గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3
426-శ్రీ కంచి పరమాచార్యులపై ‘’గురూపహారం ‘’రాసిన –శ్రీ మట్టి పల్లి మల్లినాద శర్మ(1926)
కాశ్యప గోత్రీకులు ,వీరేశ్వర శేషమాంబా పుత్రులు శ్తీ మట్టి పల్లి మల్లినాద శర్మ1926లో నెల్లూరు జిల్లా కార్వేటి నగరం దగ్గర ముక్కరవానిపాలెం లో పుట్టారు .కుటుంబం ఇందుకూరి పేట చేరి నెల్లూరు వేదసంస్కృతా కళాశాలలో చేరి 1960లో భాషా ప్రవీణ పాసైనారు .ఇందుకూరు ఉన్నత పాఠశాలలో తెలుగుపండితులుగా పని చేశారు . బాల్యం నుండి రచనలో పండిన వీరుగీర్వాణ ఆంద్ర భాషలలో నలభైకి పైగా గ్రంధాలు రాశారు .
మట్టిపల్లి వారి ‘’మిట్టీమే సోనా ‘’సంస్కృత రచనా సోయగం
శ్రీ జన్నవాడ కామాక్షీ సుప్రభాతం ,మధుర స్మ్రుతి (6సర్గలు)గురూపహారః ,ఇందుకూర్ పేట కామాక్షీ సుప్రభాతం ,భద్ర కాళీ స్తవం ,శుభాషితాని అనే చాటువులు ,నాటికా త్రయం ,చంద్రమండల యాత్ర వీరి సంస్కృత రచనలు .గురూపహారం లో శ్రీ కంచి పరమాచార్యులు శ్రీ చంద్ర శేఖర యతీన్ద్రులవారిని ‘’నడిచే దైవం ‘’గా అభి వర్ణించారు .ఆరు సర్గల కామాక్షీ సుప్రభాతం లో అమ్మవారి సేవకోసం సకల దేవతలూ వచ్చారని- ‘’ల్లక్ష్మీః కుశేశ సమాంచిత పాత్ర హస్తా-వాణీ స్వపాణితల మండిత వల్లకేచ –అనాశ్చవాద్య నిపుణామంజూది ద్రుత్వా-కామాక్షి దివ్య నిలయే తవ సుప్రభాతం’’ .
427-బాల నైషద కర్త –శ్రీ సముద్రాల లక్ష్మయ్య (1937)
నెల్లూరు జిల్లా గూడూరు దగ్గర కాట్రకాయల గుంటలో 19-11-1937నజన్మించారు .కొత్తపాలెం ఓరియెంటల్ఉన్నత విద్యాలయం లోచదివి,ఏర్పేడు వ్యాసాశ్రమ శిష్యులుగా అనేక గ్రంధాలు రాశారు .తిరుపతి ప్రాచ్య కళాశాలలో ఉద్యోగించి అనంతరం ‘’బాలనైషధ ‘’కావ్య రచన చేశారు .కావ్య వ్యాఖ్యాన గ్రందాలనేకం తెలుగులో రాశారు .’’శ్రీ మళయాళ‘యతీంద్ర ఉపదేశామృతం ‘’సంస్కృతకావ్యం రాశారు .స్వామి వారి వేదాంతాన్ని లలిత సుందరంగా అందించారు .’’అగ్నేః సందుక్షణే ధూమః ప్రధమం దృశ్యతే తతః –జ్వాలా దేదీప్య మానా స్యాత్తదాత్మధ్యాన వర్తినాం’’ఒక మచ్చు శ్లోకం .
‘’దివ్య జనన్యాఃశారదా దేవ్యాః ఉపదేశామృతం’’,శ్రీ తిరుమా౦బా సుప్రభాతం ,’’శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సుప్రభాతం , గొల్లా పురా౦బాస్తుతిః.’’వివేకానంద సూక్తయః ‘’వీరి ఇతర గీర్వాణ రచనలు .
428-విద్యా వారిది –శ్రీ చింతలపాటి పూర్ణానంద శాస్త్రి
నెల్లూరు సంస్క్రుతకలేజిలో సంస్కృత వ్యాకరణ పండితులైన శ్రీ శాస్త్రి ,ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు.సంస్కృత సమాస విషయాలను ‘’సమాసపారిజాతః ‘’గా రాశారు .రాష్ట్రీయ విద్యా పీఠం నుండి ‘’విద్యా వారధి ‘’పొందారు .శాస్త్రార్ధాలలో ను వ్యాకరణ శాస్త్ర నిర్ణయాలలోను అందే వేసిన చేయి శాస్త్రి గారిది .
429-చతుర్భాషా పదకోశ నిర్మాత – డా.శ్రీ అమృత వాక్కుల శేష కుమార్
తిరుపతి సంస్క్రుతకాలేజిలో చదివి వ్యాకరణ శాస్స్త్రం ప్రధాన అంశంగా బి ఏ చేశారు .తర్వాత వ్యాకరణం లో ఏం ఏ డిగ్రీ పొందారు .స్వయం కృషితో సాహిత్యం లో ఏం ఏ పాసైనారు .తెలుగు హిందీలలో కూడా ఏం ఏ .ఆంద్ర యూని వర్సిటి నుండి పి.హెచ్ డి.సాధించారు .భట్తోజీ దీక్షితుల సిద్ధాంత కౌముదికి ‘’రూప ప్రక్రియా కౌముది ‘’రాశారు .కాళిదాసః అనే లఘునాటికరాసి ప్రదర్శించారు .ఆకాశావాణిద్వారా సంస్కృతం లో అనేక కధలు వ్యాసాలూ రాసి ప్రసంగించారు .సంస్కృత భాషకు చెందినఆరు వేల పదాలకు విషయ విభజన చేస్సి ,తెలుగు హిందీ ,ఇంగ్లీష్ లలో సమానార్ధాలపదాల తో ‘’చతుర్భాషా పదకోశం ‘’రాశారు . సంస్కృతాన్ని తేలికగా నేర్చుకోవటానికి ‘’అమృత వాణీ పరిచయః ‘’రచించారు .2004లో తిరుపతిలో ‘’అఖిల భారత సంస్కృత సభలు ‘’జయ ప్రదంగా నిర్వహించారు .
430-వ్యాకరణ విద్యా ప్రవీణ –శ్రీ కందాళలక్ష్మీనారాయణ
నెల్లూరు సంస్క్రుతకాలేజిలో వ్యాకరణ లెక్చరర్అయిన కందాళ వారు వ్యాకరణ విద్యా ప్రవీణ ,పి.హెచ్ డి పొందారు .ప్రిన్సిపాల్ గా రిటైరయ్యారు .’కూర్మ నాద వింశతి’’, ‘’ఆచార్య వైభవః ‘రామానుజాచార్యులవారిపై పద్దెనిమిది శ్లోకాల లఘు రచన చేశారు .
431-శ్రీమతి గుమ్మా (అమృతవాక్కుల )శ్రీశైల
సంస్కృత శ్రీ కృష్ణ స్తుతిశతకాలపై పరిశోధన చేసి శ్రీ చంద్ర శేఖర స్వామికి అంకితమిచ్చిన శ్రీమతి శ్రీశైల శ్రీ వరదాచార్యుల కృష్ణ శతకాన్ని సంస్కృతం లో రాశారు .
వీరుకాక శ్రీ యెన్ యెన్ హరిశాస్త్రి కుమారవిజయం ,మేఘ దూతం సంస్కృతం లో రాయగా ,శ్రీ చావలి లక్ష్మీకాంత శాస్త్రి ‘’ప్రస్థాన త్రయం ‘’పేర భాష్య త్రయాన్ని వివరిస్తూ వ్యాఖ్యన సంస్కృత గ్రంధం రాశారు .శ్రీ విక్రాల రాఘవాచార్యులు ‘’మదన విజయం ‘’కావ్యాన్ని ,శ్రీనివాస ప్రసాదః ‘’కావ్యాలు రాసి శ్రీకాళహస్తి ఆస్థానకవులై ,’’చతుర్విధ కవితా విశారద ‘’కంఠీరవ’’బిరుడుల౦దు కున్నారు .
వీరుగాక అనేక మంది కవులు ఉండివుండ వచ్చు .వివరాలు తెలియకనే రాయలేక పోయాను .
దీనికి ఆధారం –శ్రీ అమృతవాక్కుల శేషకుమార్ రచన అని మరొక సారి తెలియ జేస్తున్నాను .
ఇంతటితో నెల్లూరు జిల్లా కవులు సమాప్తం .తరువాత శ్రీకాకుళం వెడదాం.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-9-15-ఉయ్యూరు