గీర్వాణ కవుల కవితా గీర్వాణం౩-3
శ్రీకాకుళం జిల్లా –స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన –శ్రీ ఎస్ ఎస్ విజయ రాఘవన్ ,శ్రీ పి.బి.వి.శివప్రసాద్
432-విశ్వదాత కర్త-శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి (1882
1882లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో జన్మించిన శ్రీ వాసా సూర్యనారాయణ శాస్త్రి పర్లాకిమిడి సంస్థాన ఆస్థాన పండితులు .’’కవి శిరోమణి ‘’.వీరి సంస్కృత రచనలు దేశ భక్తీ ప్రబోధకాలు .తిలక్ పై ‘’లోకమాన్య చరితం ‘’కావ్యం రాశారు .ఇందులో తిలక్ గారు శివాజీ చరిత్రతో స్పూర్తి పొందినట్లు రాశారు .స్వాతంత్ర్య సమరస్పూర్తి నింపే కావ్యం ఇది .ఒక శ్లోకం-‘’కారాగార ప్రవాసాది దండోవాప్రాణ విప్లవః –భవతీశ్వర సంకల్పాన్నా స్థానః పంచ భౌతికే –యశశ్శరీర మాచంద్ర తారకం జీయాదకల్మషం-వయమేవాను భోక్ష్యామః స్వరాజ్య ఫల మూర్జితం –అధవా నస్సంతతతిర్వా ఫలభాగ్ వృద్ధి మేష్యతి –షట్త్ర్యయం షట్కోటి సమ్ఖ్యాకైహ్ భారతీయ సహొదరైః’’
శ్రీ కాశీనాధుని నాగేశ్వర రాగారి చరిత్రను ‘’విశ్వ దాతా ‘’కావ్యం గా గీర్వాణం లో రాశారు
433-‘’భిషగ్రత్న ‘’-శ్రీ మహేంద్రాడవెంకట జగన్నాధ స్వామి
కళింగ సంస్కృత కళాశాల స్థాపకులు ,ఆయుర్వేద విశారద ,వేదాంత భూషణ శ్రీ మహేంద్రాడ వెంకట జగన్నాధ స్వామి సాహిత్య భాషా ప్రవీణులు ,భిషగ్రత్న ,వేదాంత విద్యా విశారదులు .శ్రీకాకుళం నివాసి .ప్రభుత్వ సహాయం లేకుండా స్వయంగా సంస్కృత పాఠశాలస్థాపించారు .సంస్కృతం లో ,వేదాంతం లో దిట్ట .సౌరమంత్రాలకు ‘’ద్యుమణి నందనం ‘’అనే వ్యాఖ్య రాశారు శ్రీ సూక్తానికి సంస్కృతం లో ‘’రమా స్వాగతం ‘’రాశారు .’’రంగనాధ సుప్రభాతం ,అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని స్తుతించారు .తల్లిగారిపై ‘’మాత్రు శతకం ‘’రాసిన ధన్యులు .
434-సూర్య శతక కర్త-శ్రీ గుండుగొల జగన్నాధ శర్మ (1908
1908లో వంశధార దగ్గర లుకులాం అగ్రహారం లో జగన్నాధ శర్మ జన్మించారు శ్రీ పేరేపు సత్యనారాయణ గారి శిష్యులు .1955లో ‘’సూర్య శతకం ‘అరసవిల్లి సూర్యదేవునిపై రాశారు
‘’శ్రీ సదన శుభంకర నిజ భాషా వాసవ దిశా విభాస్వ దురు శ్రీ –భాసుర మూర్తి యరస విలి వాసా ,దాసజన సౌఖ్య ,వరద హే సూర్య –సారసభ హరి ఘనసార సమయాశః ప్రసార సంశ్రిత సంప –త్సార సమున్నతిదా,సంసార సముద్ర తరణ ద్రుత సారస సూర్య –మిహి రహిరణ్మయవిగ్రహ మహిత హిత తత్వ విత్తమ తమో బందీ ‘’అని చాలా సరళంగా ,అనర్గళంగా అర్ధస్పోరకం గా రాశారు
వెంకటేశ్వర శతకం ,ఉమామహేశ్వర శతకం ,శ్రీకామేశ్వర శతకం పరదేవతా స్తోత్రం’’రాశారు .పరదేవతా స్తోత్రం లో లో ‘’సంతారిణీ,కలుష కాంతార సంచరణ తాంతం నితాంతం జనం –భ్రాన్తిం విరస్య విశ్రాన్తిం విధాయ ,దుఖా౦తేన సంతుష్యతీ-స్వంతం మదీయ మది శాంతం కరోతి నిశ్చింతం చిరం సంతతం –కాంతా శివస్య జగతాంతీవ్ర బాదాంనిహన్త్రీ పరదేవతా ‘’ప్రవాహ సదృశం గా భక్తీ ధారగా రాశారు .
435-శ్రీ సత్యసాయి స్తోత్రం రాసిన –శ్రీ మేడూరి సూర్యనారాయణ మూర్తి (1954
1954లో పాలకొండలో పుట్టిన సూర్యనారాయణ మూర్తిగారు మహారాజ కాలేజిలో సంస్కృతం చదివి తెలుగుపండితులుగా పాలకొండ వగైరాలలో పని చేసి డెంకాడజూనియర్ కాలేజిలో అధ్యాపకులయ్యారు .సంస్కృతం లో’’ దుర్గాంబ శతకం ,శ్రీ కూర్మనాధ సుధా ,భవానీ శతకం శ్రీ రమణ సుధా శ్రీ సత్య సాయి స్తోత్రం రాశారు ఇందులోంచి ఒక ఉదాహరణ
‘’సత్య ధర్మ శమా కారం సద్గుణానాం జలాకరం –సమస్త సజ్జనాధారం సాయినం ప్రణమామ్యహం –ప్రశాంతి నిలయోద్భాసీ ప్రసాద గుణ భూషణః-అశాంతి వారకస్సాయీ వసేత్ హృది మమానిశం ‘’
436-పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి నాటక కర్త-శ్రీ మానా ప్రగడ శేష సాయి(1927
సంస్కృతాంధ్రాలలో మహా పండితకవులైన సాయిగారు విజయ నగర సంస్కృత కళాశాల అధ్యాపకులు .సంస్కృతం లో ‘’’పద్మావతీ చరణ చారణ చక్ర వర్తి ‘’నాటకం ,’’జయ దేవ సరస్వతి ‘’నాటిక రాశారు .ఉగాదిపురస్కారగ్రహీతలు .ఆకాశ వాణి దూరదర్శన్ కార్యక్రమ వ్యాఖ్యాతగా లబ్ధ ప్రతిస్టులు .
437-చమత్కార శతక కర్త –శ్రీ పి.టి జి వి రంగా చార్యులు (1952
రాష్ట్రపతి పురస్కారగ్రహీత ,స్వర్ణ ఘంటా కంకణాలంక్రుతులు బహు గ్రంధ కర్త శ్రీ రంగా చార్యులు 1952లో కృష్ణా జిల్లా శ్రీరంగ పురం లో జన్మించారు .సంస్కృతాంధ్రాలలో ఏం ఏ .’’సంస్కృత వాజ్మయం లో వైజ్ఞానిక విశేషాలు ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ .డి.పొందారు .పాలకొండలో పని చేస్తుండగా ఉత్తమజాతీయ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు .1999లో స్వర్ణ ఘంటా కంకణం చేత అలంకరింప బడ్డారు .’’కూర్మనాధ సుప్రభాతం ,అష్ట విధ క్రియ ,కరతల సంస్కృతం ,చమత్కార శతకం ,శ్రీ ధర్మ శాస్త్ర సుప్రభాతం ,షిర్డిసాయి సుప్రభాతం ,వాజపేయి కవితా ‘’సంస్కృత రచనలు .ఒక ఉదాహరణ –‘’రాత్రౌ తు నూపురధారం బహు సుందరత్వాం –నృత్యంత మద్భుత తనుం ,సముదీక్ష్య భక్తాః-ఖంజీర వాదక మహో పరి తోష యంతి-శ్రీ షిర్డీ భగవన్ తవ సుప్రభాతం ‘’
438-శ్రీ గుణ రత్న కోశం –కర్త –శ్రీ టి పి శ్రీనివాస రామానుజం
ఉపన్యాస బ్రహ్మ ,తిరుప్పావై ఉద్గాత గా ప్రసిద్ధులైన రామానుజం గారు సంస్కృతం లో నిష్ణాతులు .డబుల్ గోల్డ్ మెడల్స్ ను ఏం ఏ లో పొందారు ‘’సాంప్రదాయ సమన్వయము –రామాయణం ‘’పై పరిశోధన చేసి పి.హెచ్ డి సాధించారు .బెస్ట్ దిసీస్ అవార్డ్ దీనికి వచ్చింది .ప్రభుత్వ డిగ్రీ కాలేజిలో సంస్కృత లెక్చరర్ గా ఉన్నారు .సంస్కృతం లో ‘’శ్రీ గుణ రత్న కోశః ‘’ముకుందమాల ,గోదా స్తుతి ,దశావతారస్తోత్రం ,భగవధ్యాన సోపానం రాశారు .
439-హయగ్రీవ శతక కర్త –శ్రీ చామర్తి కూర్మాచార్యులు
సింగుపురం లో జన్మించిన కూర్మాచార్యులుగారు సంస్కృత భాషా ప్రవీణులు తెలుగుపండిట్ గా చేసి రిటైర్ అయ్యారు .సంస్కృత భాషా ప్రచారకులు .’’హయ గ్రీవ శతకం ,సీతారామ సుప్రబాతం ,ద్వాదశాక్షరీ స్తోత్రం ,’’వీరి గీర్వాణ రచనలు .
శ్రీకాకుళం దాటి గుంటూరు సీమలో ప్రవేశిద్దాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-9-15-ఉయ్యూరు
–
‘’