గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩ 401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-2

గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩

401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-2

తణుకు పట్టణం లో శ్రీ కొవ్వూరు పెండ్యాల వెంకట్రాయుడు స్మ్రుతి సభా ప్రాంగణం లో అవధాన వాచస్పతి చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి ‘’సంస్కృత సంపూర్ణ శతావధానం ‘’1996ఏప్రిల్ 5,6,7  తేదీలలో దేదీప్యమానంగా జరిగింది .అదొక పెద్ద పండుగలా , సాహితీమహోత్సవంలా ,అవధాన యజ్ఞం లా నిర్వహించారు .యజ్నభాషలో శాస్త్రి గారిని సంస్కృత శతావదానసోమయాజి  ,కొవ్వూరు ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యులు  డా.శ్రీ దోర్బల ప్ర్రభాకర శర్మ గారిని హోతగా  ,కొవ్వూరు సంస్క్రుత కళాశాల  అధ్యాపకులు డా.శ్రీ నోరి భోగీశ్వర శర్మగారిని అధ్వర్యులుగా ,ఆచార్య శ్రీ బేతవోలు రామ బ్రహ్మం గారిని  బ్రహ్మ గా ,రాజ మండ్రి సంస్కృత కళాశాల ప్రధానా చార్యులు డా.శ్రీ విశ్వనాధ గోపాల కృష్ణ శాస్త్రి 

ఉద్గాతగా ,, సర్వ సాహితీ ప్రియులను సాహితీ మహా యజ్న కవితా హోమదూమ సౌరభ ఆఘ్రాతలుగా పేర్కొన్నారు .

ఈ శతావధానం లో 21వర్ణనలు ,21దత్తపదులు ,21సమస్యలు ,21 అనువాదాలు,21ఆశవాలు ,3విశిష్ట ప్రశ్నలను మొత్తం 108 ని పృచ్చక మాహాశయులు సంధించారు .వీరందరూ కాకలు తీరిన సంస్కృత కవి పండితులే కావటం మరో విశేషం ఇందులో మహిళామణులకూ గొప్ప ప్రాతి నిధ్యం లభించింది .అవధానానాన్ని శాస్త్రి గారు అతి సునాయాసంగా అత్యన్తవినోదసంభ్రమ భరితంగా రసభరితంగా రసిక జన మనోరంజకంగా గంగా ప్రవాహ సదృశ వేగంగా నిర్వహించి అందరికి మహదానందం కలిగించి ‘’అవధానం అంటే ఇలా ఉండాలి ‘’అనిపించారు .అనంతరం   అవధాని శాస్త్రిగారికి’’ఉభయ భారతి  ‘’  ప్రభాకర శాస్త్రి  ప్రదానం చేసి సత్కరించారు .శాస్త్రిగారు, అధ్యక్షత వహించిన శ్రీ దోర్బల ప్రభాకర శర్మగారికి ‘’సంస్కృత శతావధాన ప్రభాకర ‘’బిరుదునిచ్చి సన్మానించారు .

ఈ అవధానం జరిగిన ఏడు నెలలకే శాస్త్రిగారు 14-11-96న అకస్మాత్తుగా పరమ పదించారు .శోక తప్తులైన గీర్వాణ కవితాలోకం వారి’’ సంపూర్ణ సంస్కృత శతావధానం ‘’ను గ్రంధ రూపం లోకి తెచ్చి శ్రీ నోరి భోగీశ్వర శర్మగారి చేత తెలుగు భావ వివరణలు రాయించి ,శాస్త్రిగారికి అంకిత మిచ్చి ఋణం తీర్చుకోన్నది .ఈ గ్రంధం వర్దిష్నులైన వారికి కరదీపిక .ఇందులో శర్మగారు అందజేసిన విశేషాలను మీ ముందుంచుతున్నాను .

సత్యనారాయణ శాస్స్త్రి అవధానిగారు కవి మాత్రమె కాదు ‘’శాస్త్ర గ్రంధాలలోని సైద్ధాంతిక గ్రంధాలను గురు ముఖతా నేర్చి,మననం చేసినవారు .కాణాద,పాణినీయములను భాష్యంత వ్యాకరణాలను నేర్చినవారు .అందుకే వ్యాకరణ శాస్త్ర సమ్మతమైన పదప్రయోగాలను ఈ అవధానం లో చేసి అర్ధ ప్రతి పత్తికలిగించారు .పాదపూరణాలలో- తు చ లను వాడనే లేదు  .ప్రతిశ్లోకం రస అలంకార శోభ తో ,చమత్కృతి ,భావ పుస్టితో విరాజిల్లింది .వేదశాస్త్ర పాండిత్యం జ్యోతిశ్శాస్త్ర నైపుణ్యం ,లోకజ్ఞత పుష్కలంగా ఉన్నవారు కనుకనే వాటిపై వచ్చిన ప్రశ్నలకు దీటైన సంతృప్తికరమైన సమాదానాలాను శ్లోకాలలో చెప్పారు .వీరి సాహిత్య పటిమ అనిర్వచనీయం .లోక శాస్త్ర పరిజ్ఞానమూ మిన్నదైనదే .భావాన్ని బట్టి వృత్తాలను ఎన్నుకొని ఛందోదో వైవిధ్యం ప్రదర్శించారు. శ్లే షనూ,సమాదరించారు .

బ్రహ్మశ్రీ  చెరువు సత్యనారాయణ  శాస్త్రిగారు మొదట తమ విద్యా గురువు మాతామహులు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిగారిని సంస్మరిస్తూ మత్తేభ  శ్లోకం చెప్పారు –

‘’అవధానం సువిదాన మత్ర భవతా మానందసందాయకం –భవతాదిత్య హమాశ్రయే యత మతి ఃదీక్షాగురుం సంతతం

శివ మంత్రాక్షర మంత్రం చింత నశివా సేవావిశుద్ధ౦ ,హి,రా –ఘవ నారాయణ శాస్త్రి సద్గురు వరం కారుణ్య వారాన్నిధిం’’

తాత్పర్యం –ఈ అవధానం అందరికీ ఆనందాన్ని కల్గించాలి అని ఏకాగ్రమనస్సుతో నా దీక్షాగురువు ,నిత్య శివ పంచాక్షరీ జపపరులు ,శివా అంటే బాలా  త్రిపుర సుందరీ దేవిసేవలో విశుద్ధులు ,దయాసముద్రులు ,అయిన శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి సద్గురువులను నేను ఆశ్రయిస్తాను

తర్వాతఇస్టదేవతాప్రార్ధన అధ్యక్షులను మిగిలినవారిని స్తుతించి అవధానం విజయవంతం కావటానికి కారకులయ్యే ప్ర స్టలను అంటే

’ప్రస్టారః కమనీయ పూర్వకవితా  సౌందర్య పారంపరీ –ద్రస్టారోవివిధాధ్వరీ తిలసదర్వాచీన కావ్యావళీ

స్రస్టారో రసభావ బంధుర వినూత్నానేక కావ్య  స్వయం –ప్రస్టారఃపరిపాలయంతు కృపయా సౌజన్య రత్నాకరాః’’అ. న్నారు  భావం –ప్రస్టలారా !మీరు కవితా సౌందర్యాన్ని పరంపరగా కనుగొన్న మంత్ర ద్రష్టలు సాహిత్యం లో వివిధ ప్రక్రియలలో కావ్యాలు సృష్టించిన వారు .రసభావ బంధురం గా ఎన్నో కొత్త కావ్య నిర్మాతలు సౌజన్య రత్నాకరులు .నన్ను దయతో పాలించండి .

మొదట వర్ణనల గురించి కొన్ని తెలుసుకొందాం .బ్రహ్మశ్రీ రేకపల్లి వీర భద్ర శర్మ –తాడేపల్లి వారి కృతులలో అద్వైత భావన వర్ణించమని అడిగారు .ఆధానిగారు

‘’అద్వైతం శ్రుతి చోదితం చిద చితో స్వాత్మా నుభూతి స్తితం –కు౦భా కాశ తరంగభాను కలనా దృష్టా ౦త యుక్తిస్తిరం వెండి

శుక్తౌ రౌప్యవదశ్మని ద్విరద వన్మ్రుత్యు౦భవ ద్యో జగత్ –బ్రహ్మాధ్యస్త మితి ప్రదార్య తదదిదం-జానాతి ముక్తో భవేత్ ‘’అని శార్దూల శ్లోకం చెప్పారు

ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లు గా భ్రమించటం అదికాదని తెలిస్తే   వెండిభావం నశిస్తుంది శిల్పం లో ఏనుగు కల్పితం అని గుర్తిస్తే శిలాజ్ఞానం పోతుంది .మట్టిలో కుండ ఉందని తెలిస్తే కుండ జ్ఞానం పోతుంది .నిజమైన వస్తువులలో అసత్యాలు గోచరిన్చినపుడు వాటి కారణాలను అనుభవ పూర్వకంగా గ్రహిస్తే స్వరూప జ్ఞానం లభిస్తుంది పర బ్రహ్మం లో ఈ జగత్ట్టు ఉందని నిర్ధారించుకొని మనన నిధి ధ్యాసలచేత ఘటం లో ఆకాశం లేదని తెలుసుకోన్నట్లే ఉపాధి గత లక్షణాలను విసర్జిస్తే చిత్ రూపమైన బ్రహ్మ ఏకత్వం అని గ్రహిస్తే ముక్తుడు అవుతాడు .

శ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ పున్నమినాటి చంద్రుడిని వర్ణించమని కోరారు .శార్డూలం లో శ్లోకం చెప్పారు శాస్త్రిగారు

‘’దిక్కాంతా కుఛ కుంభ యోర్ద వలిమ ప్రావార మాసంజయన్ –కుర్వన్విశ్వ మహోచ్చసౌద శిఖరే సౌవర్ణ కుంభ భ్రమం

స్పర్శై ఃకోమల శీతలైఃసితరుచా తారా వధూ ర్హేపయనన్-జ్యోత్స్నా వైభవ శేష దిర్విజయతే రాకా సుధా ధేధిత

అంటే దిక్కులు అనే స్త్రీల కుంభాకార స్తనాల యందు తెల్లని దుప్పటికప్పుతూ విశ్వం అనే మేడపైభాగం లో బంగారపు కలశాలేమోననే భ్రమ కలిగిస్తూ మృదువైన చల్లని తెల్లని కాంతి చేత స్పర్శి౦చ బడిన నక్షత్ర కాంతలకు కిచ కిచ లిచ్చే సిగ్గు కలిగిస్తూ వెన్నెల అనే సంపదకు నిలయం అయిన చంద్రుడు మహా గొప్పగా ప్రకాశిస్తున్నాడు .ఇందులో ఉత్ప్రేక్ష వైభవం ముచ్చట గొలుపుతుంది .

శ్రీ ప్రభల సుబ్రహ్మణ్యం అవధానాన్ని గోదావరితో పోల్చమని అడిగితె

‘’పూరే పూరే రసిక హృదయ క్షేత్ర మాసేచయన్తీ-నీరే నీరే మధుర మధురం స్వాదిమానం వహంతీ

చేతశ్చేతో హారతి కవితా మద్వాదానే నటంతీ-భూయో భూయః సరస సరసా గౌతమీవ స్రవంతీ’’అని మందాక్రాంత వృత్తం లో సరస మనోహరం గా వర్ణించారు

భావం –ప్రతి ప్రవాహం లో రసిక హృదయాలనే క్షేత్రాలను తడుపుతూ ,కొత్తకొత్త నీటి మధురమదురంగా తియ్యదనాన్ని ఇస్తూ ,ప్రతి హృదయాన్నీ నా అవధాన కవిత  ఆకర్షిస్తూ సరస సరసమైన గౌతమీ నది లాగా మనసును ఇటువైపుకే ఆకర్షిస్తోంది .

వర్ణన అయిన తర్వాత కొన్ని దత్త పదులను దర్శిద్దాం –శ్రీ ధూళిపాళ మహా దేవమనణి–మండపేట,వచ్చేశా, ఏదీ నీ సత్తా అనేపదాలిచ్చి సరస్వతీ దేవి ఆశీస్సుగా చెప్పమన్నారు

‘తపః ప్రీతా వత్స ప్రసభ మధునా త్వద్రుదయ మం –డపేటానీహత్వం జహిహి హ్రుదయేదీన సరణిం

సుధా వచ్చేశా నుగ్రహ మహిత వీక్షా సుఖయతాం –వధానీసత్తా వాన్ విలసతు భవాన్ కీర్తి ధనవాన్ ‘’

వత్సా!నీ తపస్సుకు సంతోషించా .నీ మనసులో దైన్యం వదిలేయి అమృతం లాగా శివుని అనుగ్రహం తో పూజింపబడే చూపు నిన్ను సుఖ పెడుతుంది .ఇలా సత్తావంతుడివై కీర్తి దక్షతలు కలవాడిగా  వర్ధిల్లు .

శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ –అజారుద్దీన్ కపిల్ సచిన్ ,ప్రభాకర్ పదాలతో అవధానాన్ని క్రికెట్ ఆటతో పోల్చమని అడిగారు

‘’అజారుద్ద్దీవ దుష్ప్రాపః –కపిలౌల్య వివర్జితః –సచినోతివాదా నేద్యాం –క్రికకెద్వ్యాఖ్యాప్రభాకరః

అని చెప్పారు –భావం –మేకలాగా అరిచే దీనుడికి దుష్ప్రాపుడు ,కోతి చాపల్యం లేనివాడు ,క్రికెట్ అనే ఆటకు కాంతినిచ్చే వాడైనఅవధాని క్రికెట్ క్రీడను అవధాన ఇష్టిచయం చేస్తాడు

సశేషం

గురుపూజోత్సవ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-9-15-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

1 Response to గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩ 401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-2

  1. jabalimuni says:

    Dear Durga Prasad garu,Pranams!I closely follow your postings in Sarasa Bharathi.As a retired teacher I am able to appreciate all the topics.Some how I missed part 1 of గీర్వాణ కవులకవితా గీర్వాణం-౩ 401-అచ్చెరువు గొలిపే డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గీర్వాణ భాషా వైదుష్యం-1.Please be kind enough to mail me that part. Best Regards,Jabalimuni  Jabali Muni. Sarve    Bhavantu    Sukhinah,       Sarve     Santu    Niraamayaa Sarve Bhadraani Pashyantu, Maa kascchid Dukh bhaagbhavet

    May all become happy, may all be free from disease;  May there be nothing but auspiciousness in everyone’s lives; May no one undergo pain or suffering.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.