విశ్వనాధ కొంటె కోణంగి

విశ్వనాధ కొంటె కోణంగి

రెండు అనటం ,పది పడటం విశ్వనాధకు చిన్నప్పటి నుంచి ఉంది .’’కర్రపుల్లలా ఉన్నా ,మనసులో చచ్చేంత అహంకారం ఉండేది ‘’అని ఆయనేచేప్పుకొన్నాడు .ఎవరికీ అపకారం మాత్రం చేయలేదు ఉపకారమే చేశాడు జీవితాంతం .సద్యస్పురణ వల్లవిరోదులేర్పడ్డారు .బాల్యం లో అంగ రక్షకులు లేకుండా కాలు కదిపేవాడు కాదు.ఈయన పుస్తకాలూ ,అన్నం గిన్నా వాళ్ళే మోయాలి . అంతగారాబం చేశాడు తండ్రి .ఎంతత గారం చేసేవాడో ఆయనకిష్టం లేనిది చేస్తేతండ్రి అంతగా చచ్చేట్లు కొట్టేవాడు .’’నా నోటిలో ఉన్నది దురహంకారం .నోటికి వచ్చి నట్లు మాట్లాడే వాడిని  నా వాక్కునకు నియమం లేకుండా పెరిగాను .నా యదేచ్చా వ్యాపారం వల్ల శత్రువుల్ని   సంపాది౦చుకొన్నాను  .విరోదుల్ని ప్రబలి౦చు కొన్నాను ‘’‘’ఆయనే ఉవాచ .

బందరు లో రెండోఫారం చదివాడు విశ్వనాధ .’’క్లాస్ మానీటర్ ‘’కూడా .ఒక మేస్టారు తప్పులు చెప్పేదాకా ప్రశ్నలు వేసి తప్పు చెప్పగానే చితగ్గోట్టేవాడు .ఒక సారి ఆ శాస్తి ఈయనకీ జరిగింది .కోపం వచ్చి ‘’కొట్టు .నీ అన్యాయం సిగ్గోయ్యా !’’అన్నాడు మేస్టర్ని అంతకోపం లోను ఆయన ఈమాటకు పకపకా నవ్వాడట.ఒక సారి ఈయన ట్యూటర్ మను చరిత్ర చదివి ఇస్తానంటే ఇచ్చాడు .ఆయన ట్యూషన్ చెప్పేవాడు విశ్వనాధ. కొంత బాకీ పడ్డాడు .ఆయన తిరిగి ఇవ్వనే లేదు .చెళ్ళపిళ్ళ వారికి చెప్పుకొన్నాడు ఆయన ఎవరితోనో విచారింప జేసి విశ్వనాధ చెప్పింది నిజాని నమ్మి ఆ ట్యూటర్ ని పుస్తకం తిరిగి ఇచ్చేయమన్నాడు .సరే అన్నాడుకాని ఆ ఆచార్యులగారు తిరిగి ఇవ్వనే లేదని రాసుకొన్నాడు విశ్వనాధ .

‘’నా అల్లరి తిరుగుళ్ళకి ,నా చెడ్డ స్నేహాలకి ,నా దివారాత్ర సంచారాలకు నా నాటక ప్రియత్వానికి ,నా ‘’కొకిబికి ‘’మనస్సునకు  నేను సహజంగా పైకి రావలసిన వాడను కాను .నేను పరీక్షలలో ఉత్తీర్ణుడను కాకూడదు .స్కూలుకు వెళ్ళి మాస్టార్లు చెప్పింది శ్రద్ధగా వినట౦ ,మంచి జ్ఞాపక శక్తి  నా విజయానికి కారణం ‘’అన్నాడు .కవిత్వం రాయటం బాగా అబ్బి ఇంట్లో బడిలో చెప్పినపా ఠాలు చదివే వాడుకాదు .’’కాగి తాలపై పద్యాలు రాయటమే పని .అవి తగల బెట్టటానికి క్కూడా పనికి రావు.ఒక సారి మా అమ్మ పొయ్యి వెలిగించటానికి ఈ కాగితాలు అంటిస్తే అవి మండలేదు .అప్పుడు తెలిసింది వాటి విలువ ‘’అని నిజాయితీగా చెప్పాడు .

శ్రీ  ఉప్పు లూరి సంజీవరావు మంచి డ్రామానటుడు . పద్యం పరమ రామణీయకం గా చదివే వాడు .అప్పటికే ముసలివాడు .అందరు పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం చేసేవారు .ఆయన పట్టు బట్ట కట్టుకు తింటే విశ్వనాధ ముఠా లాగు చొక్కాలతో లాగించేవాళ్ళు .రావు  గారు సంధ్యావందనాన్ని  సంక్షిప్తం చేసి రాశారట .చేశారట .మాకు  తెలిసి ఆయన్ను ‘’కేత్’’అని ‘’ముసలాడు ‘’అని పరిహసించే వాళ్ళం .కేత్అంటే కేశవ నామాలలో మొదటి అక్షరం ,త్అంటే సంధ్యావందనం చివర చెప్పే ‘’అభివాదయేత్ ‘’లో చివరి అక్షరం కలపగా వచ్చిందే .కాని తర్వాత తెలిసింది తకారం లేదని .వెంకట శాస్స్త్రిగారు కూడా బేతపూడి లక్ష్మీకాంతకవి రాసిన రుక్మాంగద నాటకాన్ని మెచ్చుకొనేవారు ‘’అని తప్పు తెలుసుకొన్నాడు .

ఆ రోజుల్లో ఎస్ ఎస్ ఎల్ సి పరీక్ష పూర్తీ అవటం అనేది ఉండేదికాదు .కాలేజిలో చేరటానికి దీనిలో వచ్చిన మార్కులతో పని లేదు .కుర్రాడు ఏ సబ్జెక్ట్ ఇస్టపడతాడో దానిలో మార్కులని బట్టి ప్రిన్సిపాల్ బి ఏ లో చేర్చుకోనేవాడు .’’నాకు లెక్కల్లో పదిహేను మార్కులోచ్చాయి .చరిత్రలో అరవై .చరిత్ర పరీక్ష రోజు ముందురాత్రి సినిమాకెళ్ళాను .పరీక్ష రోజు పొద్దున్న తొమ్మిదిన్నరకి లేచి ,పావుగంట ఆలస్యంగా పరీక్ష హాల్ కు వెళ్లాను .కాని అరవై మార్కులోచ్చాయి. ఎప్పుడూ ఫస్ట్ వచ్చే  ‘’కోట ‘’వాడికి నా కంటే రెండు తక్కువ .నాది  అంతాజ్ఞాపక శక్తి మీదే ఆధారం ‘’అని రాసుకొన్నాడు .బందరు నోబుల్ కాలేజిలో ‘’పెన్’’ దొర బి. ఏ .లో సీటిచ్చాడు .అంతకు  ముందు గుంటూరులో ప్రయత్నించాడు .అక్కడ ఈయనా ,దుగ్గిరాల రాఘవ చంద్రయ్య చౌదరి ఒకే సారి ఇంటర్వ్యు కి వెళ్ళారు  ఆయనకిచ్చి ఈయనకు లేదుపోమ్మన్నారు .’’చౌదరిగారి కంటే ఎక్కువ పండితుడను అని నా భావం ‘’అని ఆ సంఘటనపై స్పందించాడు .

కూరగాయలు కొనడానికి వెడితే  విశ్వనాధ కూరలమ్మి బుట్టముందు కూచుని అన్నీ కెలుకుతూ మాట్లాడిస్తూ బేరం చేసేవాడు .ఆ అమ్మాయి ఒకసారి ఏదో మాట్లాడుతూ ‘’తదుపరి ‘’అన్నది .ఈయన పక్కనున్నశ్రీ జువ్వాడి గౌతమ రావు తో  ‘’అబ్బ యెంత బాగా మాటలాడిం దండీ’’అని మెచ్చాడు .ఒక సారి నలుగురితో కలిసి లాంచిమీద అమరావతి వెళ్తున్నారు .సాహిత్య చర్చ జోరుగా సాగుతోంది .అందులో ఎవరో ఒకాయన శివుడికి అభిషేకం చేసి వస్తానన్నాడు .’’శివుడూ లేదు గాడిద గుడ్డూ లేదు .ఊరికే కృష్ణ మీద షికారు పోయి రావటమే ‘’అన్నాడు విశ్వనాధ .

ఒకసారి శ్రీ పేరాల భరత శర్మ ‘’మీ జీవితచరిత్ర పూర్తిగా రాయండి ‘’అన్నాడు .విశ్వనాధ వెంటనే ‘’నీక్కూడా ఈ పిచ్చి పట్టిందా ?నా గ్రంధాలన్నీ చదివిన వాడికి నా జీవితమంతా తెలుస్తుంది. ఇక నా పుట్టిన తేది, చచ్చిన తేది కి మధ్య తేదీలలో నేను బతక లేక చచ్చినవి ,చావ లేక బతికినవీ ఘట్టాలేగా చరిత్ర రాయాలంటే ‘’అన్నాడు .

బెజవాడలోతెలుగు  లెక్చరర్ గా ఉన్నకాలం లో శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి ఇంగ్లీష్ లెక్చరర్ .విశ్వనాధ క్లాసులో తన్మయ భావం తో చెప్పేవాడు .దీన్ని చూసి జొన్నలగడ్డ ‘’కవి సామ్రాట్ .యు ఆర్ టాకింగ్ సమ్ వాట్ ‘’అనేవాడు. ఆయనొక్కడే ఈయన్ను వేళాకోళం చేసేవాడు .ఒకసారి వేమన వ్యాసాలు  బోధిస్తూ కృష్ణ  దేవరాయలవలన అందరూ వైష్ణవులయ్యారని అంటూ ,అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లోకి వెళ్లి ‘’మధ్యాహ్న పూట దంపతులు కలియ కూడదు .’’మాటినీ’’ వేస్తే  కమ్యూనిస్టులు పుడతారు ‘’అన్నాడనిఆక్లాసులోనే ఉన్న  శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాశాడు .దీనితో రామారావు అనే కమ్యూనిస్ట్ అభిమాన విద్యార్ధి ‘’మీరు అనవసరంగా కమ్యూనిస్ట్ లను తిడుతున్నారు .మీరు గుంటూరు లో ఉన్నప్పుడు ‘’ఒక స్త్రీని ఉంచుకున్నారని ‘’విన్నాము .ఆ మాట ఇప్పుడు అంటే మీకు కష్టం గా ఉండదా ?’’అన్నాడు .తెలివి తెచ్చుకొన్న కవిసామ్రాట్ ‘’నీ బోటి వాడు అంటే లెక్క చేయను .నాతొ సమాన హోదా ఉన్న వాడంటే అప్పుడాలోచిస్తాను ‘’అన్నాడు. రామారావు ను తోటి విద్యార్ధులే కేకలేశారు .తర్వాత విశ్వనాధకు క్షమాపణ చెప్పి గొప్ప శిష్యుడయ్యాడు .ఈ సంఘటన జరిగినప్పుడు అప్పటి హైకోర్ట్ న్యాయ మూర్తి సి కోదండ రామయ్య గారుకూడా క్లాసు లో ఉన్నారని’’ పురాణం’’ రాశాడు .మాస్టారు క్లాసులో ఎప్పుడూ ఏదో తగూ, వివాదం లేవ దీయటం సరదా అన్నాడు కూడా .

బెజవాడ రామా టాకీస్ దారిలో దొమ్మరి సానుల సీన్లు అప్పటిజనానికి బాగా తెలుసు .విశ్వనాధ అటువెడుతుంటే ఒకమ్మాయి రమ్మని పిలిచి ‘’ఎంతిస్తావు ?’’అని అడిగితె కొంటెగా ఈయన ‘’వస్తే ఎంతిస్తావు ?’’అన్నాడు చమత్కారంగా .మరోసారి విజయా టాకీస్ దగ్గరా ఇలాంటి సీనే ఉన్న చోట నులక మంచాలు అమ్మే ఆడ మనిషితో ‘’ఒక మనిషి పడుకుంటే ఆగుతుందా ?అని అడిగాడు ‘’ఇద్దరు కూర్చున్నా ఆగుతు౦దిబాబూ ‘’అంది ‘’కోణంగి విశ్వనాధ ‘’నువ్వూ, నేనూ పడుకుంటే ఆగుతుందా ?’’అన్నాడు .ఆవిడ బూతులు లంకి౦చు కొంటే ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ చకచకా వెళ్ళిపోయాడు ఈ కొంటె కోణంగి ,

‘’ఆధునిక సాహిత్యం పై మీ అభిప్రాయమేమిటి ?’’అని ఇలస్త్రేటేడ్ వీక్లీ మాజీ సంపాదకుడు ఏ ఎస్ రామన్ ఇంగ్లీష్ లో అడిగితె ఇంగ్లీష్ లోనే ‘’ఇట్ ఈజ్ నైదర్ మోడరన్ నార్ లిటరేచర్ ‘’అని చమత్కార బాణం వేశాడు విశ్వనాధ.’’అన్నం ‘’తెలుగా సంస్కృతమా అని ఒక కొంటె ప్రశ్నకు ‘’అదికూడా తెలీకుండా యెట్లా తింటున్నావు ?’’అని కోణంగి జవాబు .’’పుల్ల ,తియ్య ,వెన్న మజ్జిగల్లో ఏరకం మజ్జిగ  పోయమంటారు ?’’అన్న భార్య ప్రశ్నకు ‘’మారకం లేకుండా ఏదైనా సరే ‘’అని కొంటె జవాబు .ఒక జాయంట్ కలెక్టర్ ముఖ్య అతిధిగా ఉన్న సభలో ‘’ఈ సారి సభలో వీరి ‘’జాయంట్’’ ఊడిపోవాలని కోరిక ‘’అన్న చమత్కారి .’’నేను మన్మధ లోపుట్టాను నువ్వు’’ ఖర గాడి’’ వను కొంటా’’అన్నాడు విశ్వనాధ .‘’ఒకసారి బందర్లో ఉండగా చుట్టపు చూపుగా వచ్చినాయన ‘’మీ బందర్లో గాడిదలు ఎక్కువే ‘’అని కొంటెగా అంటే ‘’అబ్బే !ఇక్కడివి తక్కువే నండీ .బయటి నుంచి వచ్చినవే ఎక్కువ ‘’అని రిపార్టీ ఇచ్చిన కోణంగి విశ్వనాధ .ఏదైనా తప్పు చేసి సంర్ధించుకొనే వాడంటే విశ్వనాధకు అసహ్యం .అలాంటి వారి గురించి తరచుగా ఒక చిన్న సంభాషణ చెప్పేవారు –

‘’ఎరా ! సంధ్యావందనం చేశావా?’’చేశాను ‘’.ఎక్కడ?’’’’’’ఊరి చివర చెరువు దగ్గర ‘’’’ఆ చెరువులో నీళ్ళు లేవుకదా ?’’’’అరె !వాడెవడో ఉన్నాయని చెప్పాడే !’’

‘’నిన్న మీ శిష్యుడి రేడియో టాక్ విన్నాను. నా మొహం లాఉంది ‘’ఒకాయన విశ్వనాధ తో .’’మీ మొహం అంత బాగుంటుందా ?మన కోణంగి గారి రిపార్టీ .స్థానాన్ని బట్టి వస్తువుకు గౌరవం వస్తుంది అని చెబుతూ ‘’తలమీద ఉన్న జుట్టును కేశాలు అంటారు .కళ్ళమీద ఉంటె వెంట్రుకలు అంటారు .రొమ్ము మీద ఉంటె రోమాలుఅనీ ,మూతిమీద ఉంటె గౌరవంగా మీసాలని ,’’అక్కడ ఉండే ‘’దాన్ని’’ బొచ్చు ‘’అని క్లాసులో చెప్పాడు చమత్కారంగా .ఒకడుఒంటికి సెంటు రాసుకొని వెడుతుంటే ‘’ఊరి దుర్వాసన పోగొట్టటానికి వాడి ఔదార్యానికి జనంమెచ్చారు ‘’అంటాడు .’’స్కూలు పిల్లల మిస్సమ్మ కొంగ రెక్కలా నడుస్తుందట .ఉద్యోగం ఊడితే ఆమె పాళీ లేని కలంగా ఉంటుందిట ‘’.

ఒకడు పత్రిక పెట్టాడు  వాడికి చదువురాదు.అర్హత ఏమిటి అని విశ్వనాధను అడిగితె ‘’వాడు విప్పే పురాణం ముందు ముల్లోకాలు డీలా పడ్డాయి .వాడి భార్య ఊర్లో ఉంటె వంటింట్లో పొగలు వస్తాయి లేకపోతె హాలులో పొగలోస్తాయని ‘’అన్న కొంటె వాడు .డప్పు బుజాన వేసుకొని ‘’గూని గుప్పిగాడు ‘’పెళ్ళాం వెనక పోతుంటే ‘’గజోత్సవం ముందు వెడుతుంటే వెనక నౌబత్తుతో వెళ్ళే లోట్టిపిట్ట (ఒంటె)లాగా ఉన్నాడట .

పెళ్ళాం చచ్చిపోయిందని ఒకడు చచ్చేట్లు ఏడ్చాడు .భయం తో రెండో పెళ్లి చేశారు .ఈవిడ అంటే నిజంగానే చచ్చిపోతున్నాడు అంతప్రేమ ‘’అని చమత్కారాలు నూరారు .ఒకడి భార్య పుట్టింటికి వెడితే ‘’కూరలమ్మి’లోపల ఉందేమిటి ఇంతసేపు?ఎన్ని కూరలు కొన్నాడో  ఏమో?’’అని లోగుట్టు విప్పిన చమత్కారి .

ఇదీ విశ్వ నాద కొంటెతనం  కోణంగిత్వం .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -24-15 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.