గీర్వాణకవుల కవితా గీర్వాణం-3 గుంటూరు జిల్లా- స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన డా’డి. ఏం .దీక్షిత్

గీర్వాణకవుల కవితా గీర్వాణం-3

గుంటూరు జిల్లా- స్వాతంత్ర్యానంతర గీర్వాణ సాహిత్యం –రచన డా’డి. ఏం .దీక్షిత్

440-శ్రీ అ౦బటిపూడి వెంకట రత్నం (19౦8-1982)

ప్రకాశం జిల్లా ఏదుబాడుఅగ్రహారం లో 18-7-1908న అ౦బ టిపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి సుబ్బమ్మ దంపతులకు శ్రీ వెంకటరత్నం జన్మించారు గుంటూరులో చదివి ఏం ఏ,పాసైనారు .శతావధాని వేలూరి శివ రామ శాస్స్త్రి గారి వద్ద తర్క ,వ్యాకరణ ,అలంకార శాస్త్రాలు నేర్చారు .స్వయంగా ఆంగ్లాన్ద్రాలను తులనాత్మకం గా పరిశీలించారు .ఉద్యోగం చేయకుండా నల్లగొండ లో చుండూరు చేరి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని విద్యా అన్న వస్త్ర దానాలు చేస్తూ కృష్ణ భక్తీ ప్రచారం చేశారు .రావినారాయన రెడ్డిగారి సహకారం తో ఒక హరిజన విద్యాలయం స్థాపించారు .’’సాహితీ మేఖల ‘’అనే సంస్థను నెలకోల్పారు .రచనలు చేస్తూ చేయించారు .ఈ సంస్థ ద్వారా 32గ్రంధాలు ప్రచురించారు .ఎందరినో గొప్ప రచయితలుగా తీర్చి దిద్దారు .’’దక్షిణ కౌమోదికి,ఇందిరా విజయం ,చంద్ర శాల ‘సంస్కృతం లో రాశారు .చంద్రశాలను వీరే ఆంగ్లం లోకి అనువదించారు .చూడాల నాటిక ,కృష్ణ బోధ షడ్దర్శన రహస్యాలు ,తత్వ సమవర్తనం ,వేదాంత సారం మొదలైనవి రచించారు .1943లో హైదరాబాద్ శ్రీకృష్ణ దేవా రాయాంధ్ర భాషా నిలయం లో ఘన సత్కారం పొందారు .

441 –శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య (1926-1984)

1926ఆగస్ట్ 11న గుంటూరు జిల్లా బాపట్లలో ఎక్కిరాల అనంతాచార్యులు ,బుచ్చంమలకు కృష్ణమాచార్య జన్మించారు .ఆంధ్ర,ఆంగ్ల సంస్కృతాలలో పాండిత్యం సాధించి ‘’పాండురంగ మహాత్మ్యం ‘’కావ్య పరిశోధన చేసి బృహత్ గ్రంధం రాసి పి.హెచ్ డి పొందారు .ఆంధ్రా యూనివర్సిటిలో తెలుగు లెక్చర్ గా పని చేసి ఎన్నో గ్రంధాలు రాశారు .’’వరల్డ్ టీచర్’’ప్రసిద్ధులు .’’మాస్టర్ యి కే ‘’ గా గుర్తింపుపొందారు ఎన్నో వేదాంత గ్రంధాలను రాశారు .17-3-1984 మరణించారు .సంస్కృతం లో అనేక స్తోత్రాలు ,స్తుతి సౌఖ్యం రాశారు .

442-శ్రీ కోగంటి సీతారామాచార్య  (1927-1996)

చతుర్వాణి బిరుదాంకితులైన సీతారామాచార్య గారు ‘’ప్రతిజ్ఞా కౌసల్యం ,అనూర్వం ,ఎకలవ్యం ,పద్మావతీ చరన చారణ చక్ర వర్తి ‘’లను సంస్కృతం లో రాశారు .

443-శ్రీమతి ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ (1917-1996)

21-12-1917న  మధురకవి నాళం కృష్ణారావు దంపతులకు లక్ష్మీ కాంతమ్మ పుతారు .రాజమండ్రిలో చదివిసంస్క్రుతాన్ని నేర్చారు .మెట్టినిల్లు బాపట్ల చేరి హితైషిణిసభ్యురాలై మహిళాభ్యుదయానికి కృషి చేశారు శ్రీహయగ్రీవ గుప్తాను వివాహమాడారు ..1947లో ‘’ఆంద్ర యువతీ సంస్కృత కళాశాల ‘’స్థాపించినప్రదానాధ్యాపకురాలు శ్రీమతి కామాక్షిగారి షష్టి పూర్తీ ఘనంగా చేసి మొదటి స్త్రీ షష్టిపూర్తిగా రికార్డ్ సృష్టించారు . తెలుగులో ఆత్మకధ ,సాహితీ రుద్రమ రాసి పేరుపొందారు ‘ఆంద్ర సరస్వతి ‘’బిరుడుపొందారు .సంస్కృతం లో ‘’కావ్య మణిత్రయం ‘’,శ్రీ కన్యకా పరమేశ్వరీ స్తోత్రం ,సుప్రభాతం సరళ సుందరంగా రాశారు .1-2-1996న చనిపోయారు .

,444-శ్రీ దీవి శ్రీని వాసాచార్య

ఉపన్యాస చక్రవర్తి శ్రీ శ్రీనివాసాచార్య రాచూరు లో పుట్టారు .’’ప్రక్రుతి విజయం ‘’అనే చమత్కార నాటక  రచన సంస్కృతం లో చేశారు ‘’శ్రీమన్నారాయనః ‘’రాశారు .

445-శ్రీ ఓగేటి పరీక్షిత శర్మ (19౩౦ -2007)

గుంటూరు దగ్గర యాజిలిగ్రామం లో శర్మగారు జన్మించారు .పూనా లో సంస్కృతం నేర్చారు .సంస్కృతం లో ‘’లలితా గీతాలహరి ,యశోధరా మహాకావ్యం ,శ్రీమత్ప్రతాప రాణాయణం ,జానపద నృత్య గీతమంజరి ,పరీక్షాన్నాటక చక్రం అక్షయ గీతా రామాయణం రాశారు ఇందులో ప్రతాప రాయనామ్ ప్రబంధ శైలిలో మహోత్క్రుస్తంగా రచించారు .

446-అవధాన సరస్వతి డాక్టర్ శ్రీ ప్రసాద రాయ కులపతి (1937

23-1-1937 న శ్రీ ప్రసాద రాయ కులపతి ప్రకాశం జిల్లా ఏల్చూరులో శ్రీ పోతరాజు దంపతులకు జన్మించారు .సంప్రదాయ బద్ధంగా సంస్కృతాంధ్రాలు చదివారు .19ఏళ్ళకే గొప్పకవిగా పేరు తెచ్చు కొన్నారు .ఆశుకవిత్వం అవధానాలు లో జగత్ ప్రసిద్ధులయ్యారు .గుంటూరులో బి ఏ .విశాఖలో ఏం ఏపిహెచ్ డి సాధించారు .1956లో గుంటూరు హిందూకాలేజిలో లెక్చరర్ గా చేరి క్రమంగా పదోన్నతి పొంది నలభై ఏళ్ళు పని చేసి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు .’’అవధాన సరస్వతి ,సాహితీ సార్వ భౌమ ,రూపక సామ్రాట్ ,కవితా సుధారా మొదలైన ఎన్నో బిరుదులూ అందుకొన్నారు .’’రసవాహిని ,ఆనంద యోగిని ,రస గంగ ,గాంధర్వ గీతి మొదలైనవి రచించారు సంస్కృతం లో ‘’శివత్రిశతి ,అంబికా త్రిశతి ,ఏంద్రీ సప్తశతి ‘’రాశారు .రిటైర్ అయ్యాక కుర్తాళం పీఠాదిపతులై శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వాములుగా విరాజిల్లుతున్నారు .

447-శ్రీ మేల్ల చెర్వు సుబ్రహ్మణ్య శాస్త్రి

గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన శాస్త్రిగారు అక్కడే ఉద్యోగించి ఎన్నో గ్రంధాలు రచించారు వారి సంస్కృత రచనలు –‘’శ్రీ గురు చరిత మహా కావ్యం ,భావనా బృందావనం హేహయ ప్రతిభా ,యాతనా శతకం .

448-శ్రీదీవి నరసింహ దీక్షితులు –

కవి ,పత్రికా రచయితా అయిన శ్రీ దీక్షితులు గేయ ,పద్య కావ్యాలు సంస్కృతం లో రాశారు .పద్య కావ్యాలు –‘’విశ్వ నృత్యం ,సాగర జీఎవితం ,నభో నర్తకి ,వందే హనూ మంతం ,అంకితం ‘’.నృత్య రూపకం గా ‘’శ్రమ ఏవ జయతే ‘’రాశారు .’’భారతీ భూషణం ‘’లో భారత దేశ ప్రధాన మంత్రులజీవిత చరిత్రలనురాశారు .

శ్రీ జొన్నా భట్ల గోపాల కృష్ణ మూర్తి

‘’ ‘’సంస్కృతం లో జొన్నాభోట్ల కృష్ణ మూర్తిగారు ‘’ శ్రీ కృష్ణ భాగవతం. ‘’రాశారు .

శ్రీ దీక్షితులు గారి రచన దీనితో పూర్తీ అయింది .తరువాత వచ్చే శ్రీ వెంకటప్పయ్య శాస్త్రి గారిపై రచన నేను సేకరించి వ్రాసింది .

449 -శ్రీశైల తీర్ధ సారం రాసిన శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు (20వ శతాబ్ది పూర్వార్ధం )

బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అనే చందవోలు శాస్త్రి గారి పితృ దేవులే వెంకటప్పయ్య శాస్త్రి గారు .తండ్రి హనుమచ్చాస్త్రి. తల్లి లక్ష్మమ్మ . .పరమ నిస్టా గరిస్టూలని పేరొందిన వారు .శ్రీమతి హనుమమ్మ ను వివాహ మాడారు.నిష్టా  గరిష్టంగా జీవిస్తూ శిష్యులకు విద్య గరపే వారు . ‘’శ్రీరామ కదామృతం’’అనే మహత్తర కావ్యాన్నిఆరు కాండలలో రాశారు .ఇది రామాయణమే .ఉత్తర రామాయణాన్ని ‘’ఉత్తరకాండ ‘’గా మహా గ్రంధం గా రచించారు .చివరలో ఉండగా పరమ పదిస్తే కుమారులు రాఘవ నారాయణ శాస్త్రి గారు పూర్తీ చేశారు . ఇదికాక మరొక యాత్రా సందర్శనం వంటి కావ్యం ‘’శ్రీశైల తీర్ధ సారం ‘’ను 34 అధ్యాయాలలో విపులంగా వర్ణించారు . వీరి ఇతర రచనలు ‘’కవి గుణ ప్రకాశిక ,’త్రిశంకు  స్వర్గం నాటకం ,బద్రాయురుపాఖ్యానం,శ్రీ శంకర విజుయ కదా సార సంగ్రహసోత్రం  .వీరు తమ ముఖ్య గురువులుగా శ్రీ కొలిచిన యజ్ఞనారాయణ సోమయాజి దీక్షితులు గారని చెప్పుకున్నారు .దీక్షితులు గారు  తర్వాత సన్యాసం స్వీకరించి కల్యాణానంద స్వామి గా మారారు .

శ్రీ శైల తీర్ధ సారం

ఇందులోశ్రీ వెంకటప్పయ్య శాస్త్రిగారు 34వచివరి అధ్యాయం లో తమ గురించి చెప్పుకొన్నారు .వెలనాటి బ్రాహ్మణులమని చందోలు వాస్తవ్య్దానని తమ వంశ మూలపురుషుడు రామ భట్టు అని ప్రపితామహుడు సింగ రాయ సింహ అని సుబ్రహ్మణ్య అవధాని పితామహులని బుచ్చయ్యగారు తమ సద్గురువులని ,తమ తలిదండ్రుల సంతానం లో తానే పెద్దవాడిననిశ్రీ కల్యానంద భారతీస్వామి గురు వర్యుల కటాక్షం తమపై ఉందని రామ కదా మృతం ,దత్త పురాణం స్వయంగా రాశానని స్కాంద పురాణం లో ఉన్న శ్రీశైల తీర్ధ సారం ‘’ను సంస్కృతం లో రాసి శ్రీ పరమేశ్వరార్పితం చేశానని సవినయంగా తెలియ జేశారు .

ప్రధమాధ్యాయం  ‘’ఓమిత్యేకాక్షరం బ్రహ్మా శాశ్వతం శివ మచ్యుతం –ఈశానం భూత భవ్యస్య భర్గో దేవస్య దీమహి ‘’అనే శ్లోకం తో ప్రారంభించారు .’’మహిత మహిత వర్గ ధ్వంసి మల్లీశితు స్త-చ్చరితం మఖిల హృద్యంసర్వతస్సార భూతం –రస యతి యది మర్త్యః కోపి మృత్యం నిరస్యో –ల్లసతి తరతి శోకం ప్రాంచతి బ్రహ్మ లోకం ‘’అని ఫల శృతి చెప్పారు .మూడధ్యాయాలు ఉపన్యాస ప్రకరణం గా రాసి నాలుగులో వ్యాసుడు కాశీ వదిలి వేసే కధను చెప్పారు .అయిదులో అగస్త్యర్షి వింధ్య పర్వత గర్వం ఖర్వం చేయటం చెప్పి ,ఆరులో శ్రీశైలమహిమ వర్ణించారు .’’తీర్ధం లింగం వనం కుండ మసంఖ్యాతం,తదా గుహాన్ –సర్వం శ్రీశైల సంస్థానే జగత్పావన మీరితం ‘’అన్నారు .అక్కడి ప్రతిశిలా శివయోగిలా దర్శన మిస్తు౦దన్నారు .

ఏడవ అధ్యాయం లో శ్రీ గిరి ప్రభావాన్ని చెప్పారు .’’సేవే శ్రీ గిరి శ్రుంగ రంగ నటనోదయ ద్విస్ఫుర చంద్రికా-శ్రీ వర్దిష్ణు సుధా మయూఖ నన లక్ష్మీ భ్రుజ్జటామండలం –ప్రావారోచిత మల్లికా కుసుమ సంభార డ్యాష స్సంభ్రుతి-ప్రావీణ్య ప్రధమా నసద్గుణ గణం మల్లీశ్వరం ప్రత్యహం ‘’అని ప్రభావాన్ని మహా భక్తిగా రసబందురగా చెప్పారు .కవిత్వం పాతాళ గంగా సదృశం గా జాలువారింది .ఏడు ఎనిమిదిలలో  శిలాతనయుడి శివ ప్రసాద లబ్ది ,తొమ్మిదిలో శ్రీ పర్వతసిద్ధికధనం,పదిలో చంద్రావతీ చరిత్ర ,పదకొండులో మల్లికార్జున పేరు వచ్చిన విధం వివరించారు –పన్నెండు లో ఆమ్మవారు అయ్యవారుల మృగయా విహారం , పదమూడులో విప్రలంభ శృంగారం ,పద్నాలుగులో మల్లికార్జున సమాగమం ,పదిహేనులో శిబి చక్రవర్తి శరీర దాన కద ,పదహారులో కపోతాఖ్యానం –ఉన్నాయి .శివునిపేరు తో అప్పయ్య శాస్త్రిగారికి పూనకమే వస్తుంది –‘’నమో భవాయ భువన సృష్టి హేతవే –నమో మ్రుడాయ తదను పాలనోద్యతే –నమోహరాయ తదుప సంహ్రుతి స్ఫురే –నమశ్శివాయ భవ విముక్తి దాయినే ‘’అని పొంగిపోయి రాశారు .పదిహేడు లో శిబి కైలాసప్రాప్తి ,18లో త్రికూటాచల క్షేత్ర వివరణ ,22లో పరదేశియతి నిర్యాణం 23లో అనంత తీర్ధ వివరం ,24 25లో నందారాధ్య చరిత్ర  ముక్తి ,26లో శివ పారామ్య కధనం ,27లో పంచాక్షరీ మంత్రం మహిమ ను చెబుతూ ‘’అక్ష్య్య ఫల మాప్నోతి స ఇష్టాపూర్తయోన్నరః –ఉపాస్తే దీక్షయా నిత్యం మంత్రం రాజం శివస్యయః ‘’అని మహిమ వర్ణించారు .28లో శివపూజా ప్రభావం ,29లో భస్మ ప్రభావం 30లో రుద్రాక్ష ప్రభావం చెబుతూ ‘’రుద్రాక్ష వ్రత నిస్టస్య జప హోమార్చనాదికం –రక్షోఘ్నంశివ సాయుజ్య దాయకం ‘’అన్నారు .32లో వైశ్యకుమారుని శివలోక ప్రాప్తి ,33లో అంకినీడు ప్రభువు కు శివ ప్రసాద లబ్ది ,చివరిదైన 34వ సర్గలో దుర్గాక్షేత్ర మహాత్మ్యం చెప్పి శ్రీ శైల సారోఖ్యోయం ను శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు పూర్తీ చేశారు .చాలా సులభమైన సుందరమైన సరళమైన శ్లోకాలతో గ్రంధ రచన సాగింది హాయిగా తెలుగు చదువుతున్నట్లే అనిపిస్తుంది.  అన్వయ కాఠిన్యం లేని బహు సుందర రచన ఇది .తెలుగు వారికి గర్వకారణం .

ఇంతటితో గుంటూరు జిల్లా కవుల రచనలు సమాప్తం

మరో జిల్లాలో మళ్ళీ కలుద్దాం

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-15-ఉయ్యూరు

‘’

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.