ‘’ఇదే అవధానం .అందరు చూసి నేర్చు కొండి ‘’అని సవాల్ విసిరారు మెచ్చుకొంటూనే .
డా.నోరి భోగీశ్వర శర్మ అభినందన మందార మాల అల్లి
‘’నాణ్యాః స్నేహార్దపీన స్తన ఘట జనితః క్షీర ధారా ప్రవేకః –ఛందో లక్ష్మీ వదూటీ వదన గలిత తాబూల శేషః కిమేషః
త్వమ్మేతేహం నుకాళీవచన సువిదితాను గ్రహః కాళిదాసః –సత్యన్నారాయణాఖ్యః ‘’కవికుల తిలకః చెర్వు వంశాబ్ధి సోమః ‘’
ఆమల్ల దిన్నె రమణ ప్రాసాద కవి ‘’త్రచ్చిన భాషా సింధువు అని ,వచ్చిన గీర్వాణ మధువు ,గొప్ప కవనాన్నిచ్చే సుర తరువు ,అంటూ ‘’హరువు ఇచ్చెరు,వచ్చెరువు చెరువు ఇది చిరు చెరువా ?’’అని అచ్చెరువు పోయారు .
‘’గొప్ప పాండితీ విభవం లో ,కవిత్వ పటుత్వం లో భద్రాయిత మూర్తి అని ,స్నేహ శీలాలలో కలశా౦బువు అయిన సత్యనారాయణ శాస్త్రి ని చెరువు అనటం హిమాలయాన్ని గుట్ట అనటమే ‘’అని శాస్త్రిగారి హిమాలయోత్తుంగ కవిత్వాన్నిబహుదా శ్లాఘించారు .
‘’కవి అంటే చెరువు సత్యనారాయణ శాస్త్రియే అని ఆయన అవధాన యాగం అమేయం ,పేయం ‘’అన్నారు శాంతి శ్రీ బొత్స కవి .
కొవ్వూరు ఆంద్ర గీర్వాణ విద్యా పీఠం సంస్కృత కళాశాల శాస్త్రిగారికి ‘’ఉభయ భారతీ ‘’బిరుదు ప్రదానం చేసి ప్రశంసా పత్రం సమర్పించింది. అందులో శాస్త్రిగారిని ‘’సహజ పాండితీ విభవ విలాస ‘’,కవితా విలాస సంశోభిత ‘’,ఉభయ భాషా వదాన మహా భాష్య కార ,సౌజన్య చంద్రికా విరాజిత ,’’నిరర్గళధారా ధారణా ప్రతిభా భాసమాన ‘’అని వారి కవితా వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు .
‘’శ్మశ్రు భారతీ’’ అని సంబోధించి డా ఎస్వి రాఘ వేంద్ర రావు
‘’కీరితి కంబ మైతి రస కేళి వదాన మహేస్టిసల్పికో-వ్వూరున సంస్క్రుతంబున మహోత్తమ రీతి నపూర్వ ధారణన్
ఆరని జ్యోతివై వెలుగు మారతి పట్ట బుధుల్ సుదీనిదీ ‘’
ఈవిధంగా శతవదానిని పొగడ్తఈవిధంగా శతవదానిని పొగడ్తలలో ము౦చెత్తేశారు ప్రఖ్యాత కవి పండితులు .ఇంతటి సరస్వతీ పుత్రులు కాలగర్భం లో లీనమై శూన్యాన్ని మిగిల్చారు .
‘’జయ౦తిన తే-సుకృతినో –రస సిద్ధాః కవీశ్వరాః-నాస్తి తేషాం యశః కాయే –జరామరణజం భయం ‘’
చెరువు వారిపై వ్యాసం సంపూర్ణం
దీనికి ఆధారం –పొన్నూరు సంస్కృత కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీ తూములూరు శ్రీ దక్షిణా మూర్తి శాస్త్రి గారు నాకు ఆదరం తో పంపిన -1-డా,చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి సమగ్ర సంస్కృత శతావధానం ‘’పుస్తకం
2-చెరువు వారి సుబ్బ లచ్మి పుస్తకం
3-శ్రీ గాడేపల్లి సీతా రామ మూర్తిగారి ‘’చెరువువారి సత్తిబాబు పావు శతకం ‘పుస్తకం ’అని సవినయంగా మనవి చేస్తున్నాను .
మరొక తెలుగు కవి సంస్కృత రచనల గురించి తెల్సుకొందాం .
సశేషం
ఉపాధ్యాయ దినోత్సవ ,శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-15 –ఉయ్యూరు